Intinti Gruhalakshmi Today Episode: పెళ్లి చూపుల్లో రచ్చ.. రాజ్యలక్ష్మికి షాక్.. విక్రమ్ సీరియస్

ఇండియాలో చాలా భాషలు ఉన్నా.. తెలుగు టెలివిజన్‌పై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' శనివారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!
Photos Courtesy: Star మా and Disney+Hotstar

శుక్రవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

శుక్రవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే


శుక్రవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. విక్రమ్ మాటలను గుర్తు చేసుకుని దివ్య నవ్వుతూ ఉండగా.. శృతి అక్కడకు వెళ్లి ఆమెను ఆట పట్టిస్తుంది. దీంతో జరిగిందంతా ఆమెకు వివరిస్తుంది. ఆ తర్వాత దివ్య పెళ్లి చూపులకు రెడీ అవుతుంది. ఆ సమయంలో లాస్య యమ ఓవర్ యాక్షన్ చేయడంతో అందరూ నవ్వుకుంటూ ఉంటారు. మరోవైపు, విక్రమ్ తన తల్లి చీరను ఐరన్ చేస్తుంటాడు. తర్వాత సంజయ్ కూడా వచ్చి షర్ట్ ఇస్తాడు. అప్పుడు అతడి పరిస్థితిని చూసిన తాతయ్య.. విక్రమ్ గురించి బాధ పడుతుంటాడు. ఇక, పెళ్లి వాళ్లు రావడంతో తులసి ఇంట్లో సందడి వాతావరణం కనిపిస్తుంది.

 ఇష్టం లేకుండానే పెళ్లి చూపులు

ఇష్టం లేకుండానే పెళ్లి చూపులు


దివ్యను రెడీ చేస్తోన్న సమయంలో తులసి నీ అనుభూతికి ఎవరు అడ్డొచ్చారు అని ప్రశ్నిస్తుంది. దీంతో దివ్య 'ఇది నాకు ఇష్టమైన పెళ్లి చూపులు కాదు కదా. బలవంతపు పెళ్లి చూపులు' అని చెబుతుంది. దీంతో తులసి 'జీవితంలో అన్నీ అనుకున్నట్టుగా జరగవు. పెళ్లిచూపులో కూర్చున్నప్పుడు నిర్ణయం తీసుకుని కూర్చోవద్దు. కూర్చున్నాక నిర్ణయం తీసుకో. సర్లే వెళ్ళాం పదా' అని దివ్యను అక్కడి నుంచి పిలుచుకొని వెళ్తుంది. అప్పుడే లాస్య.. నందూ ముందర దివ్యను ఇంకా తీసుకు రావట్లేదని తులసిని తిడుతుంటుంది. అంతలోనే తులసి ఆమెను అక్కడకు తీసుకుని వస్తుంది.

 దివ్య, నేను క్లోజ్ ఫ్రెండ్స్ అంటూ

దివ్య, నేను క్లోజ్ ఫ్రెండ్స్ అంటూ


తులసి వెంట దివ్య రాగానే పెళ్ళికొడుకు వాళ్ళు అలాగే చూస్తూ ఉంటారు. అప్పుడు దివ్య అతడిని చూసి నవ్వుతూ పలకరించినా.. చూసి చూడకుండా మొబైల్ ఫోన్ వైపు చూస్తూ ఉంటాడు. అప్పుడు లాస్య 'మా ఇంటి అమ్మాయి అని చెప్పుకోవడం కాదు కానీ దివ్య బుద్ధిమంతురాలు పనిమంతురాలు. మేమిద్దరం చాలా క్లోజ్ ఫ్రెండ్స్‌గా ఉంటాం. తను ఏ విషయం అయినా నాతోనే పంచుకుంటుంది. మీ అబ్బాయి మా ఇంటి అల్లుడు అవడం ఎంత అదృష్టమో.. మా అమ్మాయి మీ ఇంటికి కోడలు అవ్వడం కూడా అంతే అదృష్టం' అంటూ ఓవరాక్షన్ చేస్తుంది. అప్పుడు తులసి, దివ్య ఒకరి వైపు ఒకరు చూసుకుని నవ్వుకుంటూ ఉంటారు.

 మగాన్ని నాకేం అభ్యంతం అని

మగాన్ని నాకేం అభ్యంతం అని


పెళ్లి చూపుల్లో దివ్య నేను అబ్బాయితో విడిగా మాట్లాడాలి అంటుంది. దీంతో లాస్య 'విడిగా మాట్లాడటానికి ఏముంది. ఏమైనా అడగాలని ఉంటే మాముందే అడుగు' అంటుంది. దీంతో లేదు నేను పర్సనల్‌గా మాట్లాడాలి అని అంటుంది. అప్పుడు తులసి బాబు నీకేమైనా అభ్యంతరమా అని అడుగుతుంది. దీంతో అతడు 'మగాన్ని నాకేం అభ్యంతరం ఉంటుంది' అనడంతో అందరూ ఆశ్చర్యపోతారు. ఇప్పుడు దివ్య, అతడు కలిసి మాట్లాడుకోవడానికి వెళ్తారు. అప్పుడు దివ్య ఏదైనా అడగాలి మాట్లాడాలి అనుకుంటున్నారా అనడంతో అడిగింది మీరు మీరు మాట్లాడండి అంటాడు.

