Intinti Gruhalakshmi: లాస్యను కాదని తులసితో నందూ.. దివ్యను కాపాడిన విక్రమ్.. పిల్ల పడిపోయిందిగా!

దాదాపు రెండు దశాబ్దాలకు పైగానే తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' గురువారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!

Photos Courtesy: Star మా and Disney+Hotstar

బుధవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

బుధవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే


బుధవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. దివ్యను విక్రమ్ తన కారులో తీసుకు వెళ్తుండగా యాక్సిడెంట్ జరుగుతుంది. ఆ సమయంలో గాయపడిన కుర్రాడికి విక్రమ్‌ ఓ రేంజ్‌లో క్లాస్ పీకుతాడు. అంతేకాదు, ప్రేమ గురించి కూడా సరైన అర్థాలను చెబుతాడు. దీంతో దివ్య ఫ్లాట్ అయిపోతుంది. ఇక, ఇంటికి వెళ్లిన తర్వాత దివ్య తన తల్లిదండ్రులు క్లోజ్‌గా ఉండడం చూసి ఎంతగానో సంతోష పడుతుంది. దివ్య తాను పని చేస్తున్న ఆస్పత్రిలో ఓ పేషెంట్ కడుపులో కత్తెర పెట్టి కుట్టేశారని తెలుసుకుని.. రాజ్యలక్ష్మికి విషయం చెప్తుంది. అలాగే, బాధితులకు డబ్బు ఇప్పిస్తుంది.

నందూ తీరుపై లాస్య ఆగ్రహం

నందూ తీరుపై లాస్య ఆగ్రహం


తులసికి సేవలు చేయడంపై నందూను లాస్య ఫోన్‌లోనే ప్రశ్నిస్తుంది. ఆ సమయంలోనే 'మొన్న నైట్ తులసితో కలిసి ఆమె గదిలోనే వెచ్చగా పడుకున్నావు. నిన్నటికి నిన్న కన్నీళ్లతో ఆమెకు క్షమాపణ చెప్పావు అంటే.. నువ్వు సిగ్నల్ ఇస్తున్నట్టే కదా' అని ప్రశ్నిస్తుంది. దీంతో నందూ 'వాసుదేవ్ కోసం మనం నాటకం ఆడుతున్నాం. ఈ నాటకంలో ఇలాంటి అనుకోని సంఘటనలు చాలా జరగుతాయి. నువ్వు భూతద్దంలో పెట్టి చూడకు' అని అంటాడు. దీంతో లాస్య 'సర్లే చూడను.. నువ్వు వెంటనే కెఫేకి వచ్చెయ్ అనగా తులసికి జ్వరం ఉంది ఇప్పుడు రాలేను అంటాడు.

 లాస్యను కాదంటూ తులసితో

లాస్యను కాదంటూ తులసితో

నందూ మాటలతో లాస్య షాక్ అవుతుంది. అప్పుడామె 'తులసిని చూడడానికి ఇంట్లో ఎంతో మంది ఉన్నారు. నువ్వు దగ్గరుండి చూసుకుంటేనే కానీ.. తనకి జ్వరం తగ్గదా? ఈ సెంటిమెంట్ ఎందుకు' అని ప్రశ్నిస్తుంది. దీంతో నందూ 'ఇది సెంటిమెంట్ కాదు మానవత్వం.. ఈ నాటకం నీకు ఇష్టం లేకపోతే వచ్చి వాసుదేవ్ ముందు నాటకాన్ని బయట పెట్టే. నాకు రిలీఫ్‌గా ఉంటుంది' అని అంటాడు. దీంతో లాస్య 'సర్లే నీ ఇష్టం.. కానీ తులసికి కాస్త దూరంగా ఉండు' అంటుంది. తర్వాత మంచం మీద ఉన్న తులసికి నందూ బ్రెడ్ తినిపిస్తూ ఉంటాడు.

సంజయ్ కోపం.. తల్లి ఫైరింగ్

సంజయ్ కోపం.. తల్లి ఫైరింగ్


దివ్యను ఆస్పత్రిలో కలవడం కోసం ముఖానికి కర్చీఫ్ కట్టుకుని విక్రమ్ ఆస్పత్రికి వస్తాడు. అలా ఆమె కోసం అతడు దొంగ వేషాలు వేస్తుండగా.. మరోవైపు రాజ్యలక్ష్మి, సంజయ్‌లు దివ్య చేసిన అవమానం తలుచుని కోపంతో రగిలిపోతూ ఉంటారు. అప్పుడు సంజయ్ 'జీతం తక్కువ అని దివ్యను తీసుకొచ్చి పెట్టావు. ఇప్పుడు చూడు అది మన దుమ్ముదులుపుతుంది' అని అంటాడు. దీంతో రాజ్యలక్ష్మి కోపంతో 'తప్పు చేసింది నువ్వు. అవసరం లేకపోయినా ఆపరేషన్ చేయమన్నాను. కానీ, కత్తెర లోపల పెట్టి కుట్లు వేస్తే ఎలా' అంటూ కొడుకుకు చీవాట్లు పెడుతుంది. సంజయ్, రాజ్యలక్ష్మి మాటలను విన్న విక్రమ్ 'మనల్ని అంత ఇబ్బంది పెడుతున్న డాక్టర్ ఎవరు? వెంటనే ఆమెను ఉద్యోగంలో నుంచి పీకేయండి' అని అంటాడు.

