Intinti Gruhalakshmi Today Episode: ప్రేమ్‌కు షాకిచ్చిన తులసి.. నందూ, లాస్య ఊహించని నిర్ణయం
తెలుగు బుల్లితెరపై ప్రసారం అయ్యే సీరియళ్లకు మాత్రమే సుదీర్ఘ కాలంగా ప్రేక్షకుల నుంచి భారీ నుంచి అతి భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోందన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' శనివారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరు కూడా ఓ లుక్కేయండి!

శుక్రవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే
శుక్రవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. దివ్య వచ్చి అందరికీ రంగులు పూస్తూ హోలీ పండుగను జరపాలని అనుకుంటుంది. అలాగే తులసికి, నానన్న తాతయ్యలకు పూస్తుంది. అయితే, లాస్య మాత్రం రంగులు పూయనీవ్వకపోగా గొడవ పడుతుంది. దీంతో నందూ వచ్చి కూతురిని సపోర్ట్ చేస్తాడు. తర్వాత అందరూ కలిసి తులసికి చెప్పకుండా ప్రేమ్ ఇంటికి వెళ్లాలని అనుకుంటారు. అప్పుడు తులసికి అబద్ధం చెప్పి వెళ్లిపోతారు. మరోవైపు తులసి కూడా ప్రేమ్‌కు క్లాస్ పీకేందుకు వెళ్లాలని మాధవితో కలిసి ప్లాన్ చేస్తుంది. ఆ సమయంలో తులసితో నందూ గొడవ పడతాడు.

ప్రేమ్ ఇంటికి చేరుకున్న తులసి
హోలీ సంబరాలు జరుపుకుంటోన్న సమయంలో అందరూ సంతోషంగా కనిపిస్తారు. ఆ సమయంలోనే ప్రేమ్ ఆటోలో ఉరంతా తిప్పమని దివ్య కోరుకుంటుంది. ఇందుకోసం అతడు రెడీ అవుతుండగా.. తులసి, మాధవితో కలిసి అక్కడకు వస్తుంది. దీంతో తులసిని చూసి అందరూ షాక్ అవుతారు. ప్రేమ్ మాత్రం సంతోషిస్తాడు. అప్పుడు 'అమ్మా.. నువ్వు వస్తావని అస్సలు ఊహించలేదు. వీళ్లంతా నన్ను మోసం చేశారమ్మా. నీ పర్మీషన్ తీసుకున్నా అని చెప్పారు కానీ, నువ్వు వస్తావని మాత్రం ఒక్కరు కూడా చెప్పలేదు' అంటూ సంతోషంగా చెబుతాడు.

నన్నే అందరూ మోసం చేశారని
తల్లి వచ్చిందన్న సంతోషంలో ఉన్న ప్రేమ్‌తో శృతి 'ఇంకెందుకు ఆలస్యం ఆంటీనే ఇక్కడకు వచ్చారు కదా. తనతో పండుగ జరుపుకుందాం. వెళ్లి రంగులు పూయి ప్రేమ్' అంటుంది. దీంతో ప్రేమ్ రంగులు తీసుకెళ్లి ఆమెకు పూయబోతాడు. దీంతో అతడి చేతిని కొట్టి ఆ రంగులను పడేస్తుంది తులసి. దీంతో అందరూ షాక్ అవుతారు. అప్పుడామె 'వాళ్లు మోసం చేసింది నిన్ను కాదురా నన్ను. ఫ్రెండ్స్‌తో హోలీ ఆడటానికి వెళ్తున్నామన్నారు. ఆ ఫ్రెండ్‌వు నువ్వేనని.. నాకు ఇక్కడికి వచ్చేదాకా తెలియలేదు' అంటుంది. అప్పుడు దివ్య ఏదో చెప్పబోగా నోర్మూయ్ అంటుంది.

వీడు నా మనసును చంపేశాడు
కోపంలో ఉన్న తులసి 'పాపం.. నిజంగానే ప్రేమ్ మీద అందరూ బాధతో ఉన్నారు అని అనుకొని.. ఈ ఒక్క రోజు అయినా వాడిని తీసుకెళ్దామని వచ్చాను. కానీ, ఇక్కడికి వచ్చాక తెలిసింది మీరు నా కళ్లు కప్పి ఎలా మాయ చేస్తున్నారో. అందరూ కలిసి నా మనసును చంపేశారు. అమ్మకిచ్చిన మాటను గాలికి వదిలేసి.. దారి తప్పి బతుకుతూ వీడు నా మనసును చంపేశాడు. అసలు నీకు చెప్పిందేంటి.. నువ్వు చేస్తుందేంటి? జీవితం అంటే అమ్మ కొంగు పట్టుకొని తిరగడం కాదు.. నలుగురు చెప్పుకునేలా ఎదగాలి' అంటూ ఫైర్ అవుతుంది. మాధవి అడ్డొస్తే ఆమెను ఆపుతుంది.

