Intinti Gruhalakshmi Today Episode: విక్రమ్‌కు దివ్య ఫోన్.. శృతికి తెలిసిన నిజం..దేవుడు మాట్లాడడంతో!
తెలుగు టెలివిజన్‌పై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' శుక్రవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!
Photos Courtesy: Star మా and Disney+Hotstar

గురువారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే
గురువారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. విక్రమ్‌ను వెతుకుతున్న దివ్య దగ్గరకు వెళ్లిన పేషెంట్ తల్లి.. డబ్బు ఇచ్చేశారా అని అడుగుతుంది. అప్పుడామె అతడు దొరకలేదు అని చెబుతుంది. ఆస్పత్రి నుంచి ఇంటికి వచ్చిన విక్రమ్‌ను రాజ్యలక్ష్మితో పాటు అందరూ టెన్షన్ పెడతారు. అంతేకాదు, అతడు ఏదో తప్పు చేసినట్లు మాట్లాడతారు. దీంతో విక్రమ్ భయపడిపోతాడు. అప్పుడు రాజ్యలక్ష్మి అతడిని ఎమోషనల్‌గా బ్లాక్‌మెయిల్ చేస్తుంది. ఇక, దివ్య ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు వెళ్లిన తులసి.. పెళ్లి చూపుల గురించి చెబుతుంది. అంతేకాదు, ఎలాగోలా మాట్లాడి ఆమెను దానికి మాత్రం ఒప్పిస్తుంది.

ఆ విషయం అమ్మకూ చెప్పాను
దివ్య మొబైల్ కోసం వెతుకుతుండగా హ్యాండ్ బ్యాగ్‌లో విక్రమ్ ఇచ్చిన డబ్బులు కనిపిస్తాయి. అప్పుడు దివ్యకు విక్రమ్‌తో జరిగిన గొడవ, ఆమె అన్న మాటలు గుర్తుకు వస్తాయి. అవి తలచుకుని దివ్య నవ్వుకుంటూ ఉంటుంది. అప్పుడే శృతి అక్కడకు వస్తుంది. నవ్వుకుంటున్న దివ్యను చూసి శృతి అలా చూస్తూ ఉంటుంది. దీంతో ఏంటలా చూస్తున్నావని వదినను దివ్య అడుగుతుంది. అప్పుడామె 'పెళ్లి కానీ ఆడపిల్ల అలా శూన్యంలోకి చూస్తూ ఆలోచిస్తూ ఉందంటే మామూలు నవ్వు కాదమ్మా. ఎవరో మనసును కదిలించి ఉండాలి. ఎవరో నీ జ్ఞాపకాలు నుంచి తొంగి చూస్తూ నవ్విస్తుంటే వచ్చే నవ్వు' అని అంటుంది. దీంతో దివ్య 'అదేం లేదు వదిన నువ్వు ఏవేవో మనసులో అనుకోకు. అసలు నాకు మనసులో ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన కూడా లేదు. అదే విషయాన్ని అమ్మకి కూడా చెప్పా' అంటుంది.

లవ్‌లు అలాగే మొదలవుతాయి
ఆ తర్వాత దివ్య 'తప్పనిసరి పరిస్థితుల్లో రేపు పెళ్లి చూపుల్లో కూర్చుంటున్నాను' అని క్లారిటీ ఇస్తుంది. అప్పుడు శృతి ఈ నవ్వు దేనికి మరి అని అడుగుతుంది. దీంతో దివ్య దానికి చిన్న కథ ఉందిలే అంటూ ఆస్పత్రిలో విక్రమ్‌తో జరిగింది మొత్తం వివరిస్తుంది. అప్పుడు శృతి 'నువ్వు నమ్మిన నమ్మకపోయినా ఒక విషయం చెప్తాను. ప్రేమ కథలన్నీ ఇలాగే మొదలవుతాయి. అతను ఎవరో నీతో మాట్లాడడానికి నిన్ను మళ్ళీ కలవడానికి ఇలా రెండు లక్షలు పెట్టుబడి పెట్టాడు' అని చెప్తుంది. దీంతో దివ్య అదేం లేదు అంటుంది. దీంతో శృతి మరి అతడు నీకెందుకు డబ్బిచ్చాడు అని ప్రశ్నిస్తుంది.

విక్రమ్‌కు ఫోన్ చేయాలనుకుని
శృతి కంటిన్యూ చేస్తూ 'ఇప్పుడు డబ్బులు ఇవ్వడానికి నువ్వు అతనికి ఫోన్ చేసినా.. లిఫ్ట్ చేయడు' అని చెబుతుంది. దీంతో దివ్య నిజంగానే లిఫ్ట్ చేయలేదు వదిన అంటుంది. దీనికి శృతి 'అలా నువ్వు పదే పదే ఫోన్ చేస్తూ అతని గురించి ఆలోచిస్తావు' అంటుంది. దీంతో దివ్య అంత లేదు వదిన అనగా.. నీ వైపు నుంచి లేకపోయినా అతని సైడ్ నుంచి ఉంటుంది కదా అంటుంది. అప్పుడు దివ్య 'అతనికి డబ్బులు ఇచ్చే వరకు నేను ఫోన్ చేస్తాను. ఆ తర్వాత అసలు అతని పట్టించుకోను. ఉండు ఇప్పుడే ఆ గురుడికి ఫోన్ చేస్తాను. చేస్తే బాగుంటుందా వద్దులే' అని నిర్ణయాన్ని మార్చుకుంటుంది.

