Intinti Gruhalakshmi Today Episode: దివ్యకు ప్రమోషన్.. ప్రామిస్ చేసిన అభి.. ప్రేమ్ కఠిన నిర్ణయం
సుదీర్ఘ కాలంగా తెలుగు బుల్లితెరపై ప్రసారం అయ్యే సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ దక్కుతోందన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా రన్ అవుతున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' గురువారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరు కూడా ఓ లుక్కేయండి మరి!
Photos Courtesy: Star మా and Disney+Hotstar

బుధవారం ఎపిసోడ్‌లో జరిగిందిదే
బుధవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. అభి ఇంటికి వచ్చినందుకు అందరూ సంతోషంగా ఉంటారు. అప్పుడే ప్రేమ్ వచ్చి తనకు అభి గురించి ఎందుకు చెప్పలేదని అందరిపై కోప్పడతాడు. కానీ, అభి మాత్రం ఇంట్లో ఒంటరిగా ఉండి బాధపడుతుంటాడు. అప్పుడు అంకిత వెళ్లి అతడికి ఓ రేంజ్‌లో క్లాస్ పీకుతుంది. మరోవైపు, అభి విషయంలో అందరూ తులసిని పొగుడుతుండగా నందూకు కోపం వచ్చి ఆమెను నిందిస్తాడు. అప్పుడు ప్రేమ్ తండ్రిపై తిరగబడతాడు. అనంతరం పరందామయ్య.. తులసికి సహాయం చేయాలన్న ఉద్దేశంతో ఫ్రెండ్‌ను అప్పు అడుగుతాడు.

ఆఫర్ వద్దన్న ప్రేమ్.. శృతి బాధగా
ఢిల్లీలో ఈవెంట్‌కు రమ్మని ప్రేమ్‌కు ఫోన్ వస్తుంది. కానీ, అతడు మాత్రం వెళ్లడానికి ఇష్టపడడు. దీంతో శృతి 'అదేంటి ప్రేమ్ ఢిల్లీ ఈవెంట్ నీ లైఫ్ ఈవెంట్ అన్నావు. నీ లైఫ్‌ను మార్చుతుంది అన్నావు కదా. మరి చేయను అంటున్నావు ఎందుకు?' అని ప్రశ్నిస్తుంది. దీంతో 'మనిషి అన్నాక చాలా కలలు కంటాడు. అన్నీ జరుగుతాయా' అంటాడు ప్రేమ్. దీనికామె 'ఇప్పుడు నీకొచ్చిన సమస్య ఏంటి' అని అడుగుతుంది. అప్పుడు ప్రేమ్ 'ఇంట్లో సమస్యలనిలా పెట్టుకొని, అమ్మను ఒంటరిగా వదిలేసి మూడు నెలలు ఢిల్లీకి వెళ్లి ఉండటం నా వల్ల కాదు' అంటాడు.

ఆంటీకి నీవల్ల లాభం ఉండదంటూ
శృతి ఈవెంట్ గురించి అడగడంతో ప్రేమ్ మాట్లాడుతూ.. 'నాన్న కూడా తలతిక్కగా ఎలా మాట్లాడారో నువ్వే చూశావు కదా. అంత మంచి పని చేసిన అమ్మ మీద నాన్న నిందలు వేశారు. అప్పుడు తను ఎలా బాధపడిందో నాకే తెలుసు. అందుకే అమ్మను నేనైనా దగ్గరుండి మంచిగా చూసుకుంటాను' అంటాడు. దీంతో 'నువ్వు ఇప్పుడు ఇక్కడ ఉండటం వల్ల ఆంటికి వచ్చే లాభం ఏం ఉండదు ప్రేమ్. నువ్వు శశికళకు ఇవ్వాల్సిన డబ్బును ఎలాగూ తీసుకురాలేవు. చివరకు ఈవెంట్‌ను కూడా వద్దనుకుంటే ఎలా సంపాదిస్తావు' అని వివరిస్తూ చెబుతుంది శృతి.

దివ్యకు ప్రమోషన్.. అంతా సరదాగ
తులసి దగ్గరకు వచ్చిన దివ్య 'అమ్మా.. నేను వంట పనులన్నీ చేశాను. ఇంకా ఏమున్నాయి చెప్పు మొత్తం చేసేస్తా' అంటుంది. దీంతో ముందుగా షాకైపోయిన తులసి ఆ తర్వామ 'నువ్వు ఏంటి తాగిన కప్పు కూడా కడగవు.. ఇవాళ ఏంటి మొత్తం కిచెన్ పనులన్నీ చేస్తున్నావు.. కాకా పడుతున్నావా' అంటుంది. ఇంతలో ప్రేమ్ వస్తాడు. ఇద్దరూ కాసేపు సరదాగా గొడవ పడతారు. ఆ సమయంలో దివ్య పుష్ప సినిమాలోని డైలాగులు చెప్పి అన్నయ్యకు పంచులు వేస్తుంది. ఇంతలో అభి, అంకిత ఇద్దరూ వస్తారు. అప్పుడు తాను వంట చేసినట్లు వాళ్లకు కూడా చెప్తుంది దివ్య.

