For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Intinti Gruhalakshmi Today Episode: కాంపిటీషన్‌లో తులసికి షాక్.. ప్రవళ్లిక గురించి నిజం తెలియడంతో!

  |

  ఎన్నో ఏళ్లుగా తెలుగు టెలివిజన్‌పై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి భారీ నుంచి అతి భారీ స్థాయిలో స్పందన దక్కుతుందన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' మంగళవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరు కూడా చూసేయండి మరి!
  Photos Courtesy: Star మా and Disney+Hotstar

  సోమవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  సోమవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  సోమవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. మదర్ థెరిస్సా ఫౌండేషన్ ఈవెంట్‌లో బెస్ట్ మదర్ కాంపిటీషన్ జరగ్గా.. దానికి లాస్య, తులసి పేర్లు నమోదు చేస్తారు. రెండో రౌండ్‌లో పిల్లలను తమ తల్లలు గురించి మాట్లాడమని అంటారు. దీంతో లక్కీ.. లాస్యపై ఉన్న అసహనాన్ని వెల్లగక్కుతాడు. అలాగే, దివ్య, అభి, ప్రేమ్ మాత్రం తమ తల్లి గొప్పదనాన్ని వివరిస్తారు. దీంతో నందూ, లాస్యకు బాగా కోపం వస్తుంది. ఆ తర్వాత పిల్లలుగా తాము ఓడిపోయామని అంటారు. దీంతో తులసి ఎమోషనల్ అవుతుంది. ఈ సమయంలోనే తన జీవితంలో ఎదురైన కష్టాలను గురించి వివరిస్తుంది.

  Bigg Boss Non Stop: బిందుపై నటరాజ్ అసభ్య వ్యాఖ్యలు.. అవి చూపించడానికే అలాంటి బట్టలు అంటూ!

  పిల్లల గొప్పదనం చెప్పిన తులసి

  పిల్లల గొప్పదనం చెప్పిన తులసి

  బెస్ట్ మదర్ కాంపిటీషన్‌లో భాగంగా తులసి తన పిల్లల గొప్పదనం గురించి మాట్లాడుతుంది. 'ఇక్కడున్నవాళ్లలో కొంతమంది తమ బిడ్డలను కాదనుకున్నవాళ్లు ఉన్నారు. తల్లిదండ్రుల ప్రేమను పట్టించుకోని ఉన్నారు. కానీ, నా పిల్లలు మాత్రం అమ్మ మనసు తెలుసుకున్న బిడ్డలు అని చెబుతాను. ఒక మొక్కకు నీళ్లు పోసి పెంచినప్పుడు అది ఎదిగి పూలు పూసినప్పుడు ఎంత సంతోషంగా ఉంటుందో తన పెంపకంలో ఎదిగిన బిడ్డలను చూసి తల్లి కూడా అంతే సంతోషపడుతుంది. అదే ప్రేమ' అని చెబుతుంది. దీంతో అందరూ నిలబడి తనకు చప్పట్లు కొడతారు.

  భర్త పేరును పలకలేనన్న తులసి

  భర్త పేరును పలకలేనన్న తులసి

  ఆ తర్వాత యాంకర్ 'ఇంత మంచి మనిషిని మోసం చేసి దూరం చేసుకున్న వాడు నిజంగా అన్ లక్కీ ఫెలో. అతడు ఎవరో మీరు చెబుతారా' అని తులసిని అడుగుతుంది. దీంతో తులసి మాత్రం ఆయన పేరు అంటూ ఏదో చెప్పబోతుంది. దీంతో నందూకు తన పేరు ఎక్కడ చెబుతుందో అని టెన్షన్ మొదలవుతుంది. లాస్య కూడా అదే అనుకుంటుంది. కానీ, తులసి మాత్రం 'ఆయన పేరు నా నోటితో పలకడం నాకు ఇష్టం లేదు' అంటుంది. అప్పుడు యాంకర్ 'ఇంతటితో ఈ కాంపిటిషన్ ముగిసింది. కాసేపట్లో విన్నర్ ఎవరో అనౌన్స్ చేస్తాం' అని చెబుతుంది.

