Intinti Gruhalakshmi: విక్రమ్ గురించి తులసికి నిజం చెప్పిన దివ్య.. పెళ్లికి రాజ్యలక్ష్మి ఏర్పాట్లు

భారతదేశంలోని చాలా భాషల కంటే తెలుగు టెలివిజన్‌పై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.

దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' మంగళవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!

Photos Courtesy: Star మా and Disney+Hotstar

సోమవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

సోమవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

సోమవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. పెళ్లి చూపులు క్యాన్సిల్ అయిన తర్వాత ఏదైనా తప్పు చేశానా అని దివ్య.. తులసిని అడుగుతుంది. దీంతో ఆమె కూతురు నిర్ణయాన్ని గౌరవించడంతో పాటు ఆమె తెగువను కొనియాడుతుంది. అదే సమయంలో నందూ ముందు లాస్య తులసిని తిడుతుంది. దీంతో నందూ ఆమెకు క్లాస్ పీకుతాడు.

మరోవైపు, విక్రమ్ తన మనసులోని మాటను మామయ్య చెప్పుకుంటాడు. ఇక, దివ్యను చూడ్డానికి వచ్చిన పెళ్లి కొడుకు తనకు గతంలో పెళ్లి అయిందని, లాస్య బలవంతం చేయడంతోనే పెళ్లి చూపులకు వచ్చానని చెప్పి షాకిస్తాడు. దీంతో తులసి లాస్యతో గొడవ పడుతుంది.

లాస్యకు గట్టి క్లాస్ ఇచ్చిన తులసి

లాస్యకు గట్టి క్లాస్ ఇచ్చిన తులసి

లాస్య ప్లాన్ తెలుసుకుని తులసితో పాటు ఇంట్లో వాళ్లందరూ గొడవ చేస్తుంటారు. అప్పుడు లాస్య 'ఏ రెండో పెళ్లి చేసుకుంటే తప్పేంటి' అంటూ ఏదేదో చెబుతుంది. దీంతో తులసి 'అది కాదు ప్రశ్న. నువ్వు నిజం ఎందుకు దాచి పెట్టావు' అని లాస్యను సూటిగా ప్రశ్నిస్తుంది. అప్పుడు దివ్య 'ఎందుకంటే వ్యాపారంలో లాభం కోసం.. వాళ్ల కెఫేలో సగం వాటా కోసం నన్ను అమ్మేయాలని చూసింది' అని అంటుంది.

అప్పుడు ప్రేమ్ 'అందుకే మనళ్లందరినీ పెళ్లిచూపులు అంటూ తొందర పెట్టింది' అంటాడు. దీంతో లాసయ ఆగు ప్రేమ దివ్య అని మంచి కోసమే నీ కెరియర్ కోసమే నేను అదంతా చేశాను అంటుంది.

లాస్యను కొట్టమని చెప్పిన నందూ

లాస్యను కొట్టమని చెప్పిన నందూ

లాస్య మాటలతో నందూ ఏంటి నువ్వు చేసిన మంచి అని అడుగుతాడు. దీంతో లాస్య 'నువ్వు కూడా అలా మాట్లాడతావ్ ఏంటి నందూ? వాళ్లు కోటీశ్వరులు నాలుగు తరాలు అయినా కూర్చుని తినే అంత ఆస్తి ఉంది. మన దివ్య ఆ ఇంటి కోడలు అయితే ప్రిన్సెస్‌లా బతికేయొచ్చు. కన్నతల్లిని కన్నతల్లిని అని చెప్పుకుంటూ తిరగడం కాదు.. కూతురికి నాలుగు మంచి మాటలు నేర్పించు. నీలాగా సూక్తులు నేర్పించి దాని జీవితం నీ జీవితం లాగా తయారు చేయకు' అంటుంది.

దీంతో తులసి కోపంతో లాస్యని కొట్టబోతుంది. అప్పుడామె చూసావా నందూ నీ ముందే కొట్టడానికి చూస్తోంది అనగా.. నందూ తులసి దగ్గరికి వెళ్లి 'తులసి చేయి లేపడం కాదు.. చెంప పగలగొట్టాల్సింది' అంటాడు. దీంతో లాసయ షాక్ అవుతుంది.

అదిరిపోయే వార్నింగ్ ఇవ్వడంతో

అదిరిపోయే వార్నింగ్ ఇవ్వడంతో

తర్వాత నందూ 'నా విషయంలో ఎన్ని తప్పులు అయినా చేయి భరిస్తాను. కానీ నా కూతురు విషయంలో తప్పు చేస్తే మాత్రం సహించను' అని వార్నింగ్ ఇస్తాడు. దీంతో లాస్య 'అయినా నేను చేసిన తప్పు ఏంటి. దివ్యను మంచి స్థాయిలో చూడాలనుకున్నాను. కోటీశ్వరురాలు అవుతుందని అనుకున్నాను' అంటుంది.

దీంతో తులసి 'డబ్బు కోసం నీలా అడ్డదారులు తొక్కడం, డబ్బు కోసం ఎంతకైనా దిగజారడం నీకు అలవాటు.. మాకు కాదు. చూడు నా కూతురులో ఉంది నా రక్తం. నాకు ప్రేమ అభిమానం వ్యక్తిత్వం మర్యాద ఇవి మాత్రమే తెలుసు. ఈ పదాలు నీకు తెలియదు అనుకుంటా' అని అంటుంది.

