Intinti Gruhalakshmi: కోర్టులో బుక్కైన నందూ.. వీడియో చూపించిన దివ్య.. నిజం తెలియడంతో ట్విస్ట్

చాలా భాషలతో పోల్చుకుని చూస్తే తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రం ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' బుధవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!
Photos Courtesy: Star మా and Disney+Hotstar

మంగళవారం ఎపిసోడ్‌లో జరిగిందిదే:మంగళవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. కోర్టుకు బయలుదేరుతున్న దివ్య, విక్రమ్‌ను ఆపిన రాజ్యలక్ష్మి పూజ ఉందని అంటుంది. అప్పుడే పంతులు కూడా అక్కడకు వచ్చి ఈరోజే లాస్ట్ అని అంటాడు. దీంతో దివ్య అత్తగారి ప్లాన్ అని గ్రహించి.. అందుకు తగ్గట్లుగానే ప్రవర్తిస్తుంది. తర్వాత కోర్టులో లాస్య తరపు లాయర్ తులసిని విచారిస్తాడు. అప్పుడామె సరైన సమాధానాలు చెప్తుంది. తర్వాత మోహన్ కూడా తులసి నుంచి కొన్ని నిజాలను రాబట్టే ప్రయత్నం చేస్తాడు. కానీ, లాస్య మాత్రం తనదైన యాక్టింగ్‌తో నందూదే తప్పు అన్నట్లుగా కోర్టులో చెబుతుంది.

Intinti Gruhalakshmi Serial Today Episode May 17th 2023

లాస్య క్యారెక్టర్ అలాంటిదే అని:విచారణకు బోనులోకి వచ్చిన తులసిని మాధవి భర్త మోహన్ 'లాస్య చెప్పినవన్ని నిజాలేనా' అని అడుగుతాడు. దీనికామె 'అంతా అబద్ధం.. మా పరువు తీయటానికి చేస్తున్న ప్రయత్నం ఇది' అంటుంది. అప్పుడు మోహన్ 'నందగోపాల్ గారు లాస్య వలలో పడి మిమ్మల్ని నిర్లక్ష్యం చేశారు కాబట్టి విడాకులు తీసుకున్నారు అంతేనా' అని ప్రశ్నిస్తాడు. దీనికి తులసి అవునన్నట్లుగా తలాడిస్తుంది. అప్పుడు మోమన్ 'లాస్య క్యారెక్టర్ అదే.. పరాయి వ్యక్తి భర్తని లాక్కొని ఆమెకి అన్యాయం చేసిందంటే ఆమె క్యారెక్టర్ ఎలాంటిదో మీరే ఊహించుకోండి' అంటాడు.

Intinti Gruhalakshmi Serial Today Episode May 17th 2023

నందూ టార్చర్ అనుభవించి:లాస్య క్యారెక్టర్‌పై మోహన్ వేస్తున్న నిందలకు ఆమె తరపున ఉన్న లాయర్ స్పందిస్తాడు. అప్పుడాయన 'నందగోపాల్ ఏమీ చిన్న పిల్లవాడు కాదు. ముగ్గురు బిడ్డల తండ్రి. ఈ వయసులో ఆయనను ఒకరు ప్రలోభాలకు గురి చేస్తారు అంటే ఎవరూ నమ్మరు' అని సమాధానం చెప్తాడు. అప్పుడు మోహన్ 'ఆడదాని వలలో పడటానికి వయసుతో సంబంధం ఏముంది? నిజానికి లాస్య వల్ల నా క్లయింట్ చాలా టార్చర్ అనుభవించాడు. ఈ లాస్య సాధారణమైన వ్యక్తి కాదని అర్థం చేసుకోవాలి' అంటాడు.

Intinti Gruhalakshmi Serial Today Episode May 17th 2023

మీ ఆటను కట్టిస్తాను అంటూ:తల్లి కోసం ఇంట్లో పూజా చేస్తోన్న సమయంలో విక్రమ్ 'నీకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయాను క్షమించు' అని దివ్యతో అంటాడు. దీనికామె 'అదంతా మనసులో పెట్టుకోవద్దు. మనస్ఫూర్తిగా పూజ చేయు' అంటుంది. ఇక, పూజ పూర్తయిన తర్వాత దివ్య అందరికీ హారతి ఇస్తుంది. ఆ తర్వాత అత్తగారికి హారతి ఇస్తూ మనసులో 'ఈరోజు నుంచి మన ఆట మొదలు.. మీ ఆట కట్టిస్తాను' అని అనుకుంటుంది. అప్పుడు ఆమె కూడా 'నువ్వు ఏం చేసినా నా కొడుకుని నా నుంచి దూరం చేయలేవు' అని మనసులో అనుకుంటుంది. తర్వాత హారతి పళ్లెం కింద పెడుతూ పంతులును కోపంగా చూస్తుంది. దీంతో అతడు 'ఈవిడ చూపులకి కాలిపోయేలాగా ఉన్నాను. అత్తగారి మీద కోపం నామీద చూపిస్తుందేంటి' అనుకుంటాడు.

