Intinti Gruhalakshmi: దివ్య కోసం ప్లాన్.. ప్రియకు షాకిచ్చిన రాజ్యలక్ష్మి.. విషయం తెలియక విక్రమ్ ఖుషీ
ఎప్పటికప్పుడు కొత్త షోలు పుట్టకొస్తున్నా.. తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.
దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' మంగళవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!
Photos Courtesy: Star మా and Disney+Hotstar

సోమవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే
సోమవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. నందూ నిజం చెప్పగానే వాసుదేవ్ కోప్పడకుండానే మాట్లాడతాడు. అంతేకాదు, ఈ విషయాన్ని తులసి తనకు ముందే చెప్పేసిందని అంటాడు. ఆ తర్వాత ఇద్దరినీ పొగుడుతూ మాట్లాడి వెళ్లిపోతారు. మరోవైపు, దివ్య ఆస్పత్రి ముందు ధర్నాకు దిగుతుంది. దీంతో రాజ్యలక్ష్మి అక్కడకు వచ్చి అడగ్గా అసలు నిజం చెబుతుంది.
అంతేకాదు, సంజయ్ ప్రియను పెళ్లి చేసుకోవాలని డిమాండ్ చేస్తుంది. దీంతో చేసేదేం లేక వాళ్లిద్దరికీ రాజ్యలక్ష్మి పెళ్లి జరిపిస్తుంది. మరోవైపు, క్యారమ్స్ ఆడుతూ నందూ, లాస్య ఒకరినొకరు దెప్పిపొడుకుంటారు.

దివ్యపై కోపంగా ఉన్న రాజ్యలక్ష్మి
ఆస్పత్రిలో దివ్య చేసిన పని తలచుకుని రాజ్యలక్ష్మి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఆ సమయంలోనే 'దాన్ని వానపాము అనుకున్నాను.. కానీ తాచుపాములా నన్నే కాటేస్తుందని అనుకోలేదు' అంటుంది. అప్పుడు అక్కడే ఉన్న బసవయ్య 'నేను మొదటి నుంచే చెబుతున్నాను కదా అక్క' అంటాడు.
దీనికామె సీరియస్ అవుతుంది. దీంతో బసవయ్య ఇప్పటికైనా సరిగా ఆలోచించు అక్కా అంటాడు. అప్పుడు రాజ్యలక్ష్మి 'దివ్య చేసిన పని మామూలు పని కాదు.. మన పరువు బజారుకీడ్చింది. నా కొడుకునీ కోలుకోలేని దెబ్బ కొట్టింది' అని అంటుంది.

దాన్ని ఇక వదిలిపెట్టను అంటూ
బసవయ్య 'పాపం పిచ్చి నాగన్న.. మింగలేక కక్కలేక గిలాగిలా కొట్టుకుంటున్నాడు' అని సంజయ్ గురించి అంటాడు. దీనికామె 'వాడి గురించి మాట్లాడకు. వాడి వల్లే ఇదంతా జరిగింది. వాడు ఆ విషయం గురించి ముందే మాట్లాడుటే.. సెటిల్ చేసేదాన్ని. కానీ ఆ దివ్య మీడియా ముందు ఇరికిచ్చి నాతో ఇలాంటి నిర్ణయం తీసుకొనేలా చేసింది. ఇప్పటి వరకూ హాస్పటల్ విషయాల్లోనే అనుకున్నాను. ఇప్పుడు నా వ్యక్తిగత విషయాల్లోనూ దూరింది. ఇకపై దానిని నేను వదిలిపెట్టను' అంటుంది.
దీంతో బసవయ్య దాన్ని ఉద్యోగంలో నుంచి తీసేయ్ అనగా.. రాజ్యలక్ష్మి 'అలా చేస్తే మనకేం లాభం? ఎక్కడ అయితే అది హీరోయిన్ అనిపించుకుందో.. అక్కడే అదే పది మంది ముందే దాన్ని విలన్ చేసి నానా మాటలు అని అవమానించేలా చేస్తాను' అంటుంది.

విక్రమ్ బాబుకు దూరమయ్యారు
ఇక, దివ్య చేసిన పనికి హాస్పిటల్లో అందరూ ఆమెకు కంగ్రాట్యులేషన్స్ చెబుతూ ఉంటారు. దీంతో 'నేను ఏం చేశానని మీరు అంతలా సంతోషపడుతున్నారు' అని ప్రశ్నిస్తుంది. అప్పుడు వాళ్లు 'మీరు చాలా పెద్ద గొప్ప పని చేశారు మేడం. ఒకరకంగా ఇది విక్రమ్ గారి పర్సనల్ లైఫ్ అయినా మేనేజ్మెంట్‌ను ఎదిరించారు.
ఆ విషయంలో మీకు భయం లేదా' అని అడుగుతారు. దీనికామె 'ఏం చేస్తారు? మహా అయితే జాబ్ చేసేస్తారు అంతే కదా' అంటుంది. ఆ తర్వాత పనిలో బిజీగా ఉంటుంది. అప్పుడు ఆమెను చూసిన దేవుడు 'రాత్రికి రాత్రి హీరోయిన్ అయిపోయారు. కానీ విక్రమ్ బాబుకు దూరమయ్యారు' అనుకుంటూ ఉంటాడు.

