For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Intinti Gruhalakshmi Today Episode: డాక్టర్ చెప్పిన దానికి తులసి షాక్.. లాస్యకు నిజం చెప్పిన నందూ

  |

  మిగిలిన భాషల కంటే తెలుగు బుల్లితెపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి భారీ నుంచి అతి భారీ స్థాయిలో స్పందన దక్కుతుంది. సుదీర్ఘ కాలంలో ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' శుక్రవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరు కూడా చూసేయండి మరి!
  Photos Courtesy: Star మా and Disney+Hotstar

  గురువారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  గురువారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే


  గురువారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. ప్రవళ్లిక సలహాతో తనను తాను మార్చుకోవాలని డిసైడ్ అయిన తులసి.. ఇంటర్వ్యూకు వెళ్లేందుకు చీరకు బదులుగా చుడీదార్ వేసుకుని రెడీ అవుతుంది. దీంతో ఆమెను చూసిన ఇంట్లో వాళ్లంతా షాక్ అవుతారు. ఇక, నందూ ఓ కంపెనీలోకి వెళ్తాడు. అది అతడి ఫ్రెండ్ కంపెనీనే. నందూకు ఆ ఫ్రెండ్ జాబ్ ఇస్తాడు. దీంతో ఇద్దరూ సంతోషంగా మాట్లాడుతుంటారు. అంతలో తులసి అక్కడకు ఇంటర్వ్యూకు వస్తుంది. ముందు జాబ్ ఇవ్వని ఆయన.. నందూ భార్య అని తెలిసి ఇస్తానంటాడు. దీంతో తులసి ఆ జాబ్ వద్దని వెళ్లిపోతుంది.

  ప్రియుడితో ఒకే రూంలో పాయల్ రాజ్‌పుత్: ఏకంగా అలాంటి పని చేస్తూ షాకిచ్చిందిగా!

  నందూకు తులసి గట్టి వార్నింగ్

  నందూకు తులసి గట్టి వార్నింగ్


  రికమండేషన్‌తో జాబ్ వద్దని బయటకు వచ్చేస్తోన్న తులసిని.. వెనకాలే వచ్చిన నందూ అడ్డుకుంటాడు. దీంతో ఇద్దరి మధ్య వాదన జరుగుతుంది. అప్పుడు తులసి 'మీరు నా మీద చూపించే జాలి నాకు అవసరం లేదు. పెద్దమనసుతో ఇప్పించే ఉద్యోగమూ నాకు అవసరం లేదు. మళ్లీ నా విషయంలో ఇంకోసారి జోక్యం చేసుకోకండి' అంటూ సీరియస్ వార్నింగ్ ఇస్తుంది. కానీ, నందూ మాత్రం 'నీ వల్ల నా ఫ్రెండ్ ముందు పరువు పోయింది. మర్యాదగా వచ్చి మనం విడిపోడానికి కారణం నువ్వు అని వాడి ముందు ఒప్పుకో' అంటాడు. కానీ, తులసి రానని వెళ్లిపోతుంది.

  తులసిని మెచ్చుకున్న ప్రవళ్లిక

  తులసిని మెచ్చుకున్న ప్రవళ్లిక

  తులసి ఆ కంపెనీ నుంచి బయటకు రాగానే తన కోసం ఎదురు చూస్తున్న ప్రవళ్లిక కనిపిస్తుంది. కోపంతో వచ్చిన తులసికి ఆమె చాక్లెట్ ఇస్తుంది. దీంతో తులసి 'ఇప్పుడు నాకు ఇదెందుకు ఇచ్చావు? నేను ఏం గెలిచానని. రావాల్సిన ఉద్యోగాన్ని పోగొట్టుకున్నాను' అంటుంది. దీనికి ప్రవళ్లిక 'ఉద్యోగం పోతే పోయింది కానీ, ఆత్మాభిమానాన్ని గెలిచావు కదా. అవును తులసి అన్నీ ఉన్నప్పుడు వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకోవడం వేరు.. ఏమీ లేనప్పుడు వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకోవడం వేరు. నువ్వు సాధించావు అని చెప్పడానికి ఇది చాలు' అంటూ తెగ మెచ్చుకుంటుంది.

