Intinti Gruhalakshmi: రాజ్యలక్ష్మికి దివ్య ఝలక్.. నందూకు వ్యతిరేకంగా సాక్షాలు.. లాస్య బెదిరించడంతో!
ఇండియాలోని చాలా భాషల కంటే తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రం ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' సోమవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!
Photos Courtesy: Star మా and Disney+Hotstar
శనివారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే: శనివారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. ప్రియ తీరుపై అనుమానం వ్యక్తం చేసిన దివ్యకు విక్రమ్ తాతయ్య నిజాలు మొత్తం చెప్పేస్తాడు. ఆ తర్వాత ప్రియ కూడా తొలిసారి పెదవి విప్పి రాజ్యలక్ష్మి గురించి చెబుతుంది. దీంతో దివ్య అత్తగారిపై యుద్దం చేస్తానని అంటుంది. మరోవైపు, నందూ మందు తాగుతూ బాధ పడుతుండగా తులసి వెళ్లి ఆపుతుంది. ఆ సమయంలో ఇద్దరి మధ్య వాదనలు జరుగుతాయి. దీంతో నందూకు తులసి క్లాస్ పీకుతుంది. ఇక, దివ్య తన అత్తకు బుద్ధి చెప్పాలని అనుకుని ప్లాన్‌ను అమలు చేసేందుకు రెడీ అవుతుంది.

రాజ్యలక్ష్మికి ఝలక్ ఇచ్చిన దివ్య: అడగకుండానే రాజ్యలక్ష్మికి కాఫీ తీసుకు వచ్చిన దివ్య 'మా అత్తగారి మనసు చాలా మంచిది. ఆవిడ మా మంచినే కోరుకుంటుంది' అంటూ కాకా పడుతూ ఆమె పక్కనే కూర్చుంటుంది. దీంతో బసవయ్య భార్య 'అదేంటి అక్కడ కూర్చున్నావు? పెద్దవాళ్ళకి కాస్త మర్యాద ఇవ్వు' అంటుంది. దీనికి దివ్య 'మీరు ఎందుకు అలా అనుకుంటారు? నేను తన పక్కన కూర్చున్నందుకు మా అత్తగారు చాలా సంతోషిస్తుంది. కూతురు లేని లోటు తీరుస్తుంది అనుకుంటుంది' అని మోసేస్తుంది. తర్వాత పుట్టింటికి వెళ్లి వస్తాను అని అత్తగారితో చెప్తుంది.
అత్తయ్య అవనివ్వదు కదా అంటూ: పుట్టింటికి వెళ్లొస్తానని దివ్య అనగానే బసవయ్య భార్య 'అదేంటి మూడు రాత్రులు అవ్వకుండా గడప దాటకూడదు' అంటుంది. దీంతో దివ్య 'ఇంట్లో ఉన్నా.. అత్తయ్య అవనివ్వదు కదా' అని ఝలక్ ఇస్తుంది. దీంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. అప్పుడు బసవయ్య 'అదేంటి అలా అంటావు? ఆవిడకి ఏమి అవసరం' అని ప్రశ్నిస్తాడు. దీనికి దివ్య 'అంటే ముహూర్తాలు లేకపోతే ఆవిడ మాత్రం ఏం చేస్తారు? ముహూర్తం లేట్ అయితే నేను ఆగగలను కానీ విక్రమ్ ఆగలేడు. తను నా దగ్గరికి రాకుండా కాపలా కాయవలసిన బాధ్యత మీదే' అంటుంది.

