For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Intinti Gruhalakshmi Today Episode: తులసి సహాయం కోరిన నందూ.. ఇంట్లో నుంచి వెళ్లాలని నిర్ణయం

  |

  చాలా కాలంగా తెలుగు బుల్లితెరపై ప్రసారం అయ్యే సీరియళ్లకు మాత్రమే సుదీర్ఘ కాలంగా ప్రేక్షకుల నుంచి భారీ నుంచి అతి భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోందన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' సోమవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరు కూడా ఓ లుక్కేయండి!
  Photos Courtesy: Star మా and Disney+Hotstar

  శనివారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  శనివారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే


  శనివారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. హోలీ పండుగను జరుపుకోవడం కోసం దివ్య, అభి, అంకితలు ప్రేమ్ ఇంటికి వెళ్తారు. అక్కడ తులసికి చెప్పే వచ్చామని అబద్ధం చెబుతారు. దీంతో అందరూ సరదాగా గడుపుతుంటారు. అప్పుడే అక్కడకు తులసి వచ్చి పెద్ద గొడవ చేస్తుంది. ప్రేమ్ తనను మానసికంగా చంపేశాడని అంటుంది. ఆ తర్వాత అక్కడ జరిగిన విషయం మొత్తం పరందామయ్యకు చెబుతుంది. దీంతో ఆయన ధైర్యం చెబుతాడు. అనంతరం నందూ, లాస్య ఇంట్లో నుంచి వెళ్లిపోదాం అనుకుంటారు. ఈ విషయాన్ని పరందామయ్య మాత్రం అడ్డుకుంటాడు.

  RRR 3 Days Collections: సండే అన్ని కోట్లతో అరాచకం.. 453 కోట్ల టార్గెట్.. 3 రోజుల్లో వచ్చిందెంతంటే!

  తులసి మాటలకు శృతి ఆగ్రహం

  తులసి మాటలకు శృతి ఆగ్రహం


  హోలీ పండుగ రోజు ఇంటికొచ్చి మరీ తులసి ఎంతగానో తిట్టడంతో ప్రేమ్ చాలా బాధ పడుతుంటాడు. అసలు అతడికి ఏం చేయాలో అర్థం కాదు. దాని గురించే ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో అతడి దగ్గరకు శృతి వస్తుంది. వచ్చీ రావడమే ఆమె ‘ఆంటి ఎందుకు అలా నిన్ను అంటుంది. కట్టుబట్టలతో కొడుకును బయటికి పంపిస్తే ఎలా బతుకుతారు' అని ప్రశ్నిస్తుంది. దీంతో అమ్మ నా మంచి కోసమే కదా చెప్పింది అంటాడు ప్రేమ్. కానీ.. శృతి మాత్రం వినదు. ‘మాటలు అనగానే సరిపోదు ప్రేమ్. నోరు జారి అన్నమాటలు.. మనసుకు చేసిన గాయం.. జీవితాంతం గుర్తుంటాయి' అంటుంది.

  తులసి వల్ల శృతి కీలక నిర్ణయం

  తులసి వల్ల శృతి కీలక నిర్ణయం

  శృతి మాటలకు బాగా హర్టైన ‘ఓర్పుతో భరించాలి శృతి. ఓర్పుతో ఉన్నవాళ్లు ఎప్పుడు ఓడిపోరు' అని సర్ధి చెబుతాడు. దీనికి శృతి ‘నాకు అదంతా తెలియదు.. ఈ రోజు నుంచి నువ్వు ఆటో నడపకు. ఇంటి బాధ్యతలు నేను తీసుకుంటాను' అంటుంది. అప్పుడు ప్రేమ్ ‘నువ్వు కష్టపడటం నాకు ఇష్టం లేదు' అంటాడు. అప్పుడు శృతి ‘నువ్వు ఎంతో ఎత్తుకు ఎదగాలి. మాటలు అన్నవాళ్లు నిన్ను చూసి సిగ్గు పడాలి. నీ గురించి అందరూ గర్వంగా చెప్పుకోవాలి. దాని కోసం నేను ఏదైనా చేస్తాను. నువ్వు మాత్రం మ్యూజిక్ మీదే దృష్టి పెట్టు. ఇంకో మాట లేదు' అంటుంది.

  Bigg Boss Non Stop: అఖిల్ అక్కడ చేయి పెట్టాడన్న హమీదా.. ‘ప్రైవేట్ పార్ట్' వీడియో చూపించడంతో!

  తులసి సహాయం కోరిన నందూ

  తులసి సహాయం కోరిన నందూ

  తులసి దగ్గరికి నందూ వెళ్లి నాకు ఒక హెల్ప్ చేయాలి అంటాడు. దీనికామె నేను మీకు ఏం హెల్ప్ చేయగలను అంటుంది. అప్పుడతను ‘అమ్మ వాళ్లు మాతో రావడానికి ఒప్పుకోవడం లేదు. వాళ్లు మొండితనం ఎందుకు చేస్తున్నారు' అని అడుగుతాడు. దీంతో ఈ ప్రశ్న నన్ను అడిగితే నేను ఏం చెప్పాలి అంటుంది తులసి. అప్పుడు నందూ వాళ్లు నాతో వచ్చేలా ఒప్పించు అంటాడు. దీనికి తులసి ‘అత్తయ్య, మామయ్య నిర్ణయాన్ని మీరు గౌరవించండి' అని చెబుతుంది. దీనికతడు ‘అంటే మా అమ్మనాన్నను నేను వదిలేసి వెళ్లాలా. అమ్మ వాళ్లు లేకుండా మేము గడప దాటలేము. మాతో వచ్చేలా నువ్వు అమ్మానాన్నలను ఒప్పిస్తున్నావు అంతే' అని చెప్పి అక్కడి నుంచి వెళ్తాడు నందూ. దీంతో ఆమెకు ఏం చేయాలో అర్థం కాదు.

