Intinti Gruhalakshmi Today Episode: దివ్యకు షాకిచ్చిన లాస్య.. నందూ ఫైర్.. ప్రేమ్ దగ్గరకు వెళ్లాలని!

చాలా భాషలతో పోల్చుకుంటే తెలుగు బుల్లితెరపై ప్రసారం అయ్యే సీరియళ్లకు మాత్రమే సుదీర్ఘ కాలంగా ప్రేక్షకుల నుంచి భారీ నుంచి అతి భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోందన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' శుక్రవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరు కూడా ఓ లుక్కేయండి మరి!

Photos Courtesy: Star మా and Disney+Hotstar

గురువారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

గురువారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

గురువారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. దివ్య ఆన్‌లైన్ క్లాసులకు హాజరు కాకపోవడంతో కాలేజ్ వాళ్లకు ఫోన్ చేసిన వివరణ ఇస్తుంది తులసి. ఆ తర్వాత ఆమె పరందామయ్యతో ప్రేమ్ గురించి మాట్లాడుతుంది. అసలు అతడు ఓడిపోకూడదని.. తాను అనుకున్నది సాధించాలని అనుకుంటుంది. అదంతా విన్న దివ్య తన తప్పును తెలుసుకుని తల్లి కాళ్లపై పడుతుంది. మరోవైపు, ప్రేమ్‌కు నచ్చజెప్పమని తులసి.. మాధవిని పంపుతుంది. కానీ, అతడు మాత్రం మాట వినడు. ఇక, ప్రేమ్ మాటలకు ఫీలైన లాస్య.. ఇంట్లో నుంచి వెళ్లిపోదాం అంటూ నందూకు షాకిస్తుంది.

 తులసి ఇంట్లో హోలీ.. బాధగానే

తులసి ఇంట్లో హోలీ.. బాధగానే


తులసి ఇంట్లో హోలీ పండుగ సంబరాలు ప్రారంభం అవుతాయి. ముందుగా దివ్య రంగులను తీసుకెళ్లి తన తల్లి తులసికి రాయాలని అనుకుంటుంది. దీనికోసం ముందుగా ఆమె పర్మీషన్ తీసుకుంటుంది. చిన్నగా బొట్టు పెడతానని చెప్పి రంగులు పూస్తుంది. మరోవైపు, పరందామయ్య 'పండుగకైనా ప్రేమ్ ఇంటికి వస్తాడనుకున్నానే. ఎంతైనా ఇది వాడి ఇల్లు కదా. తులసి వెళ్లి వాడిని తిరిగి తీసుకుని వస్తుందని అనుకున్నాను. కానీ, అలా జగడం లేదు. పాపం వాడు ఎలా ఉన్నాడో' అని అనసూయతో అంటాడు. ఆమె కూడా అప్పుడు బాధ పడుతూ ఉంటుంది.

దివ్యపై లాస్య ఫైర్.. నందూతోనే

దివ్యపై లాస్య ఫైర్.. నందూతోనే


తులసికి రంగులు పూసిన తర్వాత దివ్య వచ్చి పరందామయ్యకు, అనసూయకు కూడా రాస్తుంది. వాళ్లు బాధగా ఉండడం చూసి ఇవాళ పండుగ అంటూ గుర్తు చేసి జోష్‌గా ఉండమంటుంది. అంతేకాదు, హోలీ శుభాంకాక్షలు చెబుతూ వాళ్లను కూడా ఖుషీ చేస్తుంది. ఆ తర్వాత వీళ్లిద్దరు కూడా బాధను మర్చిపోతారు. అనంతరం దివ్య.. లాస్యకు రంగులు పూయడానికి ప్రయత్నిస్తుంది. కానీ, ఆమె అడ్డుకుంటుంది. అంతేకాదు, బుద్దిలేదా అంటూ ఓ రేంజ్‌లో ఫైర్ అవుతుంది. దీంతో దివ్య బాధగా అక్కడి నుంచి వెళ్లిపోతుంది. అప్పుడు నందూ.. దివ్యను వెనక్కి పిలుస్తాడు.

 నందూతో గొడవకు పడిన లాస్య

నందూతో గొడవకు పడిన లాస్య


దివ్యను లాస్య తిట్టడం చూసిన నందూ.. తనకు రంగులు పూయమని అడుగుతాడు. 'ఏంటమ్మా దివ్యా.. ఈ డాడీకి రంగులు పూయవా? నాతో హోలీ పండుగ జరుపుకువా' అని ప్రశ్నిస్తాడు. దీంతో అప్పటి వరకూ ఏడుస్తూ ఉన్న దివ్య వెంటనే కామ్ అవుతుంది. అనంతరం నందూకు రంగులు పూస్తుంది. ఆమె వెళ్లిపోయిన తర్వాత లాస్య 'నాకు ఏది నచ్చదో నువ్వు అదే చేస్తావు కదా నందూ. అయినా నేను వద్దని చెప్పిందే చేస్తావు. ఇంట్లో నుంచి వెళ్లిపోవడం గురించి అడగమంటే మాత్రం పట్టించుకోవు' అంటుంది. దీంతో నందూ కూడా ఆమె మీద సీరియస్ అవుతాడు.