అందరికీ వార్నింగ్ ఇచ్చిన దివ్య: ఆ తర్వాత దివ్య 'ఒకసారి నా భర్త నా చేతిలోకి వస్తే తర్వాత మీరు చేతులు ముడుచుకుని కూర్చోవాల్సిందే. తర్వాత మీ ఇష్టం' అంటూ వార్నింగ్ ఇచ్చేసి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఇక, దివ్య వెళ్లిపోయిన వెంటనే బసవయ్య 'నాకు ఏదో తేడా కొడుతుంది అక్కయ్య.. ఎందుకైనా మంచిది దివ్యతో జాగ్రత్త' అని హెచ్చరిస్తాడు. ఇదిలా ఉండగా.. కోర్టులో ఎలా నడుచుకోవాలో అత్తగారికి, మామగారికి మోహన్ ట్రైనింగ్ ఇస్తాడు. తులసికి కూడా ఏదో చెప్పబోతుంటే నేను కోర్టుకు రావటం లేదు అంటుంది. వాళ్లు బ్రతిమాలినా రాలేనని చెబుతుంది. దీంతో నందూ.. తులసిని ఈ గొడవలో ఇన్వాల్వ్ చేయకండి అంటాడు.
విక్రమ్‌ను తీసుకెళ్లిపోయిన దివ్య: విక్రమ్.. సంజయ్ దగ్గరకు వచ్చి 'మీతో హాస్పిటల్‌లో గొడవ పడింది ఎవరు? నా తమ్ముడిని అన్ని మాటలు అన్నాడంటే నాకు ఎంత అవమానం? వాడు ఎవడో చెప్పు' అని అడుగుతాడు. దీంతో సంజయ్ 'వదిలేయ్ అన్నయ్య.. అసలే వాడు ఎమ్మెల్యే మనిషి' అంటాడు. దీంతో విక్రమ్ 'ఎవడైతే మనకేంటి? రేపు పొద్దున్న హాస్పిటల్‌కు రమ్మను తేల్చుకుందాము' అంటాడు. అంతలోనే దివ్య అక్కడికి వచ్చి 'రేపు మనకి ప్రోగ్రాం ఉంది మర్చిపోయారా' అంటుంది. దీంతో అతడు 'అవును కదా.. అతనిని రేపు మధ్యాహ్నం రమ్మనమను' అని ఆమె వెనుక వెళ్తాడు.

నేను రంగంలోకి దిగనంతవరకే: విక్రమ్‌ను దివ్య తీసుకెళ్లగానే రాజ్యలక్ష్మి, బసవయ్య అక్కడకు వస్తారు. అప్పుడు బసవయ్య 'వీడు పూర్తిగా పెళ్ళాం కొంగు పట్టుకుని తిరుగుతున్నాడు. వీడు ఇంక మనకు కాకుండా చేజారి పోయినట్లే' అంటాడు. దీంతో రాజ్యలక్ష్మి 'ఏదైనా నేను రంగంలోకి దిగక ముందే.. దిగిన తరువాత నేనేంటో వాడితో పాటు నీకు కూడా అర్థమయ్యేలాగా చేస్తా' అంటూ కోపంతో వార్నింగ్ ఇస్తుంది.
లాస్య తరపున దొంగ సాక్షాలు: కోర్టుకు వచ్చిన లాస్యతో లాయర్ 'మీరు కేసు గెలవాలంటే మీ భర్త మిమ్మల్ని కొట్టినట్లుగా సాక్ష్యం కావాలి' అంటాడు. అప్పుడే అక్కడకు ఒకామె వస్తుంది. ఆమెను చూపిస్తూ.. 'ఒకప్పుడు తను మా దగ్గర పనిచేసేది' అంటూ డబ్బులు ఇస్తుంది. దీంతో ఆమె 'నందూ బాబు గారు రోజు అమ్మగారిని కొట్టేవారు. ఆయన లాంటి భర్త ఎవరికీ ఉండకూడదు. నన్ను కూడా చాలాసార్లు లాగారు. అని కన్నీరు పెట్టుకుని చెప్తే సరిపోతుందా' అని అడుగుతుంది. దీంతో ఆ లాయర్ 'ఈ ఎవిడెన్స్ చాలు. రెచ్చిపోతాను' అంటాడు.

అలా చేస్తే వాపసు తీసుకుంటా: తర్వాత తులసికి లాస్య ఫోన్ చేసి 'నన్ను బాగా చూసుకుంటాను.. తులసి వైపు ఎప్పుడు కన్నెత్తి చూడను అని బాండ్ పేపర్ రాసి ఇవ్వమను. అప్పుడు కాంప్రమైజ్ అవుతాను' అని అంటుంది. దీంతో తులసి 'ఎదుటి వాళ్ళు తప్పు చేశారని చెప్తున్నావు కానీ నీతో ఒప్పుకోవడం లేదు. కావాలని నువ్వే దివ్య జీవితాన్ని రాజ్యలక్ష్మికి తాకట్టు పెట్టాను. మరెప్పుడూ ఇలాంటి తప్పుడు పని చేయను అని నువ్వు కూడా బాండ్ పేపర్ మీద రాసి ఇవ్వు' అంటుంది. దీంతో లాస్య 'తెలివిగా ఇరికిద్దామనుకుంటున్నావేమో ఎలాగైనా ఈ కేసు నేనే గెలుస్తాను' అంటుంది. దీంతో తులసి ' అంత అహంకారం చూపించకు అది ఎప్పటికైనా ప్రమాదమే' అంటూ ఫోన్ పెట్టేస్తుంది. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.


Click it and Unblock the Notifications











