Intinti Gruhalakshmi Today Episode: నందూకు ఫ్రెండ్ నుంచి భారీ ఆఫర్.. ఇంటర్వ్యూలో తులసికి బిగ్ షాక్

తెలుగు బుల్లితెపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి భారీ నుంచి అతి భారీ స్థాయిలో స్పందన దక్కుతుందన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' గురువారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరు కూడా చూసేయండి మరి!
Photos Courtesy: Star మా and Disney+Hotstar

బుధవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

బుధవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

బుధవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. మదర్ థెరిస్సా ఫౌండేషన్ ఈవెంట్‌లో బెస్ట్ మదర్‌గా గెలిచిన తర్వాత తులసిపై ప్రవళ్లిక ప్రశంసల వర్షం కురిపిస్తుంది. అంతేకాదు, ఆమెను నీకు నచ్చినట్లే ఉండు అంటూ సలహాలు ఇస్తుంది. ఇక, కాంపిటీషన్‌లో ఓడిపోయిన లాస్య.. లక్కీని ఇంట్లోకి తీసుకెళ్లి కొడుతుంది. అప్పుడు నందూ వచ్చి ఆపగా.. అతడిని తులసి ఫ్యామిలీ మీదకు రెచ్చగొడుతుంది. దీంతో నందూ కూడా కోపంతో రగిలిపోతూ ఉంటాడు. అనంతరం ప్రవళ్లిక సలహా మేరకు తులసి తనను తాను మార్చుకుంటుంది. జాగింగ్ డ్రెస్‌తోనే తిరుగుతూ ఉంటుంది.

తులసి డ్రెస్ చూసి అందరూ షాక్

తులసి డ్రెస్ చూసి అందరూ షాక్

ప్రవళ్లిక చెప్పిన ప్రకారం తనలా తాను ఉండాలని డిసైడ్ అయిన తులసి.. టాప్, ప్యాంట్‌తోనే ఇంటి పనులు చేస్తుంది. ఆ తర్వాత రెడీ అవ్వడం కోసం తన రూమ్‌లోకి వెళ్తుంది. ముందు చీర కట్టుకుందామని అనుకుంటుంది కానీ, దానికంటే ప్రవళిక తీసుకొన్న డ్రెస్ వేసుకుందామని అనుకుంటుంది. ఆమెను ఒకసారి గుర్తుకు తెచ్చుకొని.. వెళ్లి రెడీ అవుతుంది. అప్పుడే పరందామయ్య, అనసూయ ఇద్దరూ కాసేపు సరదాగా మాట్లాడుకుంటారు. ఇంతలో తులసి చుడీదార్ వేసుకొని వస్తుంది. దీంతో ఇంట్లోని వాళ్లందరూ ఆమెను అలా చూసి ఒక్కసారిగా షాక్‌కు గురి అవుతారు.

జాబ్ కోసం ఇంటర్వ్యూకు తులసి

జాబ్ కోసం ఇంటర్వ్యూకు తులసి

తులసి డ్రెస్ చూసి అనసూయ బాగుందని అంటుంది. అలాగే పరందామయ్య 'ఇన్నేళ్ల ప్రయాణం తర్వాత కూడా కాలం నిన్ను మొదటి మెట్టు మీదనే నిలబెట్టి యుద్ధం చేయమంటోంది' అంటూ ఆల్ ది బెస్ట్ చెబుతుంది. ఇంతలో ఆమెకు ప్రవళ్లిక ఫోన్ చేసి ఈరోజు రెగ్యులర్ చెకప్‌కు హాస్పిటల్‌కు వెళ్తున్నావా అని అడిగి.. నేను కూడా నీతో వస్తా అంటుంది. దీనికి తులసి 'నువ్వెందుకు.. నేను ఇంటర్వ్యూకు వెళ్తున్నా. అదయ్యాక చెకప్‌కు వెళ్తా' అంటుంది. దీంతో నీ ఇంటర్వ్యూ ఎక్కడో చెప్పు.. నేను అక్కడికి వచ్చేస్తా అని దివ్యను డ్రాప్ చేసి వెళ్లిపోతుంది.

నందూకు ఫ్రెండ్ కంపెనీలో జాబ్

నందూకు ఫ్రెండ్ కంపెనీలో జాబ్

కెఫేలో వచ్చే సంపాదన సరిపోవడం లేదని బాధ పడుతోన్న నందూ ఓ కంపెనీకి వెళ్తాడు. అది అతడి ఫ్రెండ్ సొంత కంపెనీనే. నందూను చూసిన వెంటనే అతడు 'అప్పుడు కలిసి బిజినెస్ చేద్దామని నీకు చాలా ఆఫర్లు ఇచ్చాను కానీ.. నువ్వు ఓకే చెప్పలేదు' అంటాడు. దీనికి నందూ 'ఏం చేద్దాం.. శని నా నెత్తిన కూర్చున్నాడు' అంటాడు. అప్పుడు ఫ్రెండ్ 'నీలాంటి టాలెంటెడ్ పర్సన్స్ ఎనర్జీ అస్సలు వేస్ట్ కాకూడదు. ఈరోజు నుంచి నువ్వు నా కంపెనీలో ఆపరేషన్స్ మేనేజర్‌వు' అంటాడు. దీంతో థాంక్యూ చెబుతాడు నందూ. ఇద్దరూ కాసేపు సరదాగా మాట్లాడుతారు.

