Intinti Gruhalakshmi Today Episode: నిజం తెలుసుకున్న దివ్య.. ప్రేమ్ కోసం తులసి.. నందూకు లాస్య షాక్
ఇండియాలోని మిగిలిన భాషలతో పోల్చుకుంటే తెలుగు బుల్లితెరపై ప్రసారం అయ్యే సీరియళ్లకు మాత్రమే సుదీర్ఘ కాలంగా ప్రేక్షకుల నుంచి భారీ నుంచి అతి భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోందన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' గురువారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరు కూడా ఓ లుక్కేయండి మరి!
Photos Courtesy: Star మా and Disney+Hotstar

బుధవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే
బుధవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. ప్రేమ్ ఆటో నడపడం మొదలు పెట్టగానే తులసి, అనసూయ ఎక్కుతారు. వాళ్లకు ముఖం కనిపించకుండా జాగ్రత్త పడి గమ్యానికి చేరుస్తాడు. ఆ తర్వాత 300 చార్జ్ ఇవ్వగా.. ఆ డబ్బులు కింద పడేసి తల్లి కాళ్లకు దండం పెడతాడు. ప్రేమ్ వెళ్లిపోతోన్న సమయంలో అతడిని వాళ్లిద్దరూ చూస్తారు.
మరోవైపు, లాస్య, నందూ వస్తున్న కారు ఆగిపోగా.. ఆటో ఆపుతారు. అప్పుడు ప్రేమ్‌ను చూసి లాస్య ఎగతాళి చేస్తుంది. మరోవైపు, దివ్య ఆన్‌లైన్ క్లాసులకు అటెండ్ కావట్లేదని కాలేజ్ నుంచి తులసికి ఫోన్ వస్తుంది. కానీ, ఆమె మాత్రం మాట వినదు.

దివ్య గురించి ఆబద్ధం చెప్పిన తల్లి
ప్రేమ్ మీద పెట్టుకున్న బెంగతో పాటు తల్లితో గొడవ పడుతూ దివ్య కొన్ని రోజులుగా ఆన్‌లైన్ క్లాసులకు అటెండ్ కాకుండా ఉంటుంది. ఈ విషయాన్ని కాలేజ్ వాళ్లు తులసి దృష్టికి తీసుకుని వస్తారు. అప్పుడు వాళ్లకు 'దివ్యకు కొద్ది రోజులుగా ఆరోగ్యం బాగోవడం లేదు. అందుకే నేనే ఆన్‌లైన్ క్లాసులకు అటెండ్ కావొద్దని చెప్పాను. ఇందులో తన తప్పు ఏమీ లేదు' అని ఫోన్‌లో చెబుతుంది. దీంతో వాళ్లు ఒప్పుకుంటారు. ఆ తర్వాత పరందామయ్య వచ్చి 'దివ్య నీ మాట వింటుందా? ఎందుకు బాధపడుతున్నావు. తనను రెండు రోజుల్లో ఆన్‌లైన్ క్లాసుల కోసం ఎలా ఒప్పిస్తావు' అని అంటాడు.

తులసి మాటలను వినేసిన దివ్య
పరందామయ్య, తులసి మాట్లాడుతుండగా దివ్య అక్కడకు వస్తుంది. అప్పుడు తులసి 'వాడికి మంచి చేయబోయి చెడు చేస్తున్నాను. వాడి జీవితాన్ని దారిన పెట్టాలని దారి తప్పేలా చేస్తున్నానా అని అనిపిస్తోంది. నా గురించి నా కష్టాల గురించి ఆలోచిస్తూ తన గురించి పట్టించుకోవడం లేదు.
తన లక్ష్యాలను పట్టించుకోవడం లేదు. నేను వాడి బలహీనతగా మారాననే కదా.. వాడిని ఇంట్లో నుంచి తరిమేసింది. ఇంట్లో నుంచి బయటికి వెళ్తే అయినా జీవితంలో ఎదుగుతాడు అనుకున్నా. ఎవరు ఏమన్నా.. గుండెను రాయిని చేసుకొని వాడిని బయటికి పంపించా' అంటుంది.

మేమిద్దరం ఓడిపోయినట్లే అంటూ
ప్రేమ్ గురించి తులసి మాట్లాడుతూ.. 'వాడు బాగుపడతాడని అనుకుంటే.. ఆటో నడుపుకొని జీవించడం ఏంటి? నేను ఇప్పుడు వాడి మీద జాలి చూపిస్తే.. వాడి మనసులో లక్ష్యం చచ్చిపోతుంది. నా కొడుకు చేతగాని వాడు.. జీవితంలో ఓడిపోయాడు అని నేనే అందరికీ చెప్పినట్టు అవుతుంది. అదే జరిగితే తల్లిగా నేను.. కొడుకుగా వాడు ఓడిపోయినట్టే. ఇద్దరం తలదించుకునే పరిస్థితి వస్తుంది' అంటుంది. దీనికి పరందామయ్య 'ప్రేమ్‌ను ఇంటికి తీసుకురాను అంటావు.. అలా అని ఒంటరిగా వదిలేయను అంటావు.. మరి ఏ నిర్ణయం తీసుకుంటావమ్మా' అంటాడు.

