Intinti Gruhalakshmi: నిజం తెలిసి తులసి టెన్షన్.. ఆమెను చూసి విక్రమ్ షాక్.. లాస్య మరో మోసం
కొంత కాలంగా ప్రేక్షకుల అభిరుచిలో మార్పులు వస్తున్నా.. తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రం ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.
దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' బుధవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!
Photos Courtesy: Star మా and Disney+Hotstar

మంగళవారం ఎపిసోడ్‌లో జరిగిందిదే
మంగళవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. సంజయ్, ప్రియకు పెళ్లి జరిపించడంతో దివ్యపై రాజ్యలక్ష్మి పగబడుతుంది. ఎలాగైనా ఆమెకు సరైన గుణపాఠం చెప్పాలని అనుకుంటుంది. అంతలోనే ప్రియను తీసుకుని సంజయ్ ఇంటికి రావడంతో రాజ్యలక్ష్మి కొత్త నాటకం ఆడి ఆమెను ఔట్ హౌస్‌లోనే ఉండేలా ప్లాన్ చేస్తుంది.
ఇక, లాస్యకు భాగ్య ఈ విషయం గురించి వివరించడంతో ఇద్దరూ కలిసి దివ్యను ఇరికించే ప్లాన్లు చేస్తుంటారు. ఇక, విక్రమ్‌కు ఏం జరుగుతుందో తెలియకపోవడంతో దివ్యకు బొకే ఇవ్వమని దేవుడికి చెప్తాడు. అది ఇవ్వగానే దివ్య ఎంతగానో సంతోషిస్తుంది.

పిల్లల బాధ్యత తీసుకుంటాను
దివ్య పెళ్లి గురించి చర్చించుకుంటోన్న సమయంలో నందూ 'అడిగితే తను వద్దనే అంటుంది. అలా అని వదిలేయలేం కదా తులసి' అని అంటాడు. దీనికి తులసి 'ఇదివరకటి రోజుల్లా కాదు కదా. పిల్లల ఇష్టాలకు వ్యతిరేకంగా ఏ పని చేయాలన్నా ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి కదా' అని అంటుంది. దీంతో నందూ 'అది నాకు వదిలేసేయ్.
ఇప్పటి నుంచి నేను చూసుకుంటాను. ఇప్పటి వరకు పిల్లల బాధ్యతలను నేను చూసుకోలేదు. నువ్వు మాత్రమే చూసుకున్నావు కదా. ఇప్పటినుంచి నేను చూసుకుంటాను' అంటాడు. దీంతో తులసి ఆ మాట నేనలేదు అంటుంది.

ఎన్నో కష్టాలు వస్తాయి అంటూ
నందూ మాటలకు తులసి 'చిన్నప్పుడు అంత మీరే పిల్లల బరువు బాధ్యతలను మోసారు కదా' అంటుంది. దీనికి నందూ 'అది కాదు.. పిల్లలకు అవసరం ఉన్నప్పుడు మాత్రమే మన సహాయం కావాలి. ఇప్పుడు నా శక్తి ఏంటో నాకు తెలిసి వచ్చింది. పిల్లలకు సహాయంగా ఉంటాను' అని అంటాడు.
దీంతో పరందామయ్య 'మాట చెప్పినంత సులువు కాదు.. ఎన్నో కష్టాలు వస్తాయి' అని అంటాడు. దీంతో నందూ 'ఆ కష్టాలను ఎదుర్కొంటాను' అంటాడు. దీనికి తులసి 'మీరు నా లాగా సింగిల్ కాదు.. మీకు భాగస్వామి ఉంది' అని సమాధానం చెబుతుంది.

నా కోపాన్ని నువ్వే తగ్గించాలి
నందూ చెప్పిన సమాధానానికి పరంధామయ్య మాట్లాడుతూ 'లాస్య లేకుండా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు కదా నువ్వు' అని గుర్తు చేస్తాడు. దీనికి నందూ 'ఇది నా బాధ్యత.. ఈ విషయంలో అడ్డు వస్తే ఎవరినీ విడిచిపెట్టను' అని అంటాడు.
అప్పుడు తులసి 'మీ గొడవ వల్ల మేము ఇబ్బంది పడాల్సి వస్తోంది. లాస్యతో శత్రుత్వం పెంచుకోవాల్సి వస్తోంది. కొంచెం కోపంతో కాకుండా శాంతంగా ప్రవర్తించండి' అని చెబుతుంది. దీనికితడు 'ఫ్రెండ్‌గా ఇదంతా నువ్వే చెప్పావు కదా. నా కోపాన్ని కూడా నువ్వే తగ్గించాలి' అని తులసిని అడుగుతాడు.

