Intinti Gruhalakshmi Today Episode: అత్తమామలను చూసిన తులసి.. అనాథాశ్రమంలో వాళ్లకు బిగ్ షాక్

సుదీర్ఘ కాలంగా తెలుగు బుల్లితెరపై ప్రసారం అయ్యే సీరియళ్లకు మాత్రమే సుదీర్ఘ కాలంగా ప్రేక్షకుల నుంచి భారీ నుంచి అతి భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోందన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' బుధవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరు కూడా ఓ లుక్కేయండి!

Photos Courtesy: Star మా and Disney+Hotstar

మంగళవారం ఎపిసోడ్‌లో జరిగిందిదే

మంగళవారం ఎపిసోడ్‌లో జరిగిందిదే

మంగళవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. నందూ వాళ్లతో వచ్చేందుకు పరందామయ్య వాళ్లు ఒప్పుకున్నారన్న విషయాన్ని తులసి వాళ్లకు చెబుతుంది. అంతేకాదు, వాళ్లకు ఎలాంటి లోటు లేకుండా చూడాలని చెబుతుంది. అయితే, నందూతో వెళ్లడం ఇష్టం లేక పరందామయ్య, అనసూయ ఇంట్లో నుంచి చెప్పకుండా వెళ్లిపోతారు. దీంతో అందరూ తెగ టెన్షన్ పడుతుంటారు.

కానీ, లాస్య, నందూ మాత్రం తులసిపై నిందలు వేస్తారు. వాళ్లను తమతో పంపించడం ఇష్టం లేకనే ఎక్కడో దాచేసిందని ఆరోపిస్తారు. దీంతో తులసి తానే వెళ్లి వాళ్లను తీసుకొస్తానని అంటుంది.

తులసిపై నందూ.. లాస్య నిందలు

తులసిపై నందూ.. లాస్య నిందలు

పరందామయ్య, అనసూయ కనిపించకుండా వెళ్లిపోయే సరికి అందరూ కంగారు పడుతుంటారు. అప్పుడు తులసి ముందు వాళ్లు ఎక్కడ ఉన్నారో కనుక్కుందాం అంటుంది. దీంతో లాస్య ‘వాళ్లు దొరకరు ఎందుకంటే.. వాళ్లను నువ్వే దాచావు' అంటుంది. దీనికామె నేనెందుకు దాస్తాను అంటుంది. అప్పుడు నందూ ‘ఎందుకంటే అమ్మా నాన్నలను మాతో పంపించడం ఇష్టం లేదు కాబట్టి' అంటాడు. ఇలా వాళ్లిద్దరూ పరందామయ్య, అనసూయ విషయంలో కూడా తులసిపై నిందలు వేస్తారు. ఆ సమయంలోనే నాకు మా అమ్మానాన్నలు కావాలి అని నందూ అరుస్తాడు.

వాళ్లను తీసుకొస్తానని తులసి హామీ

వాళ్లను తీసుకొస్తానని తులసి హామీ

తులసి ఎంత చెప్పినా అటు నందూ కానీ, ఇటు లాస్య కానీ నమ్మరు. పైగా లాస్య ‘పిచ్చోడిలా తులసి మాటలు నమ్మావు కదా. ఇప్పుడు ఏమంటావు.. రోగం కుదిరిందా.. ఎవరేంటో అర్థం అయిందా' అని నందూను రెచ్చగొడుతుంది. దీనికి నందూ ‘ఎవరు ఏం చెప్పినా నేను నమ్మను. ఇది తులసి కుట్ర. ఇక్కడి నుంచి నేను మా అమ్మానాన్నలతోనే కదులుతాను' అంటాడు. అప్పుడు ఇంట్లో వాళ్లు కూడా తులసి వైపు మాట్లాడతారు. అయినా వాళ్లిద్దరూ వినకపోయే సరికి తులసి ‘అత్తయ్య, మామయ్య ఎక్కడున్నా నేను వెతికి తీసుకొస్తాను' అంటుంది.

ఫ్రెండ్స్‌తో రంగంలోకి దిగిన ప్రేమ్

ఫ్రెండ్స్‌తో రంగంలోకి దిగిన ప్రేమ్

తన తల్లి వచ్చి తిట్టిన విషయాన్ని ప్రేమ్ తన స్నేహితుల దగ్గర చెప్పి బాధ పడతాడు. ‘ఎందుకురా నాకు ఇలా జరుగుతోంది? ఏం చేద్దాం అనుకున్నా నెగెటివ్‌గానే జరుగుతోంది' అని అంటాడు. దీంతో మొన్ననే కదా ఆటో నడపడం స్టార్ట్ చేశావు అంటారు ఫ్రెండ్స్. దీంతో తన తల్లి చెప్పిన విషయాలను వాళ్లందరికీ వివరించి చెబుతాడు ప్రేమ్. ఇంతలో ప్రేమ్‌కు దివ్య ఫోన్ చేస్తుంది. నాన్నమ్మ, తాతయ్య వాళ్లు లెటర్ రాసిపెట్టి ఎక్కడికో వెళ్లిపోయారు అని చెబుతుంది దివ్య. దీంతో ప్రేమ్ రంగంలోకి దిగి తన ఫ్రెండ్స్‌తో కలిసి నానమ్మ, తాతలను వెతుకుతాడు.