సంబంధం ఇష్టం లేదన్న దివ్య

సంబంధం ఇష్టం లేదన్న దివ్య

పెళ్లి కొడుకుతో మాట్లాడుతోన్న సమయంలో దివ్య 'ఈ పెళ్లి సెట్ అవుతుందని మీరు అనుకుంటున్నారా' అని దివ్య అడగ్గా.. అతడు నాకేం తక్కువ నన్ను ఎందుకు రిజెక్ట్ చేస్తారు అని ప్రశ్నిస్తాడు. అంతేకాదు, 'భర్తగా నేను సంపాదిస్తాను. నువ్వు భార్యగా పిల్లలను చూసుకుంటూ ఇంటి బాధ్యతలను చూసుకుంటే చాలు' అని చెబుతాడు. దీంతో దివ్య సరే వెళ్దాం పదండి అని అంటుంది. తర్వాత దివ్య పెళ్ళికొడుకు లోపలికి వెళ్తుంది. అప్పుడు మీరు ఓకే అంటే నాకు ఓకే మమ్మీ అని పెళ్ళికొడుకు అనడంతో అందరూ నవ్వుకుంటూ ఉంటారు. కానీ, దివ్య మాత్రం నాకు ఒకే కాదు. ఈ సంబంధం నాకు ఇష్టం లేదు అని షాకిస్తుంది. తర్వాత లాస్య కవర్ చేసే ప్రయత్నం చేయగా.. 'పెళ్లి తర్వాత భార్యకి ఎటువంటి స్థానాన్ని ఇవ్వాలో తెలియని వాడికి నేను లైవ్ పార్ట్నర్‌గా వెళ్ళలేను నాన్న. అతను నాకంటే మొబైల్ ఫోన్ వైపే ఎక్కువగా చూస్తున్నాడు' అని అంటుంది.

తులసిపై చిందులేసిన లాస్య

తులసిపై చిందులేసిన లాస్య


దివ్య తర్వాత వాళ్లకు దండం పెట్టి వెళ్లిపోమంటుంది. దీంతో వాళ్లు వెళ్లిపోతారు. ఆ సమయంలో నందూ, లాస్య వాళ్లను బ్రతిమాలుతుండగా.. తులసి మాత్రం సంతోషంగా ఉంటుంది. అప్పుడు లాస్య కోపంగా వచ్చి 'దివ్య కాళ్ల వరకు వచ్చిన బంగారం లాంటి సంబంధాన్ని కాదని జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావా. మనం ఇంతలా టెన్షన్ పడుతున్నా ఆవిడ గారి ముఖంలో టెన్షన్ లేదు చూసావా నందూ' అంటుంది. దీంతో తులసి 'ప్రతి దానికి నన్ను నిందించడం నీకు అలవాటు అయిపోయింది. నా కూతురు పెళ్లి సంబంధాన్ని నేను ఎందుకు చెడగొట్టుకుంటాను' అని తిరగబడుతుంది. అప్పుడు లాస్య నీ వల్లే దివ్య పెళ్లికి ఒప్పుకోలేదు అని తులసిని నిందిస్తుంది. దీంతో దివ్య కలగజేసుకుని వివరణ ఇస్తుంది. అయినప్పటికీ లాస్య మాత్రం తులసినే అంటుంది.

 రాజ్యలక్ష్మికి షాకిచ్చిన మామ

రాజ్యలక్ష్మికి షాకిచ్చిన మామ


రాజ్యలక్ష్మి తన కొత్త హాస్పిటల్ కన్స్ట్రక్షన్ గురించి ఇంట్లో వాళ్లకు చెబుతూ.. ఒక వ్యక్తిని పరిచయం చేస్తుంది. అప్పుడు విక్రమ్ వాళ్ళ తాతయ్య 'ఇప్పటికే ఉన్న హాస్పిటల్ చూసుకోవడం సరిపోలేదు. ఇంకొకటి అవసరమా' అని ప్రశ్నిస్తాడు. దీంతో ఆమె నేను మన కుటుంబం కోసమే ఆలోచిస్తున్నాను అని అంటుంది. దీనికాయన 'ఒకసారి నీ భర్తతో నువ్వు చివరగా ఎప్పుడు మాట్లాడావు గుండెల మీద చేయి వేసుకొని ఆలోచించుకో' అంటాడు. దీంతో రాజ్యలక్ష్మి బ్రదర్ మాట్లాడడంతో ఆయన గట్టిగా బుద్ధి చెబుతాడు. తర్వాత విక్రమ్ అక్కడికి రావడంతో అందరూ కలిసి భోజనం చేద్దాము అనగా కింద కూర్చుంటాడు. అది చూసిన కొత్త వ్యక్తి షాక్ అవుతాడు.

విక్రమ్ సీరియస్.. దివ్య సారీ

విక్రమ్ సీరియస్.. దివ్య సారీ


విక్రమ్ తాతయ్య రాజ్యలక్ష్మిపై ఫైర్ అవడంతో వాళ్ల సోదరుడు వచ్చి మాట్లాడుతుంటాడు. అప్పుడు విక్రమ్ వాళ్ళ తాతయ్య తన కొడుకు గురించి బాధపడుతూ 'వాడు పక్షవాతం వచ్చి మూలన పడ్డాడు. వాడి గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు' అంటాడు. అప్పుడు రాజ్యలక్ష్మి కావాలనే విక్రమ్ వాళ్ళ తాతయ్యను చెడుగా చూపించడం కోసం భోజనం చేయకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు విక్రమ్ వాళ్ళ తాతయ్య మీద సీరియస్ అవుతాడు. మరొకవైపు దివ్య తులసిని హత్తుకుని సారీ చెబుతుంది. దీంతో తులసి ఆమెకు ధైర్యం చెప్పి ఓదార్చుతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X