Intinti Gruhalakshmi: ఆమెకు షాకిస్తూ ధర్నాకు దిగిన దివ్య.. నిజం చెప్పిన నందూ.. కథలో సూపర్ ట్విస్ట్
తరాలు మారుతూ ఉన్నా తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.
దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' శనివారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!
Photos Courtesy: Star మా and Disney+Hotstar

శుక్రవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే
శుక్రవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. తులసి నిద్ర లేవగానే నందూ పక్కన పడుకుని కనిపిస్తాడు. దీంతో ఆమె ఇబ్బందిగా ఫీల్ అవుతుంది. ఆ తర్వాత బయటకు వచ్చి ఫైల్స్ గురించి టెన్షన్ పడుతుండగా.. వాసుదేవ్ వచ్చి అవన్నీ నందూ కంప్లీట్ చేసేశాడని చెబుతాడు.
మరోవైపు, దివ్య మాత్రం విక్రమ్ ఆలోచనలోనే ఉండి అతడి మెసేజ్ చేస్తుంది. కానీ, అప్పుడే రాజ్యలక్ష్మి వచ్చి రెండు రోజులు మామిడి తోటకు వెళ్లమంటుంది. దీంతో కావాలనే విక్రమ్.. దివ్యను దూరం పెడతాడు. ఇక, ఆస్పత్రిలో నర్స్ దివ్య దగ్గరకు వచ్చి సంజయ్ చేసిన మోసం గురించి వివరిస్తుంది.

ప్రియ కోసం ఒప్పుకున్న దివ్య
సంజయ్ మోసం గురించి ప్రియ చెప్పగానే దివ్య 'ఆ రాజ్యలక్ష్మి మంచిదే అయినప్పటికీ ఇటువంటి విషయాలలో కన్నా కొడుకుని వెనకేసుకొస్తుంది. ఆ వెంటనే సంజయ్ కూడా వెళ్లి తల్లి వెనక దాక్కుంటాడు. మనం డైరెక్ట్‌గా వెళితే పనులు కావు. పబ్లిక్‌లోకి వెళ్దాము. అలా అయితేనే వాళ్లు దారికొస్తారు' అంటుంది.
దీంతో ప్రియ నావల్ల నీ జాబు రిస్క్‌లో పడుతుందేమో మేడం అంటుంది. అప్పుడు దివ్య 'నాకు చదువు ఉంది కాబట్టి నేను ఎక్కడైనా బతుకుగలను. నీ జీవితం ఇంపార్టెంట్. సరే నువ్వు వెళ్ళు నువ్వు ఏం మాట్లాడాలో ఏం చేయాలో మళ్ళీ ఫోన్ చేసి చెప్తా' అంటుంది.

దివ్య ఎందుకు ఫోన్ చేయలేదు
రాజ్యలక్ష్మి చెప్పినట్లుగానే విక్రమ్ మామిడి తోటను చూడడానికి విజయవాడ బయలుదేరుతాడు. కారులో వెళ్తూ పాటలు వింటూ ఎంజాయ్ చేస్తుంటాడు. కానీ, దివ్య గురించే ఆలోచిస్తుంటాడు. ఆ సమయంలోనే 'నా మీద దివ్య బెంగ పెట్టుకొని ఉంటుందేమో. కనీసం చెప్పలేదు.. ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేదు.
అవును దేవుడు చెప్పిన ప్రకారం ఈపాటికి ఫోన్లు రావాలి కదా ఇంకా ఫోన్ రాలేదు ఏంటి? అసలు ఏమైంది తనకు? ఎందుకు నాకు ఫోన్ చేయడం లేదు? నా మీద అలిగిందా? లేకుంటే నా మీద కోపం వచ్చిందా' అని తనలో తానే మనసులో అనుకుంటూ ఉంటాడు.

బాస్‌కు ధైర్యం చెప్పిన దేవుడు
దివ్య గురించి ఆలోచిస్తోన్న విక్రమ్ తనలో తాను బాధ పడుతూ ఉంటాడు. ఆ వెంటనే దేవుడికి ఫోన్ చేసి 'ఏం చేస్తున్నావ్ దేవుడు? దివ్య ఇంకా ఫోన్ చేయడం లేదు ఏంటి' అని వరుస ప్రశ్నలు వేస్తాడు. దీనికి దేవుడు 'మీరు వెళ్లి పావుగంటే కదా బాబు. మరి ఎందుకు అలా బీపీ పెంచేసుకొని ఆలోచిస్తారు. కొద్దిసేపు ఆగండి బాబు. దివ్య అమ్మ నుంచి మీకు వరుసగా ఫోన్ కాల్స్ వస్తాయి' అని ధైర్యం చెప్తాడు. దీంతో అంతేనంటావా దేవుడు అనగా.. అవును అనడంతో సంతోషపడతాడు. తర్వాత తెలుగు ఇంగ్లీష్ మిక్స్ చేసి ఇద్దరు ఒకరికొకరు పద్యాలు సామెతలు చెప్పుకుంటారు.

