Intinti Gruhalakshmi Today Episode: తులసిని చూసిన ప్రేమ్.. ఇల్లు ఖాళీ చేయమంటూ బాబూరావు గొడవ
చాలా ఏళ్లుగా తెలుగు బుల్లితెరపై ప్రసారం అయ్యే సీరియళ్లకు మాత్రమే సుదీర్ఘ కాలంగా ప్రేక్షకుల నుంచి భారీ నుంచి అతి భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోందన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' సోమవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరు కూడా ఓ లుక్కేయండి!
Photos Courtesy: Star మా and Disney+Hotstar

శనివారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే
శనివారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. ప్రేమ్ తన గత పుట్టినరోజు గురించి గుర్తు చేసుకుంటాడు. అప్పుడు అందరూ అతడిని సర్‌ప్రైజ్ చేయాలని ప్లాన్ చేస్తుంటారు. అర్ధరాత్రి కాకుండా పుట్టినరోజునే విష్ చేయాలని అంతా అనుకుంటారు. అందుకు అనుగుణంగానే కనిపించకుండా.. పట్టించుకోకుండా నటిస్తారు. దీంతో ప్రేమ్ నిరాశకు లోనవుతాడు. ఇక, ఉదయాన్నే కూడా ఎవరూ అతడిని పట్టించుకోరు. అలా ఓ గదిలోకి వెళ్లగానే లైట్స్ ఆర్పేస్తారు. ఆ తర్వాత ఒక్కొక్కటిగా వెలిగించి అతడిని సర్‌ప్రైజ్ చేస్తారు. దీంతో అందరూ సంతోషంగా గడుపుతారు.

ప్రేమ్‌కు స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన తల్లి
తులసి ఇంట్లో ప్రేమ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుగుతాయి. అందరూ సంతోషంగా ప్రేమ్ ఈ సంబరాల్లో పాల్గొంటారు. ఆ తర్వాత అంకిత 'ప్రేమ్.. ఆంటి నీకోసం ఏం గిఫ్ట్ తెచ్చారో అడగవా' అని అంటుంది. దీంతో ప్రేమ్ ఏం గిఫ్ట్ తెచ్చావ్ మామ్ అంటాడు. అప్పుడు తులసి తొందరెందుకు అంటుంది. ఇంతలో అభి వెళ్లి ఆ గిఫ్ట్ తెచ్చి తులసికి ఇస్తాడు. తులసి ఆ గిఫ్ట్ ను ప్రేమ్‌కు ఇస్తుంది. అదేంటో కాదు.. అతడికి బాగా ఇష్టమైన గిటార్. ఇది అమ్మ ఇచ్చే గిఫ్ట్ కాదు. అమ్మ మనసు. దీనికి బదులుగా నువ్వు ఒక మాట ఇవ్వాలి ప్రేమ్ అని అడుగుతుంది తులసి.

ప్రేమ్‌తో మాట తీసుకున్న తులసి
గిటార్‌ను గిఫ్టుగా అందించిన తర్వాత తులసి 'ఇది ఇప్పటి నుంచి నీ జీవితం కావాలి. నువ్వు గొప్ప గాయకుడివి కావాలి. పేరు సంపాదించాలి' అంటుంది. దీంతో సరే అంటాడు. అప్పుడు శృతి 'ప్రేమ్.. ఆంటి నీకు ఈ గిఫ్ట్ ఇచ్చినందుకు నువ్వు ఒక పాట పాడాలి' అంటుంది. కుటుంబ సభ్యులు కూడా అందరు అడగడంతో.. పెదవే పలికిన మాటల్లోనా అంటూ పాట పాడుతాడు. దీంతో అందరూ సంతోషిస్తారు. అప్పుడు పరందామయ్య 'ఎప్పుడూ మీ అమ్మ గురించే పాడుతావా.. ఈరోజు ఫ్యామిలీ పార్టీరా.. సెలబ్రేట్ పార్టీ' అంటాడు. ఇలా గతాన్ని గుర్తు చేసుకుంటాడు.

నువ్వు అమ్మలా ఉన్నావు అంటూ
ప్రేమ్ గతాన్ని గుర్తు చేసుకున్న తర్వాత శృతి 'లాస్ట్ ఇయర్ అందరి మధ్య జరుపుకున్నావు. ఈసారి నేను ఒక్కదాన్నే ఉన్నాను. నేను ఇంతే చేయగలిగాను. బాధపడకు ప్రేమ్' అంటుంది. అప్పుడు ప్రేమ్ 'అమ్మ నా పక్కన లేకపోయినా.. అమ్మలా చూసుకోవడానికి నువ్వు నా పక్కనే ఉన్నావు కదా అది చాలు. నువ్వే నాకు అన్నీ' అంటాడు. మరోవైపు ఆటోలో ప్రేమ్, శృతి.. గుడికి వెళ్తారు. ఇంత దూరం వచ్చి ఈ గుడిలో ఎందుకు పూజ చేయించడం అని శృతి అడుగుతుంది. దీంతో ప్రేమ్ ప్రతి సంవత్సరం నా బర్త్ డే రోజు అమ్మ ఈ గుడిలో పూజ చేస్తుంది అని చెబుతాడు.

