Intinti Gruhalakshmi Today Episode: అభిని కాపాడింది తులసి కాదు.. మొత్తం బయట పెట్టేసిన నందూ

అన్ని భాషలతో పోలిస్తే తెలుగు బుల్లితెరపై ప్రసారం అయ్యే సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ దక్కుతోందన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా రన్ అవుతున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' బుధవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరు కూడా ఓ లుక్కేయండి!

మంగళవారం ఎపిసోడ్‌లో జరిగిందిదే

మంగళవారం ఎపిసోడ్‌లో జరిగిందిదే

మంగళవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. అభిని చంపడానికి ఎస్సై బయలుదేరిన వెంటనే కానిస్టేబుల్ వెళ్లి తులసికి చెబుతాడు. ఆ తర్వాత అభిని ఓ నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లిన ఎస్సై.. పారిపోమని అంటాడు. కానీ, అభికి డౌట్ వస్తుంది. అయినప్పటికీ తప్పనిసరి పరిస్థితుల్లో పరిగెత్తుతాడు. అంతలో ఎస్సై ఫైర్ చేస్తాడు. అప్పుడే తులసి, కమిషనర్ ఎంట్రీ ఇచ్చి అతడి ఆట కట్టిస్తారు. ఆ తర్వాత మనోజ్ కోలుకున్నాడని తెలిసి ఆస్పత్రికి వెళ్లగా.. అతడు నిజం చెప్తాడు. దీంతో అభిని విడిచిపెడతారు. ఆ తర్వాత కొడుకును తీసుకుని తులసి ఇంటికి వెళ్తుంది.

ఎంటరైనన ప్రేమ్.. అందరిపై కోపం

ఎంటరైనన ప్రేమ్.. అందరిపై కోపం

అభిని తులసి ఇంటికి తీసుకుని వచ్చిన తర్వాత అందరూ చాలా సంతోషంగా ఉంటారు. అప్పుడే వేరే పని మీద ఊరు వదిలి వెళ్లిన ప్రేమ్ ఎంట్రీ ఇస్తాడు. వచ్చీ రావడమే అతడు కోపంగా కనిపిస్తాడు. అప్పుడు లోపలికి రాకుండా ఇంటి బయటే నిలబడి ఉంటాడు. అంతేకాదు, ‘ఇంత జరిగినా నాకు ఒక్క మాట కూడా చెప్పరా' అంటూ అందరినీ సూటిగా ప్రశ్నిస్తాడు. దీంతో అనసూయ ‘నీకే కాదురా.. మాకు కూడా చెప్పలేదు. ఎవరికీ తెలియకుండానే చాలా పనులు చేసింది మీ అమ్మ' అని అంటుంది. అప్పుడు తులసి ‘అభి మారాడు అదే చాలు. నేను పడ్డ కష్టం మొత్తం మరిచిపోతాను' అని అనుకుంటుంది.

 తనను తిట్టమని బ్రతిమాలిన అభి

తనను తిట్టమని బ్రతిమాలిన అభి

పెద్ద ఇష్యూ తర్వాత ఇంటికి తిరిగి వచ్చిన అభి తన రూమ్‌లో బాధగా కూర్చుని ఉంటాడు. అప్పుడు అతడి దగ్గరకు వెళ్లిన అంకిత.. ఇంకా జరిగిన వాటినే తలుచుకుంటున్నావా అని అడుగుతుంది. దీనికతడు ‘ఎలా మరిచిపోగలను అంకిత. చెప్పిన మాట వినకుండా.. అందరినీ బాధపెట్టాను. అయినా కూడా ఎవ్వరూ పల్లెత్తు మాట అనలేదు. ఎందుకు అంకిత. నువ్వైనా నన్ను తిట్టు ప్లీజ్' అంటాడు. దీంతో ‘నేను తిడుతాను. దాని వల్ల ఏంటి లాభం అభి' అంటుంది అంకిత. అప్పుడు అభి ‘గిల్టీ ఫీలింగ్ పోతుంది. చేసిన తప్పును మరిచిపోతాను' అంటాడు.