దివ్య పనితో భయంలో తులసి
ఇంట్లో తులసి పని చేసుకుంటూ ఉండగా దివ్య వచ్చి తల్లిని ఆట పట్టిస్తుంది. అప్పుడు దివ్య 'నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది అమ్మా. ప్రియా జీవితాన్ని నిలబెట్టాను' అంటూ జరిగింది మొత్తం ఆమెకు వివరిస్తుంది. దీంతో తులసి 'నాకు సంతోషంగానే ఉన్నా లోలోపల భయంగా ఉంది దివ్య. ఎందుకంటే నువ్వు పెద్దవాళ్లతో పోరాడుతున్నావు.
ఏ క్షణంలో ఎటువంటి సమస్య వస్తుందేమో అని భయంగా ఉంది. వాళ్లకు డబ్బు పలుకుబడి హోదా అన్నీ ఉన్నాయి. వాళ్ళు ఇటువంటి విషయాలను చాలా ఈజీగా తీసుకోరమ్మ అదే నా భయం' అని టెన్షన్ పడుతుంది.

తల్లికి ధైర్యం చెప్పేసిన దివ్య
ఆ తర్వాత తులసి 'ఆమె హాస్పిటల్లో ఎండి కనుక నీ డిమాండ్స్‌కు లొంగకపోయి ఉంటే ఏం చేసేదానివి' అని ప్రశ్నిస్తుంది. దీంతో దివ్య 'పరిస్థితి ఇంకా పెద్దగా అయ్యేదమ్మా' అంటుంది. అప్పుడు తులసి 'ఆమె హాస్పిటల్ కాబట్టి కొంచెం కన్నెర్ర చేస్తే మీ వెనకాల ఉండే వాళ్లంతా తోక ముడుచుకుని వెళ్లిపోయే వాళ్ళు' అని అంటుంది. అప్పుడు దివ్య.. రాజ్యలక్ష్మి మంచిదే అనుకుని ఆమె గురించి మంచిగానే చెప్తుంది.
దీంతో తులసి కూడా అలాగే మాట్లాడుతుంది. ఆ తర్వాత 'గెలిచిన ఆనందంలో కడుపు నింపుకోకు. వెళ్లి అన్నం తిందాం పదా' అనగా.. 'నువ్వే నాకు ముద్దలు కలిపి పెట్టాలి' అంటుంది. దీంతో తులసి మరి అత్తగారింట్లో ఎవరు పెడతారు అనగా మా అత్తగారే నాకు తినిపిస్తుంది అంటుంది. తర్వాత విక్రమ్ బొకే పంపుతాడు.

రాజ్యలక్ష్మి గురించి నిజాలు
ఔట్ హౌస్‌లో ఉన్న ప్రియకు పనిమనిషి అన్నం తీసుకు రాగా.. ప్లేట్‌లో ఉన్నది చూసి షాక్ అవుతుంది. అదేంటి వీళ్లంతా ఇంత సింపుల్‌గా తింటారా అని ప్రశ్నిస్తుంది. దీంతో పనిమనిషి 'మీ అత్తయ్య గారు నోరు మూసుకొని తినమని చెప్పారు. నేను ఇంటి పనిమనిషిని నేను మీకు చెప్పకూడదు కానీ.. రాజ్యలక్ష్మి అమ్మగారు పైకి కనిపించే దేవత కానీ నరరూప రాక్షసి. నా మాట విని ఇక్కడి నుంచి మీ పుట్టింటికి వెళ్ళిపోండి అమ్మ.
లేదంటే మీకు నరకం చూపిస్తారు' అంటుంది. దీంతో ప్రియ 'నేను పుట్టింటికి వెళితే రెండు శవాలు చూడాల్సి వస్తుంది. చేయాల్సింది ఏమీ లేదు సంజయ్ మారే వరకు ఎదురు చూస్తాను' అంటుంది. అంతలోనే రాజ్యలక్ష్మి వచ్చి ఇద్దరికీ భయపెట్టాలా మాట్లాడి వార్నింగ్ ఇచ్చేసి వెళ్లిపోతుంది.
లాస్య అబద్ధం.. విక్రమ్ నిజం
నందూకు తెలియకుండా లాస్య డబ్బు దాచుకునేందుకు మాట్లాడుతుండగా అతడు వచ్చి అడుగుతాడు. దీంతో అబద్దాలు చెప్తుంది. ఇక, విక్రమ్ దివ్య గురించి ఆలోచించగా.. దివ్య విక్రమ్ గురించి ఆలోచిస్తూ ఒకరితో ఒకరు ఊహల్లో మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక, ఉదయాన్నే ప్రియ అమ్మవారికి బిందెతో నీళ్లు తెచ్చి అభిషేకం చేస్తుండగా అందరూ చూస్తూ ఉంటారు.
అంతలోనే విక్రమ్ అక్కడకు వచ్చి 'నా కోసమే చూస్తున్నారా' అని అడుగుతాడు. అనంతరం ప్రియను చూసి 'నువ్వు ఆస్పత్రిలో పని చేసే నర్స్ కదా. నీ పేరు ప్రియ కదా. నువ్వు ఇక్కడ ఉన్నావేంటి' అని ప్రశ్నిస్తాడు. అంతలో వాళ్ల తాత వచ్చి 'ఇప్పుడు ప్రియ హోదా మారిందిరా' అని నిజం చెప్పబోతాడు. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.


Click it and Unblock the Notifications











