Intinti Gruhalakshmi Today Episode: ప్రేమ్ ఇంటికొచ్చి షాకిచ్చిన దివ్య.. శృతికి నిజం తెలియడంతో!
దాదాపు రెండు మూడు దశాబ్దాలుగా తెలుగు బుల్లితెరపై ప్రసారం అయ్యే సీరియళ్లకు మాత్రమే సుదీర్ఘ కాలంగా ప్రేక్షకుల నుంచి భారీ నుంచి అతి భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోందన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' మంగళవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరు కూడా ఓ లుక్కేయండి మరి!
Photos Courtesy: Star మా and Disney+Hotstar

సోమవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే
సోమవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. ప్రేమ్ పుట్టినరోజు సందర్భంగా వాళ్ల అమ్మ గిటార్‌ను గిఫ్టుగా ఇస్తుంది. అంతేకాదు, పాటే నీ ప్రపంచం కావాలని మాట తీసుకుంటుంది. గతాన్ని గుర్తు చేసుకున్న తర్వాత శృతి దగ్గర ప్రేమ్ బాధ పడతాడు.
అనంతరం ఇద్దరూ కలిసి తులసి వెళ్లే గుడికి వెళ్తారు. అక్కడ వీళ్లను చూసిన తులసి దాక్కుని కనిపించకుండానే పారిపోతుంది. కానీ, అది ప్రేమ్ చూస్తాడు. దీంతో ఎంతగానో సంతోషిస్తాడు. ఇక, చివర్లో ప్రేమ్, శృతి ఇంటికి వచ్చే సరికి ఓనర్లు అక్కడకు వచ్చి.. గొడవ పడినట్లు నటించి.. ఆ తర్వాత ఇద్దరినీ సర్‌ప్రైజ్ చేసేస్తారు.

ప్రేమ్‌ను సర్‌ప్రైజ్ చేసిన బాబూరావు
ప్రేమ్, శృతి గుడికి వెళ్లొచ్చే లోపు అతడి పుట్టినరోజు అని తెలుసుకున్న బాబూరావు, అతడి భార్య ఇంటికి వస్తారు. వచ్చీ రావడమే వాళ్లను బయపెట్టే విధంగా గొడవ చేస్తారు. ఆ తర్వాత రాములమ్మను పిలవగా.. ఆమె కేక్ పట్టుకుని వస్తుంది. దీంతో సర్‌ప్రైజ్ చేశామని నవ్వుతారు. అప్పుడు శృతి, ప్రేమ్ ఊపిరి పీల్చుకుంటారు. ఆ తర్వాత అందరూ కలిసి బర్త్‌డే జరుపుకుంటారు. అప్పుడు బాబూరావు భార్య 'మీ అమ్మ నీ దగ్గర లేకపోయినా నీకు మేమున్నాం. దేనికీ మొహమాటపడకు. మమ్మల్ని సొంతం వాళ్లు అనుకో బాబు' అని చెప్పడంతో అతడు సంతోషిస్తాడు.

గిఫ్టుగా ఆటో.. తెలియడంతో శృతి షాక్
బాబూరావు భార్య 'నీ పుట్టిన రోజు సందర్భంగా నీకు ఒక గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాం. నడుపుకోవడానికి అద్దెకు ఆటో అడిగావట కదా రాములమ్మ చెప్పింది మాట్లాడి పెట్టాను' అంటుంది. అప్పుడు బాబూరావు ఇదిగో కీస్ అని ఇవ్వబోతాడు. ఈ విషయం తెలిసి శృతి షాక్ అవుతుంది.
ఆ వెంటనే ఆటో అడగటం ఏంటి ఆంటి అంటుంది. అప్పుడు రాములమ్మ 'ఇల్లు గడవడం కష్టంగా ఉందని ప్రేమ్ బాబు ఆటో నడుపుతా అన్నాడు. అదే కాంతం అక్కకు చెప్పాను' అంటుంది. దీంతో శృతికి చాలా కోపం వస్తుంది. అప్పుడు అక్కడి నుంచి బయటికి వెళ్లిపోతుంది.

ఇంటికొచ్చిన తులసి.. అంకితపై ఫైర్
ప్రేమ్, శృతికి కనిపించకుండా గుడిలో తప్పించుకుని తిరిగిన తులసి.. కొద్ది సేపటికి ఇంటికి వచ్చేస్తుంది. అప్పుడామెను చూసిన అంకిత ఒక్క నిమిషం అంటూ ఆగమంటుంది. దీంతో తులసి ఏం మాట్లాడుతుందా అని వేచి చూస్తుంటుంది. ఆ సమయంలో అంకిత 'ఈరోజు ప్రేమ్ పుట్టినరోజు కదా ఆంటీ. ఒకసారి ఇంటికి రమ్మని పిలుద్దామా' అంటూ ఏదో చెప్పబోతుంది. దీంతో తులసికి కోపం తన్నుకొస్తుంది. అప్పుడామెతో 'నువ్వు దీని గురించే మాట్లాడాలి అంటే నాతో మాట్లాడొద్దు' అంటూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. దీంతో అంకిత ఎంతగానో బాధ పడుతుంది.

