Intinti Gruhalakshmi: లాస్యకు నందూ విడాకులు.. నిజం తెలుసుకున్న దివ్య.. ట్విస్ట్ ఇచ్చిన తులసి

తెలుగు బుల్లితెరపై సుదీర్ఘ కాలంగా ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రం ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' గురువారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!
Photos Courtesy: Star మా and Disney+Hotstar

బుధవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే:బుధవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. మాధవి భర్త మోహన్.. నందూకు బెయిల్ ఇచ్చి విడిపిస్తాడు. అప్పుడు దివ్య తండ్రిని పట్టుకుని ఎమోషనల్ అవుతుంది. అనంతరం రాజ్యలక్ష్మికి విక్రమ్ క్షమాపణలు చెబుతాడు. అంతలోనే దివ్య అక్కడకు రావడంతో అతడు ఆమెను మనసును ఇబ్బంది పెట్టేలా మాట్లాడతాడు. దీంతో దివ్య.. రాజ్యలక్ష్మి కాళ్లు పట్టుకుని క్షమాపణ అడుగుతుంది. తర్వాత విక్రమ్‌పై అసహనం వ్యక్తం చేస్తుంది. అంతేకాదు, ఇకపైనా తన పుట్టింటికి అలాగే వెళ్లిపోతానని అంటుంది. అనంతరం విక్రమ్.. దివ్యతో మంచిగా మాట్లాడే ప్రయత్నం చేస్తాడు.

Intinti Gruhalakshmi Serial Today Episode May 11th 2023

లాస్యకు విడాకులు ఇస్తానంటూ:పోలీస్ స్టేషన్ నుంచి వచ్చిన వెంటనే నందూను ఇంట్లోకి తీసుకెళ్లిన అనసూయ.. అతడిని కూర్చోబెట్టి మంచినీళ్లు ఇస్తుంది. ఆ తర్వాత ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావురా అని అడుగుతుంది. దీనికి నందూ 'లాస్యకు విడాకులు ఇద్దామనుకుంటున్నాను' అని సమాధానం చెప్తాడు. దీంతో అక్కడున్న అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. అప్పుడు పరందామయ్య 'ఇలాంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఒకటికి పది సార్లు ఆలోచించాలి. ఈ విషయంలో కూడా ఆలోచించి నిర్ణయం తీసుకో' అంటాడు.

Intinti Gruhalakshmi Serial Today Episode May 11th 2023

నందూకు అనసూయ సపోర్టు:ఇంట్లో వాళ్ల మాటలకు నందూ 'ఇది ఇప్పటికిప్పుడు తీసుకున్న నిర్ణయం కాదు.. ఎప్పుడైతే తను నన్ను జైల్లో పెట్టించిందో అప్పుడే నిర్ణయించుకున్నాను. అయినా తను మనందరినీ ఎన్ని ఇబ్బందులు పెట్టిందో తెలుసు కదా నాన్న' అంటాడు. దీనికి అనసూయ 'ఇంత జరిగాక వాడు మాత్రం లాస్యతో ఎలా కాపురం చేస్తాడు? వాడి పరిస్థితిని కూడా మనం అర్థం చేసుకోవాలి కదా' అని సపోర్ట్ చేస్తుంది. తర్వాత వింటున్నావా తులసి నువ్వు ఏమంటావు అని అడగ్గా.. వింటున్నాను అంటుంది. కానీ, తులసి మాత్రం ఈ విషయంలో మౌనంగా ఉండిపోతుంది.

Intinti Gruhalakshmi Serial Today Episode May 11th 2023

విడాకులు పరిష్కారం కాదని:తులసిని సలహా ఇవ్వమని అడగ్గా.. 'అది భార్యాభర్తలకు సంబంధించిన విషయం. మధ్యలో నేను కలుగ చేసుకోవడం బాగోదు' అని అంటుంది. దీంతో పరందామయ్య 'ఏం చేయాలో తెలియని స్థితిలో నిన్ను సలహా అడుగుతున్నాము. మంచి చెడు కాస్త చెప్పు' అంటాడు. అప్పుడు తులసి 'చిన్న విషయానికి కోడలికి విడాకులు ఇవ్వటం ఏంటి అని మీరు చెప్పవలసింది పోయి నన్ను అడుగుతున్నారు ఏంటి మావయ్య? అయినా ఎంతమందికని విడాకులు ఇచ్చుకుంటూ పోతారు. వీలైతే సర్దుకోండి లేదంటే గొడవపడండి. అంతేకానీ విడాకులు ఇవ్వటం అనేది పరిష్కారం కాదు. సమయం వచ్చింది కదా అని నేను మిమ్మల్ని దెబ్బటం లేదు కానీ మీరు చేసేది సరైనది కాదు. మీరు పిల్లలకు ఏ మెసేజ్ ఇస్తున్నారు' అని అక్కడి నుంచి వెళ్లిపోతుంది.

