Intinti Gruhalakshmi Today Episode: దివ్యను ఒప్పించిన తులసి.. ఆమె ప్లాన్‌తో విక్రమ్‌కు కొత్త టెన్షన్
దాదాపు రెండు మూడు దశాబ్దాలుగా తెలుగు టెలివిజన్‌పై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి.
అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' గురువారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!
Photos Courtesy: Star మా and Disney+Hotstar

బుధవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే
బుధవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. విక్రమ్‌ను రాజ్యలక్ష్మి ఎలా ప్లాన్ చేసి మోసం చేసిందో.. తనకు పక్షవాతం ఎలా వచ్చిందో అతడి తండ్రి చూపిస్తాడు. ఆ తర్వాత దివ్యతో పెళ్లి విషయమై మాట్లాడేందుకు అందరూ ప్రయత్నం చేయగా..దివ్య మాత్రం ఎవరితో ఏమీ మాట్లాడకుండానే వెళ్లిపోతుంది.
ఇక, ఆస్పత్రికి వెళ్లిన తర్వాత ఓ బాబును యాక్సిడెంట్ అయిందని తీసుకు వస్తారు. ఆ సమయంలో యాక్సిడెంట్ చేసింది విక్రమ్ అనుకుని దివ్య అతడితో గొడవకు దిగడంతో పాటు డబ్బులను కూడా లాక్కుంటుంది. తర్వాత నిజం తెలుసుకుని చాలా బాధ పడుతుంది.

అతడిపై కంప్లైట్ చేయాలని
విక్రమ్ కోసం వెతుకుతున్న దివ్య దగ్గరకు యాక్సిడెంట్ అయిన బాబు తల్లి వస్తుంది. వచ్చీ రావడమే ఆమె డబ్బులు ఇచ్చి వెళ్లిపోయిన ఆయన దొరికారా డాక్టర్ అని ప్రశ్నిస్తుంది. దీనికామె 'లేదు ఫోన్ చేసిన లిఫ్ట్ చేయడం లేదు. ఏదోలా అతనికి ఈ డబ్బులు వెనక్కి తిరిగి ఇచ్చేస్తాను.
ఇంతకీ యాక్సిడెంట్ చేసిన అతడు ఎక్కడ' అని అడుగుతుంది. దీంతో ఆమె 'మీరు ఇతనితో మాట్లాడుతున్నప్పుడు అతను వెనకనుంచి పారిపోయాడు మేడం' అని చెప్తుంది. అప్పుడు దివ్య 'సరే మన సీసీ కెమెరాల్లో అతడిని గుర్తు పట్టి పోలీసులకు ఫిర్యాదు చేస్తాను' అని ఆ పేషెంట్ తల్లితో అంటుంది.

విక్రమ్‌ను టెన్షన్ పెట్టేశారుగా
ఆస్పత్రిలో దివ్య మాట్లాడిన మాటలను విక్రమ్ పదేపదే గుర్తుచేసుకొని సంతోషంగా కారులో ఇంటికి వెళ్తాడు. ఇంట్లో రాజ్యలక్ష్మితో పాటు అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. అప్పుడు విక్రమ్ లోపలికి వెళ్లి అమ్మ అని పిలవగా ఎవరూ మాట్లాడకుండా సైలెంట్‌గా ఉండడంతో అప్పుడు ఏం జరిగిందా అని టెన్షన్ పడుతూ ఉంటాడు. అప్పుడు అందరూ కలిసి విక్రమ్ ఏదో తప్పు చేసినట్టుగా నిందిస్తూ మాట్లాడుతూ ఉంటారు.
ఆ సమయంలోనే విక్రమ్ వాళ్ళ మామయ్య అమ్మను ఏడిపించావు బాధపెట్టావు అని అనడంతో ఇంకా భయపడిపోతాడు. అప్పుడు రాజ్యలక్ష్మి 'విక్రమ్‌ను ఎవరు ఏమీ అనడానికి వీల్లేదు. తను బాధపడకూడదు' అంటుంది. దీంతో సంజూ మరి నువ్వు బాధ పడుతున్నావు కదా మామ్ అనగా అదేం లేదు అని అంటుంది.

విక్రమ్‌ను బ్లాక్‌మెయిల్ చేస్తూ
విక్రమ్ టెన్షన్‌ను రాజ్యలక్ష్మి క్యాష్ చేసుకోవాలని చూస్తూ అతడిని ఎమోషనల్‌గా బ్లాక్‌మెయిల్ చేస్తూ ఉంటుంది. అప్పుడు ఆమె తమ్ముడు 'నువ్వు ఎందుకు మర్చిపోయావు చెప్పు' అని విక్రమ్‌ను ప్రశ్నించగా అది చెప్పలేని విషయం అని మనసులో అనుకుంటాడు.
ఆ తర్వాత ఆయన 'ఇప్పుడు ఏ కారణంతో అయితే నువ్వు ఈ పని చేశావో.. రేపు అదే కారణం మీ అమ్మను నీకు దూరం చేస్తుందని తను భయపడుతోంది' అని విక్రమ్‌తో అంటాడు. దీనికి అతడు 'నేను ఎప్పటికీ అమ్మకు దూరం కాను. ఒకవేళ దూరం అయ్యానంటే ఆ రోజు నన్ను నేను దూరం చేసుకున్నట్లే' అని అంటాడు.

