twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Intinti Gruhalakshmi Today Episode: లాస్యకు ఘోర అవమానం.. నందూ కూడా హ్యాండ్ ఇవ్వడంతో!

    |

    మిగిలిన భాషలతో పోల్చుకుంటే తెలుగు బుల్లితెరపై ప్రసారం అయ్యే సీరియళ్లకు మాత్రమే సుదీర్ఘ కాలంగా ప్రేక్షకుల నుంచి భారీ నుంచి అతి భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోందన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' గురువారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరు కూడా ఓ లుక్కేయండి!

    Photos Courtesy: Star మా and Disney+Hotstar

    బుధవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

    బుధవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

    బుధవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. పరందామయ్య, అనసూయ ఇంట్లో నుంచి కనిపించకుండా పోయే సరికి నందూ, లాస్య తులసిపై నిందలు వేస్తుంటారు. దీంతో వాళ్లిద్దరినీ ఇంటికి తీసుకొచ్చే బాధ్యత నాదే అని అంటుంది. ఆ వెంటనే మాధవికి ఫోన్ చేసి వాళ్లను వెతకడానికి వెళ్దామని చెబుతుంది. మరోవైపు, ప్రేమ్‌కు దివ్య ఈ విషయం చెప్పగానే అతడు కూడా తన ఫ్రెండ్స్‌తో కలిసి వెతుకులాట ప్రారంభిస్తాడు. అనంతరం రోడ్డు మీద తులసి.. వాళ్లిద్దరినీ చూస్తుంది. కానీ, వాళ్లు తప్పించుకుని వెళ్లిపోతారు. దీంతో తులసి ఎంతగానో ఏడుస్తుంది.

    బట్టలున్నా లేనట్లే షాకిచ్చిన శృతి హాసన్: ప్రైవేట్ భాగాలు మొత్తం కనిపించేలా ఘోరంగా!బట్టలున్నా లేనట్లే షాకిచ్చిన శృతి హాసన్: ప్రైవేట్ భాగాలు మొత్తం కనిపించేలా ఘోరంగా!

    పరందామయ్యకు ఆశ్రమంలో చోటు

    పరందామయ్యకు ఆశ్రమంలో చోటు

    ప్రేమ్ ముందే తన తాతయ్య, నానమ్మ వివరాలను ఇవ్వడంతో ఆశ్రమంలోని వ్యక్తి పరందామయ్యను గుర్తిస్తాడు. అప్పుడు అక్కడ ఉండేందుకు పర్మీషన్ అడగ్గా.. అందులో పని చేసే వ్యక్తి ‘మీరు అనాథలు కాదు. మీరు ఇంట్లో గొడవపడి వచ్చారు కదా.. మీ మనవడు వచ్చి అన్నీ చెప్పాడు. మీరు వస్తే ఫోన్ చేయమని నెంబర్ కూడా ఇచ్చాడు. అతడికి ఫోన్ చేయనా' అంటాడు. దీంతో ఆయన ‘వద్దు బాబు.. నీకు దండం పెడతా.. నువ్వు ఆశ్రయం ఇవ్వకున్నా ఏంలేదు కానీ.. వాడికి మాత్రం చెప్పకు' అంటాడు. ఆ తర్వాత పరందామయ్య వెక్కి వెక్కి ఏడవడంతో చూసి బాధ పడిన నిర్వహకులు ఆశ్రమంలో ఉండేందుకు పర్మీషన్ ఇస్తారు.

    తులసిపై నందూ, లాస్య ఆగ్రహంతో

    తులసిపై నందూ, లాస్య ఆగ్రహంతో

    పరందామయ్య, అనసూయ దొరకకపోవడంతో తులసి, మాధవి ఇంటికి వస్తారు. వాళ్లు రాగానే.. మా అమ్మానాన్న ఎక్కడ అని నందూ అడుగుతాడు. మేం వెతికాం కానీ.. దొరకలేదు అంటుంది. దీంతో గొడవ మొదలవుతుంది. అప్పుడు మాధవి ‘వదినను మెచ్చుకోవాల్సింది పోయి నిందలు వేస్తావా.. ఇదెక్కడి అన్యాయం అన్నయ్యా' అని ప్రశ్నిస్తుంది. అప్పుడు లాస్య ‘పిల్లలను నందూకు దూరం చేసింది తులసి.. అత్తయ్య మామయ్యలను నందూకు దూరం చేసింది తులసి. ఈ ఇంటి పెత్తనాన్ని మొత్తం తీసుకొని నందూకు విలువ లేకుండా చేసింది' అంటుంది.