పెళ్లి చూపులు మీకా నాకా అంటూ
ఉదయాన్నే ఇంట్లో అందరూ మౌనంగా ఉండడంతో ఇంతలో లాస్య అక్కడికి వచ్చి 'మీ అందరికీ ఏమైంది? ఈరోజు ఇంట్లో పెళ్లి చూపులు జరుగుతున్నాయి. అందరూ ఇలా ఉన్నారు ఏంటి' అని అడుగుతుంది. ఇంతలోనే నందూ అక్కడకు రావడంతో 'చూశావా? ఇక్కడ ఎవరికి బాధ్యత లేదు అన్నట్టుగా ఎలా కూర్చున్నారో' అని అంటుంది. దీంతో తులసి అలా మాట్లాడకు లాస్య అని అంటుంది. అలా అందరిపై లాస్య కోప్పడగా తులసి సమాధానాలు చెబుతుంది. తర్వాత పెళ్లికూతురు దివ్య అన్నా రెడీ అయిందా అనగా ఫోన్ మాట్లాడుతోంది అని అనసూయ చెప్తుంది. దీంతో ఈ టైంలో ఫోన్ ఏంటి అంటూ తెగ హడావిడి చేస్తుంది. ఇంతలోనే దివ్య అక్కడికి వచ్చి 'చాలా సూపర్ గా రెడీ అయ్యారు. అసలు పెళ్లి చూపులు మీకా నాకా' అని అడగడంతో అందరూ నవ్వుకుంటూ ఉంటారు.

లాస్య ఓవరాక్షన్ చేస్తుండడంతో
దివ్య మాటలకు లాస్య 'నేను మంచిగా కనిపిస్తే.. నువ్వు నాకంటే అందంగా రెడీ అవుతావని. అయినా అలా కాదు దివ్య నా మాట విను వాళ్లు కోటీశ్వరులు' అంటుంది. ఆ తర్వాత తన గురించి తాను పొగుడుతూ మాట్లాడుకుంటూ ఉండగా అందరూ నవ్వుకుంటారు. అప్పుడు నందూ 'స్వీట్లు అవి ఏమి తీసుకుని రావద్దు. నేను ఆల్రెడీ కాజు స్వీట్, బందర్ లడ్డు లాంటిది తెచ్చాను' అనడంతో.. తులసి ఇంట్లో చేస్తున్నాను కదా అని అంటుంది. దీంతో లాస్య 'మాకు తెలుసులే. నువ్వు రవ్వ లడ్డు, బూందీతో సరి పెడతావు' అంటూ ఓవర్ చేస్తుంది. దీంతో అంతా నవ్వుకుంటారు.

విక్రమ్‌ను చూసి తాతయ్య బాధ
దేవుడు బట్టలు ఐరన్ చేయకుండా అలాగే కూర్చుని ఉండగా ఇంతలో విక్రమ్ అక్కడికి వచ్చి కామెడీ చేస్తాడు. ఆ సమయంలో అమ్మగారి చీరలు ఐరన్ చేయడం నావల్ల కావడం లేదు అని దేవుడు అంటాడు. అప్పుడు విక్రమ్ 'ఈ విషయం అమ్మకు తెలిస్తే నీ పని ఏమి అవుతుందో ఊహించుకో' అంటూ భయపెడతాడు. ఆ తర్వాత అతడి పరిస్థితిని చూసి విక్రమ్ స్వయంగా ఐరన్ చేస్తానని అంటాడు. అతడు ఐరన్ చేస్తుండగానే సంజయ్ వస్తాడు. దీంతో విక్రమ్ అతడి షర్ట్ కూడా తీసుకుని చేస్తానంటాడు. ఇదంతా చూసిన విక్రమ్ వాళ్ల తాతయ్య అతడి పరిస్థితికి తనలో తానే బాధ పడతాడు.

విక్రమ్‌కు ఫోన్.. పెళ్లి చూపులతో
పెళ్లి చూపులకు వెళ్లే ముందు శృతి వచ్చి దివ్యను విక్రమ్ గురించి ప్రశ్నిస్తుంది. అప్పుడామె అతడికి ఫోన్ చేయగా.. దేవుడు లిఫ్ట్ చేసి మాట్లాడతాడు. ఆ సమయంలో తనకు విక్రమ్ రెండు లక్షలు ఇచ్చాడని చెప్పగా.. అతడి గొప్పదనం గురించి ఆమెకు వివరిస్తాడు. కానీ, దివ్య అర్థం చేసుకోదు. ఆ తర్వాత ఫోన్ విక్రమ్‌కు ఇవ్వమన్నా ఇవ్వడు. ఆ తర్వాత దివ్యను చూడడానికి పెళ్లి వాళ్లు అక్కడకు వస్తారు. దీంతో లాస్య ఎంతగానో ఓవర్ చేస్తుంది. అంతేకాదు, తన గొప్పలు తాను చెప్పుకుంటూ ఉంటుంది. అది చూసి ఇంట్లో వాళ్లంతా నవ్వుకుంటారు. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.


Click it and Unblock the Notifications