మాధవితో తులసి.. అదే నయమని

మాధవితో తులసి.. అదే నయమని

నందూకు హామీ ఇచ్చిన వెంటనే తులసి రంగంలోకి దిగుతుంది. ఆ వెంటనే మాధవికి ఫోన్ చేసి.. అక్కడికి అత్తయ్య, మామయ్య వచ్చారా అని అడుగుతుంది. దీంతో రాలేదు అని చెబుతుందామె. నేనూ వస్తాను.. వాళ్లను కలిసి వెతుకుదాం అంటుంది మాధవి. ఇద్దరూ కలిసి రోడ్డు మీద వెతుకుతూ ఉంటారు. మరోవైపు పరందామయ్య, తులసి.. ఇద్దరూ బ్యాగు పట్టుకొని రోడ్డు మీద నడుచుకుంటూ వాళ్లు ఏడుస్తూ వెళ్తుంటారు. అప్పుడు అనసూయ ‘నడవడం కష్టంగా ఉంది. కానీ, ఆ నందూ గాడితో వెళ్లడం కంటే ఈ కష్టాన్ని భరించడమే నయం' అంటుంది.

అత్తమామలను చూసేసిన తులసి

అత్తమామలను చూసేసిన తులసి

అత్తమామలను వెతుకుతోన్న సమయంలో తులసికి కూడా రోడ్డు మీద తిరిగి తిరిగి కళ్లు తిరుగుతాయి. దీంతో ఒక చోట కూర్చుంటారు. వాళ్లను పరందామయ్య, అనసూయ చూస్తారు. తులసి కూడా వాళ్లను చూసి పరిగెడుతుంది. కానీ, వాళ్లు దొరక్కుండా తప్పించుకుంటారు. తులసి మనల్ని చూసిందంటే.. మళ్లీ నందూ దగ్గరికి పంపిస్తారు అనుకొని వెళ్లి దాక్కుంటారు. అప్పుడు తులసి ‘మామయ్య, అత్తయ్య.. నేను మిమ్మల్ని చూశాను. ఖచ్చితంగా ఇక్కడే ఎక్కడో దాక్కున్నారు నాకు తెలుసు. దయచేసి బయటికి రండి మామయ్య' అంటూ ఏడుస్తూ వేడుకుంటుంది.

తులసి ఏడుపు.. వాళ్లిద్దరూ అలాగే

తులసి ఏడుపు.. వాళ్లిద్దరూ అలాగే

పరందామయ్య, అనసూయ అక్కడే ఎక్కడో దాక్కున్నారని తెలుసుకున్న తులసి ‘మీకు దండం పెడతాను.. బయటికి రండి మామయ్య. మీరు మీ అబ్బాయితో వెళ్లక్కర్లేదు. మాతోనే ఉందురు కానీ. నా మాట విని బయటికి రండి అత్తయ్య' అంటూ వేడుకుంటుంది. దీంతో అనసూయ ‘తులసి బాగా ఏడుస్తుంది.. తనతో వెళ్దాం పదండి' అంటుంది. కానీ, పరందామయ్య మాత్రం అందుకు ఒప్పుకోడు. ‘కాసేపు ఒపిక పట్టు అనసూయ. కొద్దిసేపు అయితే తనే వెళ్లిపోతుంది. అప్పుడు మన దారిలో మనం వెళ్దాం' అంటూ ఆమెకు సర్ది చెబుతాడు. దీంతో సైలెంట్ అవుతుంది.

Recommended Video

RRR Movie పై Babu Gogineni వివాదాస్పద రివ్యూ | Filmibeat Telugu
 అనాథాశ్రమంలో వాళ్లకు బిగ్ షాక్

అనాథాశ్రమంలో వాళ్లకు బిగ్ షాక్

పరందామయ్య, అనసూయ కోసం ప్రేమ్ కూడా రంగంలోకి దిగుతాడు. ఇందులో భాగంగానే అతడు ఓ అనాథాశ్రమం దగ్గరకు వెళ్తాడు. అంతేకాదు, అక్కడి నిర్వహకులకు నానమ్మ, తాతయ్యల ఫొటోలను చూపించి.. వాళ్లు వస్తే చెప్పమని తనకు ఫోన్ చేయమని చెప్తాడు. సరిగ్గా అప్పుడే వాళ్లిద్దరూ అక్కడకు వస్తారు. కానీ, ఒకరినొకరు చూసుకోరు. ఆ తర్వాత పరందామయ్య తాము అనాథలమని చెబుతాడు. దీంతో నిర్వహకులు ‘మీరు అబద్ధాలు చెబుతున్నారు. మీరు ఇంట్లో గొడవ పెట్టుకుని వచ్చేశారు. ఇప్పుడే మీ మనవడు వచ్చి ఈ విషయం చెప్పాడు. అంతేకాదు, మీరు వస్తే తనకు ఫోన్ చేయమని నెంబర్ ఇచ్చాడు' అని చెప్పి షాకిస్తాడు. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X