నాకు ఒక్కడే కొడుకు అని చెప్తా
ప్రేమ్‌పై కోపంలో ఉన్న తులసి 'పెద్ద హీరోలా ఇంట్లో నాన్నను ఎదిరిస్తావు. గడప దాటితే బతకడం చేతకాదు. తండ్రిని ఎదిరించిన వాడివి.. తండ్రి కంటే గొప్ప స్థాయిలో ఎదిగి చూపించాలి. అప్పుడు నేను నమ్ముతా. ఒక విధంగా నీ జీవితం ముగిసిపోయినట్టే. ఇంట్లో నుంచి తరిమేశాను కాబట్టి.. నీకు ఆ ఇంటికి సంబంధం లేదు అనుకుంటున్నావా? నీకు అలాంటి అనుమానమే వస్తే.. ఇంకోసారి నీ జోలికి రాను.. నా జోలికి రావద్దని చెప్పు. నాకు ఒక్కడే కొడుకు అని అనుకుంటాను' అంటూ నోటికి వచ్చినట్లు మాట్లాడుతుంది. దీంతో అందరూ తెగ బాధ పడుతూ ఉంటారు.

నేను తల్లిగా చచ్చిపోయానంటూ
తులసి మాటలకు నొచ్చుకున్న ప్రేమ్ ఏడుస్తూనే 'అమ్మా.. అలా అనకమ్మా. నాకు నువ్వు కావాలమ్మా' అంటాడు. దీనికి తులసి 'కానీ.. నాకు ఇలాంటి కొడుకు అక్కర్లేదు. సిగ్గుండాలి కొంచెమైనా. అమ్మ వద్దనుకున్నందుకు కన్నీళ్లు పెట్టుకోవడం కాదు.. అనుకున్నది సాధించనందుకు కన్నీళ్లు పెట్టుకోవాలి. నువ్వు మాత్రమే ఓడిపోలేదు.. తల్లిగా నేను కూడా ఓడిపోయాను. ఓడిపోవడం కాదు.. చచ్చిపోయాను' అంటూ అక్కడి నుంచి ఏడ్చుకుంటూ వెళ్లిపోతుంది. దీంతో ప్రేమ్‌కు ఏం చేయాలో అర్థం కాదు. అక్కడే ఏడ్చుకుంటూ అతడు కుప్పకూలిపోతాడు. తర్వాత ప్రేమ్‌ను అన్ని మాటలు అన్నందుకు మాధవి.. తులసిపై కోప్పడుతుంది. కానీ, తులసి మాత్రం ఆమె మాటను వినదు.

మామకు చెప్పి బాధ పడ్డ తులసి
ఇంటికి వచ్చిన తర్వాత తులసి.. ప్రేమ్ దగ్గరకు వెళ్లానని పరందామయ్యతో చెబుతుంది. దీనికాయన వాడి బతుకు వాడు బతుకుతున్నాడు కదా అంటాడు. అప్పుడామె 'వాడి బతుకు వాడు బతకడం కాదు నాకు కావాల్సింది.. నేను కోరుకున్నది బతకడం.. నేను గర్వపడేలా బతకడం. వాడు బాధపడేలా చెప్పాను.. ఇంకోసారి ఈ అమ్మ ముఖం చూడకూడదు అని చెప్పేలా ద్వేషించేలా చెప్పాను. ఒక రాక్షసిలా నేను ప్రవర్తించాను' అని అంటుంది. అప్పుడు మామ 'వాడి మనసు బాధపెట్టావు.. రేపు ఎదిగి గొప్ప వాడు అయ్యాక అన్నీ మరిచిపోతాడు.. అమ్మ విలువ తెలుసుకుంటాడమ్మా. అనవసరంగా మనసు పాడు చేసుకోకు' అంటాడు.

నందూ గొడవ.. పరందామయ్య నో
తులసి, పరందామయ్య మాట్లాడుతుండగా నందూ వచ్చి 'ఇక్కడ మా మనసు కూడా బాగోలేదు.. ఎవరికి చెప్పుకోవాలి. కనీసం మా బాధ చెప్పుకోవాలన్నా ఇంట్లో వాళ్లకు చెప్పుకుందామన్నా.. టైమ్ తీసుకోవాల్సి వస్తోంది. మేము ఈ ఇల్లు వదిలి వెళ్లిపోదాం అనుకుంటున్నాం' అంటాడు. దీనికి నందూ 'ఏంటి.. మీకు అంత కష్టం ఏం వచ్చింది' అంటాడు. దీంతో లాస్య 'కష్టం కాదు.. బాధ్యత తెలవాల్సిన సమయం వచ్చింది. ఈ ఇంటి పెద్దగా ఉండే అధికారం మాత్రమే కాదు.. తన పిల్లల మీద కూడా అధికారం లేకుండా నందును చేశారు' అంటుంది. తర్వాత అమ్మానాన్నలను కూడా తీసుకెళ్తాం అని నందూ అంటాడు. దీనికి పరందామయ్య నో అంటాడు. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.


Click it and Unblock the Notifications