  గర్భంతోనూ స్టార్ హీరోయిన్ హాట్ ట్రీట్.. టాప్ అందాలను హైలైట్ చేస్తూ దారుణంగా!

  నందూ గురించి వాడీ వేడి చర్చ

  నందూ గురించి వాడీ వేడి చర్చ

  తులసి చాక్లెట్ తింటూ ఉండగా.. మీ ఆయన మీద నీకు చాలా ద్వేషం ఉన్నట్టుంది అంటుంది ప్రవళిక. దీంతో ఎవరు మా ఆయన అంటుంది. మీ మాజీ భర్త అంటుంది. అప్పుడు తులసి 'నాకు ఆయన మీద ఎందుకు ద్వేషం ఉంటుంది. అది వైరాగ్యం కావచ్చు. ఒకరిని ఒకరం ఇష్టపడి పెళ్లి చేసుకున్నాం. పాతికేళ్ల తర్వాత ఆయనకు నా మీద ఇష్టం చచ్చిపోయింది' అంటుంది. అప్పుడు ప్రవళ్లిక 'కాదు.. ఇంకో మనిషి మీద ఇష్టం పుట్టుకొచ్చింది. అందుకే నీపై ఇష్టాన్ని చంపుకున్నాడు. తను అవకాశవాది' అంటుంది. దీంతో తులసి అతడి గురించి మాట్లాడదంటుంది.

  తులసికి స్వేచ్ఛ.. ఆస్పత్రిలోనే

  తులసికి స్వేచ్ఛ.. ఆస్పత్రిలోనే

  ప్రవళ్లిక మాటలకు తులసి 'ఆయన గురించి మాట్లాడుకోవడం ఎందుకు? అన్నీ మరిచిపోయి ప్రశాంతంగా బతకాలని ఉంది. ఆ పక్షులు చూడు.. ఎంత స్వేచ్ఛగా.. ప్రకృతిని ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేస్తున్నాయో' అంటుంది. అప్పుడు ప్రవళ్లిక కార్ టాప్ ఓపెన్ చేయగా అక్కడ నిలబడి స్వేచ్ఛను ఆశ్వాదిస్తుంది తులసి. ఆ తర్వాత ఇద్దరూ కలిసి ఆస్పత్రికి వెళ్తారు. చెకప్ తర్వాత ప్రవళ్లిక మా తులసి హెల్త్ పొజిషన్ ఎలా ఉంది అని అడుగుతుంది. దీనికి డాక్టర్ 'చాలా ఇంప్రూవ్‌మెంట్ కనిపిస్తోంది. ఏ జబ్బునైనా మందులు ఒక స్టేజ్ వరకే క్యూర్ చేస్తాయి. మీ విషయంలో కూడా అదే జరుగుతోంది' అంటుంది. అప్పుడు తులసి 'నాకు ఇప్పుడు అర్థం అయింది. నా డాక్టర్ ఆవిడ కాదు.. నువ్వు అని' అని ప్రవళికతో అంటుంది.

  ఉల్లిపొర లాంటి డ్రెస్‌లో యాంకర్ స్రవంతి రచ్చ: ఎద అందాలను హైలైట్ చేస్తూ ఘోరంగా!