దూరంగా పెట్టొద్దని బాధ పడిన శృతి
ప్రేమ్ ఆటో అడిగాడన్న విషయం తనకు చెప్పకపోవడంతో శృతి బయటికి వచ్చి ఏడుస్తూ ఉంటుంది. అప్పుడతను 'తప్పు చేశాను శృతి' అంటాడు. దీనికి శృతి 'బాధ పెట్టడం కాదు. నా గుండెకు గాయం చేశావు. నా మీద నమ్మకం ఉంది అనుకున్నాను కానీ.. నన్ను అనుమానపడతావని అనుకోలేదు. నువ్వు నన్ను అర్థం చేసుకున్నది ఇంతేనా? నీతో కలిసి జీవితం పంచుకోవడానికే నేను నీతో కలిసి వచ్చాను.
ఎందుకు నన్ను పరాయిదానిలా చూస్తున్నావు. ఎందుకు నాతో మనసు విప్పి మాట్లాడలేకపోతున్నావు. నా తప్పు ఏమైనా ఉంటే చెప్పు సరిదిద్దుకుంటాను. అంతే కానీ.. నన్ను దూరం చేయకు' అంటుంది.

ప్రేమ్‌కు చిలిపి శిక్ష విధించిన శృతి
తనను దూరం పెడుతున్నాడని ప్రేమ్‌తో చెప్పి బాధ పడుతుంది శృతి. అప్పుడు అతడు 'శృతి నన్ను అర్థం చేసుకో. బర్త్ డే మూడ్‌లో ఎందుకు ఈ విషయం చెప్పడం. తీరిగ్గా రాత్రి మాట్లాడుదామనుకున్నా. ఈలోపే ఈ విషయం తెలిసింది. అంతకుమించి ఇంకేం చేయాలనుకోలేదు. నిన్ను ఎప్పుడైనా దూరంగా పెట్టానా? నన్ను నువ్వే అర్థం చేసుకోకపోతే ఇంకెవరు అర్థం చేసుకుంటారు చెప్పు' అంటూ సర్ధి చెబుతాడు. దీంతో నిజంగానా అంటుంది శృతి. దీంతో అవును అంటాడు. అయినా కూడా నీకు శిక్ష పడాల్సిందే అంటూ లోపలికి తీసుకుని వెళ్తుంది.

తులసిని అర్థం చేసుకున్న మామ
తులసి ప్రేమ్ గురించే ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో పరందామయ్య వస్తాడు. అప్పుడు ఆయనతో 'ప్రేమ్ నా ప్రాణం.. ఎలాగైనా రక్షించుకుంటా' అని చెబుతుంది.
అప్పుడు పరందామయ్య 'ఒకవైపు ఇంటి మీద ఉన్న అప్పు.. మరోవైపు ప్రేమ్ సమస్య.. ఇంట్లో వాళ్లతో తలనొప్పి.. ఏంటమ్మా ఇది. నువ్వు ఓపికగానే ఉన్నావు కానీ.. ఇంట్లో వాళ్లకే ఓపిక లేదు. ప్రేమ్‌ను ద్వేషిస్తున్నావు అనుకుంటన్నారు కానీ.. నువ్వు వాడి కోసం గుడికి వెళ్లావు అని వాళ్లకు తెలియదు' అంటాడు. దీనికామె 'నేను చేసే పనులు కాదు.. ఫలితాలు కనబడాలి అనుకుంటాను' అంటుంది.

ప్రేమ్ ఇంటికి దివ్య.. ఆటో స్టార్ట్స్
ప్రేమ్ ఎక్కడ ఉన్నాడో తెలుసుకుని దివ్య ఆ ఇంటికి వెళ్తుంది. అప్పుడు అన్నను చూసి చాలా సంతోషిస్తుంది. అనంతరం ఇంటిని చూసి షాక్ అవుతుంది. తర్వాత తన తల్లిని నిందిస్తూ ఏదేదో మాట్లాడబోతుంది. అప్పుడు ప్రేమ్ 'ఇంటికి సంబంధించి ఏ నిర్ణయం అయినా అమ్మదే ఫైనల్. అందుకే.. అమ్మకు తెలియకుండా నువ్వు ఎందుకు వచ్చావు.
అమ్మ ఒప్పుకుంటేనే ఇక్కడికి రా అంటున్నా. అమ్మ ఏం చేసినా మన మంచికే చేస్తుంది. అమ్మకు అపార్థం చేసుకోవద్దు' అంటాడు. దీంతో దివ్యకు కోపం వచ్చి వెళ్లిపోతుంది. అనంతరం ప్రేమ్ ఆటోకు శృతి పూజ చేస్తుంది. ఆ తర్వాత అతడు ఆటో నడపడం మొదలు పెడతాడు. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.


Click it and Unblock the Notifications











