Intinti Gruhalakshmi: బొకేపై పేరు చూసి తులసి షాక్.. లాస్యకు రాజ్యలక్ష్మి ఆఫర్.. వాళ్లకు విక్రమ్ ఝలక్

ప్రేక్షకుల అభిరుచిలో మార్పులు వస్తున్నా.. తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రం ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి.

అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' గురువారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!

Photos Courtesy: Star మా and Disney+Hotstar

బుధవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

బుధవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

బుధవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. దివ్య పెళ్లి బాధ్యతను తాను తీసుకుంటానని నందూ అనడంతో పరందామయ్య, తులసి అతడికి కొన్ని సూచనలు చేస్తారు. మరోవైపు, ప్రియకు రాజ్యలక్ష్మి నిజస్వరూపం గురించి పని మనిషి వివరించి చెబుతుంది. అయినా ఆమె ఇల్లు వదిలి వెళ్లనని అంటుంది. అప్పుడే ఆమె వచ్చి ఇద్దరికీ వార్నింగ్ ఇస్తుంది.

ఇక, నందూకు తెలియకుండా లాస్య డబ్బు దాచుకోవాలని చూస్తుంది. అనుమానం వచ్చి అడగ్గా అబద్దాలు చెబుతుంది. ఇక, ఇంటికి తిరిగి వచ్చిన విక్రమ్.. తమ ఇంట్లో ప్రియను చూసి షాకై.. ఆమె ఎందుకు గురి ఆరా తీస్తాడు.

ప్రియ గురించి నిజం చెప్పడంతో

ప్రియ గురించి నిజం చెప్పడంతో

ఇంట్లో ప్రియను చూసి షాకైన విక్రమ్.. ఆమె ఇక్కడెందుకు ఉందని ప్రశ్నిస్తాడు. దీంతో వాళ్ల తాతయ్య వచ్చి 'నేను చెప్తాను రా. ఇప్పుడు ప్రియ ఆస్పత్రిలో నర్స్ కాదు.. తన హోదా మారిపోయింది. ప్రియ ఇప్పుడు మన ఇంటి కోడలు.. అంటే నీ మరదలు' అని చెప్పడంతో విక్రమ్ షాక్ అవుతాడు.

ఆ వెంటనే అమ్మా.. తాతయ్య చెప్పేది నిజమా అని తల్లిని ప్రశ్నిస్తాడు. దీనికామె అవును నాన్న అంటుంది. అప్పుడు విక్రమ్ 'ఇది ఎలా సాధ్యం అమ్మ? నాకు చెప్పకుండా.. నేను ఊర్లో లేనప్పుడు ఈ రెండు రోజుల్లో ఇంత జరిగిందా' అంటూ ప్రశ్నిస్తాడు.

తొందర పడ్డాను అన్నయ్యా అని

తొందర పడ్డాను అన్నయ్యా అని

విక్రమ్ ప్రశ్నించగానే రాజ్యలక్ష్మి 'అనుకోకుండా జీవితాలు తారుమారైనప్పుడు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి' అంటుంది. ఆ సమయంలోనే దేవుడు 'ఇప్పుడు నిజం తెలిస్తే దివ్యమ్మ పైకి పోట్లాటకు వెళ్తారు ఏమో' అని మనసులో అనుకుంటాడు. అప్పుడు విక్రమ్ 'అంతా అయోమయంగా ఉందమ్మా.. ఏంట్రా సంజయ్ ఇది.

నీకు పెళ్లి చేయాలని ఎన్నో కలలు కన్నాను' అని అంటాడు. దీనికి సంజయ్ 'అన్నయ్యా తప్పు నాదే. ప్రియ విషయంలో తొందర పడ్డాను. తను తల్లి కాబోతోంది. అన్యాయం జరుగుతోంది అనగా మమ్మీకి తెలియడంతో వెంటనే తాళి కట్టించింది' అని చెప్తాడు. దీంతో విక్రమ్ 'నీ మనసు నాకు తెలుసమ్మా. ఆడపిల్లకు అన్యాయం జరిగితే నువ్వు చూస్తూ ఊరుకోవు' అని అంటాడు.

ప్రియ దోషం గురించి చెప్పగానే

ప్రియ దోషం గురించి చెప్పగానే

రాజ్యలక్ష్మి గురించి విక్రమ్ మాట్లాడుతూ.. 'నీ లాంటి తల్లి ఉండబట్టే ఇంకా ధర్మం నాలుగు పాదాల మీద నడుస్తోంది' అంటాడు. దీనికామె 'పిల్లలు తప్పు చేస్తే తల్లిదే బాధ్యత. కానీ వెనకేసుకు రాకూడదు కదా నాన్న' అంటూ యమ యాక్టింగ్ చేస్తుంది. అప్పుడు విక్రమ్ 'అది కరెక్టే అమ్మా.. ప్రియ ఎందుకు అమ్మవారికి అభిషేకం చేస్తోంది' అని అడుగుతాడు.

దీంతో బసవయ్య వచ్చి ప్రియకు దోషం ఉందని, పూజారి ఇలా చేయడమన్నాడని వివరిస్తాడు. దీంతో విక్రమ్ 'మొన్న ఏదో ప్రవచనాల్లో విన్నాను మావయ్య. భార్యాభర్తల్లో దోషం ఎవరికి ఉన్నా అది ఇద్దరికీ వర్తిస్తుంది కదా' అని అంటాడు.