  తులసిని పాటలు పాడమంటూ

  తులసిని పాటలు పాడమంటూ


  ఆస్పత్రిలో చెకప్ చేయించుకున్న తర్వాత తులసితో ప్రవళ్లిక 'బతుకు తెరువు కోసం వెతుక్కుంటున్నావు. నీ వాళ్ల కోసం కష్టపడాలనుకుంటున్నావు. ఆ పడే కష్టం.. నీకు నచ్చిందయితే బాగుంటుంది కదా. పాటలనే నువ్వు ప్రొఫెషన్‌గా ఎందుకు మార్చుకోకూడదు. నీకు తెలిసిన విద్యనే వేరే వాళ్లకు నేర్పించు' అంటూ ఆమెను ప్రోత్సహించేలా సలహాలు ఇస్తుంది. దీనికి తులసి ఆలోచనలో పడిపోతుంది. ఆ తర్వాత 'ప్రస్తుత పరిస్థితుల్లో అది సాధ్యం కాని పని. దానికి సాధన చేయాలి. ఆ తర్వాతనే ఎవరికైనా నేర్పించడం కుదురుతుంది' అని బదులిస్తుంది.

  లాస్యకు నిజం చెప్పిన నందూ

  లాస్యకు నిజం చెప్పిన నందూ

  నందూ ఇంటికి వచ్చి చాలా కోపంగా ఉంటాడు. దీంతో లాస్య ఏమైంది అని అడుగుతుంది. అప్పుడామెకు అసలు విషయం చెబుతాడు. దీంతో లాస్య 'నువ్వు తులసికి ఎందుకు రికమెండ్ చేశావు? నువ్వెవరో తెలియదు అని ముఖం మీదే అన్నా కూడా నువ్వు ఎందుకు రికమెండ్ చేయాలి? మరిచిపో.. తనను ఇప్పటికైనా మరిచిపో. నేను నీ భార్యను. ప్రేమ చూపించాలని అనుకుంటే నా మీద చూపించు. ఇంకోసారి ఇలాంటి పని చేస్తే ఊరుకోను. ఎన్ని సార్లు పరువు పోతున్నా ఆమెనే ఎందుకు పట్టుకుని వేలాడతావు' అని వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోతుంది.

  శ్రీముఖికి బాలీవుడ్ స్టార్ హీరో బిగ్ సర్‌ప్రైజ్: ఏ అమ్మాయికీ దక్కని అదృష్టం ఈమెదే మరి!

  ప్రేమ్‌కు షాకిచ్చిన ఇంటి ఓనర్

  ప్రేమ్‌కు షాకిచ్చిన ఇంటి ఓనర్


  బారెడు పొద్దెక్కినా ప్రేమ్ లేవలేదని అనుకొని అతడిపై నీళ్లు పోయాలని శృతి అనుకుంటుంది. కానీ, ఆమెకు షాకిస్తూ.. 'ఈరోజు నీకు రెస్ట్ ఇస్తున్నాను. నేనే అన్ని పనులు చేస్తాను' అంటూ వంట చేస్తుంటాడు. అంతలో ఇంటి ఓనర్ అద్దె డబ్బుల కోసం అక్కడికి వస్తాడు. కానీ, అప్పటికే ప్రేమ్ వంట వండుతూ డ్యాన్స్ చేస్తుండగా చూసి అతడు కూడా కాళ్లు కదుపుతాడు. ఆ తర్వాత కొద్ది సేపటికి అతడి భార్య అక్కడకు వస్తుంది. దీంతో తన భర్తపై కోప్పడుతుంది. 'నువ్వు ఏ పని మీద ఇక్కడికి వచ్చావు? ప్రేమ్‌ను అద్దె డబ్బులు అడిగావా' అని సీరియస్ అవుతంది. అప్పుడు ప్రేమ్ రెండు రోజుల్లో శాలరీ రాగానే ఇచ్చేస్తా అంటాడు. దీంతో ఆమెకు కోపం వచ్చి.. రెండు రోజుల తర్వాత వస్తా అని వెళ్లిపోతుంది. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

  English summary
  Intinti Gruhalakshmi Episode 631: Tulasi Warns Nandhu to Stay Away From Her. After That House Owner Asked Rent To Prem Very Seriously.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X
  Desktop Bottom Promotion