వాసుదేవ్ డీల్.. లాస్య నిరాశ
వాసుదేవ్ తన బిజినెస్ విషయంలో నందూకు పార్ట్నర్‌షిప్ ఇవ్వడంతో లాస్య తెగ సంతోష పడిపోతూ ఉంటుంది. అప్పుడు వాసుదేవ్ 'నీ కెఫే విషయంలో నీ వెనుక బ్యాక్‌బోన్‌లా నిలబడి నిన్ను ఒక స్థాయికి తీసుకొచ్చిన నీ భార్య తులసి.. ఈ విషయంలో కూడా నీ వెనకాలే ఉండి నిన్ను ఒక పైకి తీసుకెళ్తుందని నేను ఆశిస్తున్నాను' అంటాడు.
అప్పుడు లాస్య నిరాశ చెందుతుంది. ఆ వెంటనే 'తులసి తన జాబులో బిజీగా ఉంటుంది. ఈ విషయంలో నేను నందూకు సపోర్ట్‌గా ఉంటాను' అని అంటుంది. దీంతో వాసుదేవ్ 'నేను కేవలం ఈ డీల్ తులసి కోసం మాత్రమే ఒప్పుకున్నాను' అనడంతో లాస్య గిల్టీగా ఫీల్ అవుతుంది. ఆ తర్వాత వాసుదేవ్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు.

తులసి నా భార్య అవుతుంది
వాసుదేవ్ వెళ్లిపోగానే నందూ చేతిలో ఉన్న ఫైల్‌ను తీసుకుని లాస్య నా కష్టానికి తగ్గ ఫలితం దక్కబోతోంది అంటూ సంతోష పడుతుంది. అప్పుడు నందూ 'ఈ ఒక అబద్ధంతో గెలిచిన ఈ ప్రాజెక్టు డీల్ నాకు అవసరం లేదు. నిజం చెప్పేద్దామని అనుకుంటున్నాను. రెండు రోజులు తులసి నా భార్య స్థానంలో ఉంటేనే గింజుకున్నావు. ఈ డీల్ ఒప్పుకుంటే లైఫ్ లాంగ్ తులసి నా భార్యగా ఉండాలి' అని అంటాడు.
అప్పుడు లాస్య 'నీ మనసులో మాట చెబుతున్నావా' అని అడుగుతుంది. దీనికి నందూ 'తులసి నా భార్య అనుకునే దేవ్ నాకు ఈ డీల్ ఇచ్చాడు' అంటాడు. దీంతో లాస్య అంది వచ్చిన అవకాశాన్ని పాడు చేసుకుంటున్నావు అంటూ నందూపై ఫైర్ అవుతుంది.

దివ్య పనికి షాకైన దేవుడు
ప్రియకు న్యాయం చేసే ఉద్దేశంతో దివ్య ఆస్పత్రి ముందు టెంట్ వేసి నిరసన తెలపాలని అనుకుంటుంది. అది చూసిన దేవుడు 'విక్రమ్ బాబు ఫోన్ లిఫ్ట్ చేయకపోయేసరికి ఇలా తెగించిందేంటి' అని అనుకుంటాడు. తర్వాత దివ్య ద్వారా అసలు విషయాన్ని తెలుసుకుంటాడు. అప్పుడు 'అన్నతో ప్రేమ పాఠాలు చదువుతూ.. తమ్ముడిపై గొడవకు దిగుతుందా' అనుకుంటాడు.
ఇక, దివ్య అక్కడున్న వాళ్లందరినీ రెచ్చగొట్టి ధర్నాలో కూర్చోబెడుతుంది. ఈ విషయాన్ని విక్రమ్‌కు చెప్పకూడదని దేవుడు అనుకుంటాడు. అప్పుడు అతడు ఫోన్ చేసి దివ్య ఇంకా కాల్ చేయలేదు అంటాడు. దీంతో దేవుడు పక్కకు వెళ్లి మాట్లాడి అబద్ధాలు చెప్పి కూల్ చేస్తాడు.

నిజం చెప్పేసిన నందూ
వాసుదేవ్ వాళ్లు బయలుదేరుతుండగానే లాస్య 'నందూ తన మూడు మార్చుకునేలా ఉన్నాడు. వీళ్ళు తొందరగా వెళ్ళిపోతే బాగుండు' అనుకుంటారు. అప్పుడు వాసుదేవ్ నందూ చేతులు పట్టుకొని 'మ్యారేజ్ డే రోజు నువ్వు ఇచ్చిన స్పీచ్ చాలా ఎమోషనల్‌గా ఉంది. జీవితంలో ప్రతి ఒక్కరూ తప్పులు చేస్తారు. కానీ కొంతమంది మాత్రమే ఆ తప్పులను సరిదిద్దుకోవడానికి ప్రయత్నిస్తారు.
ఆ ధైర్యం నీకు ఉంది' అని పొగుడుతుంటాడు. దీంతో నందూ లోలోపల అవమానంగా ఫీల్ అవుతాడు. అప్పుడే వాసుదేవ్‌తో 'నీ దగ్గర ఒక నిజం దాచాను వాసుదేవ్. తులసి నేను విడాకులు తీసుకొని విడిపోయాము. భార్యాభర్తలము కాదు. రెండేళ్ల కిందటమే విడాకులు తీసుకుని నేను లాస్యని పెళ్లి చేసుకున్నాను.
కేవలం నీ బిజినెస్ డీల్ కోసం మాత్రమే నేను తులసి ఇద్దరు భార్యాభర్తలుగా నటించాము. ఇందులో తులసీది ఎటువంటి తప్పులేదు. నేను అడగడం వల్లే తాను ఇలా నటించడానికి ఒప్పుకుంది' అంటాడు. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.


Click it and Unblock the Notifications











