For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Intinti Gruhalakshmi Today Episode: తులసికి కొత్త ఉద్యోగం.. నందూకు లక్కీ షాక్.. ఓనర్‌తో ప్రేమ్ గొడవ

  |

  ఎన్నో ఏళ్లుగా తెలుగు బుల్లితెపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి భారీ నుంచి అతి భారీ స్థాయిలో స్పందన దక్కుతుంది. సుదీర్ఘ కాలంలో ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' మంగళవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరు కూడా చూసేయండి మరి!

  Photos Courtesy: Star మా and Disney+Hotstar

  సోమవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  సోమవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  సోమవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. దివ్యకు కాలేజ్‌లో ఫీజు కట్టాలని ప్రిన్స్‌పాల్ నందూకు ఫోన్ చేస్తుంది. దీంతో అతడు ఫీజు కట్టడానికి వస్తానని అంటాడు. అప్పుడే దివ్య తన తల్లి తులసిని ఫీజు రెడీ చేయమని చెప్పి కాలేజ్‌కు వెళ్తుంది. అంతలోనే అక్కడ నందూ కనిపిస్తాడు.

  అప్పుడు విషయం తెలుసుకుని నందూ తన ఫీజు కట్టడానికి వీలు లేదని అంటుంది. అంతేకాదు, తన తల్లి కాలేజ్ ఫీజు కడుతుందని చెప్పి అక్కడి నుంచి వచ్చేస్తుంది. దీంతో నందూ చాలా ఫీల్ అవుతాడు. ఆ తర్వాత ఆమెకు సర్ధి చెప్పే ప్రయత్నం చేస్తాడు. కానీ, ఆమె మాత్రం ఒప్పుకోదు.

  హీరోయిన్ హాట్ వీడియో షేర్ చేసిన వర్మ: ఈ టైమ్‌లో ఆ సౌండ్స్ బాగుంటాయి అంటూ!

   నందూ వైపు మాట్లాడిన తులసి

  నందూ వైపు మాట్లాడిన తులసి

  కాలేజ్ జరిగిన రచ్చ తర్వాత దివ్య కోపంగా ఇంటికి వస్తుంది. చేతిలో ఉన్న బ్యాగ్‌ను పడేసి తన తండ్రి కాలేజ్‌లో మాటలను గుర్తు చేసుకుంటుంది. దీంతో ఆమెను చూసిన తులసి.. 'ఏమైంది దివ్య? ఎందుకంత కోపంగా ఉన్నావు? కాలేజ్‌లో ఏమైనా జరిగిందా' అని అడుగుతుంది. దీనికి దివ్య 'డాడీ ఎందుకు కాలేజీకి వచ్చారు. ఆయన ఫీజు కట్టడానికి వచ్చారు? అయినా.. ఆయనెందుకు వచ్చారు' అని చెప్తుంది. అప్పుడు తులసి 'అవునా.. కాలేజీ వాళ్లు ఆయనకు ఫోన్ చేసి ఉంటారు. అందుకే వచ్చి ఉంటారు. నువ్వు ఆయనను అలా అనకూడదు' అంటుంది.

  అది నా పెంపకానికే మచ్చ అని

  అది నా పెంపకానికే మచ్చ అని

  తులసి ఎంత చెప్పినా దివ్య మాత్రం అస్సలు వినదు. అంతేకాదు, 'ఆయనకు నీ మీద ఎఫెక్షన్ లేనప్పుడు మా మీద కూడా ఉండకూడదు. మీ బాధ్యతతో పనిలేదు.. మామ్ చూసుకుంటుంది అని గట్టిగా చెప్పాను' అని చెబుతుంది. అప్పుడు తులసి 'అనవసరంగా ఆయన్ను ఇబ్బంది పెట్టావు దివ్య. ఆయన్ను తక్కువ చేసి మాట్లాడకు. ఆయన మీకు తండ్రి. నాతో బంధం ఎలా ఉన్నా.. మీతో మంచిగా ఉండాలి. మీ బాధ్యత ఆయనకు కూడా ఉంటుంది. అలా కాదని మీరు ఎదురు తిరిగితే.. అది నా పెంపకానికే అవమానం చేసినట్లు అవుతుంది' అని నచ్చజెబుతుంది.

  హాట్ డోస్ పెంచిన సీరియల్ నటి: పెళ్లైన కొత్తలోనే ఇలా రెచ్చిపోయిందేంటబ్బా!

  దివ్యకు పరందామయ్య మద్దతు

  దివ్యకు పరందామయ్య మద్దతు

  తులసి మాటలకు దివ్య 'డాడ్ నిన్ను బాధపెట్టారు. అవమానించారు. అది మరిచిపోయావా మామ్. నాకు డాడ్ అంటే ఇష్టమే కానీ, ఈ డాడ్ అంటే కాదు. మా మమ్మీని ఇష్టపడే డాడీ అంటేనే నాకు ఇష్టం' అంటూ సమాధానం చెప్తుంది. అప్పుడు పరందామయ్య 'చిన్నపిల్ల అయినా దివ్య కరెక్ట్‌గానే ఆలోచిస్తోంది' అని అంటుంది. దీనికి తులసి 'మా గొడవల వల్ల వాళ్లు తండ్రి ప్రేమకు దూరం కావద్దు. వాళ్లకు తండ్రి ప్రేమను దూరం చేసే హక్కు నాకు లేదు. అలా వీళ్లు ఆయనకు దూరం అయితే నేను స్వార్ధంగా చేసినట్లు అవుతుంది' అని వివరిస్తుంది.