 ఆంటీ నొప్పులు పడిపోయిందంటూ

ఆంటీ నొప్పులు పడిపోయిందంటూ


తనను తిట్టమన్న అభితో అంకిత మనసు విప్పి మాట్లాడుతుంది. ‘నిజం చెప్పాలంటే నువ్వు చేసింది మామూలు తప్పు కాదు. ఆ తప్పును.. ఆ తప్పు వల్ల జరిగిన విషయాన్ని నువ్వు జీవితాంతం మరిచిపోకూడదు. అప్పుడే నువ్వు దాన్ని జీవితాంతం గుర్తుంచుకుంటావు. ఇప్పుడు నువ్వు పడే బాధ కంటే.. నేను, ఆంటి వెయ్యి రెట్లు ఎక్కువ బాధపడ్డాం. అయినా మేము ప్రేమను చంపుకోలేదు. నీ కర్మకు నిన్ను వదల్లేదు. నిన్ను కనడానికి పడిన నొప్పుల కంటే నిన్ను రక్షించుకోవడానికి ఆంటీ పడిన నొప్పులే ఎక్కువగా ఉన్నాయి' అంటూ క్లాస్ పీకుతుంది.

తులసిపై ప్రశంసలు.. వాళ్లు చిరాకు

తులసిపై ప్రశంసలు.. వాళ్లు చిరాకు

అభి ఇంటికి చేరుకోగానే అందరూ సంతోషంగా ఉంటారు. అప్పుడు పరందామయ్య నువ్వు చేసిన పని మామూల్ది కాదమ్మా అని తులసిని అభినందిస్తాడు. అందరూ అలాగే మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు తులసి ‘కానీ.. నేనేదో గొప్పల కోసం ఈ పని చేయలేదు. నా కొడుకు కోసం ఈ పని చేశాను' అంటుంది. అప్పుడు పరందామయ్య ‘తను అనుకుంటే ఏదైనా సాధించగలదు' అని మరోసారి పొగుడుతాడు. ఆ తర్వాత ప్రేమ్ ‘తన లాంటి ఎంతో మందికి అమ్మ ఆదర్శంగా నిలిచింది' అంటాడు. అందరూ తులసిని పొగుడుతుండగా నందూ, లాస్యకు చిరాకు వస్తుంది.

తులసి గొప్పదనం కాదన్న నందూ

తులసి గొప్పదనం కాదన్న నందూ


తులసిని అందరూ పొగుడుతుండగా నందూకు కోపం వస్తుంది. అప్పుడు ‘ఇక ఆపుతారా.. పోటీ పడి మరీ తులసిని పొగుడుతున్నారు కదా. అభిని విడిపించడంలో జీకే గారు సాయం చేశారని తులసి చెప్పింది కదా. ఆయన పూనుకోవడం వల్లే అభి రిలీజ్ అయ్యాడు. అది జీకే వల్ల అయింది కానీ.. తులసి వల్ల కాదు. ఈవిడ గారు అభిని కాపాడినంత మాత్రాన గొప్పది అవుతుందా.. దేవత అయిపోతుందా? రేపో మాపో అప్పు తీర్చమంటూ శశికల ఇంటి మీద పడుతుంది. తులసి ఏమైనా అనుకుంటే సాధించి తీరుతుందని గొప్పలు చెప్పుకుంటారు కదా. తనను ఆ అప్పు తీర్చమని చెప్పండి. ఆవిడ దేవత అని నేను ఒప్పుకుంటాను' అంటాడు.

