Intinti Gruhalakshmi Today Episode: ఎండీ కొడుకుతో దివ్య గొడవ.. డబ్బిచ్చిన విక్రమ్.. అంతలోనే ట్విస్ట్

భారతదేశంలోని చాలా వాటితో పోల్చుకుంటే తెలుగు టెలివిజన్‌పై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.

దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' బుధవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!

Photos Courtesy: Star మా and Disney+Hotstar

మంగళవారం ఎపిసోడ్‌లో జరిగిందిదే

మంగళవారం ఎపిసోడ్‌లో జరిగిందిదే

మంగళవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. దివ్య పెళ్లి విషయంపై తులసితో లాస్య, నందూ మాట్లాడుతుంటారు. ఎలాగోలా పెళ్లి చూపులకైనా దివ్యను ఒప్పించమని ఆమెను అడుగుతారు. కానీ, ఆమె మాత్రం ఒప్పుకోదు. చివరకు ఎలాగోలా తులసిని వాళ్లిద్దరూ ఒప్పిస్తారు. మరోవైపు, విక్రమ్ వాళ్ల నాన్న అన్నం తినడం మానేయడంతో అతడు వెళ్లి బ్రతిమాలి తినిపిస్తాడు.

ఆ సమయంలో ఫ్లాష్‌బ్యాక్‌కు వెళ్లి.. విక్రమ్‌కు అసలు రాజ్యలక్ష్మి సొంత తల్లి కాదని చూపిస్తారు. అంతేకాదు, విక్రమ్ పేరు మీద ఉన్న ఆస్తిని కాజేయడానికి ఆమె ప్లాన్లు చేసినట్లు కూడా గతాన్ని చూపిస్తారు.

విక్రమ్ తండ్రికి పక్షవాతం అలా

విక్రమ్ తండ్రికి పక్షవాతం అలా

విక్రమ్ తన తండ్రికి అన్నం తినిపిస్తూ ఉండగా.. ఆయన గతాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఆ సమయంలోనే విక్రమ్ తన తల్లి వల్ల చదువుకోవడం మానేశాడని చూపిస్తాడు. దీంతో 'విక్రమ్ నీ వల్లే నీ మాట వల్లే చదువుకోకుండా తయారయ్యాడు. ఇప్పుడు నా మాట వినడం లేదు. రాజ్యలక్ష్మి నీకు చేతులెత్తి మొక్కుతాను వాడి జీవితాన్ని నాశనం చేయకు' అని రాజ్యలక్ష్మిని బ్రతిమాలతాడు. కానీ, ఆమె మాత్రం నవ్వుతూనే ఉంటుంది. దీంతో ఆయనలో కోపం కట్టలు తెంచుకుని ఆమెను కొట్టబోతాడు. అంతే.. పక్షవాతం వచ్చి పడిపోతాడు. ఇలా గతం ముగిసింది.

విక్రమ్‌ను చూసి తండ్రి బాధగా

విక్రమ్‌ను చూసి తండ్రి బాధగా

ఇక, విక్రమ్ తన తండ్రికి భోజనం తినిపించి టాబ్లెట్ కూడా వేస్తూ ఉంటాడు. తర్వాత 'గుడ్ బాయ్ ఈరోజు చాలా ముద్దొస్తున్నావు. ప్రతిరోజు ఇలాగే తినాలి' అంటాడు. దీంతో తండ్రి 'నువ్వే ప్రతిరోజు తినిపిస్తే ఇలాగే ఉంటాను నాన్న. గొర్రె కసాయి వాన్ని నమ్మినట్టు నువ్వు మీ అమ్మని నమ్ముతున్నావు' అని మనసులో అనుకుంటాడు. అప్పుడు విక్రమ్ 'రోజు నిన్ను దగ్గరుండి చూసుకోవాలని ఉంది. కానీ టైం కుదరడం లేదు' అంటాడు.

దీంతో తండ్రి 'టైం కాదు నాన్న.. ఆ రాక్షసి నిన్ను నా రూమ్‌కు రాకుండా మన మధ్య ప్రేమ అనురాగాలు చిగురించకుండా ఏదో ఒక పని చెబుతుంది' అంటాడు. తర్వాత ఆయన ముందు విక్రమ్ తన తల్లిని పొగుడుతూ ఉండగా.. ఆమె మంచిది కాదని మనసులో చెప్పుకుంటూ బాధ పడతాడు.

దివ్య తెలివి.. మాట్లాడకుండానే

దివ్య తెలివి.. మాట్లాడకుండానే

దివ్యతో మాట్లాడాలని నందూ, లాస్య, తులసి చూస్తూ ఉంటారు. ఆ సమయంలో ఆమె తనకు వాళ్లు ఏదో చెప్పాలని అనుకుంటున్నారని భావిస్తుంది. ఆ వెంటనే తులసిని కొన్ని మంచినీళ్లు తీసుకు రమ్మని అడుగుతుంది. దీంతో తులసి వెళ్లి తీసుకు వస్తుంది. ఆ తర్వాత తులసి మాట్లాడడానికి ప్రయత్నించగా.. దివ్య నా స్టెతస్కోప్ కనిపించడం లేదని అంటుంది. దీంతో తులసి వెతకడానికి వెళ్తుంది.

అప్పుడు పక్కనే ఉన్న నందూ, లాస్య.. దివ్య కావాలనే ఇదంతా చేస్తోంది అనుకుంటూ ఉంటారు. ఇంతలోనే తులసి వచ్చి అది కనిపించలేదు అంటుంది. అప్పుడు దివ్య మర్చిపోయానమ్మా నా బ్యాగ్‌లోనే ఉంది అని అంటుంది. అప్పుడు తులసి మాట్లాడేందుకు ప్రయత్నించగా క్యారేజ్‌లో ఏం పెట్టినావమ్మా అంటూ సరే వెళ్లొస్తా అని వెళ్లిపోతుంది.

