For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Intinti Gruhalakshmi Today Episode: తులసిని చూసి షాకైన లాస్య.. ఆస్తి గొడవలతో నందూకు కొత్త కష్టం

  |

  మిగిలిన భాషలతో పోల్చుకుంటే తెలుగు బుల్లితెపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి భారీ నుంచి అతి భారీ స్థాయిలో స్పందన దక్కుతుంది. సుదీర్ఘ కాలంలో ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' బుధవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరు కూడా చూసేయండి మరి!
  Photos Courtesy: Star మా and Disney+Hotstar

  మంగళవారం ఎపిసోడ్‌లో జరిగిందిదే

  మంగళవారం ఎపిసోడ్‌లో జరిగిందిదే

  మంగళవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. నందూతో కాలేజ్‌లో డిస్కర్షన్ అయిన తర్వాత దివ్య కోపంగా ఇంటికి వస్తుంది. ఆ సమయంలో తన తండ్రిని తిడుతూ ఉంటుంది. దీంతో తులసి ఆమెను కూల్ చేసే ప్రయత్నం చేస్తుంది. ఆ సమయంలో ఇద్దరి మధ్య కాసేపు సంభాషణ జరుగుతుంది. అప్పుడు పరందామయ్య.. దివ్యకు మద్దతు తెలుపుతాడు. ఇక, నందూ.. లక్కీతో ప్రేమగా మాట్లాడుతూ డాడీ అని పిలవమంటాడు. కానీ, ఆ చిన్నారి కోపంతో దూరంగా వెళ్లిపోతాడు. కోపంగా ఉన్న ప్రేమ్‌ను ఇంటి ఓనర్ వచ్చి చిరాకు పెడతాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంది.

  మళ్లీ ఒక్కటైన షణ్ముఖ్, దీప్తి సునైనా: ఇద్దరూ ఒకే ఫొటో షేర్ చేసి మరీ రిక్వెస్ట్

  తులసిలో మార్పు చూసి సంతోషం

  తులసిలో మార్పు చూసి సంతోషం

  దివ్యతో పరందామయ్య చెస్ ఆడుతుంటాడు. దివ్యను ఓడించేందుకు ఆయన పెద్ద ఎత్తు వేసి ఉంచుతాడు. దీంతో తులసి రంగంలోకి దిగుతుంది. కాసేపు ఆలోచించిన తర్వాత ఒక అద్బుతమైన స్టెప్ వేసి చెక్‌మెంట్ అంటుంది. దీంతో పరందామయ్య ఓడిపోతాడు. అప్పుడాయన 'నీలో ఇంత మార్పా.. నీ ఆట తీరు మారింది.. నీ ఆలోచనల తీరు కూడా మారిందమ్మా' అంటాడు. దీనికి తులసి కూడా 'ఎందుకో కానీ.. నాకు ఇప్పుడు కొత్త జీవితం మొదలయినట్టు అనిపిస్తోంది. ఏ ఒక్క క్షణాన్ని వృథా చేసుకోను' అంటుంది. ఈ మార్పును చూసి అత్త మామలు ముచ్చటపడతారు.

  తులసికి జాబ్... వాళ్లంతా హ్యాపీగా

  తులసికి జాబ్... వాళ్లంతా హ్యాపీగా


  తులసిలో వచ్చిన మార్పుల గురించి మాట్లాడుకున్న తర్వాత అందరూ సరదాగా నవ్వుతూ ఉంటారు. అప్పుడే తులసి పార్కులో జరిగిన విషయాన్ని వాళ్లకు చెబుతుంది. మొత్తంగా తనకు సంగీతం టీచర్‌గా ఉద్యోగం వచ్చిందని క్లారిటీ ఇస్తుంది. దీంతో దివ్య, పరందామయ్య, అనసూయలు ఎంతగానో సంతోషిస్తారు. అంతేకాదు, ఒకరికొకరు స్వీట్లు తినిపించుకుని ఆనందాన్ని వ్యక్తం చేస్తారు. ఆ సమయంలో 'తులసికి ఆ దేవుడే ఓ దారి చూపించాడు. నేర్చుకున్న విద్య ఎక్కడికీ పోదు. ఇప్పుడదే ఆమెకు ఆధారం అయింది' అని పరందామయ్య, అనసూయ అనుకుంటారు.