Intinti Gruhalakshmi Serial Today Episode May 11th 2023

ఆయనే వెళ్లిపోతారు అంటూ:దివ్య దగ్గరికి వచ్చి ఆమె కాళ్ళు పట్టుకోవటానికి విక్రమ్ ప్రయత్నిస్తాడు. దీంతో ఆమె కాళ్లను వెనక్కి తీసేసుకొని అక్కడ నుంచి కోపంగా డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళిపోతుంది. అయినా విక్రమ్ ఆమె వెనకే వస్తాడు. దీంతో అక్కడ పని చేసుకుంటున్న ప్రియ వెళ్ళిపోబోతుంది. అప్పుడు దివ్య 'నువ్వేమీ వెళ్లక్కర్లేదు. నీ పని చూసుకో. నా వెనక తిరుగుతున్నారు కదా ఆయనే వెళ్ళిపోతారు' అంటూ కోప్పడుతుంది. దీంతో విక్రమ్ 'చెప్పిన మాట కాస్త ఓపిగ్గా విను రాత్రంతా వెళ్ళిపోయావు కనీసం ఫోన్ ఇంఫాం చేయలేదు మావయ్య గారు జైల్లో ఉంటారని ఊహించను కదా' అంటాడు.

Intinti Gruhalakshmi Serial Today Episode May 11th 2023

నీ గురించే భయపడ్డానంటూ:తర్వాత దివ్యకు మరింతగా వివరిస్తూ 'దయచేసి నన్ను అర్థం చేసుకో' అని బ్రతిమాలుతాడు. దీంతో దివ్య 'ఇప్పటి వరకు అర్థం చేసుకున్నానని అనుకున్నాను. కానీ తప్పుగా అర్థం చేసుకున్నానని ఇప్పుడే అర్థమైంది. ఎన్నాళ్ళ నుంచి కలిసి ఉంటున్నాము. నా మెంటాలిటీ ఏంటో మీకు తెలియదా? అత్తగారిని నిర్లక్ష్యం చేస్తానని ఎందుకనుకున్నారు' అని నిలదీస్తుంది. దీంతో విక్రమ్ 'అది నువ్వు ఏమైపోయావు అనే భయంతో చేసింది' అంటాడు. అప్పుడు అక్కడే ఉన్న ప్రియ 'అందుకే పరిస్థితి ఇంతవరకు వచ్చింది. మీ మనసు చాలా మంచిది ఏ పని అయినా మనసుతో ఆలోచించి చేయండి' అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.

Intinti Gruhalakshmi Serial Today Episode May 11th 2023

నాకోసం ఆలోచించండి నాన్న:ఇక, తల్లిదండ్రుల దగ్గరికి వచ్చిన నందూ 'మనసంతా ఆందోళనగా ఉంది. నా బ్రతుకు కన్ఫ్యూజన్‌లో పడినట్లుగా ఉంది' అంటాడు. అప్పుడు పరందామయ్య 'అలాంటప్పుడు ఆ మనసుకు విశ్రాంతి ఇవ్వడమే మంచిది' అని సలహా ఇస్తాడు. దీనికి నందూ 'నేనున్న పరిస్థితులలో అది ఎలా కుదురుతుంది? మీరు కూడా నేను లాస్యకి డైవర్స్ ఇవ్వడాన్ని తప్పుగా అనుకుంటున్నారా? మీరు లాస్య కోసం కాదు నాకోసం ఆలోచించండి' అంటాడు.

Intinti Gruhalakshmi

నీ వల్ల తులసి బాధపడొద్దు:నందూ మాటలకు పరందామయ్య 'నువ్వు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా నీ తల్లిదండ్రులుగా నీ వెనుక మేము ఉంటాము. కానీ నువ్వు తీసుకునే నిర్ణయం వల్ల తులసి బాధపడకూడదు. ఇప్పటికే ఆమెకి మన వల్ల చాలా అన్యాయం జరిగింది. ఇక మీదట ఈ గొడవల్లోకి తనని లాగొద్దు. నీ జీవితానికి సంబంధించిన నిర్ణయం నువ్వే తీసుకో' అని సలహా ఇస్తాడు. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X