Intinti Gruhalakshmi Today Episode: ప్రవళ్లిక సలహాతో మారిన తులసి.. లక్కీతో లాస్య ఊహించని ప్రవర్తన

బుల్లితెర చరిత్రలో తెలుగు టెలివిజన్‌పై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి భారీ నుంచి అతి భారీ స్థాయిలో స్పందన దక్కుతుందన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' బుధవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరు కూడా చూసేయండి మరి!
Photos Courtesy: Star మా and Disney+Hotstar

మంగళవారం ఎపిసోడ్‌లో జరిగిందిదే

మంగళవారం ఎపిసోడ్‌లో జరిగిందిదే

మంగళవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. మదర్ థెరిస్సా ఫౌండేషన్ ఈవెంట్‌లో బెస్ట్ మదర్ కాంపిటీషన్‌లో తులసి తన పిల్లల గొప్పదనం గురించి చెబుతుంది. ఆ తర్వాత ఆమెనే విజేతగా ప్రకటిస్తారు. అయితే, లాస్య కన్నింగ్ ప్లాన్ చేసి మిగిలిన వాళ్లతో తులసిని విజేత చేయొద్దు అని చెప్పిస్తుంది. అంతలో లక్కీకి కడుపు నొప్పి రావడంతో తులసి ఆ చిన్నారికి సాయం చేస్తుంది. దీంతో ఆమె గొప్పదనం చూసి తులసినే గెలిచినట్లు చెబుతారు. ఆ తర్వాత ప్రవళ్లిక జిల్లా కలెక్టర్‌గా ఎంట్రీ ఇస్తుంది. ఇది చూసిన తులసి ఫ్యామిలీ సభ్యులు మొత్తం షాక్‌కు గురవుతారు.

తులసిపై ప్రవళ్లిక ప్రశంసల వర్షం

తులసిపై ప్రవళ్లిక ప్రశంసల వర్షం


బెస్ట్ మదర్‌గా గెలుపొందిన తులసికి కలెక్టర్‌గా పరిచయమైన ప్రవళ్లిక అవార్డును అందజేస్తుంది. ఆ తర్వాత ఆమె మాట్లాడుతూ.. 'తులసి గొప్ప తల్లి అని తెలుసు కానీ.. ఎంత గొప్ప తల్లో ఈరోజే తెలిసింది. పిల్లల భవిష్యత్తు కోసం జీవితంలో త్యాగం చేసేది నాన్న అయితే.. జీవితాన్నే త్యాగం చేసేది అమ్మ. ఒక మొబైల్‌ను ఎంతో జాగ్రత్తగా చూసుకునే నేటి జనరేషన్ తల్లి విషయంలో మాత్రం ఎందుకు అంత అశ్రద్ధ చూపిస్తారు. ఒక మొబైల్ పోతే ఇంకో మొబైల్ కొనుక్కోవచ్చు కానీ, తల్లి విషయంలో అలా జరగదు కదా' అంటూ తులసిని పొగుడుతూ స్పీచ్ ముగిస్తుంది.

నిజం దాచడంతో తులసి ప్రశ్నలు

నిజం దాచడంతో తులసి ప్రశ్నలు

అవార్డు అందుకున్న తర్వాత తులసి దాన్ని చూసి మురిసిపోతూ ఉంటుంది. అప్పుడు ప్రవళ్లిక 'నువ్వు బెస్ట్ మదర్ అవార్డును గెలవడం కాదు. నీ మీద ఉన్న నమ్మకాన్ని గెలిచావు. నిన్ను నువ్వు గెలిచావు. నీ ఫ్యాక్టరీ కోసం పెట్టుకున్న అప్లికేషన్ చూసే నీ గురించి తెలుసుకున్నాను' అంటుంది. అప్పుడు తులసి 'కానీ.. నీ గురించి మాత్రం చెప్పకుండా దాచావు కదా. నువ్వు కలెక్టర్‌వు. ఎన్నో బాధ్యతలు ఉంటాయి. ఇంత బిజీలో నాతో ఎలా ఉండగలుగుతున్నావు' అని ప్రశ్నిస్తుంది. దీనికి ప్రవళ్లిక 'ఎంత బిజీగా ఉన్నా.. నాకంటూ ఒక సమయం ఉంటుంది' అని చెప్తుంది.

తులసికి ప్రవళ్లిక విలువైన సలహా

తులసికి ప్రవళ్లిక విలువైన సలహా

తులసి అడిగిన దానికి ప్రవళ్లిక సమాధానం చెబుతూ.. 'నా మనసుకు నచ్చిన పని చేసి గడుపుతాను. నాకోసం కేటాయించుకున్న ఆ టైమ్‌లోనే నీతో గడుపుతున్నాను. ఆ పని నువ్వెందుకు చేయలేవు' అని అడుగుతుంది. అంతేకాదు, 'రెండు రోజుల పాటు మన పనులను మరిచిపోయి.. చిన్నపిల్లల్లా ఎంజాయ్ చేశాం. అలా తిరగడం వల్ల నీ బాధ్యతలను వదులుకున్నావా? మీ వాళ్లు ఏమైనా అన్నారా? లేదు కదా. నువ్వు ఎంత వెంపర్లాడినా ఏ బంధం నీతో రాదు తులసి. వాటి కోసం నీ ఆనందాన్ని దూరం చేసుకోకు. ఇంతకంటే నేను ఇంకేం చెప్పలేను' అంటుంది.