  బెడ్‌పై బ్రాతో అషు రెడ్డి రచ్చ: ఏకంగా అవి చూపిస్తూ రెచ్చిపోయిందిగా!

  ప్రేమ్‌తో గొడవ పెట్టుకున్న శృతి

  ప్రేమ్‌తో గొడవ పెట్టుకున్న శృతి


  కోపంతో ఇంటి ఓనర్‌పై విరుచుకు పడిన ప్రేమ్‌పై శృతి ఆగ్రహంగా ఉంటుంది. అతడు ఎంత ప్రయత్నించినా ఆమె మాత్రం మాట్లాడదు. దీంతో ఏమైందని అడుగుతూ చేసిన తప్పుకు సారీ అని అంటాడు. అంతేకాదు, ఏదో కోపంలో అలా జరిగిపోయిందని నచ్చజెపుతాడు. కానీ, శృతి మాత్రం 'చేశాల్సింది అంతా చేసేసి.. అనాల్సింది అంతా అనేసి ఇప్పుడు సారీ అంటే అయిపోయిందా? ఒక్కొక్కసారి ఈ కోపమే జీవితాన్ని కూడా కోలుకోలేనంత దెబ్బ తీస్తుంది. ఇంటి ఓనర్ మీద అరిస్తే వాళ్లెందుకు ఊరుకుంటారు. ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోమనరా' అంటూ ప్రేమ్‌ను ప్రశ్నిస్తుంది.

  ప్రేమ్‌ను ఇల్లు ఖాళీ చేయమంటూ

  ప్రేమ్‌ను ఇల్లు ఖాళీ చేయమంటూ

  శృతి చెప్పినట్లుగానే ఇంటి ఓనర్ దంపతులు కోపంతో అక్కడకు వస్తారు. వచ్చీ రావడమే వాళ్లిద్దరూ వెంటనే ఇల్లు ఖాళీ చేయండి అని అంటారు. దీంతో ప్రేమ్, శృతి షాక్ అవుతారు. అప్పుడు ఓనర్ వాళ్లు 'మీ సామాన్లు మీరే తీసేస్తారా.. మమ్మల్ని విసిరేయమంటారా' అంటూ వెంటనే లోపలికి వెళ్లి సామాన్లు బయట పడేయడానికి ప్రయత్నిస్తారు. అంతలో ప్రేమ్ వాళ్లను ఆపుతాడు. అంతేకాదు, 'అంకుల్ తప్పు అయిపోయింది. నోరు జారాను. ఇంకోసారి అలాంటి పొరపాట్లు చేయను' అంటూ క్షమాపణ చెప్తాడు. దీంతో ఇంటి ఓనర్ శాంతించి అక్కడి నుంచి వెళ్తారు.

  ఉల్లిపొర లాంటి డ్రెస్‌లో హీరోయిన్ హాట్ ట్రీట్: అబ్బో ఆమెనిలా చూశారంటే!