తల్లి మీద ప్రమాణం చేసేసిన అభి
రెడీ అయి వచ్చిన అభి, అంకిత తమ తమ ఉద్యోగాలకు వెళ్లేందుకు వస్తారు. అప్పుడు అభిని దివ్య తన వంటలు తినాలని చెబుతుంది. కానీ, అతడు మాత్రం 'నేను ఆస్పత్రికి వెళ్తున్నాను. కాబట్టి అవన్నీ తినడం నాకు కుదరదు' అని చెబుతాడు. అప్పుడు దివ్య 'నువ్వు నిజంగానే ఆస్పత్రికి వెళ్తున్నావా? లేక' అని సందేహ పడుతుంది. దీంతో అభి ఫీల్ అవుతాడు. అప్పుడు తులసి దివ్యను కసురుకుంటుంది. అంతలో అభి 'మామ్.. ఈరోజు నుంచి నేను హాస్పిటల్‌కే వెళ్తాను.. ఇంకే పని చేయను. మీ ముందు మామ్ మీద ప్రామిస్ చేసి చెబుతున్నాను' అంటాడు.

మూడీగా శృతి... ఏమైందని అడగ్గా
శృతి.. ప్రేమ్ తీసుకున్న నిర్ణయం గురించే ఆలోచిస్తూ ఉంటుంది. ఆమె నిరాశగా ఉండడం చూసి తులసి.. శృతి దగ్గరికి వెళ్తుంది. ఏమైందమ్మా అలా ఉన్నావు.. ఏం ఆలోచిస్తున్నావు అని అడుగుతుంది. దీనికామె 'కొంతమంది పట్టువిడుపు లేకుండా ఎందుకు అంత మొండిగా వ్యవహరిస్తారు ఆంటి. భార్య చెప్పేది కూడా వినాలి కదా. ప్రతి నిర్ణయంలో భార్య చెప్పేది కూడా వినాలి కదా' అంటుంది. దీంతో తులసి 'భార్యే భర్తకు నచ్చజెప్పుకోవాలి. అయినా మా ప్రేమ్ అలా మొండితనం చేసే రకం కాదు. ఏం జరిగిందో చెప్పు' అంటూ సూటిగానే అడుగుతుంది.

తులసికి చెప్పిన శృతి... అతడిపై
తులసి అడిగినా శృతి చెప్పను అంటుంది. అయినా బలవంతం చేసే సరికి.. 'ఢిల్లీ ఈవెంట్ గురించి ప్రేమ్ ఎన్ని కలలు కంటున్నాడో మీకు తెలుసు కదా. ఇప్పుడు వాళ్లు ఈవెంట్‌కు రమ్మంటే రానని చెబుతున్నాను. ఇంట్లో పరిస్థితులు బాలేవు.. అమ్మ దగ్గర ఉండాలి అంటున్నాడు' అని చెబుతుంది. దీంతో తులసి 'దీనికే నువ్వు టెన్షన్ పడుతున్నావా. నేను వాడిని ఒప్పిస్తానులే.. వాడితో నేను మాట్లాడుతానులే' అంటుంది. ఇంతలో ప్రేమ్ ఇంటికి వస్తాడు. అప్పుడు తులసి 'నువ్వు చేసే పనులు, నువ్వు తీసుకునే నిర్ణయాలు నన్ను నిద్రపోనివ్వడం లేదు' అంటుంది.

నందూ ఎంట్రీతో పెద్ద గొడవగా
ప్రేమ్‌తో తులసి 'ఢిల్లీ ఈవెంట్ వచ్చిందని.. నువ్వు ఈవెంట్‌కు వెళ్లడం లేదని ఎందుకు నాకు చెప్పలేదు. అమ్మ మీద అభిమానం ఉంటే చాలు కానీ.. భవిష్యత్తును పణంగా పెట్టాల్సిన అవసరం లేదు. ఈ అమ్మ నీకు శాశ్వతం కాదు.. నీ భవిష్యత్తు శాశ్వతం. ఈ అమ్మ నీకు అడుగులు నేర్పింది.. తన వెనుక తిరగడానికి కాదు. తన లక్ష్యాన్ని నెరవేర్చుకోవడానికి' అని క్లాస్ పీకుతుంది. అంతలో నందూ వస్తాడు. అప్పుడు ప్రేమ్‌ను తిడతాడు. దీంతో అతడు 'దొరికిన అవకాశాన్ని చేజిక్కించుకొని అందరినీ నట్టేట ముంచేవాళ్లను.. తన దారి తాను చూసుకునే వాళ్లను ఏమంటారో తెలుసా.. నంద గోపాల్ అంటారు' అని అంటాడు. దీంతో నందూ తులసిని తిడతాడు. తనపైకి పిల్లలను ఉసిగొల్పి గొడవలు పెట్టిస్తుందని అంటాడు. ఆ తర్వాత ఇంట్లో శివరాత్రి వేడుకలు జరుగుతుంటాయి. దీంతో అందరూ సంతోషంగా కనిపిస్తారు. ఇలా ఈ ఎపిసోడ్ పూర్తైంది.


Click it and Unblock the Notifications