  శృతి నిర్ణయంపై ప్రేమ్ నిరాశగా

  శృతి నిర్ణయంపై ప్రేమ్ నిరాశగా

  శృతి ఉద్యోగం చేస్తానని చెప్పడంతో దాని గురించే ప్రేమ్ ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి వచ్చిన శృతి.. ఏం ఆలోచిస్తున్నావు అంటుంది. నీ గురించే అంటాడు ప్రేమ్. ఇంకొకసారి ఆలోచించుకో. సంపాదించడం కోసం నువ్వు బయటికి వెళ్లాల్సిన అవసరం లేదు అంటాడు ప్రేమ్. దీంతో శృతి ‘అసలు నీ ప్రాబ్లమ్ ఏంటి ప్రేమ్. అందరితో తెగదెంపులు చేసుకొని ఇద్దరం ఒంటరిగా బతుకుదామా' అని సూటిగా ప్రశ్నిస్తుంది. దీనికి ‘నేను ఏ పని చేయకుండా.. నువ్వు మాత్రమే పని చేస్తావంటేనే నాకు ఏం చేయాలో అర్థం కావడం లేదు' అంటాడు ప్రేమ్.

  RRR రివ్యూపై నాగబాబు సంచలన వ్యాఖ్యలు: ఏసుకోవడం అంటే అది కాదు.. న్యూసెన్స్ సైట్ అంటూ!

  నందూ గురించి ప్రేమ్‌కు కాల్

  నందూ గురించి ప్రేమ్‌కు కాల్

  భవిష్యత్ గురించి ప్రేమ్, శృతి ఆలోచిస్తూ చర్చలు జరుపుకుంటూ ఉంటారు. ఇంతలో దివ్య అతడికి ఫోన్ చేసి‘సారీ అన్నయ్య నావల్ల నువ్వు చాలా మాటలు పడ్డావు. మామ్ అక్కడికి వస్తుందని నేను అనుకోలేదు. సిచ్యుయేషన్ అలా అవుతుందని ఎప్పుడూ అనుకోలేదు' అంటుంది. దీనికి ప్రేమ్ ‘నా గురించి ఆలోచించకు.. నీ చదువు మీద దృష్టి పెట్టు' అని చెబుతాడు. అప్పుడు దివ్య ‘ఇంట్లో పరిస్థితులు బాగాలేవు. డాడీ, లాస్య ఆంటి ఇంట్లో నుంచి బయటికి వెళ్లడానికి రెడీ అయ్యారు. వాళ్లతో పాటే.. నానమ్మ, తాతయ్యను తీసుకెళ్తారట' అంటుంది. దీంతో ప్రేమ్ షాక్ అవుతాడు. ఆ తర్వాత ఏం చేద్దాం అని ఆలోచిస్తాడు.

  Recommended Video

  Will Smith Conflict With Chris Rock Explained విల్ స్మిత్ భార్యకి ఉన్న వ్యాధి ఏంటి?
  ఇంట్లో నుంచి వెళ్లాలని తులసి

  ఇంట్లో నుంచి వెళ్లాలని తులసి

  నందూ చెప్పిన తర్వాత తులసి బ్యాగ్ పట్టుకొని వస్తుంది. అప్పుడు పరందామయ్య ‘ఏంటమ్మా ఈ టైమ్‌లో బ్యాగ్‌తో ఎక్కడికి బయలుదేరుతున్నావు' అని అడుగుతాడు. దీంతో ఈ ఇంటి నుంచి వెళ్తున్నాను అని చెబుతుంది తులసి. అప్పుడు పరందామయ్య ‘అమ్మా తులసి నువ్వు వెళ్లడం ఏంటమ్మా. అంటే నువ్వు మమ్మల్ని నందూతో వెళ్లమంటున్నావా' అని ప్రశ్నిస్తాడు. అప్పుడు తులసి ‘మీకు ఇష్టం లేదు కదా అందుకే నేను వెళ్లిపోదాం అనుకుంటున్నాను' అంటుంది. అప్పుడాయన ‘వద్దు తులసి.. నువ్వు వెళ్లొద్దు. మేమే వాడితో వెళ్లిపోతాం. నందూతో మమ్మల్ని వెళ్లిపోమంటున్నావు కదా.. నువ్వు ఎక్కడికి వెళ్లిపోవాల్సిన అవసరం లేదు. నందూతో చెప్పు మేము ఉదయం వాళ్లతో వస్తాం' అని చెప్పి వెళ్లిపోతారు. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

  English summary
  Intinti Gruhalakshmi Episode 591: Nandhu Requests to Tulasi to Convince Anasuya and Parandhamaiah. After That Shruti Decided to do a Job.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X