Intinti Gruhalakshmi: తులసి గదిలో నందూ.. లాస్యకు దొరికిపోయిన భర్త.. పెళ్లికి ఒప్పుకున్న విక్రమ్
ఎన్నో ఏళ్లుగా తెలుగు టెలివిజన్‌పై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' గురువారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!
Photos Courtesy: Star మా and Disney+Hotstar

బుధవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే
బుధవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. విక్రమ్ గురించి దివ్య చెప్పగానే తులసి ఏదేదో ఊహించుకుని మాట్లాడుతుంది. ఆ తర్వాత ఆ రెండు లక్షల రూపాయలను విక్రమ్‌కు ఇచ్చేయమని సలహా ఇస్తుంది. దీంతో విక్రమ్‌కు దివ్య ఫోన్ చేసి ఒక చోట కలుద్దామని అడ్రెస్ పంపుతుంది. దీంతో విక్రమ్ అక్కడకు వెళ్లగా.. తన ఫ్రెండ్ కనిపిస్తుంది. ఆమెకు ఓ విషయంలో క్లాస్ పీకుతుండగా దివ్య చూసి అతడిని అపార్థం చేసుకుంటుంది. మరోవైపు, నందూ ఇంటికి అతడి ఫ్రెండ్ వస్తానని కాల్ చేస్తాడు. అలాగే, తులసిని మంచి వంటలు చేయమని చెప్పడంతో నందూ టెన్షన్ పడతాడు.

తల్లి మాటలతో దివ్య రియలైజ్
విక్రమ్ విషయంలో దివ్య కోపంగా ఇంటికి వచ్చి పిచ్చి పిచ్చిగా చేస్తూ ఉంటుంది. అది అర్థం చేసుకున్న తులసి ఆమెకు చిన్నగా క్లాస్ పీకుతుంది. ఆ సమయంలోనే 'మనసు ప్రశాంతంగా లేకపోతే మన కంటికి ఎదురుగా ఉన్న వస్తువులు కూడా మనకు కనపడవు' అని అంటుంది. అప్పుడు దివ్య 'అయినా మన పిచ్చి గానీ.. మన గురించే మనకు సరిగా తెలియదు.. తెలియని వాళ్ళ గురించి జడ్జిమెంట్ ఇవ్వడం ఏంటో నా తెలివి తక్కువ తనం' అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడు తులసి మొబైల్‌లో 'మనం తప్పు చేశామన్నప్పుడు చెంపలు వాయించుకోవడం మంచిది' అని వాయిస్ వస్తుంది. అది విన్న వెంటనే దివ్య పొలమారుతుంది. దీంతో సిగ్గ పడుతూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది.

తండ్రికి దొరికిపోయిన నందూ
వాసుదేవ్ ఫోన్ తర్వాత తులసితో మాట్లాడేందుకు నందూ ప్రయత్నిస్తుంటాడు. ఇందుకోసం దొంగలా అటూ ఇటూ చూస్తూ కిచెన్ వైపు చూస్తుంటాడు. అది పరందామయ్య గమనించి అక్కడికి వచ్చి 'ఈ వయసులో వీనికి ఇదేం పాడు బుద్ధి. చెప్తా నీ సంగతి' అని నందూ వెనకాలే నిల్చుంటాడు. అప్పుడు ఆయన 'ఒరేయ్ ఏం చూస్తున్నావురా' అనడంతో నందూ 'తులసి మూడు ఎలా ఉందో చూస్తున్నాను' అంటూ ఏదో చెప్తాడు. తర్వాత పరందామయ్యను గమనించి భయపడతాడు. అంతేకాదు, మీరు అనుకున్నట్లు ఏమీ చూడట్లేదు అంటూ అక్కడి నుంచి వెళ్తాడు.

కాళ్లకు అడ్డు పడతారమే అని
రాజ్యలక్ష్మితో సోదరుడు బసవయ్య మాట్లాడుతూ.. 'ఒకసారి విక్రమ్ పెళ్లి సంబంధం గురించి బావగారికి, అలాగే మామయ్యకి చెబితే బాగుండు కదా. వాళ్ళు సంతోషపడతారు' అంటాడు. దీనికామె 'సంతోష పడకపోయినా పర్లేదు కానీ.. కాళ్లకు అడ్డుపడకుండా ఉంటే చాలు' అంటుంది. దీంతో బసవయ్య 'బావగారు తన కాళ్లపై తానే నిల్చోలేరు. మన కాళ్లకు ఏం అడ్డు పడతారులే' అంటాడు. అప్పుడు విక్రమ్ అటుగా వెళుతూ రాజ్యలక్ష్మి వాళ్ళని పట్టించుకోడు. దీంతో ఏమైందని అడగ్గా.. నిద్ర వస్తుంది అని అబద్ధం చెప్పి వెళ్లిపోవాలను అనుకుంటాడు.

