Intinti Gruhalakshmi: తులసి ఇంటి ముందు ధర్నా.. కేసు పెడతానని వార్నింగ్.. రాజ్యలక్ష్మి మరో ప్లాన్
ఎప్పటికప్పుడు కొత్త షోలు ప్రారంభం అవుతోన్నా.. తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రం ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' శుక్రవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!
Photos Courtesy: Star మా and Disney+Hotstar
గురువారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే:గురువారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. ఇంటికి వచ్చిన తర్వాత నందూ ఎమోషనల్ అవుతూ ఉంటాడు. దీంతో అతడిని అనసూయ దగ్గరకు తీసుకుని ఏం చేయబోతున్నావు అని అడుగుతుంది. అప్పుడతను లాస్యకు విడాకులు ఇస్తానని అంటాడు. దీనికి అందరూ సపోర్టుగానే మాట్లాడతారు. కానీ, తులసి మాత్రం అతడి నిర్ణయంపై అసహనం వ్యక్తం చేస్తూ క్లాస్ పీకుతుంది. ఇక, తనపై కోపంగా ఉన్న దివ్యను కూల్ చేసేందుకు విక్రమ్ ప్రయత్నిస్తుంటాడు. కానీ, ఆమె దూరంగా వెళ్లిపోతుంది. చివరకు ఇద్దరూ మాట్లాడుకుంటారు. దీంతో అసలు నిజాలను తెలుసుకుంటారు.

తులసికి రాములమ్మ సలహాలు:రాములమ్మ.. తులసి దగ్గరికి వస్తుంది. అప్పుడు 'నందూ బాబు గారు అయోమయంలో ఉన్నారు. ఎవరికైనా నచ్చని మనుషులతో ఉండటం అంటే కష్టమే. అందులో తప్పేముంది ఎందుకు నందూ బాబు గారిని ఇబ్బంది పెడుతున్నారు' అని తులసిని నిలదీస్తుంది. దీనికామె 'నేను ఇబ్బంది పెట్టడం ఏంటి అంటుంది. దీంతో రాములమ్మ 'మీరు చెప్పడం వల్లే ఆ పెద్ద వాళ్ళు ఇద్దరు కూడా నందూ బాబు వెనక లేకుండా పోయారు. ఆయన్ని చూస్తే జాలేస్తుంది' అంటుంది. దీంతో తులసి నేను సలహా మాత్రమే ఇచ్చాను. ఆయన్ని పాటించమనలేదు అంటుంది.

నాకు కావాల్సింది ఈ భుజమే:ఇంట్లో జరిగిన రచ్చ తర్వాత బాధ పడుతోన్న దివ్య దగ్గరకు విక్రమ్ వస్తాడు. అప్పుడు అతడి భుజంపై దివ్య వాలిపోయి బాధపడుతుంటుంది. అంతేకాదు, 'నాకు కష్టం వస్తే నేను కోరుకునేది ఈ భుజాన్నే. ఏ భార్యకైనా భర్త భుజం మీద తలవాలిస్తే ఆమెకి కొండంత ధైర్యం. నేను నీ నుంచి కోరుకునేది అదే విక్రమ్' అంటుంది. దీనికతడు 'ఈ భుజం ఎప్పటికీ నీదే' అంటాడు. తర్వాత దివ్య 'నేను ఎంతో ఇష్టపడే మా నాన్న కటకటాల్లో ఉండేసరికి తట్టుకోలేకపోయాను. అదే బాధతో ఇంటికి వచ్చి నీ ఒళ్ళో పడుకొని నా బాధను చెప్పుకోవాలి అనుకున్నా' అని చెప్తుంది.

ఎలాంటి సాయమన్నా చేస్తా:ఆ తర్వాత దివ్య 'నీతో బాధ చెప్పాలనుకుని వస్తే గుమ్మంలో నిలబడి నన్ను నిలదీసే సరికి నాకు బాగా కోపం వచ్చింది. అందుకే అందరి ముందు నీతో ఎదిరించి మాట్లాడాను. నన్ను క్షమించు విక్రమ్' అంటుంది. దీనికతడు 'చిన్నప్పటి నుంచి నాకు మా అమ్మే ప్రపంచం. తను నీకోసం బాధపడుతుంటే భరించలేకపోయాను. అందుకే అలా మాట్లాడాను. ఇంతకీ మావయ్య గారు జైలుకు ఎందుకు వెళ్లారు' అని అడుగుతాడు. దీంతో దివ్య జరిగిందంతా చెప్తుంది. అప్పుడు విక్రమ్ 'ఎలాంటి సాయం అవసరమైన నీకు ఎప్పుడూ అండగా ఉంటాను' అని భరోసా ఇస్తాడు.

