Intinti Gruhalakshmi: చేతులు కలిపిన లాస్య, రాజ్యలక్ష్మి.. విక్రమ్, దివ్య పెళ్లికి ఒప్పుకోవడంతో!
దాదాపు రెండు దశాబ్దాలకు పైగానే తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రం ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' శుక్రవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!
Photos Courtesy: Star మా and Disney+Hotstar

గురువారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే
గురువారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. ఇంట్లో ప్రియను చూసి షాకైన విక్రమ్.. ఆమె ఇక్కడెందుకు ఉందని ప్రశ్నిస్తాడు. దీంతో వాళ్ల తాతయ్య వచ్చి జరిగింది మొత్తం చెప్తాడు. దీంతో ప్రియతో పాటే సంజయ్ కూడా దోషం అయ్యే వరకూ ఔట్ హౌస్‌లోనే ఉండాలని చెప్తాడు. ఇక, విక్రమ్ పంపిన బొకేను తీసుకున్న లాస్య.. దాన్ని తులసికి ఇస్తుంది. కానీ, దాని మీద పేరు లేకపోవడంతో దివ్య ఊపిరి పీల్చుకుంటుంది. ఆ తర్వాత విక్రమ్‌కు ఫోన్ చేసి మాట్లాడుతుండగా లాస్య చూస్తుంది. చివర్లో లాస్యకు రాజ్యలక్ష్మి ఫోన్ చేసి తనకు ఒక పని చేయాలని డబ్బులు ఆఫర్ చేస్తుంది.

సంజయ్‌ను ప్రశ్నించిన ప్రియ
సంజయ్ కోసం ప్రియ కాఫీ తీసుకొచ్చి ఇవ్వబోతుంది. అప్పుడతను కోపంతో 'నా నెత్తి మీద పోయ్' అంటూ ఆమెపై చిరాకు పడతాడు. దీంతో ప్రియ బాధగా 'ఎందుకంత ఇరిటేట్ అవుతున్నారు? మీరు, అత్తయ్య చెప్పినట్లే వింటున్నాను కదా' అంటుంది. దీంతో సంజయ్ నిన్ను చూస్తేనే ఇరిటేషన్ వస్తుంది అంటాడు. దీంతో ప్రియ 'అయినా నన్ను ప్రేమించినప్పుడు.. నాతో కలిసినప్పుడు నీకు ఇరిటేషన్ రాలేదా' అని సూటిగా ప్రశ్నిస్తుంది. దీనికతడు 'ప్రేమా? గాడిద గుడ్డా? తొందరపడి చేసిన ఒక పని వల్ల నా జీవితం పాడైంది' అనుకుంటూ ఉంటాడు.

విక్రమ్ ముందు నటిస్తున్నాను
సంజయ్, ప్రియ వాదన పడుతుండగా రాజ్యలక్ష్మి అక్కడకు వస్తుంది. అప్పుడు సంజయ్ 'మామ్ నా వల్ల కాదు.. ఔట్ హౌస్‌లో ఉండలేకపోతున్నాను' అంటాడు. దీంతో రాజ్యలక్ష్మి 'చేశావు కదా అనుభవించు' అంటుంది. దీంతో సంజయ్ ప్లీజ్ మామ్.. ఇంట్లోకి వస్తాను అనగా.. విక్రమ్ ఒప్పుకోడు అంటుంది. అప్పుడు నువ్వే ఏదో ఒకటి చెప్పి ఒపించు మామ్ అంటాడు. దీంతో రాజ్యలక్ష్మి 'వాడి ముందు నా పరువు పోతే నువ్వు నేను రోడ్డు మీద పడి ఆడుకోవాలి. అందుకే వాడి ముందు నటించడానికి నానా తంటాలు పడుతున్నాను' అని సంజయ్‌కు నచ్చజెబుతుంది.

రాజ్యలక్ష్మి నాటకం ఆడడంతో
వాళ్లు మాట్లాడుకుంటూ ఉండగా విక్రమ్ అక్కడకు వచ్చి ఏమైందని అడుగుతాడు. దీంతో రాజ్యలక్ష్మి నిజం దాచేసి 'సంజయ్.. ప్రియ గురించి ఆలోచిస్తున్నాడు. ఔట్ హౌస్‌లో ఉండలేకపోతోంది అంట' అంటాడు. దీనికి విక్రమ్ నిజమే కానీ మనం ఏం చేయలేం కాదమ్మా అని అంటాడు. అప్పుడు రాజ్యలక్ష్మి పంతులు గారిని అడిగితే లోపలికి పిలుచుకొని వెళ్లొచ్చు అని చెప్పాడు అని అంటుంది. దీంతో విక్రమ్ మరి ఇంకేం.. అదే పని చేద్దాం అమ్మ అని అంటాడు. తర్వాత ప్రియకు నాలుగు మంచి మాటలు చెబుతాడు. అప్పుడు ప్రియ విక్రమ్‌తో మాట్లాడాలి అనుకుంటుండగా రాజ్యలక్ష్మి కోపంగా చూడడంతో తలదించుకుంటుంది. అప్పుడు సంజయ్ నా బదులు హాస్పిటల్ కి వెళ్లి జీతాలు ఇచ్చిరా అన్నయ్యా అని చెప్పగా అతడు ఆస్పత్రికి వెళ్తాడు.