ప్రేమ్ ఇంటికి ఫ్యామిలీ మెంబర్స్

ప్రేమ్ ఇంటికి ఫ్యామిలీ మెంబర్స్


ఇంట్లో ఉన్న ఒక్కొక్కరికీ రంగులు పూసిన తర్వాత అభి, అంకిత దగ్గరకు వెళ్తుంది దివ్య. వాళ్లను చూసి బాధను పోగొట్టాలని సంతోషంగా మాట్లాడుతుంది. అనంతరం ప్రేమ్ అన్నయ్య దగ్గరకు వెళ్లి పండుగ జరుపుకుందామా అని వాళ్లతో అంటుంది. కానీ, వాళ్లిద్దరు మాత్రం తులసి గురించి భయపడతారు. అయినా ఎవరికీ చెప్పకుండా వెళ్లాలని అనుకుంటారు. అలా వెళ్తుండగా పరందామయ్య, అనసూయ, తులసి అడ్డుపడి అడుగుతారు. అప్పుడు ప్రేమ్ లేడని బాధగా ఉండడంతో మా ఫ్రెండ్ ఇంటికి వెళ్లి పండుగ చేసుకుందామని అనుకుంటున్నాం అని చెప్తుంది దివ్య.

బెడ్‌పై బట్టల్లేకుండా హీరోయిన్: హాట్ వీడియో షేర్ చేసిన రాంగోపాల్ వర్మ
https://telugu.filmibeat.com/heroine/ram-gopal-varma-share-apsara-rani-bed-video-108222.html

 మాధవితో కలిసి తులసి పయనం

మాధవితో కలిసి తులసి పయనం


అంకిత, అభి, దివ్యలు అబద్ధం చెప్పి మరీ ప్రేమ్ ఇంటికి వెళ్లిపోతారు. వాళ్లు అలా బయలుదేరిన వెంటనే తులసి.. మాధవికి కాల్ చేస్తుంది. అప్పుడామె.. 'మాధవి.. నేను ప్రేమ్ ఇంటికి వెళ్దామని అనుకుంటున్నాను' అని చెప్తుంది. దీనికి మాధవి 'అవునా వదిన. పండుగ పూట మంచి వార్త చెప్పావు' అని అంటుంది. అప్పుడు తులసి 'నేను వెళ్లేది వాడిని తీసుకొచ్చేందుకు కాదు. వాడి మనసును మార్చడానికి. వాడి భవిష్యత్‌ గురించి హెచ్చరించడానికి' అని చెబుతుంది. దీంతో మాధవి నిరుత్సాహపడుతుంది. అప్పుడు తులసి.. ఆమెను ఇంటికి రమ్మని అడుగుతుంది.

తలచుకుని బాధ పడిన ప్రేమ్

తలచుకుని బాధ పడిన ప్రేమ్


గత సంవత్సరం ఇంట్లో అందరి ముందూ హోలీ పండుగ జరుపుకున్నానని.. కానీ, ఇప్పుడు ఒంటరిగా ఉండిపోయానని ప్రేమ్ బాధ పడుతూ ఉంటాడు. అప్పుడు శృతి వచ్చి అడగ్గా తన మనసులోని బాధనంతా బయట పెడుతుంటాడు. అంతలో అక్కడకు దివ్య, అభి, అంకిత వస్తారు. వాళ్లు రాగానే అమ్మకు చెప్పి వచ్చారా అని అడుగుతాడు. దీనికి దివ్య చెప్పామని అబద్ధం చెబుతుంది. అప్పుడు అంకిత 'ఒక్క అబద్దాన్ని కప్పి పుచ్చడానికి ఎన్నో చెప్పాలి' అని మనసులో అనుకుంటుంది. ఆ తర్వాత అందరూ సంతోషంగా హోలీ పండుగ జరుపుకుంటారు.

 తులసితో గొడవకు దిగిన నందూ

తులసితో గొడవకు దిగిన నందూ


ప్రేమ్ దగ్గరకు వెళ్లి హెచ్చరించాలని తులసి కంగారుగా వెళ్లాలని అనుకుంటుంది. అప్పుడు అత్తమామలకు చెబుతుంది. అంతలో నందూ వచ్చి ఒక విషయం మాట్లాడాలని అంటాడు. కానీ, తులసి తనకు అర్జెంట్ పని ఉందని అంటుంది. అప్పుడు లాస్య 'చెప్పా కదా నందూ.. తులసికి నీ మాట అంటే లెక్కే లేదు. అసలు ఆమె నీకు విలువే ఇవ్వదు' అంటుంది. దీనికి నందూ మరింతగా రెచ్చిపోతాడు. తులసిపై కేకలు వేస్తాడు. అప్పుడామె కూడా గట్టిగానే మాట్లాడుతుంది. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరుగుతుంది. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X