Intinti Gruhalakshmi Today Episode: లాస్య మోసం బయట పెట్టిన తులసి.. ప్రేమ విషయం చెప్పేసిన విక్రమ్
తరాలు మారుతున్నా.. తెలుగు టెలివిజన్‌పై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.
దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' సోమవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!
Photos Courtesy: Star మా and Disney+Hotstar

శనివారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే
శనివారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. ఎలాగోలా పెళ్లి చూపుల కోసం దివ్యను రెడీ చేసి తులసి తీసుకు వస్తుంది. ఒకరిని ఒకరు చూసుకున్న తర్వాత పెళ్లి కొడుకుతో మాట్లాడతానని దివ్య అంటుంది. దీనికి అతడు కూడా ఒప్పుకోవడంతో ఇద్దరూ మాట్లాడతారు. కానీ, అతడి మాటలతో దివ్యకు కోపం వస్తుంది.
ఆ వెంటనే లోపలికి వచ్చిన తర్వాత తనకు పెళ్లి ఇష్టం లేదని చెప్తుంది. దీంతో తులసిని లాస్య నిందిస్తుంది. మరోవైపు, రాజ్యలక్ష్మికి విక్రమ్ తాతయ్య షాక్ ఇస్తాడు. దీంతో ఆమె అన్నం తినడం మానేస్తుంది. అప్పడు విక్రమ్ తాతపై కోప్పడడంతో రాజ్యలక్ష్మి సంతోషిస్తుంది.

దివ్య నిర్ణయంపై తులసి హ్యాపీ
పెళ్లి సంబంధం చెడిపోయిన తర్వాత తల్లికి దివ్య వివరణ ఇస్తుంది. 'అది కాదమ్మా అమ్మకు సంబంధం లేదని చెప్పాను. అప్పుడైనా లాస్య ఆంటీ రియలైజ్ అవ్వాలి కదా' అని అంటుంది. దీంతో తులసి 'నాకు తాళి కట్టిన భర్తనే లాక్కుంది. అంతకంటే పెద్ద తప్పు ఉంటుందా? ఆ విషయంలోనే తను ఇప్పటివరకు రియలైజ్ అవ్వలేదు. మాట వరసకు కూడా నాకు సారీ చెప్పలేదు. అది తన వ్యక్తిత్వం' అని అంటుంది. దీంతో దివ్య 'అవన్నీ పక్కన పెట్టు పెళ్లి సంబంధం విషయంలో నేనేమైనా తొందరపాటు నిర్ణయం తీసుకున్నానా' అని అడగ్గా తులసి అమ్మ జీవితాన్ని చూసి చాలా నేర్చుకున్నావు అని అంటాను అంటుంది.

దివ్య క్యారెక్టర్ అలాంటిది అని
ఆ తర్వాత తులసి 'నాకు నీలో నచ్చిన విషయం ఏమిటంటే.. నీకు ఏం కావాలో నీకు క్లారిటీ ఉంది. కావాల్సిన దాన్ని ఎలా సంపాదించుకోవాలో ఆలోచన ఉంది. ఏ విషయం అయినా పైకి చెప్పే ధైర్యం ఉంది. ఇవి చాలమ్మా నిన్ను ఎవరు ప్రభావితం చేసి వారి చేతిలోకి తీసుకోలేరు' అని అంటుంది. దీంతో దివ్య 'అప్పట్లో నిన్ను నాన్న ఎలా ఏడిపించారో నాకు తెలుసమ్మా.
కానీ నాన్నంటే ప్రేమ గౌరవం. ఎందుకంటే తను మా నాన్న కాబట్టి. ఆయన వల్ల బాధ అనుభవించిన నువ్వే అంత కోపంగా లేవు అంటే నేను కోప్పడడంలో అర్థం లేదని మౌనంగా ఉన్నానమ్మా' అని వివరిస్తుంది.

తనతో ఎందుకు విడిపోయావు
పెళ్లి సంబంధం క్యాన్సిల్ అవడంతో లాస్య కోపంగా అటు ఇటు తిరుగుతూ ఉండగా అక్కడికి నందూ వస్తాడు. అప్పుడామెతో 'దివ్యకు ఇష్టం లేకపోయినా.. మనకోసం తులసి తనను రిక్వెస్ట్ చేసింది' అంటుంది. దీంతో లాస్య 'ఇలాగే నాటకాలు ఆడి మిమ్మల్ని మాయ చేస్తోంది. మిమ్మల్ని అందరిని మోసం చేస్తోంది. ఇంతకు ముందు దివ్యతో పెళ్లి సంబంధం నో అని చెప్పు అని తనని ఫుల్లుగా ప్రిపేర్ చేసింది' అని అంటుంది.
దీంతో నందూ 'ఒకటి గుర్తు పెట్టుకో ఎవరి మెప్పు పొందడానికి తులసి అలాంటి పనులు చేయదు. తనతో పాతికేళ్ళు కాపురం చేశాను' అంటాడు. అప్పుడు లాస్య 'ఓహో అంత మంచిదైతే డివోర్స్ ఎందుకు ఇచ్చావు? ఇంకో పాతికేల్లు కాపురం చేయాల్సింది కదా' అంటూ అక్కడి నుంచి కోపంగా వెళుతుండగా నందూ ఆగు అని అంటాడు.