తప్పు తెలుసుకుని బాధ పడ్డ దివ్య
ప్రేమ్‌ను ఓడిపోనివ్వకూడదని డిసైడ్ అయిన తులసి.. పరందామయ్యతో 'నా కొడుకును గెలిపించుకుంటాను. వాడు కోరుకున్న జీవితం వైపు అడుగులు పడేలా చేస్తాను' అంటుంది. ఇక, పక్కనే ఉన్న దివ్య తన తప్పు తెలుసుకుని బాధ పడుతూ ఉంటుంది. అంతలోనే ఏడ్చుకుంటూ వచ్చి తులసి కాళ్లు పట్టుకుంటుంది దివ్య. 'నేను చాలా పెద్ద తప్పు చేశాను. నన్ను క్షమించు అమ్మ. నువ్వేంటో తెలిసి కూడా కళ్లు మూసుకుపోయి ప్రవర్తించాను. అనకూడని మాటలు మాట్లాడాను.
దయ్యం పట్టినట్టు మాట్లాడాను. నా చెంపలు పగులగొట్టు. ప్రేమ్ అన్నయ్య మంచికోసమే చేస్తున్నానని నాకు ఒక్క మాట చెబితే చాలు కదా మామ్.. నేను ఇలా చేసే దాన్ని కాదు' అని ఏడుస్తుంది. తర్వాత ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని తులసి మాట తీసుకుంటుంది.

మాధవితో ప్రేమ్‌కు తులసి మెసేజ్
ప్రేమ్ గురించి బాధ పడుతోన్న తులసి మాధవికి ఫోన్ చేసి 'వాడి గురించి నేను అనుకున్నది వేరు.. జరిగేది వేరు. వాడిప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా.. బతుకు తెరువు కోసం ఆటో నడుపుతున్నాడు. నా కళ్లతో నేను చూశాను. ప్రేమ్ అలా చేయడం నాకు నచ్చలేదు. వాడు తన లక్ష్యాన్ని మరిచిపోయాడు. వెళ్లి వాడికి నచ్చజెప్పు. తనకు ఇష్టమైన సంగీతంలో దారి వెతుక్కోమని సలహా ఇవ్వు. ఆలస్యం అయినా సరే.. దానికే కట్టుబడి ఉండమను. అప్పటి వరకు కావాల్సిన డబ్బు సాయం నువ్వు చేస్తా అని చెప్పు' అని ఆమెను రాయబారం పంపిస్తుంది.

తులసి ప్రయత్నాలు విఫలంగానే
తులసి చెప్పిన మాట ప్రకారం మాధవి.. ప్రేమ్, శృతి దగ్గరికి వస్తుంది. అప్పుడామె జాలిగా చూస్తుండడంతో 'మమ్మల్ని ఎవ్వరూ చూసి జాలి పడకూడదు' అంటాడు ప్రేమ్. దీనికి మాధవి 'లైఫ్‌లో నీ గోల్ ఏంటో మరిచిపోయావా. ఒక్కసారి లక్ష్యం మనసులో నుంచి పక్కకు జరిగితే నువ్వు ఆ లక్ష్యాన్ని మరిచిపోతావు' అంటుంది.
దీనికి ప్రేమ్ 'మా అమ్మ కోరిక నేను కాళ్ల మీద నిలబడటం.. నాకు నేనుగా ఏదైనా సాధించడం. నేను నీ దగ్గర హెల్ప్ తీసుకోవాలనుకుంటే.. ఇంట్లో నుంచి బయట అడుగు పెట్టగానే నీ ఇంటికే వచ్చేవాడిని' అంటాడు. దీంతో మాధవి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఆ తర్వాత జరిగిందంతా తులసికి చెబుతుంది. దీంతో తనే నేరుగా రంగంలోకి దిగాలని డిసైడ్ అవుతుంది.

నందూకు లాస్య చివరి వార్నింగ్
ప్రేమ్ అన్న మాటలు తలుచుకుని లాస్య బాధ పడుతుంది. తర్వాత 'ఈ ఇంట్లో నీ మాటకు విలువ లేనప్పుడు.. నీకు విలువ లేనప్పుడు ఎందుకు ఈ ఇంట్లో ఉండటం. ఈ అవమానాలు నేను చూడలేను. నేను తట్టుకోలేను. అందుకే నేను వెళ్లిపోతున్నాను' అంటూ నందూతో అంటుంది లాస్య. దీంతో వద్దు లాస్య.. ఆగు అంటాడు. అంతేకాదు, కొన్ని రోజులు ఓపిక పట్టు అంటాడు. అప్పుడామె 'రేపు ఉదయం వరకు ఓపిక పడతాను. ఆ తర్వాత నువ్వు నా దారికి రాలేదంటే.. నేను నా దారి చూసుకుంటాను' అని చెబుతుంది. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.


Click it and Unblock the Notifications











