Intinti Gruhalakshmi Today Episode: ఇంట్లో నుంచి వెళ్లిపోయిన ప్రేమ్.. దీని వెనుక తులసి మాస్టర్ ప్లాన్

మిగిలిన భాషలతో పోల్చుకుంటే తెలుగు బుల్లితెరపై ప్రసారం అయ్యే సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ దక్కుతోందన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా రన్ అవుతున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' శనివారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరు కూడా ఓ లుక్కేయండి మరి!

Photos Courtesy: Star మా and Disney+Hotstar

 శుక్రవారం ఎపిసోడ్‌లో జరిగిందిదే

శుక్రవారం ఎపిసోడ్‌లో జరిగిందిదే

శుక్రవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. తులసి కుటుంబం మొత్తం మహాశివరాత్రి పండుగను ఎంతో సరదాగా జరుపుకుంటుంది. కానీ, లాస్య, నందూ మాత్రం చాలా ఆలస్యంగా నిద్ర లేస్తారు. దీంతో పరందామయ్య వాళ్లపై విసుక్కుంటాడు. ఆ తర్వాత లాస్య రెడీ అయి వచ్చి పనులు చేయాలని చూసినా ఎవరూ సహకరించరు. దీంతో లాస్య మాత్రం అవమానంగా భావించి నందూను రెచ్చగొడుతుంది. దీంతో అతడు కుటుంబంతో వాదనకు దిగుతాడు. అసలు ఇంట్లో వాళ్లకు తులసి ముఖ్యమా? లాస్య ముఖ్యమా అని అడుగుతాడు. దీంతో ప్రేమ్ అతడితో గొడవకు దిగుతాడు.

తులసిపై నిందలు వేసేసిన లాస్య

తులసిపై నిందలు వేసేసిన లాస్య

నందూను ఇంట్లో వాళ్లకు దూరం చేస్తున్నావని తులసిపై లాస్య నింద వేస్తుంది. అప్పుడు తులసి నోరు అదుపులో పెట్టుకోమని వార్నింగ్ ఇస్తుంది. ప్రేమ్ కూడా స్పందిస్తూ ‘మా అమ్మ గురించి ఇంకో మాట ఎక్కవ మాట్లాడినా బాగుండదు' అంటాడు. దీంతో లాస్య ‘అంటాను.. ఏం చేస్తావు. మీ అమ్మ మనసులో కుళ్లు కుతంత్రాలు పెట్టుకుంది. మీ అమ్మ ఎన్ని చేసిందో తెలుసా. అంకితను తన పుట్టింటికి దూరం చేసింది. అభిని అత్తారింటికి దూరం చేసింది.. అది కేవలం తన స్వార్థం కోసమే. చివరకు నిన్ను కూడా అనాధకు ఇచ్చి పెళ్లి చేసింది. కోడలు కాదు.. కూతురు అంటూ నాటకం ఆడి మామయ్య గారితో ఇల్లు రాయించుకుంది' అంటూ ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతుంది.

ప్రేమ్ సీరియస్.. నందూ ఆగ్రహం

ప్రేమ్ సీరియస్.. నందూ ఆగ్రహం

లాస్య అంతటితో ఆగకుండా ‘అసలు శశికళతో కూడా ఏదో కుమ్మక్కయినట్టు ఉంది. లేకపోతే నిజంగానే అంత వడ్డీ అయిందా' అని అంటుంది. దీంతో ప్రేమ్ కోపంతో లాస్యను కొట్టబోతాడు. అప్పుడు నందూ ‘నా భార్య మీదే చేయి లేపుతావా' అంటూ ప్రేమ్‌ను కొడతాడు. దీంతో అతడు నందూ చొక్కాను పట్టుకుంటాడు. ఇలా ఇద్దరూ బాహాబాహీకి దిగుతారు. అప్పుడు తులసి ‘ప్రేమ్.. వద్దురా.. కన్నతండ్రి చొక్కానే పట్టుకుంటావా. ఇదేనా నువ్వు నేర్చుకున్నది' అంటూ చెంపపై కొడుతుంది. అంతేకాదు, వెంటనే శృతితో సహా ఇల్లు వదిలి వెళ్లిపోమని తులసి ఆదేశిస్తుంది.

 తులసిని ఎంతో బ్రతిమాలిన ప్రేమ్

తులసిని ఎంతో బ్రతిమాలిన ప్రేమ్

ఇంట్లో నుంచి వెళ్లిపోమని అనగానే ప్రేమ్ ‘ఒక్కసారి నా కళ్లలోకి చూసి చెప్పు అమ్మ. నిజంగానే ఈ బిడ్డను వదిలి వెళ్లిపో అంటున్నారా' అంటాడు. దీంతో ‘అవును.. అవును.. అవును.. నిజంగానే వెళ్లిపోవాలంటున్నాను' అంటుంది తులసి. అప్పుడు అనసూయ ‘తులసి.. ఏదో ఆవేశంలో మాటా మాటా అనుకున్నంత మాత్రాన కొడుకును ఇల్లు వదిలేసి వెళ్లిపోమంటున్నావా. అసలు వాడిని చూడకుండా నువ్వు ఉండగలవా' అని అడుగుతుంది అనసూయ. దీనికి ఉండగలను అంటుంది. అప్పుడు ప్రేమ్ ‘కానీ.. నేను నిన్ను చూడకుండా ఉండలేనమ్మా. నీ కాళ్లు పట్టుకుంటానమ్మా.. అలా మాట్లాడకు. ఇంకెప్పుడు ఇలాంటి పొరపాట్లు చేయను.. నన్ను క్షమించు అమ్మ' అంటాడు.