  దీప్తి సునైనా అందాల ఆరబోత: అలాంటి బట్టల్లో గతంలో చూడనంత హాట్‌గా!

  తులసి విజయం.. ఒప్పుకోమంటూ

  తులసి విజయం.. ఒప్పుకోమంటూ

  కాంపిటీషన్ అయిన తర్వాత తులసి.. ప్రవళిక ఎక్కడుందో అని వెతుకుతూ ఉంటుంది. కానీ, ఆమె మాత్రం కనిపించదు. తర్వాత కాంపిటిషన్‌లో తులసి గెలిచిందని అనౌన్స్ చేస్తారు. దీంతో తులసి ఆశ్చర్యపోతుంది. అందరూ సంతోషంగా చప్పట్లు కొడతారు. ఇంతలో ఒకావిడ 'ఆపండి. దీనికి మేము ఒప్పుకోవడం లేదు' అంటుంది. దీంతో అందరూ షాక్ అవుతారు. ఏం ఎందుకు ఒప్పుకోరు అని దివ్య అడుగుతుంది. దీంతో ఆమె 'విన్నర్స్‌ను అనౌన్స్ చేసేముందే మీ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ కూడా చూడాలి. పిల్లలను ఇంట్లో నుంచి తరిమేసిన తులసి ఉత్తమ తల్లి ఎలా అవుతుంది' అంటుంది.

  లాస్య ప్లాన్.. అందరి ముందే ప్రశ్న

  లాస్య ప్లాన్.. అందరి ముందే ప్రశ్న

  తర్వాత మరో మహిళ లేచి కన్నకొడుకులతో మాట్లాడని ఆవిడ బెస్ట్ మదర్ ఎలా అవుతుంది అంటుంది. వాస్తవానికి వాళ్లతో బ్రేక్ టైమ్‌లో మాట్లాడిన లాస్య 'అందరూ కలిసి నాటకం ఆడుతున్నారు. అందరి ముందు నిలదీయండి' అని ముందే ప్లాన్ చేస్తుంది. ఇక వాళ్లు అడిగిన దానికి నిర్వహకులు మేము నమ్మం అంటారు. దీంతో లాస్య 'మీరే తులసిని అడిగి తెలుసుకోండి' అంటుంది. అప్పుడు అనసూయ తల్లీకొడుకులు కలిసి లేనంత మాత్రాన వాళ్ల బంధం విడిపోయినట్టేనా అని ప్రశ్నిస్తుంది. ఇంతలో లాస్య 'తుసలి తన రెండో కొడుకు ప్రేమ్‌తో కూడా మాట్లాడటం లేదు. తన ముఖం కూడా చూడటం లేదు అవునో కాదో మీరే అడగండి' అంటుంది.

  స్పోర్ట్స్ బ్రాతో శృతి హాసన్ సెల్ఫీ: టాప్ వ్యూ నుంచి ఎద అందాల జాతార

  అందరినీ అవమానించినట్లేనని

  అందరినీ అవమానించినట్లేనని

  కాంపిటీషన్‌లో గొడవ జరుగుతుండగానే లక్కీకి కడుపునొప్పి వస్తుందని.. టాయిలెట్‌కు వెళ్లాలని చెబుతాడు. కానీ, లాస్య మాత్రం వినదు. అంతేకాదు, 'మేము ఇంతగా గొంతు చించుకొని అరుస్తున్నాం. తులసి సమాధానం చెప్పడం లేదు. దాని అర్థం ఏంటి? తప్పు తులసి వైపు ఉన్నట్టే కదా. తులసికి బెస్ట్ మదర్ అవార్డు ఇవ్వడం అంటే.. మా పార్టిసిపెంట్స్ అందరినీ అవమానించినట్టే' అంటుంది. అప్పుడు అందరూ లాస్యకే వత్తాసు పలుకుతారు. దివ్య, అనసూయ మాత్రం కుదరదు. ఆ అవార్డు తులసికి ఇవ్వాల్సిందే అంటూ అక్కడ గొడవ చేస్తారు.