  బిజినెస్ క్లోజ్.. నందూ జాబ్ ఔట్

  బిజినెస్ క్లోజ్.. నందూ జాబ్ ఔట్

  నందూ పని చేస్తోన్న కేఫ్ ఓనర్.. తన అన్నతో గొడవ పెట్టుకుంటాడు. దీంతో నందూ వెళ్లి ఇద్దరిని గొడవ పడకుండా ఆపుతాడు. ఆ తర్వాత ఏమైంది అని అడుగుతాడు. దీంతో ఆ వ్యక్తి 'నువ్వెందుకు వచ్చావు. 24 గంటల్లో ఈ ప్లేస్ ఖాళీ చేయి. లేకపోతే నువ్వు ఎలా ఖాళీ చేయవో నాకు బాగా తెలుసు' అని వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతాడు. ఆ తర్వాత నందూ ఫ్రెండ్ 'ఆస్తి పంపకాల్లో వాటాగా ఈ ప్లేస్ మా అన్నయ్యకు వెళ్లింది. అందుకే వాడు ఇప్పుడు గొడవ చేస్తున్నాడు. దీంతో ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఒరేయ్ నందూ.. కేఫ్ ఖాళీ చేయడం తప్ప నాకు వేరే దారి లేదు. మా అన్నయ్య ఇంత మొండిగా ఉంటాడని నేను అనుకోలేదు' అంటాడు. దీంతో నందూ ఉద్యోగం ఇకపై ఉండదని అర్థం చేసుకుని వెళ్లిపోతాడు.

  తులసిని చూసి షాకైపోయిన లాస్య

  తులసిని చూసి షాకైపోయిన లాస్య

  సంగీతాన్ని నేర్పించేందుకు తులసి.. ఆ పిల్లల ఇంటికి వెళ్తుంది. అక్కడ వాళ్లతో సాధన చేయిస్తుంటుంది. అంతలోనే లాస్య అక్కడికి వచ్చి 'ఆ సంగీతం టీచర్ ఎవరు. భలేపాడుతోంది. ఆవిడ గొంతు వింటుంటే నాకూ సంగీతం నేర్చుకోవాలనిపిస్తోంది' అంటూ లోపలికి వెళ్లి చూడగానే తులసిని చూసి షాక్ అవుతుంది. ఆ వెంటనే లాస్య 'సో.. ఇంటింటికి తిరుగుతూ సంగీతం చెప్పుకుంటన్నావన్నమాట. నా మాటే శాసనం అంటూ రాణిలా రాజ్యమేలావు. ఒక వెలుగు వెలిగావు. ఇప్పుడు ఏమైంది? ఇప్పటికైనా పొగరు తగ్గిందా లేక అదే రేంజ్ మెయిన్‌టెన్ చేస్తున్నావా' అంటుంది. దీనికి తులసి అది పొగరు కాదు.. ఆత్మాభిమానం అంటుంది.

  హీరోయిన్ హాట్ వీడియో షేర్ చేసిన వర్మ: ఈ టైమ్‌లో ఆ సౌండ్స్ బాగుంటాయి అంటూ!

  చప్పట్లు కొట్టిన లక్కీ.. నందూ ఫైర్

  చప్పట్లు కొట్టిన లక్కీ.. నందూ ఫైర్


  ఇంటికి వచ్చిన తర్వాత లాస్య.. లక్కీకి అన్నం తినిపిస్తుంటుంది. అప్పుడు ఆ చిన్నారి తనను హాస్టల్‌కు పంపొద్దని చెప్తాడు. దీనికి లాస్య 'నీ గురించి పట్టించుకునే టైమ్ మా ఇద్దరికీ ఉండదు కదా.. అందుకే హాస్టల్‌కు పంపిస్తున్నా' అంటుంది. ఇంతలో నందూ వచ్చి మూడీగా ఉంటాడు. ఏమైంది అని లాస్య అడగ్గా ఉద్యోగం పోయింది అని చెబుతాడు. దీంతో లాస్య షాక్ అవుతుంది. అప్పుడు లక్కీ చప్పట్లు కొడుతూ 'ఎంతైనా ఇప్పుడు అంకుల్ ఫ్రీనే కదా. నన్ను దగ్గరుండి చూసుకోవచ్చు. నేను ఇక హాస్టల్‌కు వెళ్లాల్సిన పని లేదు' అంటాడు. దీంతో నందూకు తీవ్రంగా కోపం వస్తుంది. ఆ వెంటనే షట్ అప్ అని అరుస్తాడు. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

  English summary
  Intinti Gruhalakshmi Episode 635: Tulasi Finds New Job and Builds Her Career. On The Other Side.. Nandhu Family Business Comes to an End.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X