Intinti Gruhalakshmi Today Episode: అనసూయ డిమాండ్‌తో తులసి షాక్.. ప్రేమ్‌కు రాములమ్మ సర్‌ప్రైజ్

రెండు మూడు దశాబ్దాలుగా తెలుగు బుల్లితెరపై ప్రసారం అయ్యే సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోందన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' బుధవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరు కూడా ఓ లుక్కేయండి!
Photos Courtesy: Star మా and Disney+Hotstar

మంగళవారం ఎపిసోడ్‌లో జరిగిందిదే

మంగళవారం ఎపిసోడ్‌లో జరిగిందిదే

మంగళవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. లాస్య, నందూ అన్న తినకుండా లేచి వెళ్లిపోయిన తర్వాత ఇంట్లోని అందరూ ఒక్కొక్కరుగా తినడం మానేస్తారు. దీంతో తులసి ఒంటరిగా కూర్చుని బాధ పడుతూ ఉంటుంది. ఇక, ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోయిన ప్రేమ్, శృతి గుడిలో పడుకుందామని అనుకుంటారు. కానీ, పూజారి ఒప్పుకోడు. అంతలో రాములమ్మ వచ్చి వాళ్లను తన ఇంటికి తీసుకుని వెళ్తుంది. ఆ తర్వాత వాళ్లకు భోజనం కూడా పెట్టగా.. వంటలు తల్లే చేసిందని ప్రేమ్ గుర్తిస్తాడు. చివర్లో ఇంట్లోని వాళ్లంతా తనను అపార్థం చేసుకున్నారని తులసి బాధ పడుతుంది.

నందూపై సెటైర్లు వేసిన అనసూయ

నందూపై సెటైర్లు వేసిన అనసూయ

ప్రేమ్‌ను తలచుకుంటూ అనసూయ బాధగా కూర్చుని ఉంటుంది. అంతలో పరందామయ్య అక్కడకు వస్తాడు. అప్పుడామె ‘తులసితో చెప్పి ప్రేమ్‌ను వెనక్కి పిలవమని చెప్పొచ్చు కదా. మీరూ మీరూ బాగానే ఉంటారు కదా' అంటుంది. అంతలోనే నందూ, లాస్య వస్తారు. అప్పుడు నందూ ‘అమ్మ.. ఆఫీసుకు వెళ్తున్నాను' అంటాడు. దీనికామె ‘వెళ్లు నాన్నా. లంచ్ బాక్స్ తీసుకెళ్తున్నావా. సరైన సమయానికి తిను నాన్న. లేకపోతే చిక్కిపోతావు' అంటూ సెటైర్లు వేస్తూ మాట్లాడుతుంది. దీంతో ఎందుకమ్మా అలా మాట్లాడుతున్నావు అని అడుగుతాడు నందూ.

అనసూయ డిమాండ్.. తులసి వల్లే

అనసూయ డిమాండ్.. తులసి వల్లే

నందూ ఏమైందని అడగ్గానే ‘ప్రేమ్‌ను వెళ్లగొట్టారు.. నీకు మాత్రం ఎలాంటి పట్టింపు లేదా. ప్రేమ్‌కు నేను తండ్రినంటూ శివాలెత్తిపోయావు కదా. తండ్రి అనేవాడు ఇలాగే ప్రవర్తిస్తాడా. చేతిలో చిల్లిగవ్వ లేకుండా భార్యతో సహా వాడు బయటికెళ్లాడు. వాడిని పట్టించుకోవా నువ్వు' అంటుంది. దీంతో ‘వెళ్లింది వాడు.. వెళ్లగొట్టింది వాడి అమ్మ. అదేంటి అని అడిగితేనే నిన్న ఒంటి కాలి మీద లేచింది. నాన్నా.. మీకు తులసి అంటే ఇష్టం.. అందుకే తనవైపు మాట్లాడుతున్నారు' అంటాడు. అప్పుడు పరందామయ్య ‘కన్నకొడుకు అంటే ఇష్టం ఉండని తల్లిదండ్రులు ఉండరురా. నువ్వు కేఫ్‌లో జాయిన్ అవుతానని అన్నప్పుడు నిన్ను ఎంకరేజ్ చేసింది తులసినే అనే విషయం మరిచిపోకు' అంటాడు.

తులసితో నందూ, లాస్య వాగ్వాదం

తులసితో నందూ, లాస్య వాగ్వాదం

నందూ మాట్లాడుతూ.. ‘తులసి అసలు స్వరూపం ఏంటో త్వరలోనే బయటపడుతుంది' అంటాడు. అప్పుడు తులసి ‘పోనీలేండి.. ఇప్పటికైనా నా గురించి తెలుసుకున్నారు' అంటుంది. దీనికి లాస్య ‘సమయం వచ్చినప్పుడు కూడా మీ అమ్మానాన్న నీ వెనుక నిలబడటం లేదు' అంటుంది. అప్పుడు తులసి ‘నువ్వు ఒక్కదానివి ఉన్నావు కదా.. అది చాలులే. ఒకసారి వద్దు అనుకున్నాక ఇంకెప్పుడూ కావాలనుకోను' అని చెబుతుంది. అప్పుడు అనసూయ వచ్చి ‘ఇప్పుడు మాట్లాడుకోవాల్సింది మీ గురించి కాదు. ప్రేమ్ గురించి' అంటుంది.