మళ్లీ రెచ్చగొట్టిన బసవయ్య:విక్రమ్, దివ్య మాట్లాడుకున్న మాటలను విన్న బసవయ్య వెంటనే రాజ్యలక్ష్మి దగ్గరకు వెళ్లి జరిగిన విషయం మొత్తం చెప్తాడు. అప్పుడామె 'ఏం జరిగినా మన మంచికే. అమ్మకి తెలియకుండా మాటిచ్చి.. అమ్మ మాటకి కట్టుబడి మాట తప్పుతాడు. అప్పుడు వాళ్ళిద్దరి మధ్య నిప్పు రగులుకుంటుంది. అప్పుడు నేను గెలిచినట్లు కదా. చూద్దాం వాళ్లిద్దరూ ఏం చేస్తారో' అని అతడితో అంటుంది. ఆ మాటలకి బసవయ్య సంతోషిస్తాడు.

మీ అబ్బాయికి చెప్పండని:రాములమ్మ తులసి దగ్గరు వచ్చి 'మీరు పూర్తిగా మారిపోయారు.. ఇంట్లో ఎవరిని పట్టించుకోవడం లేదు' అనగా.. ఏం జరిగింది అంటుంది. అప్పుడామె 'నందూ బాబు జైలు నుంచి వచ్చిన దగ్గర నుంచి ఏమి తినలేదు. ఒంటరిగా ఉండిపోయారు' అంటుంది. దీంతో తులసి 'చూసుకోవటానికి అత్తయ్య మామయ్య ఉన్నారు' అనగా.. మీరున్నారని వాళ్లు పట్టించుకోవట్లేదు అంటుంది రాములమ్మ. అంతలోనే అనసూయ అక్కడికి వస్తుంది. అప్పుడు తులసి 'పంతాల కోసం భోజనం మానేయ వద్దని మీ అబ్బాయికి చెప్పండి. నేను చెప్పానని చెప్పకండి' అంటుంది. తర్వాత అనసూయ వెళ్లి నందూను తినమని అడగ్గా.. 'నాకు తినాలనిపించడం లేదమ్మా తులసికి చేసిన అన్యాయానికి ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్నా' అంటాడు.

ఇంటి ముందు లాస్య ధర్నా:లాస్య కొందరు ఆడవాళ్ళను తీసుకొచ్చి నందూ ఇంటి ముందు ధర్నా చేస్తుంది. భార్యను గౌరవించడం లేదంటూ వాళ్లంతా నందూను తిడుతుంటారు. అప్పుడు అనసూయ 'నిజా నిజాలు తెలుసుకోకుండా నా కొడుకుని ఏమీ అనొద్దు' అని బ్రతిమాలుతుంది. అప్పుడు ఆమెను కూడా వాళ్లంతా నోటికొచ్చినట్లు అంటారు. తర్వాత 'ఏది మొగుణ్ణి వదిలేసిన కూడా ఇంకా మొగుడు చంకనే కూర్చున్న తులసి ఇంట్లో ఉందా లేకపోతే వెనుకదారి నుంచి పారిపోయిందా రమ్మనండి' అంటాడు. దీంతో తులసి వచ్చి 'నేను వాళ్ళ ఇంట్లో ఉండటం కాదు.. వాళ్లే మా ఇంట్లో ఉంటున్నారు. కావాలంటే డాక్యుమెంట్స్ చూపిస్తాను' అని సమాధానం చెప్తుంది.

లాస్యకు అన్యాయం జరిగితే:తులసి మాటలకు ఆ ఆడవాళ్లు 'వాళ్ళెందుకు మీ ఇంట్లో ఉంటున్నారు? లేకపోతే నువ్వు ఎందుకు నీ భర్తకి బెయిల్ విషయంగా హెల్ప్ చేస్తున్నావు' అని ప్రశ్నిస్తారు. దీంతో తులసి 'మీరెందుకు ఏ సంబంధమూ లేకపోయినా లాస్యకు హెల్ప్ చేస్తున్నారు? నేను అందుకే ఆయనకు హెల్ప్ చేస్తున్నాను. కేసు కోర్టులో ఉంది. తీర్పు ఇవ్వాల్సింది కోర్టు.. మీరు కాదు. అప్పటివరకు ఓపిక పట్టండి లేకపోతే నేనే మీ మీద కేసు పెడతాను' అని బెదిరిస్తుంది. దీంతో వాళ్లంతా 'నువ్వు అన్నట్లే ఓపిక పడతాము. ఒకవేళ లాస్య కి అన్యాయం జరిగితే మాత్రం ఆమె వెనకాలే మేము ఉంటాము' అంటాడు. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.


Click it and Unblock the Notifications