దివ్యలో మార్పు.. తులసి డౌట్
ఇంట్లో దివ్య అద్దం ముందర రెడీ అవుతూ ఉండగా అది చూసి తులసి మురిసిపోతూ ఉంటుంది. అప్పుడు దివ్య నా డ్రెస్ బాగుందా అమ్మ అని అడగ్గా.. ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతుంది. దీంతో దివ్య 'అమ్మలకు దేవుడు ఇలాంటి తెలివితేటలు అన్ని బాగానే ఇస్తాడు' అని అంటుంది. దీనికి తులసి 'మాట దాటేయకుండా ఎక్కడికి వెళ్తున్నావో చెప్పు. ఈ మధ్య నీలో ఏదో నాకు మార్పు కనిపిస్తోంది. మాటల్లోనా అనగా మాటల్లో కాదు ప్రవర్తనలో నా దగ్గర ఏదో దాస్తున్నావని అనిపిస్తోంది' అంటుంది. దీనికి దివ్య 'అమ్మ ఆలోచన ఎప్పుడూ తప్పు కాదు.. నిజంగానే విక్రమ్ గురించి దాస్తున్నాను కదా. ఇప్పుడు వెళ్తున్నా కదా.. విక్రమ్ మనసులో నేను ఉన్నానో లేదో తెలుసుకుని అప్పుడు చెప్తానమ్మా' అని మనసులో అనుకుంటుంది.

రాజ్యలక్ష్మి మాటలతో కోపంగా
రాజ్యలక్ష్మిని కలిసేందుకు లాస్య వాళ్ల ఇంటికి వెళ్తుంది. అప్పుడు 'నన్ను రమ్మని చెప్పారు కానీ ఎందుకో ఇప్పటివరకు చెప్పలేదు. నేను విషయం ఏంటో తెలియకుండా మాట ఇవ్వను రాజ్యలక్ష్మి గారు' అని లాస్య అంటుంది. దీనికామె 'మాట ఇవ్వకపోతే నువ్వే మోసపోతావు. ఒకసారి కళ్ళారా చూసుకో' అని డబ్బు చూపించడంతో లాస్య ఆశ్చర్యపోతుంది. వెంటనే సరే పనేదో చెప్పండి చేయడానికి నేను రెడీ అని అంటుంది. అప్పుడు రాజ్యలక్ష్మి లాస్య బ్యాగ్రౌండ్ మొత్తం చెబుతూ ఉంటుంది. దీంతో లాస్య కోపంతో రగిలిపోతూ ఉంటుంది. అప్పుడామె 'పని చెప్పడానికి పిలిపించారా? లేక నా జాతకం చెప్పడానికి పిలిపించారా' అని కోప్పడుతుంది. దీంతో రాజ్యలక్ష్మి 'నాకు కావాల్సిన వాళ్ళ బ్యాగ్రౌండ్ తెలియకుండా నేను పని ఒప్పుకోను' అని అంటుంది.

దివ్యను కోడలిని చేసుకోండి
రాజ్యలక్ష్మి మాటలకు లాస్య 'నాకు ఇప్పుడు అర్థమైంది.. దివ్యని దెబ్బ కొట్టే విషయంలో నా హెల్ప్ అడుగుతున్నారు' అంటుంది. దీంతో రాజ్యలక్ష్మి బాగానే గెస్ చేశావు అని అంటుంది. తర్వాత లాస్య కాసేపు ఆలోచించి సంజయ్, ప్రియ మధ్యలో ఉన్న సీన్‌ను విక్రమ్, దివ్యల మధ్య ఊహించుకోండి అంటుంది. అప్పుడు రాజ్యలక్ష్మి ఊహించుకొని సంతోషపడుతుంది. అప్పుడు లాస్య 'మధ్య మధ్యలో మీరు డోస్ పెంచుతూ పోతే.. తను ఎప్పటికీ మీ కాళ్ళ దగ్గర పడి ఉంటుంది. ఇదే కదా మీకు కావాల్సింది. కాబట్టి దివ్యని ఈ ఇంటి కోడల్ని చేసుకోండి' అని సలహా ఇస్తుంది. తర్వాత లాస్య డబ్బు తీసుకుంటూ ఉండగా.. 'దివ్య ను ఈ ఇంటికి కోడలు చేసే వరకు ఆ సూట్‌కేస్‌ను ముట్టుకోవడానికి వీల్లేదు' అని అంటుంది.

రాజ్యలక్ష్మికి నిజం చెప్పేసి
ఆ తర్వాత లాస్య 'మీకు ఒక షాకింగ్ న్యూస్ చెప్పనా? ఆల్రెడీ విక్రమ్ దివ్య ఇద్దరు ప్రేమించుకుంటున్నారు' అనడంతో రాజ్యలక్ష్మి షాక్ అవుతుంది. తర్వాత 'ఈ విషయంలో కోపం తెచ్చుకోకండి. మీ చేతికి మట్టి అంటకుండానే విక్రమ్ మీకు పనికి పూర్తయ్యేలా చేస్తున్నాడు' అంటుంది. దీంతో రాజ్యలక్ష్మి అయిపోయావు దివ్య అనుకుంటూ ఉంటుంది. ఇక, హాస్పిటల్లో విక్రమ్.. దివ్య పేరు చూసి మురిసిపోతూ సంతోషపడుతూ ఆ ఫోటోకి ముద్దు పెడతాడు. తర్వాత అందరికీ చెక్కులు పంచుతాడు. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.


Click it and Unblock the Notifications