దివ్యకు విక్రమ్ బొకే పంపించి
ఆస్పత్రిలో ఉన్న దేవుడికి విక్రమ్ కాల్ చేసి 'ఏంట్రా దేవుడు.. నిన్ను నమ్ముకుని విజయవాడ వెళ్తే నువ్వు ఇలా చేసావు' అని ప్రశ్నిస్తాడు. కానీ, దేవుడు మాత్రం విక్రమ్‌కు అర్థం అయి అవనట్లుగా తింగరి తింగరిగా మాట్లాడతాడు. దీంతో విక్రమ్ 'నీ మాటలు వింటే నీతో పాటు నన్ను కూడా సన్యాసంలో కలుపుకునేలా ఉన్నావు కదరా' అంటాడు.
దీంతో దేవుడు అదే ఫిక్స్ అయిపోండి బాబు అని అంటాడు. తర్వాత విక్రమ్ 'దివ్య ఏం చేస్తుంది ఆపరేషన్ అయిపోయిందా' అనగా 'ఆపరేషన్ సక్సెస్.. పేషెంట్ ఫెయిల్. మీరేం ఎక్కువ ఆలోచించకండి బాబు' అని అంటాడు. దీంతో విక్రమ్ 'సరే ఆపరేషన్ సక్సెస్ అయింది అన్నావు కదా. హాస్పిటల్‌కు బొకే తెప్పించాను. తీసుకొని వెళ్లి దివ్యకి ఇవ్వు' అంటాడు. అది దేవుడు ఇవ్వగా దివ్య సంతోషిస్తుంది.

లాస్య ఓవర్.. భాగ్య సమాచారం
ఇంట్లో క్యారమ్స్ ఆటలో లాస్య గెలుస్తుంది. అప్పుడామె 'ఇప్పటికైనా ఒప్పుకుంటారా? ఆట ఎప్పుడు అన్ని వైపులా ఉంటుందని. లాస్యకు ఎప్పుడు ప్రత్యర్తిగా ఉండాలని అనుకోవద్దు' అని ఓవర్‌గా మాట్లాడుతుంది. దీంతో నందూ ఇప్పుడు ఎలా అయినా లాస్య మీద గెలవాలి అన్న పంతంతో మళ్ళీ గేమ్ మొదలుపెడదామా అని అంటాడు.
అప్పుడు గేమ్ స్టార్ట్ చేయబోతుండగా ఇంతలో భాగ్య ఫోన్ చేయడంతో లాస్య పక్కకు వెళ్లి ఫోన్ మాట్లాడుతుంటుంది. అప్పుడే ఆస్పత్రిలో జరిగింది మొత్తం లాస్యకు చెప్తుంది. దీనికామె సంతోషిస్తుంది. తర్వాత ఇద్దరూ కలిసి దివ్య జీవితాన్ని ఎలా నాశనం చేయాలా? అని ఆలోచిస్తూ ప్లాన్లు చేసుకుంటూ ఉంటారు.

ఇంటికి వచ్చిన ప్రియకు షాక్
ప్రియను తీసుకుని సంజయ్ ఇంటికి వస్తాడు. అప్పుడు రాజ్యలక్ష్మి ఆగండి అని గుమ్మం ముందరే ఆపుతుంది. దీంతో విక్రమ్ వాళ్ల తాతయ్య 'ఏంటి రాజ్యలక్ష్మి వాళ్ళను ఆగమన్నావు? జరగాల్సిన కార్యక్రమాలు జరగాలి కదా' అంటాడు. దీనికామె 'అవన్నీ చేసుకున్న తర్వాతనే వాడు పెళ్లి చేసుకున్నాడు మామయ్య. ఇప్పుడు ఏం చేయాలి అన్నది పంతులుగారు చెబుతారు' అని అంటుంది. దీంతో పంతులు 'అమ్మాయి జీవితంలో దోషం ఉంది. ఇప్పుడు ఇంట్లోకి రాకూడదు.
101 రోజుల పాటు 101 బిందెలతో అమ్మవారికి అభిషేకం చేయాలి' అని అబద్దం చెప్తాడు. దీంతో ఆయన ఇలాంటివి నేనెక్కడా వినలేదు అంటాడు. కానీ, ప్రియ మాత్రం వాటిని చేయడానికి రెడీ అంటుంది. దీంతో రాజ్యలక్ష్మి ఆమెతో ప్రేమగా మాట్లాడినట్లు నటిస్తుంది.

దివ్య పెళ్లి గురించి చర్చలు
తులసి ఇల్లు శుభ్రం చేస్తుండగా నందూ అక్కడికి వస్తాడు. అప్పుడామె మీకు ఏదో శుభలేఖ వచ్చింది అక్కడ పెట్టాను అంటుంది. దీంతో ఎవరు ఇచ్చారు అని అడగ్గా 'పరాయి వ్యక్తుల శుభలేఖలు, లేఖలు తీసుకోవడం నాకు ఇష్టం లేదు' అంటుంది. అలా ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు నందూ మా ఫ్రెండ్ వాళ్ళ కూతురుది పెళ్లి అని చెప్తాడు.
దీంతో పరందామయ్య వచ్చి 'ఫ్రెండ్ కూతురు పెళ్లి సరే రా.. మరి మీ కూతురు పెళ్లి ఎప్పుడు చేస్తున్నారు? సమాధానం అడిగితే ఇద్దరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు ఏంటి రా' అని ప్రశ్నిస్తాడు. దీంతో తులసి 'మాకు తెలిస్తే కథ మామయ్య మీకు చెప్పడానికి. ఇంతవరకు దివ్యతో ఆ విషయం గురించి మాట్లాడలేదు. మాట్లాడి చెప్తా' అంటుంది. ఇలా ఎపిసోడ్ పూర్తైంది.


Click it and Unblock the Notifications