  లక్కీని తీసుకెళ్లిపోయిన తులసి

  లక్కీని తీసుకెళ్లిపోయిన తులసి


  లక్కీ బాధను అర్థం చేసుకున్న తులసి.. ఆ గొడవ జరుగుతుండగానే ఆ చిన్నారిని బాత్‌రూమ్‌కు తీసుకుని వెళ్తుంది. అప్పుడు లాస్య 'చూశారా.. నా లక్కీని ఎక్కడికో లాక్కుని తీసుకెళ్లిపోయింది' అని ఆరోపిస్తుంది. కొద్ది సేపటికి తులసి తిరిగి వస్తుంది. అప్పుడు నిర్వహకులు 'వీళ్లు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక పారిపోయారని ఆరోపిస్తున్నారు. మీరు నిర్లక్ష్యంగా, పొగరుగా బిహేవ్ చేస్తున్నారని లాస్య గారు అంటున్నారు. బెస్ట్ మదర్ అవార్డుకు మీకు అర్హత లేదని వాళ్లు చెబుతున్నారు' అంటూ అక్కడ జరిగిన రాద్దాంతం మొత్తాన్ని తులసికి వివరిస్తారు.

  Samantha: శృతి మించిన సమంత హాట్ షో.. ఆమెను ఇంత గ్లామర్‌గా ఎప్పుడూ చూసుండరు!

  లాస్యకు షాక్.. తులసికే అవార్డు

  లాస్యకు షాక్.. తులసికే అవార్డు


  వాళ్లంతా ప్రశ్నించగా తులసి 'బెస్ట్ మదర్ సంగతి పక్కన పెట్టండి. అసలు తల్లి అనిపించుకునే అర్హతే ఆమెకు లేదు. ఒక పక్క బాబు టాయిలెట్ కోసం వెళ్లాలని ఎంతో బతిమిలాడుతున్నాడు. తనకు కడుపు నొప్పి వచ్చిందని అంటున్నాడు. అయినా కూడా బాబును పట్టించుకోకుండా.. అవార్డు కోసం కొట్లాడుతోంది. ఆ అవార్డు తనకే ఇచ్చేయండి. సంతోషపడనివ్వండి. ఆ అవార్డుతోనైనా తనను తల్లిగా నటించడం కాదు.. తల్లిగా జీవించమని చెప్పండి' అంటుంది. దీంతో నిర్వహకులు 'తల్లి మనసు అంటే అది. ఇది ఒక్కటి చాలు.. తులసి గారికి బెస్ట్ మదర్ అవార్డు ఇవ్వడానికి' అంటూ ఆమెనే విజేతగా ప్రకటిస్తారు.

  జిల్లా కలెక్టర్‌గా వచ్చిన ప్రవళ్లిక

  జిల్లా కలెక్టర్‌గా వచ్చిన ప్రవళ్లిక

  తులసిని విజేతగా ప్రకటించగానే అక్కడున్న వాళ్లంతా సంతోషంతో చప్పట్లు కొడతారు. ఆ సమయంలో నిర్వహకులు ఈ ఫంక్షన్‌ను జిల్లా కలెక్టర్ గారు వస్తున్నారని అనౌన్స్ చేస్తారు. కొద్ది సేపటి తర్వాత కలెక్టర్ ఎంట్రీ ఇస్తారు. ఆమె ఎవరో కాదు.. తులసి స్నేహితురాలు ప్రవళ్లిక. ఆమె గురించి నిజం తెలిసి తులసి ఫ్యామిలీతో పాటు అక్కడున్న వాళ్లంతా షాక్ అవుతారు. నందూ, లాస్యలో ఒక రకమైన భయం కనిపిస్తుంది. ఆ తర్వాత తులసికి ప్రవళ్లిక మొట్టికాయ వేస్తుంది. అప్పుడామె షాక్ నుంచి తేరుకుంటుంది. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

  English summary
  Intinti Gruhalakshmi Episode Tulasi Receives Best Mother Award. Then The Family Feels So Happy. After That Nandhu and Lasya Shocked Know about Pravallika.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X