వాళ్లందరికీ షాకిచ్చేసిన విక్రమ్

వాళ్లందరికీ షాకిచ్చేసిన విక్రమ్

ప్రియ దోషం గురించి చెప్పిన బసవయ్యతో విక్రమ్ 'ప్రియా అవుట్ హౌస్‌లో ఉంటూ ఇలా ఒక్కటే కష్టపడుతుంటే చూస్తుంటావేంట్రా. ఈ దోషం పోవాలంటే శాస్త్రం ప్రకారం సంజయ్ కూడా ప్రియకు హెల్ప్ చేయాలి. తనతో పాటు వాడు కూడా నీళ్లు మోయాలి. ఆమెతో కలిసే అవుట్ హౌస్‌లో ఉండాలి' అని చెప్పడంతో అందరూ షాక్ అవుతారు.

అప్పుడు రాజ్యలక్ష్మి 'వీడేంటి ఇలా రెచ్చిపోతున్నాడు. ఇప్పుడు కాదు అంటే నా ప్లాన్ అంతా తెలిసిపోతుంది' అని మనసులో అనుకుంటుంది. అప్పుడు విక్రమ్ సంజయ్‌తో నీళ్లు పోయమని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.

బొకేపై పేరు చూసి తులసి షాక్

బొకేపై పేరు చూసి తులసి షాక్

దివ్య కోసం తులసి ఉప్మా పెసరట్టు రెడీ చేశానని చెప్తుంది. అంతలోనే లాస్య అక్కడకు వచ్చి 'నీకోసం ఎవరో బొకే పంపించారు' అని చెప్తుంది. దీంతో దివ్య టెన్షన్ పడుతూ ఉంటుంది. అంతేకాదు, మనసులో 'ఫోన్ చేస్తే ఎత్తడు కానీ.. ఇలా బొకేల మీద బొకేలు పంపిస్తున్నాడు' అని అనుకుంటుంది.

అప్పుడే లాస్య ఉండు నేను పేరు చూసి చెప్తాను అనగా దివ్య ఆమె చేతిలో నుంచి బొకే లాక్కోబోతుంది. దీంతో లాస్య దాన్ని తులసికి అందిస్తుంది. అప్పుడామె పేరు చూస్తానని టెన్షన్ పెట్టి 'దీని మీద ఫ్రెండ్ అని మాత్రమే ఉంది' అంటుంది. దీంతో దివ్య ఊపిరి పీల్చుకుంటుంది. అప్పుడు లాస్య దివ్య వైపు చూసి 'నువ్వు ఆ విక్రం పంపించిన బొకే కోసం ఎదురుచూస్తున్నావు. నువ్వు విక్రమ్‌తో ప్రేమలో ఉంటేనే కదా నా పని అయ్యేది' అనుకుంటుంది.

లాస్యకు షాక్.. విక్రమ్ జవాబు

లాస్యకు షాక్.. విక్రమ్ జవాబు

ఇక, నందూకు తెలియకుండా లాస్య పెట్టుబడి పెట్టిన డబ్బు మొత్తం పోయిందని ఆమెకు ఫ్రెండ్ ఫోన్ చేసి చెప్తుంది. దీంతో ఏం చేయాలో తెలియక తెగ టెన్షన్ పడుతూ ఉంటుంది. మరోవైపు.. దేవుడు వచ్చి విక్రమ్‌ను దివ్య గురించి ప్రశ్నిస్తుంటాడు. తల్లి ముఖ్యమా? దివ్య ముఖ్యమా అని వస్తే ఏం చేస్తావు అని అడుగుతాడు.

అప్పుడు విక్రమ్ 'అలాంటి పరిస్థితే రాదు.. నేను అమ్మను ఒప్పించే పెళ్లి చేసుకుంటాను' అంటాడు. దీంతో దేవుడు మనసులో ఏదేదో మాట్లాడుకుంటాడు. దీనికి విక్రమ్ నువ్వు ఏదేదో మాట్లాడి నన్ను టెన్షన్ పెట్టకు అని అక్కడి నుంచి వెళ్లిపోతాడు.

లాస్యకు రాజ్యలక్ష్మి ఆఫర్ చేసి

లాస్యకు రాజ్యలక్ష్మి ఆఫర్ చేసి

దివ్య టిఫిన్ చేస్తున్న సమయంలో విక్రమ్ ఆమెకు కాల్ చేస్తాడు. అప్పుడు ఫోన్ వైబ్రేషన్‌లో పెట్టుకుని తన నడుము దగ్గర పెట్టుకుంటుంది. చాలా సేపటి తర్వాత కాల్ లిఫ్ట్ చేసిన దివ్య 'నడుము దగ్గర సెల్లు పెట్టుకుంటే పదేపదే మీరు ఫోన్ చేసి నన్ను డిస్టర్బ్ చేస్తున్నారు చెక్కలిగింతలు పెడుతున్నాయి' అంటాడు. అలా ఇద్దరూ చాలా సేపు మాట్లాడుకుంటారు.

అదంతా లాస్య చూస్తుంది. దీంతో దివ్య టెన్షన్‌గా వెళ్లిపోతుంది. అది అయిన వెంటనే లాస్యకు రాజ్యలక్ష్మి ఫోన్ చేసి 'లాస్య నీతో మాట్లాడాలి. మా ఇంటికి రా. నీకు లాభం వచ్చే పనే చెప్తాను' అంటుంది. దీంతో లాస్య 'లాభం వచ్చే పనైతే కచ్చితంగా చేస్తాను కదా. మీ లొకేషన్ పంపించండి' అంటుంది. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X