ప్రేమ్ గురించి అనసూయ డిమాండ్

ప్రేమ్ గురించి అనసూయ డిమాండ్


అనసూయ.. ప్రేమ్‌ను వెనక్కి తీసుకు రావడం గురించి మాట్లాడుతుండడంతో నందూ ‘వాడిని శిక్షిందించి తులసే. అందుకే నిర్ణయం తన చేతుల్లోనే ఉంది' అంటాడు. దీనికి లాస్య ‘కట్టుబట్టలతో ఎందుకు ప్రేమ్‌ను తరిమింది' అని అడుగుతుంది. అప్పుడు అనసూయ ‘నందూ చెప్పాల్సిన మాటలు చెప్పాడు. ప్రేమ్ గురించి నిర్ణయం నీ చేతుల్లో ఉంది. ప్రేమ్ మనతో పాటు కలిసి ఉండటం నీకు ఇష్టం లేదా. అయినా నందూ మెత్తపడినప్పుడు నీకెందుకు బాధ' అని ప్రశ్నిస్తుంది. దీంతో తులసి దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం అని వెళ్లిపోతుంది.

తులసి గురించి అంకిత, అభి చర్చ

తులసి గురించి అంకిత, అభి చర్చ

ఇంట్లో జరుగుతున్న గొడవలు.. ప్రేమ్, శృతి ఎలాంటి కష్టాలు పడుతున్నారో అన్న ఆలోచనతో అంకిత కూడా బాధగానే ఉంటుంది. తులసి.. నందూతో మాట్లాడినవి అన్నీ విన్న తర్వాత అంకిత.. అభి దగ్గరకు వెళ్తుంది. ‘అభి.. ఈ ఇంట్లో ఏం జరుగుతోందో నాకు అర్థం కావడం లేదు. నాకైతే మనసు మనసులో లేదు. వాళ్లు ఎక్కడున్నారో.. ఎలాంటి కష్టాలు పడుతున్నారో' అంటుంది. దీనికి అభి ‘నిజం చెప్పాలంటే మామ్‌కు వాడంటేనే ఎక్కువ అటాచ్‌మెంట్.. అలాంటిది మామ్ వాడిని ఎందుకు పంపించిందో అర్థం కావడం లేదు' అని సమాధానం చెబుతాడు.

అద్దె ఇల్లు తీసుకున్న ప్రేమ్, శృతి

అద్దె ఇల్లు తీసుకున్న ప్రేమ్, శృతి

ఇల్లు లేక రాత్రి సమయంలో రాములమ్మ ఇంట్లో తలదాచుకున్న ప్రేమ్, శృతి.. అద్దెకు ఇల్లు తీసుకోవాలని అనుకుంటారు. దీంతో రాములమ్మ తన ఇంటి ఓనర్ దగ్గరకు వాళ్లను తీసుకుని వెళ్తుంది. అప్పుడు ఆయన ‘రాములమ్మ.. ఈ బాబురావు దగ్గరికి వచ్చేటప్పుడు ఉత్తచేతులతో రావద్దని ఎన్నిసార్లు చెప్పాను. ఎవరు వీళ్లు' అని అడుగుతాడు. దీంతో రాముల్మ ‘పక్క వీధిలో మన ఇల్లు ఖాళీగా ఉంది కదండి' అని చెప్పి ఇల్లు అద్దెకు కావాలని అడుగుతుంది. ఆ తర్వాత అలా అలా మాట్లాడుకుని 3000 రూపాయలకు అద్దెకు మాట్లాడుకుంటారు.

Recommended Video

Best Telugu TV Serials In 2020 | కార్తీక దీపం హవా..!!
అంకితపై తులసి తీవ్ర ఆగ్రహంగా

అంకితపై తులసి తీవ్ర ఆగ్రహంగా

తులసి దివ్య కోసం ప్లేట్‌లో అన్నం పెడుతుంది. అంతలో అంకిత అక్కడకు వచ్చి ఎవరి కోసం అని అడగ్గా.. దివ్యకు అని చెబుతుంది. అప్పుడు అంకిత ‘మీరు తొందరపడ్డారేమో ఆంటి.. ప్రేమ్‌ను ఇంట్లో నుంచి పంపించకుండా ఉండాల్సింది. అందరూ బాధపడుతున్నారు' అంటుంది. దీంతో నాకంటే ఎక్కువగా బాధపడుతున్నారా అని అడుగుతుంది. దీనికి అంకిత ‘తప్పు చేసిన వ్యక్తిని శిక్షిస్తే ఇంకా మొండిగా మారుతారు' అని అంటుంది. అప్పుడు తులసి ‘ప్రేమ్‌కు ఏది మంచో అదే చేశాను.. ఈ విషయంలో ఎవ్వరూ ఏం మాట్లాడాల్సిన అవసరం లేదు' అంటుంది. మరోవైపు దివ్య అన్నం తినడం మానేస్తుంది. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X