దొంగ కన్నీరుతో విక్రమ్ పైనే
విక్రమ్ బాధ పడుతూ చెప్పిన మాటలకు రాజ్యలక్ష్మి 'నీ గురించి నాకు తెలుసు నాన్న. కానీ ఆ భయం నన్ను మనసులో వెంటాడుతోంది' అంటూ దొంగ కన్నీరు కారుస్తుంది. ఆ తర్వాత ఇంట్లోని వాళ్లు అందరూ ఒకటై విక్రమ్‌ను పిచ్చివాడిని చేసి మాట్లాడుతుంటారు. అప్పుడు రాజ్యలక్ష్మి తల్లి సెంటిమెంట్‌ను అడ్డం పెట్టుకొని విక్రమ్‌ను ఎమోషనల్ బ్లాక్‌మెయిల్ చేస్తూనే ఉంటుంది.
కానీ, అతడు మాత్రం తల్లి మాటలు నిజం అని నమ్మి బాధ పడుతూ ఉంటాడు. ఆ సమయంలో సంజయ్‌తో పాటు మేనమామ, అత్తయ్య విక్రమ్ పరిస్థితిని చూసి నవ్వుకుంటూ ఉంటారు.

విక్రమ్ గురించి ఆలోచిస్తూనే
ఇంట్లో దివ్య వర్క్ చేసుకుంటూ ఉండగా విక్రమ్ పదేపదే గుర్తు వస్తుంటాడు. దీంతో ఆమె అతడి గురించే ఆలోచిస్తూ ఉంటుంది. అంతేకాదు, 'ఎవరో ఆ పిచ్చోడు.. చేయని తప్పుకు నాకు రెండు లక్షలు ఇచ్చి నాతో మాటలు పడ్డాడు' అంటూ తనలో తానే మాట్లాడుకుంటుంది. ఇంతలో తులసి అక్కడికి పాలు తీసుకుని వస్తుంది. అంతేకాదు.. 'అయ్యో దివ్య పొద్దున అంటే తప్పించుకున్నావు ఇప్పుడు ఎక్కడికి పోతావు' అని మనసులో అనుకుంటూ ఉంటుంది.
ఆ తర్వాత ఉద్యోగం ఎలా ఉందమ్మా అనడంతో 'ఉద్యోగం సంగతి పక్కన పెడితే.. నువ్వు చాలా మారిపోయావు. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా కూతురికి పెళ్లి చేసి పంపిణీ చేసేయాలి అనుకుంటున్నావు. లాస్య ఆంటీ నా పెళ్లి సంబంధం గురించి మాట్లాడుతుంటే మా అమ్మ అడ్డుపడి నా వైపు నిలబడేది అలాంటిది నువ్వు మౌనంగా ఉన్నావు' అంటుంది.

నువ్వే నా రోల్ మోడల్ అని
దివ్య మాటలకు బదులుగా తులసి 'కూతురికి పెళ్లి చేయడం అంటే మరొక జీవితం ఇవ్వడం' అని అంటుంది. దీంతో దివ్య 'చదువుకోవడం లేదా లైఫ్ సెటిల్ కాకుండా పెళ్లి చేసుకుంటే ఆడపిల్ల ఎన్ని కష్టాలు పడుతుంది అన్న దానికి నీ లైఫ్ ఒక ఎగ్జాంపుల్. నువ్వే నా రోల్ మోడల్. జాగ్రత్తలు చెప్పాల్సిన నువ్వే పెళ్లికి తొందర పెడుతుంటే కొత్తగా ఉందమ్మా' అని అంటుంది.
దీనికి తులసి 'అయినా నేను ఇప్పుడు నిన్ను పెళ్లికి ఒప్పించడానికి రాలేదు. పెళ్లి చూపులకు ఒప్పించడానికి వచ్చాను' అంటుంది. అప్పుడు దివ్య 'అమ్మ నేను చిన్నపిల్లనే కానీ.. చందమామ కథలు నమ్మే ఎంత చిన్న పిల్లని కాదు' అని అంటుంది.

దివ్యకు మాటిచ్చిన తులసి
అనంతరం దివ్య 'పెళ్లి ఇష్టం లేదు తల్లి అంటే మళ్ళీ పెళ్లిచూపులు అంటావేంటమ్మా' అంటుంది. దీంతో తులసి 'నాన్నగారి క్లోజ్ ఫ్రెండ్ వాళ్ళ కొడుకు. నా మాట విని పెళ్లి చూపులకు ఒప్పుకోమ్మా' అని అనడంతో దివ్య 'పెళ్లిచూపులు తర్వాత కూడా సేమ్ డైలాగ్ ఇదే మాట అంటావు. నాన్న పరువు కోసమైనా పెళ్లికి ఒప్పుకోమ్మా అని అంటావు' అంటుంది.
దీంతో తులసి 'నేను ఏమీ మాట్లాడను నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా నేను అడ్డుపడను నీకు మాట ఇస్తున్నాను' అంటుంది. దీంతో దివ్య ఒకవేళ అబ్బాయి నచ్చితే అనడంతో 'చెప్పాను కదా నీ నిర్ణయానికి అడ్డుపడను' అని అంటుంది. తర్వాత తులసిని అక్కడి నుంచి పంపేస్తుంది. మరోవైపు రాజ్యలక్ష్మి 'ఆస్పత్రిలో విక్రమ్‌కు అందంగా ఎవరు కనిపించారబ్బా' అనుకుంటుంది. తర్వాత అతడు వచ్చి ఆమెకు అన్నం తినిపిస్తాడు. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.


Click it and Unblock the Notifications