 తల్లి వైపే మాట్లాడిన విక్రమ్

తల్లి వైపే మాట్లాడిన విక్రమ్


విక్రమ్ మాటలకు రాజ్యలక్ష్మి 'లేదు నాన్న.. తప్పు మన వైపు ఉండిపోయింది. అందుకే సైలెంట్‌గా ఉన్నాం' అంటుంది. దీంతో విక్రమ్ 'మా అమ్మ తప్పు చేసినా అది రైటే. అడిగే హక్కు ఇక్కడ ఎవరికీ లేదు' అని ఎమోషనల్‌గా మాట్లాడతాడు. దీనికామె 'ఇప్పుడు ఇలాగే అంటావ్ రా.. రేపటి రోజున మీ ఆవిడ న్ను బెదిరిస్తే ఏం చేస్తావు రా' అని అంటుంది. దీంతో విక్రమ్ 'అలా ఎప్పటికీ జరగదు. నాకు తెలుసు. నిన్ను గౌరవించే కోడలే వస్తుంది. ఈ హాస్పటల్‌లో నిన్ను బెదిరించిన డాక్టర్ ఎవరో చెప్పు' అని అంటుంది. అప్పుడు 'నేను చూసుకుంటాలే నువ్వు వెళ్లు' అని రాజ్యలక్ష్మి అంటుంది. తర్వాత సంజయ్‌తో 'దివ్యపై నాకు పీకలవరకూ కోపం ఉందిరా.. కానీ దానితో మనకి అవసరం ఉంది. దాని చేయిమంచిదిరా. బంగారు బాతు' అని అంటుంది.

 విక్రమ్ గురించి లాస్య ఆరా

విక్రమ్ గురించి లాస్య ఆరా


కెఫేలో ఉన్న లాస్య నందూ, తులసి వ్యవహరిస్తున్న తీరు గురించి ఆలోచిస్తుంటుంది. అప్పుడు 'మగాడిగా బతికే నందూ.. మొగుడిగా ఎప్పుడు మారాడు. అంత బుద్దిమంతుడు ఎలా అయిపోయాడు. తులసికి దగ్గరగా ఉంటున్నాడు కదా.. గాలి సోకి బ్రెయిన్ ఫీవర్ వచ్చిందేమో. ఆ మాజీ మొగుడు పెళ్లాల మధ్య మళ్లీ ఏదో పుల్ల పెట్టాల్సిందే. ఇలా వదిలేస్తే జీడి పాకంలా దగ్గరైపోతున్నారు. పెడతా.. గట్టి పుల్లనే పెడతాను' అని అనుకుంటుంది. అప్పుడే లాస్యకు భాగ్య ఫోన్ చేస్తుంది. ఆ సమయంలో లాస్య 'వంకాయలు కొంటున్న ఆ సొరకాయ గాడు గురించి నేను చెప్పిన పని ఏం చేశావు' అని విక్రమ్ గురించి అడుగుతుంది. అంతేకాదు, 'అసలు వాడు ఎవడు? ఏం చేస్తుంటాడు? దివ్య వెనుక ఎందుకు పడుతున్నాడు' అని ఆరా తీస్తుంది.

లాస్యకు చెప్పేసిన భాగ్య

లాస్యకు చెప్పేసిన భాగ్య


లాస్య మాటలకు భాగ్య 'దివ్యతో పాటు ఉన్నాడంటే డాక్టర్ అనుకున్నా.. కానీ వాడికి డాక్టర్ అనే పదానికి స్పెల్లింగ్ కూడా తెలియదు. చదువు లేదు కానీ కోట్లు ఆస్తి ఉంది. వాడు వారసుడు కానీ వారసుడు. స్వీట్ షాపు ఓనర్ లాంటోడు. చుట్టూ ఎన్ని స్వీట్స్ ఉన్నా తినే అదృష్టం ఉండదు. అలాగే వీడు కూడా. ఆ ఇంటికి వారసుడే కానీ, పెద్ద పాలేరు లెక్క. సవతి తల్లి ఉంది. ఆమె చెప్పినట్టే చేస్తాడు. అయినా అలాంటివాడితో దివ్యకి ఫ్రెండ్ షిప్ ఏంటో' అని అంటుంది. దీంతో లాస్య 'అది మన అదృష్టం.. అవసరం అయిన దానికంటే చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చావు. ఆ ఇంటిపైన మనుషుల పైన కన్నేసి ఉంచు. తీరిగ్గా కలుసుకుని మాట్లాడుకుందాం' అని చెబుతుంది

రౌడీల నుంచి కాపాడాడు

రౌడీల నుంచి కాపాడాడు

దివ్య కోసం ఆస్పత్రి దగ్గరే ఉన్న విక్రమ్ ఆమెతో పాటు మాట్లాడుకుంటూ వెళ్తుండగా రౌడీలు వచ్చి ఏడిపిస్తారు. వాళ్ల చుట్టూనే తిరుగుతూ 'ఏరా తమ్ముడూ.. బేరం కుదరకపోతే వెళ్లిపోవచ్చు కదా. మేం సెట్ చేసుకుంటాం. ఏ పిల్లా వస్తావా' అని దివ్య చేయి పట్టుకోబోతారు. దీంతో విక్రమ్ 'ఎక్కడికిరా వచ్చేది? అమ్మాయి కనిపిస్తే చాలు ఇలాంటి వంకర ఆలోచనలేనా? మీరు తప్పు చేస్తున్నార్రా.. మర్యాదగా అమ్మాయికి సారీ చెప్పండి' అంటాడు. ఆ సమయంలో గొడవ జరగడంతో విక్రమ్ వాళ్లను కొడతాడు. దీంతో వాళ్లు పారిపోతారు. అప్పుడు దివ్య విక్రమ్‌కు ఫిదా అవుతుంది. ఆ వెంటనే అతడి బైక్ ఎక్కేసి వెళ్లిపోతుంది. తర్వాత లాస్య వాసుదేవ్ మాటలను విని ఫీల్ అవుతుంది. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X