 కోపంతో మళ్లీ తేల్చి చెప్పిన తులసి

కోపంతో మళ్లీ తేల్చి చెప్పిన తులసి

నందూ మాటలకు అందరూ చిరాకుగా చూస్తుంటారు. అప్పుడు లాస్య ‘ఏంటి.. అందరూ నందూను దోషిని చూసినట్టు చూస్తున్నారు. మంచిగా ఉన్న నందూను రెచ్చగొట్టడం ఎందుకు. నన్ను, నందూను ఎందుకు బలవంతం చేస్తారు' అంటుంది. అప్పుడు నందూ ‘పైసా ఖర్చు లేని పని చేసి పొగిడించుకున్నంత వరకు కాదు.. అప్పు తీర్చడం అంటే' అంటాడు. దీనికి తులసి ‘నా బిడ్డ సమస్య నాది.. నా సొంతం.. నా బాధ్యత. కానీ, ఈ ఇంటి మీద అప్పు అందరి బాధ్యత. ఇంతకుముందే చెప్పాను. డబ్బు తేవడం చేతగాక వంకర మాటలు మాట్లాడకండి. 20 లక్షల వాటా చొప్పున ఎవరి వాటా వాళ్లు తేవాల్సిందే. ఈ విషయంలో ఎవరి మాటా వినేది లేదు. వెనక్కి తగ్గేది లేదు. అభి విషయంలో ఓడిపోయారు కనీసం.. కొడుకుగా అయినా గెలవండి' అంటుంది.

తండ్రిని సూటిగా ప్రశ్నించిన ప్రేమ్

తండ్రిని సూటిగా ప్రశ్నించిన ప్రేమ్

తులసిని నిందించిన తర్వాత నందూ దగ్గరకు వెళ్లిన ప్రేమ్ అసలు మీ ప్రాబ్లం ఏంటని అడుగుతాడు. అప్పుడు నందూ ఈ అమ్మే నా ప్రాబ్లం అంటాడు. దీనికి ప్రేమ్ ‘మీరు గొంతు చించుకొని అరవాల్సిన పెద్ద తప్పులు అమ్మ ఏం చేసింది' అని సూటిగా ప్రశ్నిస్తాడు. అప్పుడు నందూ ‘నా తప్పుల దగ్గరికి వచ్చేసరికి నీకు కనిపిస్తున్నాయి. మీ అమ్మ తప్పులు నీకు కనిపించడం లేదా? అభిని సేవ్ చేసిందని నెత్తిన మోస్తున్నారు కానీ, వాడు అలా కావడానికి కారణం తులసే కదా. తులసి వల్లే అభి ఇలా తయారయ్యాడు' అంటూ మరోసారి ఆమెను నిందిస్తూ మాట్లాడతాడు

Recommended Video

Best Telugu TV Serials In 2020 | కార్తీక దీపం హవా..!!
 పరందామయ్య పనితో తులసి బాధ

పరందామయ్య పనితో తులసి బాధ


ఇక, శశికళకు ఇవ్వాల్సిన డబ్బుల కోసం పరందామయ్య తన స్నేహితుడికి ఫోన్ చేసి డబ్బులు అడుగుతాడు. అది చూసిన తులసి ‘నేను చేతగాని దాన్నా మామయ్యా. ఈ వయసులో మీరు వేరే వాళ్లను దేహీ అని అడగాలా' అని అంటుంది. దీనికాయన ‘ఏం చేయాలి అమ్మా. ఇలాంటి కొడుకును కన్నందుకు నేను బాధపడుతున్నానమ్మా. నువ్వు మాత్రం ఎంత భారం మోస్తావు. అందుకే స్నేహితుడిని అప్పు అడిగాను' అంటాడు. దీనికామె ‘నాకు తోడుగా మీరందరూ ఉన్నారు మామయ్య. శశికల ఇచ్చిన గడువు ఇంకా పూర్తి కాలేదు. కష్టమే కానీ.. ఎంతో కొంత డబ్బు సర్ది శశికల కాళ్లో గడ్డమో పట్టుకొని ఇంకొంచెం టైమ్ కావాలని అడుగుతాను' అని చెబుతుంది. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X