  నందూకు షాక్ ఇచ్చేసిన లక్కీ

  నందూకు షాక్ ఇచ్చేసిన లక్కీ

  దివ్య ఫీజు విషయంలో తనకు అవమానం జరగడంతో నందూ కోపంతో ఇంటికి వస్తాడు. ఇంటి దగ్గర దివ్య గురించే ఆలోచిస్తూ ఉంటాడు. దివ్య నన్ను ఎందుకు అర్థం చేసుకోవడం లేదు అని అనుకుంటాడు. ఇంతలో అక్కడికి లక్కీ వస్తాడు. లక్కీని చూసి దగ్గరికి పిలుస్తాడు. కానీ.. ఆ బుడ్డోడు రానంటాడు. పర్లేదు రా నాన్న అంటాడు. మీరు ఇంట్లో లేరనుకున్నాను అంటాడు లక్కీ. అప్పుడు నందూనే అతడి దగ్గరికి వెళ్తాడు. అంతేకాదు 'నన్ను చూసి ఎందుకు అలా భయపడుతున్నావు' అని అడుగుతాడు. దీంతో మీ ముఖం చూస్తే అందరికీ భయం వేస్తుంది.. ఒక మా మమ్మీకి తప్ప అని సమాధానం చెప్తాడు.

  మసాజ్ వీడియో షేర్ చేసిన హీరోయిన్: ఒంటిపై నూలుపోగు లేకుండా ఘోరంగా!

  నందూకు బుద్దొచ్చేలా మాట్లాడి

  నందూకు బుద్దొచ్చేలా మాట్లాడి

  తనను చూసి చాలా భయపడిపోతోన్న లక్కీని దగ్గరకు తీసుకున్న నందూ.. ఈరోజు నుంచి నన్ను అంకుల్ అని కాదు.. డాడీ అని పిలువు అంటాడు. కానీ, లక్కీ మాత్రం 'నేను పిలవను. మీరంటే నాకు ఇష్టం లేదు. తులసి ఆంటిని వదిలేసి.. మా మమ్మీతో ఎందుకు ఉంటున్నారు. మీరు రాకముందు మా మమ్మీ నన్ను బాగా చూసుకునేది. కానీ, మీరు వచ్చినప్పటి నుంచి నన్ను సరిగ్గా చూసుకోవడం లేదు. మా మమ్మీని నన్ను దూరం చేసింది మీరే. అందుకే మీరంటే నాకు ఇష్టం లేదు' అంటూ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. దీంతో నందూకు మరో షాక్ తగిలినట్లు అవుతుంది.

  ఇంటి ఓనర్‌తో ప్రేమ్ ఫైటింగ్

  ఇంటి ఓనర్‌తో ప్రేమ్ ఫైటింగ్

  మ్యూజిక్ డైరెక్టర్ తిట్టడంతో ప్రేమ్ మనస్థాపానికి గురవుతాడు. దీంతో ఆ కోపంతోనే ఇంటికి వస్తాడు. దాని గురించే ఆలోచిస్తూ దిగులు పడుతుంటాడు. అంతలో ఇంటి ఓనర్ భర్త అక్కడకు వస్తాడు. అప్పటికే బాధలో ఉన్న ప్రేమ్‌ను తన ప్రవర్తనతో చిరాకు పెడుతుంటాడు. దీంతో ప్రేమ్ ఆయనకు మంచిగా చెప్పి చూస్తాడు. కానీ, ఆయన అస్సలు వినడు. అప్పుడు మీకు దండం పెడతాను.. ఇక్కడి నుంచి వెళ్లిపోండి అంటాడు. దీంతో ఆయనకు విపరీతమైన కోపం వస్తుంది. ఆ తర్వాత ఇద్దరూ ఒకరిపై ఒకరు అరుస్తూ గొడవ పెట్టుకుంటారు.

  F3 హీరోయిన్ ఎద అందాల విందు: ఈ డ్రెస్‌లో ఆమెనిలా చూశారంటే తట్టుకోలేరు!

  తులసికి దొరికిన కొత్త ఉద్యోగం

  తులసికి దొరికిన కొత్త ఉద్యోగం

  ఉదయాన్నే తులసి పార్కులో యోగా చేస్తూ ఉంటుంది. ఇంతలో ఇద్దరు పిల్లలు సరిగమప అని సంగీతం నేర్చుకుంటూ ఉంటారు. వాళ్లు సరిగ్గా పాడకపోవడంతో అక్కడకు వెళ్లిన తులసి అలా కాదు.. ఇలా అని చెప్పి వాళ్లకు పాడి చూపిస్తుంది. అంతేకాదు, మీరు చాలా బాగా పాడారు. కాస్త దృష్టి పెట్టండి అంటుంది. అంతలో వాళ్ల తల్లి వచ్చి 'మీకు ఇబ్బంది లేకపోతే మా పిల్లలకు సంగీతాన్ని నేర్పించండి' అంటుంది. దీంతో తులసి ఒప్పుకుంటుంది. అలా ఉద్యోగం దొరికినందుకు తులసి సంతోషిస్తుంది. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

  English summary
  Intinti Gruhalakshmi Episode 634: Tulasi Advises to Divya About Nandhu Relation. After That Tulasi Gets Job As Music Teacher. Then She Feels Happy.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X