నందూ ప్లాన్.. ఆస్పత్రికి విక్రమ్

నందూ ప్లాన్.. ఆస్పత్రికి విక్రమ్

దివ్య వెళ్లిపోగానే లాస్య 'దివ్య కావాలనే అవాయిడ్ చేస్తుంది కదా. రెండు నిమిషాలు కూర్చుని మాట్లాడితే ఏమవుతుంది' అని అంటుంది. దీంతో నందూ 'తులసి ప్రయత్నం చేసింది కదా' అంటాడు. అప్పుడు లాస్య 'మహానుభావా నేను మీ తులసిని ఏమీ అనలేదు' అంటుంది. దీంతో నందూ 'తులసి హాస్పిటల్ నుంచి వచ్చాక మళ్ళీ ట్రై చెయ్' అని అంటాడు.

మరోవైపు, సంజూ హాస్పటల్లోని అమ్మాయితో కొంచెం తేడాగా మాట్లాడుతూ ఉంటాడు. ఆ సమయంలోనే విక్రమ్ అక్కడకు వస్తాడు. సంజూను చూసి అతడు కోప్పడతాడు. అనంతరం అమ్మ కోసం వెళ్లిపోతాడు. ఆ సమయంలో అమాయకంగా ఆ అమ్మాయికి క్లాస్ పీకు అంటాడు.

దివ్యను చూసి విక్రమ్ హ్యాపీగా

దివ్యను చూసి విక్రమ్ హ్యాపీగా

తమ్ముడితో మాట్లాడి వెళ్లిపోతుండగా విక్రమ్‌కు ఆస్పత్రిలో దివ్య కనిపిస్తుంది. దీంతో అతడు అక్కడే ఆగిపోతాడు. అంతేకాదు, ఆమెనే చూస్తూ 'థాంక్యూ దేవుడా అందమైన అమ్మాయిని ఇచ్చావు. ఆ అమ్మాయిని మా హాస్పిటల్‌కు వచ్చేలా చేసావు. ఆ తర్వాత కార్యక్రమాలు కూడా పూర్తి అయ్యేలా చూడు స్వామి' అని మనసులో అనుకుంటాడు.

ఇంతలో ఓ బాబుకు యాక్సిడెంట్ అయిందని తీసుకు వస్తారు. ఆ బాబును చెక్ చేసిన దివ్య ఆపరేషన్ థియేటర్‌లోకి తీసుకు వెళ్తుంది. అప్పుడు విక్రమ్ కూడా వాళ్లతో పాటు లోపలికి వెళ్తుండగా దివ్య ఆపుతుంది. దీంతో అక్కడ ఉన్న నర్స్ అతడు ఎవరో చెప్పబోతుండగా విక్రమ్ ఆపుతాడు. తర్వాత దివ్య అతడిని బయటకు నెట్టేస్తుంది. అప్పుడు విక్రమ్ బయటి నుంచి ఆమెను చూస్తూ ఉంటాడు.

విక్రమ్‌ను అపార్థం చేసుకుని

దివ్య బయటకు వచ్చి ఆ బాబు వాళ్ళ అమ్మతో మాట్లాడుతూ ఉంటుంది. బాబుకు యాక్సిడెంట్ అయిన వాళ్ళను అడిగి డబ్బులు ఇప్పించుకోవాలి కదా అనగా.. నాతో పాటు రండమ్మా మీరే డబ్బులు ఇప్పించండి అని తీసుకెళ్తుంది. ఆ తర్వాత ఆమె ఒక వ్యక్తిని చూపించగా.. దివ్య మాత్రం విక్రమే యాక్సిడెంట్ చేశాడని అనుకుంటుంది. ఆ వెంటనే అతడి దగ్గరకు వెళ్లి గొడవ చేస్తుంది.

అయినా విక్రమ్ మాత్రం సైలెంట్‌గానే ఉంటాడు. అంతేకాదు, అతడి దగ్గర రెండు లక్షల రూపాయలను తీసుకుంటుంది. అలాగే, ఫోన్ నెంబర్ కూడా అడిగి తీసుకుంటుంది. దీంతో విక్రమ్ 'నేనే నీతో ఎలా మాట్లాడా అనుకుంటున్నా. నువ్వే నా నెంబర్ తీసుకున్నావు' అని మనసులో అనుకుంటాడు. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోతాడు.

నిజం తెలిసి బాధ పడ్డ దివ్య

నిజం తెలిసి బాధ పడ్డ దివ్య

విక్రమ్ దగ్గర తీసుకున్న డబ్బును బాబు తల్లికి అందించబోతుంది. అప్పుడామె ఆ డబ్బు నాకెందుకు అమ్మా.. యాక్సిడెంట్ చేసింది ఈయనే అని అసలైన వ్యక్తిని చూపిస్తుంది. దీంతో దివ్య అనవసరంగా విక్రమ్‌ను అపార్థం చేసుకున్నానని అనుకుంటుంది. అంతేకాదు, అతడి దగ్గర తీసుకున్న డబ్బులను తిరిగి ఇచ్చేయాలని చూస్తుంది. కానీ, అతడు కనిపించడు. ఆ వెంటనే విక్రమ్ నెంబర్‌కు ఫోన్ చేస్తుంది. కానీ అతడు లిఫ్ట్ చేయడు. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X