కింద కూర్చుని ఎమోషనల్‌గా
విక్రమ్‌ను ఎలాగైనా ఒప్పించాలని అనుకున్న రాజ్యలక్ష్మి 'నువ్వు భోజనం చేయకపోతే నేను కూడా కంచం ముందు నుండి లేస్తాను' అంటూ పైకి లేవడంతో విక్రమ్ 'అమ్మ వద్దులే అమ్మ నువ్వు కూర్చొ నేను భోజనం చేస్తాను' అని అంటాడు. వెంటనే అతడు కూడా భోజనానికి కూర్చోగా తినకుండా దివ్య అన్న మాటల గురించి ఆలోచిస్తూ పనిమనిషి మీద అరుస్తాడు. అప్పుడు రాజ్యలక్ష్మి భోజనం చేయకుండా చేతులు కడిగేసుకుని విక్రమ్‌తో పాటు కింద కూర్చుంటుంది. అప్పుడు విక్రమ్ మీద దొంగ ప్రేమలు చూపిస్తూ భోజనం తినిపిస్తూ ఉంటుంది. ఏమైంది నాన్న నీ ముఖంలో ఏదో దిగులు బాధ కనిపిస్తోంది అని ఆమె అనగా నిద్ర వస్తుందని అబద్ధం చెబుతాడు. ఆ తర్వాత విక్రమ్‌కు రేపు పెళ్లి చూపులు అని రాజ్యలక్ష్మి చెబుతుంది.

నందూ దొంగలా.. లాస్య షాక్
రాత్రి కాగానే లాస్య పడుకుని ఉండగా నందూ దొంగచాటుగా తులసితో మాట్లాడాలని అనుకుంటాడు. ఎవరూ చూడకుండా ఆమె గదిలోకి వెళ్లాలని ప్రయత్నిస్తుంటాడు. అప్పుడు అనసూయ 'ఒరేయ్ ఆగరా.. ఎవరూ చూడరులే అనుకుంటున్నావా' అనడంతో దొరికిపోయానని అనుకుంటాడు. కానీ, పరందామయ్య 'అబ్బబ్బ దీన్ని రోజూ రాత్రి పూట సీనియర్ డైలాగులతో చచ్చిపోతున్నాను ఒసేయ్ పడుకోవే' అనడంతో నందూ ఊపిరి పీల్చుకుంటాడు. ఇక, ఎవరూ లేరు కదా అని ధైర్యంగా వెళ్తున్న నందూను లాస్య చూస్తుంది. ఆమెను చూడగానే షాక్ అవుతాడు.

ఈ బాగోతం ఎలా సాగుతుంది
నందూను తమ గదిలోకి తీసుకు వెళ్లిన లాస్య 'ఎన్నాళ్ళ నుంచి సాగుతోంది ఈ బాగోతం? అర్ధరాత్రి పక్కన పెళ్ళాన్ని పెట్టుకొని మాజీ భార్య గదిలోకి వెళ్లడాన్ని ఏమంటారు నందూ' అని ప్రశ్నిస్తుంది. దీంతో నందూ నువ్వు ఏవేవో ఊహించుకోకు అంటాడు. దీంతో లాస్య 'అందరూ నిద్రపోయిన తర్వాత తులసి గదిలోకి ఎందుకు వెళ్లావు? మనసులో చెడు ఉద్దేశంతో లేనప్పుడు ఎందుకు వెళ్లావు' అని అడుగుతుంది. దీంతో నందూ 'తెల్లారితో నా దరిద్రం ఇంటి ముందుకు వచ్చి వాలుతుంది అప్పుడు ఏం చేయాలో తెలియక వెళ్లాను' అంటూ వాసుదేవ్ గురించి మొత్తం వివరిస్తాడు. దీంతో లాస్య సంతోషిస్తుంది. ఆ వెంటనే లాస్య 'మీరు భార్యభర్తలుగా నటించండి' అంటూ నందూకు ఓ ప్లాన్ చెబుతుంది.

విక్రమ్ తాత బాధ.. అతడిలా
విక్రమ్.. వాళ్ళ తాతయ్య కాళ్లు నొక్కుతూ సరదాగా మాట్లాడుతుండగా.. ఆయన పెళ్లి ప్రస్తావన తీసుకువస్తాడు. అప్పుడు దేవుడు వచ్చి ఇదిగో బాబు గారు అమ్మ పెళ్లి చూపుల కోసం బట్టలు పంపించింది అంటాడు. దీంతో వాళ్ళ తాతయ్య బాధపడుతూ 'ఒరేయ్ నువ్వు ఈ వంశానికి కోట్ల ఆస్తికి వారసుడివి నీకు పనిమనిషిని చేసుకోవాల్సిన అవసరం ఏముంది? పెళ్లి విషయంలో ఎందుకురా ఇంత తొందర పడుతున్నావు' అని అనగానే అమ్మ చూసింది చేసుకుంటున్నా అంటాడు. ఆ తర్వాత దేవుడు దివ్య ప్రస్తావన తీసుకు వస్తాడు. అంతేకాదు, మీరు ఇప్పుడు ధైర్యం చేయకపోతే ఎవరూ దక్కరు అంటూ వెళ్లిపోతాడు. తర్వాత అనసూయ, పరందామయ్య ఎక్సర్‌సైజ్ చేస్తుంటారు. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.


Click it and Unblock the Notifications