చావుతో సమానమన్నా వినకుండా

చావుతో సమానమన్నా వినకుండా

ఎంత బ్రతిమాలినా తులసి వినకపోవడంతో ప్రేమ్ ‘నీ నుంచి దూరంగా వెళ్లడం అంటే నాకు చావుతో సమానం అమ్మా' అని అంటాడు. అప్పుడు తులసి ‘దయచేసి ఎవ్వరూ ఈ విషయంలో జోక్యం చేసుకోవద్దు. నేను ఎవ్వరి మాటా వినను. కాదూ కూడదు అంటే చెప్పండి. నేనే ఈ ఇంట్లోంచి వెళ్లిపోతాను. వెళ్లిపో.. వెళ్లిపో ఇక్కడి నుంచి' అంటుంది. దీంతో శృతిని తీసుకొని ప్రేమ్ బయటికి వెళ్లిపోతాడు. కొడుకు, కోడలు ఇంట్లో నుంచి బయటికి వెళ్లిపోగానే.. తులసి వెక్కి వెక్కి ఏడుస్తుంది. అయితే, వెళ్లొద్దు అంటూ అందరూ ఆపినా కూడా ప్రేమ్, శృతి మాత్రం వెళ్లిపోతారు.

నందూను బాగా రెచ్చగొట్టిన లాస్య

నందూను బాగా రెచ్చగొట్టిన లాస్య

ప్రేమ్, శృతి ఇంట్లో నుంచి వెళ్లిపోయిన తర్వాత లాస్య ‘ఇప్పటికైనా తెలిసిందా నందూ.. తులసి ఒరిజినాలిటీ ఏంటో' అంటూ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది. అప్పుడు నందూ ‘తులసి ఏం తప్పు చేసింది.. ప్రేమ్ నాకు ఎదురు తిరిగాడు అని చెప్పి ఇంట్లో నుంచి బయటకు పంపించేసింది. తను చేసింది మంచి పనే కదా' అంటాడు. దీనికి లాస్య ‘ఇంతకుముందు ప్రేమ్ ఎప్పుడూ తప్పులు చేయలేదా. నిన్ను ఎదిరించి మాట్లాడలేదా. మరి తులసికి అప్పుడు రాని కోపం ఇప్పుడు ఎందుకు వచ్చింది. తులసి స్వార్థం ఇది. గుడ్డిగా తులసిని నమ్మకు. తులసి నిజ స్వరూపం తెలుసుకొని ఇంట్లో వాళ్లకు చెప్పు' అంటుంది. దీంతో అతడు తులసి ఆటలు ఇక సాగనీయను అంటాడు.

తులసిని అపార్థం చేసుకోవడంతో

తులసిని అపార్థం చేసుకోవడంతో

ప్రేమ్ ఇల్లు వదిలి వెళ్లిపోగానే అందరూ ఏడుస్తుంటారు. అప్పుడు పరందామయ్య దగ్గరకు వచ్చిన తులసి ‘నేను అంత రాక్షసురాలిగా కనిపిస్తున్నానా' అని అడుగుతుంది. దీనికాయన ‘కాదు తులసి. లాస్య రెచ్చగొట్టడం వల్ల వాడు తన మీదకి చేయి లేపాడు. నీకు అంతలా వాడిని శిక్షించాలంటే వాడిని రెండు చెంపదెబ్బలు కొట్టాల్సింది' అంటాడు. అప్పుడు తులసి ‘నేను వాడికి వేసిన శిక్ష కాదు. నాకు నేను వేసుకున్న శిక్ష. నన్ను ఎవరు అపార్థం చేసుకున్నా నేను పట్టించుకునేదాన్ని కాదు.

కానీ.. నా మనసు తెలిసిన మీరు కూడా ఇలా మాట్లాడటం నేను తట్టుకోలేకపోతున్నా. నేను ప్రేమ్‌ను ఇంట్లో నుంచి బయటకు పంపించింది.. లాస్యను ఎదిరించాడనో.. తండ్రి చొక్కా పట్టుకున్నాడనో కాదు' అంటుంది.

Recommended Video

Best Telugu TV Serials In 2020 | కార్తీక దీపం హవా..!!
మామకు నిజం చెప్పేసిన తులసి

మామకు నిజం చెప్పేసిన తులసి

తులసి వివరిస్తూ.. ‘జీవితం విలువ వాడు తెలుసుకోవాలని నేను వాడికి ఈ శిక్ష విధించాను. వాడిని ఇంట్లో నుంచి పంపించడానికి దొరికిన అవకాశాన్ని వాడుకున్నాను. ఇది వాడిని శిక్షించడం కాదు మామయ్యా.. వాడి జీవితంలో గెలవాలని ఆశ. వాడు బాగుపడతాడని నమ్మకం. ఈ నిజాన్ని మీకు తప్ప ఇంకెవరికీ చెప్పుకోలేను. వాడి మీద నాకు ఉన్న కోపానికి కారణం ఉంది. వాడి మీద నేను పెట్టుకున్న నమ్మకంలో ప్రేమ ఉంది.

తల్లిగా వాడి మీద బాధ్యత ఉంది. ఇప్పుడు చెప్పు మామయ్య నేను చేసింది తప్పా' అంటుంది. దీనికాయన ‘నువ్వు చేసింది తప్పు కాదమ్మా.. నేను తొందరపడి తప్పుగా మాట్లాడాను. కానీ.. ప్రేమ్ కూడా నాలాగే నిన్ను అపార్థం చేసుకుంటాడేమో అనుకుంటున్నా' అంటాడు. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X