లక్కీపై కోపాన్ని చూపించిన లాస్య

లక్కీపై కోపాన్ని చూపించిన లాస్య

బెస్ట్ మదర్ పోటీలో తన పరువు తీసిన కొడుకు లక్కీని కోపంతో ఇంటికి తీసుకొచ్చి లాస్య బెడ్ రూమ్‌లో పడేస్తుంది. అప్పుడామె 'ఏరా.. పది మందిలో నా పరువు తీస్తావా. నన్ను పట్టించుకోలేదని చెప్తావా? అసలు నీకు ఏం తక్కువ చేశానురా? అసలు నిన్ను ఇలా కాదు.. బెల్ట్‌తో కొడితే కానీ నీకు బుద్ధి రాదు' అంటుంది. అప్పుడు లక్కీ 'సారీ మమ్మీ.. ఇంకోసారి అలా చేయను. నీ గురించి గొప్పగా చెబుదామనుకున్నాను కానీ, నా మనసులోని మాటలు వచ్చాయి' అంటాడు. ఇంతలో నందూ వచ్చి 'లాస్య.. చిన్నపిల్లాడు వదిలేయ్. వాడికేం తెలుసు చెప్పు' అంటాడు.

నీ పరువు కూడా తీశారని రెచ్చగొట్టి

నీ పరువు కూడా తీశారని రెచ్చగొట్టి

నందూ ఆపడంతో లాస్య 'వీడికి నాకంటే తులసే ఎక్కువయిపోయింది' అంటుంది. అప్పుడు నందూ 'తులసి మీద ఉన్న కోపం వాడి మీద చూపిస్తే ఎలా. వద్దు అన్నా కూడా కాంపిటిషన్‌లో పార్టిసిపేట్ చేశావు. నీ కొడుకే నీ పరువు తీశాడు' అంటాడు. దీనికి లాస్య 'మరి నీ కొడుకులు చేసింది ఏంటి. వాళ్లు కూడా నీ పరువు తీశారు కదా. నీ మాజీ భార్యకు బెస్ట్ మదర్ అవార్డు రావాలని నువ్వు ఇన్‌డైరెక్ట్‌గా హెల్ప్ చేశావా' అని ఫైర్ అవుతుంది. దీంతో నందూ ఏం మాట్లాడకుండా ఉండిపోతాడు. ఆ తర్వాత ఈ ఆడాళ్లు ప్రస్ట్రేషన్ తీరడానికి పెళ్లి చేసుకుంటారేమో అనుకుంటాడు.

డాడీ అని పిలుస్తావా అంటూనే

డాడీ అని పిలుస్తావా అంటూనే

తన తల్లి కోపం చూపించడంతో బాధ పడిన లక్కీ కాసేపటి తర్వాత తేరుకుంటాడు. అప్పుడు నందూ దగ్గరకు బిక్కముఖం వేసుకుని వస్తాడు. అప్పుడా చిన్నారి 'నువ్వు మా డాడీ కాదు కదా. నేను, మమ్మీ గొడవ పడుతుంటే మధ్యలో ఎందుకు వచ్చావు. నావైపు ఎందుకు మాట్లాడావు' అని సూటిగా ప్రశ్నిస్తాడు. దీనికి నందూ 'అంటే ఇప్పుడు ఏంటి.. నన్ను డాడీ అని పిలుస్తావా' అని అడుగుతాడు. దీంతో లక్కీ 'అంతలేదు.. నిన్ను డాడీగా ఒప్పుకోడానికి నా మనసు ఒప్పుకోవాలి. అప్పటి వరకూ అలా ఉండలేను' అంటూ అక్కడి నుంచి వెళ్లిపోతాడు.

తులసిలో మార్పు.. ఆ డ్రెస్‌తోనే

తులసిలో మార్పు.. ఆ డ్రెస్‌తోనే

ప్రవళ్లిక మాటల ప్రభావం తులసిపై బాగానే చూపిస్తుంది. దీంతో ఎవరు ఏమనుకున్నా తనలా తాను ఉండాలని తులసి డిసైడ్ అవుతుంది. ఇందులో భాగంగానే ఇంట్లో కూడా జాగింగ్ డ్రెస్ వేసుకునే తిరుగుతుంది. అలా తన పనులు తాను చేసుకుంటూ ఉంటుంది. అంతేకాదు, గార్డెన్‌లోని గులాబీ చెట్లకు నీళ్లు పోస్తుంది. అప్పుడు ఆ మొక్కలతో మనసు విప్పి మాట్లాడుతుంది. అనంతరం దివ్య కోసం టిఫిన్ రెడీ చేస్తుంది. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X