    Samantha: ఇన్‌స్టాగ్రామ్‌‌తో సమంత లక్షల సంపాదన.. ఒక్క పోస్టుకు ఎంత తీసుకుంటుందో తెలిస్తే!Samantha: ఇన్‌స్టాగ్రామ్‌‌తో సమంత లక్షల సంపాదన.. ఒక్క పోస్టుకు ఎంత తీసుకుంటుందో తెలిస్తే!

    లాస్యను చెంపపై కొట్టేసిన మాధవి

    లాస్యను చెంపపై కొట్టేసిన మాధవి

    అంతటితో ఆగని లాస్య ‘మేము ఇంట్లో నుంచి బయటికి వెళ్లే పరిస్థితిని క్రియేట్ చేసింది తులసి. అన్ని గొడవలకు తులసే కారణం. సిగ్గు లేకుండా మా వెంట పడుతోంది. అత్తయ్య మామయ్యలను కిడ్నాప్ చేసి దాచిపెట్టింది' అంటూ నిందలు వేస్తుంది. దీంతో అప్పటికే కోపంగా ఉన్న మాధవి.. వెళ్లి లాస్య చెంప చెళ్లుమనిపిస్తుంది. అంతేకాదు, ‘ఇంకొక మాట మా వదిన గురించి చెడుగా మాట్లాడావు అంటే నాలిక చీరేస్తా' అంటూ వార్నింగ్ ఇస్తుంది. అంతలో మాధవి.. అని నందూ అనబోతే నువ్వు మధ్యలో మాట్లాడకు అంటూ అతడిపైనా ఫైర్ అవుతుంది.

     లాస్యపై ఓ రేంజ్‌లో ఫైరైన మాధవి

    లాస్యపై ఓ రేంజ్‌లో ఫైరైన మాధవి

    ఆ తర్వాత మాధవి ‘వదిన గురించి ఇంత మాట్లాడినా లేవని నీ నోరు ఇప్పుడు ఎందుకు లేస్తోంది' అంటూ నందూపైనా ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. అంతేకాదు, ‘పరువు మీకే కాదు.. మాకూ ఉంటుంది. లాస్య ఇన్ని మాటలు అంటున్నా వదిన నోరు తెరిచి ఒక్క మాట అయినా చెప్పిందా. గొడవ ఎందుకు అనుకొని తన మాటను దిగమింగుకుంటోంది. అది సంస్కారం అంటే.. అది మంచితనం అంటే. మంచితనం ముసుగు వేసుకుంది మా వదిన కాదు.. నువ్వు. మంచితనం ముసుగు వేసుకొని మా అన్నయ్యను వదినకు కాకుండా చేశావు. మా వదిన కాళ్లు మొక్కడానికి కూడా అర్హత లేని నువ్వు నిందలు వేస్తావా' అంటూ నోరు మూయిస్తుంది.

    RRR 6 Days Collections: మహేశ్ ఆల్‌టైం రికార్డు బ్రేక్.. 6 రోజుల్లోనే అన్ని కోట్ల టార్గెట్ ఫినీష్RRR 6 Days Collections: మహేశ్ ఆల్‌టైం రికార్డు బ్రేక్.. 6 రోజుల్లోనే అన్ని కోట్ల టార్గెట్ ఫినీష్