తులసి కోసం వేచి చూసిన ప్రేమ్
ప్రేమ్, శృతి వెళ్లిన గుడిలో తులసి పూజ చేయిస్తూ ఉంటుంది. కానీ.. ప్రేమ్ ఆమెను చూడడు. అప్పుడు శృతి 'వద్దు ప్రేమ్.. మనం వెనక్కి వెళ్లిపోదాం. ఎందుకంటే.. ఒకవేళ ఈసారి మీ అమ్మ ఇక్కడికి రాకపోతే నువ్వు బాధపడతావు' అంటుంది. అప్పుడతను 'సరే.. శృతి మనం వెనక్కి వెళ్లిపోదాం . అమ్మ రాకపోతే ప్రేమ లేదని జీవితాంతం బాధపడాల్సి వస్తుంది అన్నావు కదా.. ఒకవేళ అమ్మ ఉంటే జీవితాంతం ప్రేమ ఉందని సంతోషంగా కూడా ఉండొచ్చు కదా. అందుకే లోపలికి వెళ్లి ఒకసారి చూద్దాం' అంటాడు. లోపలికి వెళ్తారు. వాళ్లను తులసి చూస్తుంది.

కనిపించకుండా దాక్కున్న తల్లి
తన కోసం గుడికి వచ్చిన ప్రేమ్‌కు కనిపించకూడదని తులసి అనుకుంటుంది. అందుకోసం పక్కకు వెళ్లి దాక్కుంటుంది. అప్పుడు ప్రేమ్ తను ఇంకా రాలేదని అనుకుంటాడు. ఆ తర్వాత అక్కడే ఉన్న పూజారిని కూడా అడుగుతాడు. కానీ, ఆయన మాత్రం ఎవరూ రాలేదని అంటాడు. అప్పుడు ప్రేమ్ 'అమ్మ వచ్చేదాక వెయిట్ చేద్దాం పదా. అమ్మ ఖచ్చితంగా వస్తుంది. ఒకవేళ అమ్మ కనుక రాకపోతే జీవితంలో నేను ఇక పుట్టిన రోజులు చేసుకోను' అని అంటాడు. దీనికి శృతి 'ఒకవేళ ఆంటి ఇక్కడకు వచ్చినా నీ వైపు మాత్రం చూడరు కావచ్చు' అంటుంది.

తల్లిని చూసిన ప్రేమ్.. దివ్య అలా
ప్రేమ్ గుడి లోపలికి వెళ్లాలని అనుకుంటాడు. అప్పుడు అతడికి కంట పడకుండా.. తులసి అక్కడే దాక్కొని ఉంటుంది. అప్పుడు శృతి 'ఆంటి వస్తారో రారో.. మనం అయితే గుడిలో దండం పెట్టుకొని వెళ్దాం పదా' అంటుంది. దీంతో సరే పదా అని గుడిలోపలికి వెళ్తారు ప్రేమ్, శృతి. ఇంతలో తులసి బయటికి వచ్చి అక్కడి నుంచి ఆటోలో వెళ్తుంటుంది. అప్పుడామెను ప్రేమ్ చూసేస్తాడు. అప్పుడు చాలా సంతోషిస్తాడు. మరోవైపు, ప్రేమ్‌ను పిలిచి పుట్టినరోజు చేద్దామని దివ్య.. అంకితతో అంటుంది. కానీ, ఆమె వద్దంటుంది. అప్పుడు దివ్య తల్లిపై కోపాన్ని చూపిస్తుంది.

ప్రేమ్‌కు బాబూరావు బిగ్ సర్‌ప్రైజ్
గుడి నుంచి ఇంటికి వచ్చిన ప్రేమ్, శృతికి ఇంటి ఓనర్ బాబూరావు, అతడి భార్య కనిపిస్తారు. అప్పుడు వాళ్లిద్దరూ వీళ్లపై గొడవ పడినట్లు.. ఇల్లు ఖాళీ చేయమన్నట్లు గొడవ పెట్టుకుంటారు. దీంతో ఇద్దరూ టెన్షన్ పడుతుంటారు. అప్పుడు వాళ్లు ఒక్కసారిగా నవ్వేసి సర్‌ప్రైజ్ చేస్తారు. అనంతరం ప్రేమ్ కోసం బాబూరావు ఆటోను తీసుకొచ్చానని అంటాడు. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.


Click it and Unblock the Notifications