మహారాజే అవసరం లేదు అంటూ

మహారాజే అవసరం లేదు అంటూ

అనంతరం తులసి 'నా కూతుర్ని పెళ్లి చేసుకోబోయే వాడు మహారాజు కాకపోయినా మనసులో పెట్టుకుని చూసుకునేవాడు ఉంటే చాలు. నా కూతురినీ ప్రేమగా చూసుకునేవాడు ఉంటే చాలు. నందగోపాల్ గారు ఇదే విషయాన్ని మీ భార్యకు అర్థం అయ్యేలా చెప్పండి' అంటూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఆ వెంటనే దివ్య కూడా 'నాన్న కొంతమందికి సాఫ్ట్‌గా చెప్తే అర్థం కాదు. వార్నింగ్ ఇవ్వాలి. ఇక మీ చేతుల్లోనే ఉంది' అంటూ ఆమె కూడా వెళ్లిపోతుంది. తర్వాత అందరూ వెళ్లిపోగా లాస్య, నందూ మాత్రమే అక్కడ ఉండిపోతారు.

విక్రమ్‌కు పెళ్లి చేయాలని ప్లాన్స్

విక్రమ్‌కు పెళ్లి చేయాలని ప్లాన్స్

రాజ్యలక్ష్మి ఆఫీస్ ఫైల్స్ చూస్తూ ఉండగా ఇంతలో బసవయ్య అక్కడికి వచ్చి విక్రమ్ పెళ్లి గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఇంతలోనే అక్కడికి మ్యారేజ్ బ్యూరో నడిపే అతడు రావడంతో 'అక్క నువ్వు చాలా ఫాస్ట్‌గా ఉన్నావు' అంటాడు. ఇంతలోనే అక్కడికి విక్రమ్ వచ్చి అమ్మ నేను అలా మార్కెట్ వరకు వెళ్ళొస్తాను అంటాడు. దీంతో ఆమె దేవుడు ఉన్నాడు కదా అనగా నీ కోసమే కదా అమ్మ వెళ్ళొస్తాను అని అంటాడు. అప్పుడు రాజ్యలక్ష్మి 'నాన్న నీకు పెళ్లి చేయాలనుకుంటున్నాను. అందుకే మంచి సంబంధం చూస్తున్నాను' అని చెప్తుంది. దీంతో విక్రమ్ ఒక్కసారిగా షాక్ అవుతాడు.

ప్రేమను దాచేసుకున్న విక్రమ్

ప్రేమను దాచేసుకున్న విక్రమ్

ఆ తర్వాత రాజ్యలక్ష్మి 'తల్లిగా అడుగుతున్నాను నీ మనసులో ఎవరైనా ఉంటే చెప్పు పెళ్లి చేస్తాను' అని ప్రశ్నిస్తుంది. దీంతో విక్రమ్ దివ్య గురించి ఆలోచించి నా మనసులో ఎవరూ లేరమ్మ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత దేవుడు విక్రమ్ వెనకాలే వెళ్లి 'ఏంటి విక్రమ్ బాబు మంచి అవకాశం వస్తే చేజార్చుకున్నావు' అంటాడు. దీనికి విక్రమ్ 'నా మనసులో ఆ అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి మనసులో నేను ఉన్నానో లేదో తెలియదు కదా. కాబట్టి అప్పటివరకు ఈ దాగుడుమూతలు తప్పవు దేవుడు' అని అక్కడి నుంచి వెళ్లిపోతాడు.

ఆ తర్వాత విక్రమ్ కోసం ఓ మధ్య తరగతి అమ్మాయిని చూడమని రాజ్యలక్ష్మి మ్యారేజ్ బ్యూరో అతడికి చెబుతుంది. అప్పుడతను ఓ అమ్మాయిని చూపించగా బాగుందని అంటుంది. అంతేకాదు, విక్రమ్‌పై కుళ్లును బయటపెడుతుంది.

లాస్యకు మరోసారి వార్నింగ్‌తో

గొడవ తర్వాత లాస్య.. నందూ దగ్గరికి వచ్చి 'ఏంటి నందు నువ్వు కూడా నన్ను అపార్థం చేసుకుంటున్నావు' అంటుంది. దీంతో అతడు 'షటప్.. బతకడానికి డబ్బు అవసరం కానీ.. నీలా ఇలా తప్పుడు ఆలోచనలు చేయలేదు. తప్పుడు ఆలోచన కాబట్టి అజయ్‌కు ముందే పెళ్లి అయింది అన్న విషయాన్ని అందరి దగ్గర దాచి దివ్య గొంతు కోయాలని చూసావు. రెండో పెళ్లి ష్టపడి చేసుకుంటే బాగుంటుంది కానీ ఇలా నిజాలు దాచిపెట్టి కాదు' అని లాస్యకీ వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత తులసితో దివ్య 'నువ్వు నాన్న కలిసి ఉన్నప్పుడు నువ్వు ఎంత సర్దుకు పోయినా కూడా నాన్న విడాకుల వరకు తీసుకువచ్చాడు. మరి ఇప్పుడు లాస్య ఎంత ఇబ్బంది పెట్టినా విడాకులు ఇవ్వడం లేదేంటి' అని అడుగుతుంది. తర్వాత విక్రమ్ గురించి నిజం చెప్తుంది. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X