Intinti Gruhalakshmi Serial Today Episode May 17th 2023

నందగోపాల్ ఒక స్త్రీ లోలుడు:కోర్టులో లాస్య తరపు న్యాయవాది 'నా క్లయింట్ లాస్య క్యారెక్టర్ గురించి మాట్లాడారు. కాబట్టి నందగోపాల్ క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నాము. ఆయన ఒక స్త్రీ లోలుడు' అంటాడు. దీంతో అక్కడు ఉన్న వాళ్లంతా షాక్ అవుతారు. ఆ వెంటనే లాస్యను బోనులోకి రమ్మని అసలు విషయం చెప్పమని అడుగుతాడు. దీనికి లాస్య 'అతను స్త్రీ లోలుడు. ఆ విషయం తెలిసేసరికే మా పెళ్లి అయిపోయింది' అంటుంది. అప్పుడు లాయర్ 'ఆవిడ మాటలు మాత్రమే కాదు.. ఎవిడెన్స్ కూడా ఉంది' అని సాక్షిని ప్రవేశ పెట్టేందుకు పర్మీషన్ తీసుకుంటాడు.

Intinti Gruhalakshmi Serial Today Episode May 17th 2023

నిరూపించకపోతే శిక్ష ఖాయం:ఆ తర్వాత మంగమ్మను లాస్య లాయర్ బోనులోకి పిలుస్తాడు. ఆమె వచ్చి నందూ మీద నిందలు వేస్తూ మాట్లాడుతుంది. ఆ వెంటనే జడ్జ్ 'ఆమె మాటలు విన్న తర్వాత మీరు ఏమంటారు' అని మోహన్‌ను అడుగుతాడు. దీనికాయన 'ప్రస్తుతానికి ఆవిడ చెప్పింది తప్పు అని చెప్పటానికి మా దగ్గర ఆధారాలు లేవు. మాకు కాస్త గడువు కావాలి' అని అడుగుతాడు. దీంతో జడ్జ్ 'మీకు మూడు రోజులు టైం ఇస్తున్నాను. అప్పటికి నిజం నిరూపించండి లేకపోతే శిక్ష పడుతుంది' అంటాడు. బయటికి వచ్చిన తర్వాత మంగమ్మను తులసి నిలదీస్తూ గొడవ పడుతుంది. అప్పుడు లాస్య, భాగ్య వాళ్లకు ఆఫర్ ఇవ్వగా.. 'అవసరం అయితే జైలుకు వెళ్తాను' అని అక్కడి నుంచి వెళ్లిపోతాడు.

Intinti Gruhalakshmi Serial Today Episode May 17th 2023

పూజారిని బుక్ చేసిన దివ్య:పూజ అయిన తర్వాత అక్కడ ఉంచిన వెండి సామాన్లను పూజారి తన సంచిలో వేసుకుంటూ ఉంటాడు. అప్పుడే అక్కడకు వచ్చిన దివ్య 'ఇంట్లో బంగారం, డబ్బు కూడా ఉంది. వాటిని కూడా తీసుకు వెళ్ళండి దొంగ పంతులు' అంటుంది. దీనికాయన ఏం మాట్లాడుతున్నావు అంటూ కోప్పడతాడు. దీంతో వెంటనే ఆయన రెండో భార్యతో మాట్లాడుతున్న వీడియోను చూపించి బ్లాక్ మెయిల్ చేస్తుంది. దీంతో 'నా కొంప కొల్లేరు చేసే లాగా ఉన్నావు దయచేసి దాన్ని ఎవరికీ చూపించకు' అని బ్రతిమాలతాడు. అలాగే, రాజ్యలక్ష్మి గురించి నిజాలు చెప్తాడు. దీన్ని దివ్య రికార్డు చేస్తుంది. దీంతో అతడు ఆమె చెప్పినట్లు చేస్తానని అంటాడు.

Intinti Gruhalakshmi Serial Today Episode May 17th 2023

నందూ బాధ్యత తీసుకుంది:పరందామయ్య, అనసూయ ఇంటికి వచ్చిన తర్వాత 'మూడు రోజుల్లో నిజం నిరూపించుకోమన్నారు ఎలా నిరూపించుకుంటాము' అని బాధ పడుతూ ఉంటారు. అప్పుడు తులసి 'ఆలోచిస్తే ఏదో ఒక మార్గం దొరుకుతుంది. ఆ సంగతి నేను చూసుకుంటాను నాకు వదిలేయండి' అంటుంది. దీంతో నందూ 'దయచేసి లాస్య దగ్గరికి మాత్రం వెళ్లొద్దు. నాకు ఇష్టం లేదు' అనగా తులసి సరే అంటుంది. ఇంతలో కెఫేలో పని చేసే మేనేజర్ వస్తాడు. అతనికి కీస్ చేతిలో పెట్టిన నందూ 'కొద్దిరోజులు నేను కెఫేకి రాను. మళ్లీ ఎప్పుడు వస్తానో కూడా తెలియదు' అంటాడు. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X