నందూ ఫ్రెండ్ కంపెనీకు తులసి

నందూ ఫ్రెండ్ కంపెనీకు తులసి

నందూ, తన ఫ్రెండ్‌తో కలిసి మాట్లాడుతుండగానే.. అదే కంపెనీకి తులసి ఇంటర్వ్యూకు వస్తుంది. వచ్చీ రావడమే రిసెప్షనిస్ట్ దగ్గరకు వెళ్లి.. ఇంటర్వ్యూకు వచ్చాను అని చెబుతుంది. దీంతో ఆమె మీరు ఇక్కడ వెయిట్ చేయండి. నేను సార్‌కు చెప్పి వస్తాను అంటుంది. ఆ తర్వాత సార్.. ఇంటర్వ్యూ కోసం ఒక లేడీ వచ్చారు అంటుంది. దీంతో సరే రమ్మను అంటాడు. నందూ కూడా అక్కడే కూర్చుంటాడు. తులసి లోపలికి వస్తుంది. గుడ్ మార్నింగ్ సార్ అంటుంది. ఇంతలో అక్కడే ఉన్న నందూను చూసి షాక్ అవుతుంది. ఆ తర్వాత ఊపిరి పీల్చుకుని కూర్చుంటుంది.

తన సత్తా గురించి చెప్పిన తులసి

తన సత్తా గురించి చెప్పిన తులసి


కంపెనీ యజమానితో తులసి 'సార్.. నేను పెద్దగా చదువుకోలేదు. కానీ, జీవితాన్ని పూర్తిగా చదివేశాను' అంటుంది. అప్పుడాయన మినిమన్ క్వాలిఫికేషన్ లేకుండా ఉద్యోగం ఇవ్వడం కుదరదు అంటాడు. దీనికి తులసి 'కొంచెం ఓపిక చేసుకొని నా ఫైల్ చూడండి. నేను ఏం సాధించానో మీకు తెలుస్తుంది. మూతపడిన ఒక ఫ్యాక్టరీని నేను ప్రాఫిట్‌లోకి తీసుకొచ్చాను. పని చేయాలంటే చదువే కావాలా? కష్టపడే నైజం, నిజాయితీ ఉంటే చాలదా? మీరు నాకు ఎలాంటి పని అయినా ఇవ్వండి. నేను కష్టపడి పని చేస్తాను' అంటూ తన సత్తా గురించి ఆయనకు వివరిస్తుంది.

ఇంటర్వ్యూలో తులసికి భారీ దెబ్బ

ఇంటర్వ్యూలో తులసికి భారీ దెబ్బ

ఎంత చెప్పినా కంపెనీ ఓనర్ వినడు. దీంతో తులసి 'నా మీద చాలా బాధ్యతలు ఉన్నాయి.. అర్థం చేసుకోండి ప్లీజ్' అంటూ ప్రాధేయపడుతుంది. అప్పుడాయన 'మీ బాధ్యతలతో మాకు సంబంధం ఏంటి? ఇంతకీ మీ ఆయన ఏం చేస్తాడు' అని అడుగుతాడు. దీంతో విడాకులు తీసుకున్నాను అని చెబుతుంది. దీనికి ఆయన 'చూడండి తులసి గారు.. మీ కథ నా గుండెను పిండేసింది. సింపథీ చూపించగలను తప్ప ఏం చేయలేను. మా కంపెనీ పాలసీ ప్రకారం బేసిక్ క్వాలిఫికేషన్ లేకుండా జాబ్ ఇవ్వడం కుదరదు' అంటాడు. దీంతో అక్కడి నుంచి వెళ్లిపోతుంది.

నందూ రిఫరెన్స్‌తో వెనక్కి పిలిచి

నందూ రిఫరెన్స్‌తో వెనక్కి పిలిచి

తులసి అలా వెళ్లిపోగానే నందూ.. తన స్నేహితుడికి ఒక విషయం చెప్పాలి అని ఏదో అంటాడు. దీంతో అనంతరం తులసిని వెనక్కి పిలుస్తారు. అప్పుడా యజమాని 'మీరు నందూ భార్య అని ఒక మాట ముందే చెప్పి ఉంటే చాలు కదా. అపాయింట్‌మెంట్ ఆర్డర్ చేతుల్లో పెట్టేవాడిని కదా' అంటాడు. దీంతో తులసి 'నంద గోపాల్ భార్యనని నేను చెప్పలేదు. నంద గోపాల్ భార్య అని నాకోసం ఏం చేయకండి. నాకు భర్త లేడు. నేను ఒంటరి ఆడదాన్ని' అంటూ కోపంతో నందూ వైపు చూస్తూ సమాధానాలు చెబుతుంది. ఆ తర్వాత ఆమె అక్కడి నుంచి కోపంతో వెళ్లిపోతుంది.

తులసితో గొడవకు దిగిన నందూ

తులసితో గొడవకు దిగిన నందూ

తులసి వెళ్లిపోయిన తర్వాత ఆ కంపెనీ యజమాని నందూతో 'నువ్వేంటో తెలిశాక అసహ్యంగా ఉంది. ఇంకోసారి నన్ను కలవడానికి ట్రై చేయకు. నాకేం చెప్పకు వెళ్లు' అంటాడు. దీంతో నందూ కూడా అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అనంతరం తులసి దగ్గరికి వెళ్లి ఆమె చేయి పట్టుకుంటాడు. అంతేకాదు, 'నువ్వు అడుగడుగునా నా జీవితానికి అడ్డు పడుతున్నావు' అంటాడు. దీంతో తులసి నాకు అలాంటి సరదాలేవీ లేవు అంటుంది తులసి. అలా ఇద్దరి మధ్య వాగ్వాదం మొదలవుతుంది. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైపోయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X