ఆ పొరపాటు మళ్లీ చేయనంటూ
లాస్య మాటలతో నందూ 'ఆ విషయం గురించి కూడా మాట్లాడదాం. నీకు నచ్చినప్పుడు అలాగా అవసరం ఉన్నప్పుడు ఒకలాగా మాట్లాడకు. అతడు దివ్యకే సూట్ కాడనే అనుకుంది. అందుకే రిజెక్ట్ చేసింది' అని అంటాడు. దీంతో లాస్య 'ఒక్క ప్రశ్నతో ఇతను కరెక్ట్ కాదని ఎలా నిర్ణయించుకుంటుంది? నువ్వు కూడా ఆ దివ్యకే సపోర్ట్ చేస్తున్నావా' అని అడుగుతుంది. దీంతో నందూ ' ఈ సంబంధం కాకపోతే ఇంకొక సంబంధం వస్తుంది. ఈ కూతురు పోతే ఒక కూతురు వస్తుందా? అది నాతో కూడా మాట్లాడకపోతే నేనేం చేయాలి' అంటాడు.
అప్పుడు లాస్య 'ఇలాంటి ఆస్తిపరుల సంబంధం మళ్లీ మళ్లీ వస్తుందా? ఈ పెళ్లి జరిగి ఉంటే నీకు కూడా లాభం కలిగేది కదా' అని అంటుంది. దీంతో నందూ 'ఒకప్పుడు ప్రేమ్ విషయంలో ఇలాంటి పొరపాటు చేశాను. ఇప్పుడు మళ్ళీ అలా చేయను' అని వెళ్లిపోతాడు.
ప్రేమ విషయం చెప్పిన విక్రమ్
విక్రమ్.. దివ్యని తలుచుకుని సంతోషపడుతూ ఉండగా ఇంతలో అక్కడికి వాళ్ళ మామయ్య తాగి వచ్చి విసిగిస్తూ ఉంటాడు. అంతేకాదు, ఎవరా అమ్మాయి అనడంతో ఎవరి గురించి మాట్లాడుతున్నావు అని విక్రమ్ ప్రశ్నిస్తాడు. దీంతో బసవయ్య మనసు పోగొట్టుకున్న వాళ్ళ మొఖం ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు అల్లుడు అని అంటాడు. మామకు తెలిసిపోయిందనుకున్న విక్రమ్ మొత్తం చెప్పేస్తాడు. తర్వాత నేను అమ్మాయికి దగ్గర అవ్వాలంటే ఏం చేయాలి అని విక్రమ్ అడగడంతో వెటకారంగా సలహాలు ఇస్తాడు. తర్వాత విక్రమ్‌కు దివ్య కాల్ చేయగా బసవయ్య లిఫ్ట్ చేసి తింగరిగా మాట్లాడి కాల్ కట్ చేస్తాడు.

అతడికి సారీ.. గొడవ పడుతూ
తులసితో షాపింగ్ మాల్‌కు వెళ్లి వస్తుండగా 'ఎందుకమ్మా నేను సంపాదిస్తున్న కదా నీ డబ్బులతో ఎందుకు తీసించావు' అని దివ్య అంటుంది. దీనికామె '22 ఏళ్లు పెంచిన నా కూతురు నీ డబ్బు నా డబ్బు అని మాట్లాడడంతో నాకు బాధగా ఉంది' అని అంటుంది. అంతలో అక్కడికి అజయ్ (దివ్యను చూడ్డానికి వచ్చిన అబ్బాయి) వస్తాడు. అతడిని ఆపిన తులసి సారీ అని అంటుంది. దీంతో అజయ్ సారీ ఎవరు అడిగారు అంటాడు. దీంతో తులసి 'పెళ్లిచూపులు విషయంలో జరిగిన దానికి బాధపడుతున్నారని సారీ చెబుదాం అనుకున్నాను' అంటుంది. దీంతో అతడు 'మీరు తప్పుగా అనుకుంటున్నారు. పెళ్లి చూపులు క్యాన్సిల్ అయినందుకు సంతోషపడుతున్నాను పండగ చేసుకుంటున్నాను. అయినా మీ అమ్మాయి ఏమైనా ఎలిజిబెత్ రాణినా లేక మిస్ యూనివర్సా' అని మాట్లాడగా తులసి కోప్పడుతుంది.

లాస్య మోసం బయట పెట్టాడు
ఆ తర్వాత అజయ్ 'మొదటి పెళ్ళానికి విడాకులు ఇచ్చి ఏదో ఎంజాయ్ చేస్తుంటే ఈ లాస్య వెంటపడి నన్ను వేధించింది. అందుకే ఈ పెళ్లి చూపులకు ఓకే చేశాను' అని మోసం బయట పెడతాడు. దీంతో తులసి మళ్లీ ప్రశ్నించగా అతడు 'అవును పెళ్లయింది. రెండో పెళ్లికి కాబట్టే మీకు ఓకే చేశాను. లేదంటే మా ఆస్తిలో మా కాలు గోటికి కూడా మీరు సరిపోరు' అంటడు. దీంతో తులసి, దివ్య కోపంగా ఇంటికి వెళ్తారు. అప్పుడు లాస్యను పిలిచి అడగ్గా.. ఆమె నందూ కూడా రెండో పెళ్లి చేసుకున్నాడని మాట్లాడుతుంది. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.


Click it and Unblock the Notifications