    నందూ వల్లే ఈ పరిస్థితి వచ్చిందని

    నందూ వల్లే ఈ పరిస్థితి వచ్చిందని

    పరందామయ్య, అనసూయ ఇంట్లో నుంచి వెళ్లిపోయారని తెలుసుకున్నప్పటి నుంచి విశ్రాంతి లేకుండా వాళ్ల కోసం ప్రేమ్ వెతుకుతూనే ఉంటాడు. కానీ, వాళ్ల జాడ మాత్రం దొరకదు. ఇలాంటి పరిస్థితుల్లో అతడి కోసం ఇంట్లో శృతి ఎదురు చూస్తూ ఉంటుంది. అంతేకాదు, అమ్మమ్మ తాతయ్య అసలు ఎక్కడున్నారో అనుకుంటుంది. అంతలో ప్రేమ్ ఇంటికి తిరిగొస్తాడు. ‘వాళ్లిద్దరూ ఎక్కడికి వెళ్లిపోయారో తెలియడం లేదు. ఇదంతా నాన్న చేసిన పని వల్లే' అని ఆరోపిస్తాడు. అప్పుడు శృతి ‘మళ్లీ వెళ్దువులే వెతకడానికి. భోం చేద్దువు పదా' అని లోపలికి తీసుకెళ్తుంది.

    తులసిని బ్రతిమాలిన అభి, దివ్య

    తులసిని బ్రతిమాలిన అభి, దివ్య

    అందరూ మామూలుగానే ఉండిపోయినా తులసి మాత్రం పరందామయ్య, అనసూయ గురించే ఆలోచిస్తూ ఉంటుంది. వాళ్లు ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారు? అని తనలో తానే అనుకుంటుంది. అంతలో దివ్య, అభి తులసికి భోజనం తీసుకుని వస్తారు. ఆమె వద్దని అంటున్నా తినమని బ్రతిమాలుతారు. కానీ, అప్పటికే వాళ్లిద్దరూ వెళ్లిపోయారన్న బాధతో పాటు తనపై నిందలు వేశారన్న కారణంతో ఆమె తినదు. అంతేకాదు, ‘అసలు నేను ఎలా తింటాను. నాకు ఎలా ముద్ద దిగుతుంది అనుకుంటున్నారు. దయచేసి నన్ను వదిలేయండి' అంటూ వాళ్లకు సమాధానం చెబుతుంది.

    RRR మూవీని రిజెక్ట్ చేసిన హీరోయిన్లు వీళ్లే: ప్రెగ్నెన్సీ వల్ల ఒకరు.. ఆ రోల్ నచ్చక మరొకరు ఔట్RRR మూవీని రిజెక్ట్ చేసిన హీరోయిన్లు వీళ్లే: ప్రెగ్నెన్సీ వల్ల ఒకరు.. ఆ రోల్ నచ్చక మరొకరు ఔట్

    Recommended Video

    RRR లో మల్లి..ఎవరీ చిట్టితల్లి? Twinkle Sharma లైఫ్ మలుపు తిప్పిన యాడ్ | Filmibeat Telugu
    లాస్యకు నందూ ఝలక్ ఇవ్వడంతో

    లాస్యకు నందూ ఝలక్ ఇవ్వడంతో

    బయట గొడవ జరిగిన తర్వాత లాస్య లోపలికి వచ్చి రగిలిపోతూ ఉంటుంది. అంతేకాదు, అప్పుడామె ‘మీ చెల్లి నా చెంప పగులగొట్టింది. చూస్తూ నువ్వు ఊరుకుంటావా? ఎలాగూ మనం వెళ్లిపోతున్నాం కదా.. వాళ్లతో మనకు ఏంటి సంబంధం? ఈ ఇంట్లో గూడు పుఠానీ జరుగుతోంది నందూ. అది నీకు అర్థం కావడం లేదు' అంటుంది. అప్పుడు నందూ ‘నిన్ను మాధవి కొట్టడం తప్పే. కానీ, దీనికే నువ్వు ఏదేదో ఊహించుకుని గొడవ చేయడం కరెక్ట్ కాదు. తులసికి రేపటి వరకూ ఛాన్స్ ఇద్దాం. ఆ తర్వాత చూద్దాం' అంటాడు. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

    English summary
    Intinti Gruhalakshmi Episode 594: Nandhu and Lasya Blames Tulasi about Anasuya and Parandhamaiah Leave The House. After That Madhavi Slaps Lasya.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X