Intinti Gruhalakshmi: రాజ్యలక్ష్మికి షాకిచ్చిన పంతులు.. శిక్ష పడుతుందని నందూ కీలక నిర్ణయం

తరాలు మారుతూ ఉన్నప్పటికీ తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రం ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' గురువారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!
Photos Courtesy: Star మా and Disney+Hotstar

బుధవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే:బుధవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. కోర్టులో విచారణ జరుగుతోన్న సమయంలోనే నందూపై లాస్య, ఆమె తరపు లాయరు ఎన్నో ఆరోపణలు చేస్తారు. కానీ, వాటిని తులసి తిప్పి కొడుతుంది. కానీ, అప్పుడే లాస్య సెట్ చేసిన మంగమ్మ వచ్చి నందూకు వ్యతిరేకంగా కొన్ని సాక్ష్యాలను చెబుతుంది. దీంతో అవి తప్పు అని నిరూపించుకునేందుకు జడ్జ్ నందూ వాళ్లకు మూడు రోజులు గడువు ఇస్తారు. ఇక, రాజ్యలక్ష్మి దొంగ పూజల గురించి తెలుసుకున్న దివ్య.. పంతులును తన వైపు తిప్పుకునేలా ఓ వీడియోను చూపిస్తోంది. దీంతో భయపడిన అతడు దివ్యకు సపోర్ట్ చేస్తానంటాడు.

Intinti Gruhalakshmi Serial Today Episode May 18th 2023

నా గురించి ఆలోచించవద్దు అని:కెఫేలో పని చేసే మేనేజర్‌ను పిలిచిన నందూ.. ఆ తర్వాత అసహనంగా మాట్లాడుతూ ఉంటాడు. అంతేకాదు, 'నేను ఇప్పుడప్పుడే కెఫేకు రాను. మీకు ఏమైనా అవసరమైతే తులసి మేడంకు ఫోన్ చేయండి' అని చెబుతాడు. అంతేకాదు కెఫే తాళాలను కూడా మేనేజర్‌కు అందిస్తాడు. అప్పుడు తులసి 'ఇప్పుడు ఏమైంది? కెఫేకు ఎందుకు వెళ్ళరు' అని ప్రశ్నిస్తుంది. దీంతో నందూ 'కోర్టు గొడవలు తేలే వరకు వెళ్ళను. అయినా నా గురించి ఎవరు ఎక్కువగా ఆలోచించకండి' అంటూ బాధగా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు.

Intinti Gruhalakshmi Serial Today Episode May 18th 2023

పంతులును బెదిరించిన దివ్య:పంతులుకు వీడియో చూపించిన తర్వాత దివ్య 'చెప్పింది గుర్తుంది కదా. లేదంటే మీ బండారం బయట పెడతాను' అని బెదిరిస్తుంది. తర్వాత అతడిని రాజ్యలక్ష్మి దగ్గరికి తీసుకువస్తుంది. పంతులు మాత్రం అప్పుడు దివ్య చెప్పినట్లు చేయటానికి భయపడిపోతాడు. ఇంతలో పనిమనిషి వచ్చి రాజ్యలక్ష్మి వాళ్ళను టిఫిన్ చేయడానికి రమ్మంటుంది. రాజ్యలక్ష్మి పంతులు గారిని కూడా టిఫిన్ చేయడానికి రమ్మంటుంది. ఆ తర్వాత అందరూ టేబుల్ మీద కూర్చోగా విక్రమ్ కింద కూర్చుంటాడు. అప్పుడు దివ్యను కూడా కింద కూర్చోమని బసవయ్య భార్య అంటుంది.

Intinti Gruhalakshmi Serial Today Episode May 18th 2023

రాజ్యలక్ష్మికి షాకిచ్చిన పంతులు:తాను అనుకున్నట్లుగా జరగకపోవడంతో పిరికి పంతులు మోసం చేశాడు అని దివ్య అనుకుంటుంది. అంతలోనే పూజారి వచ్చి 'ఇక మీకు కిందన కూర్చునే అవసరం లేదు. ఈరోజుతో మీ అమ్మగారికి పట్టిన దోషమంతా పోయింది' అని విక్రమ్‌తో అంటాడు. దీంతో ఒక్కసారిగా రాజ్యలక్ష్మితో పాటు అక్కడున్న వాళ్లంతా షాక్ అవుతారు. దీంతో రాజ్యలక్ష్మి 'మతి పోయిందా పంతులు గారు? 20 ఏళ్ల వరకు ఇలాగే చేయాలని చెప్పారు కదా' అని అడగ్గా.. దివ్య వచ్చి 'అప్పుడు గ్రహాలు అలా ఉన్నాయి కానీ.. ఇప్పుడు గ్రహాలు మారిపోయి ఉంటాయి' అంటుంది.

Intinti Gruhalakshmi Serial Today Episode May 18th 2023

అర్థం చేసుకున్న రాజ్యలక్ష్మి:దివ్య మాటలు విన్న తర్వాత రాజ్యలక్ష్మి మొత్తం ఎవరు చేశారో.. పూజారిని ఎవరు మార్చారో అర్థం చేసుకుంటుంది. ఆ తర్వాత దివ్య 'ఈ ఇంటికి గురువు లాంటి పంతులుగారు చెప్పారు కదా. ఇంకెందుకు కిందన కూర్చోవడం' అంటూ విక్రమ్‌ను తీసుకెళ్లి రాజ్యలక్ష్మి పక్కన కూర్చోబెడుతుంది. ఆ వెంటనే భర్త పక్కనే కూర్చుని టిఫిన్ తినిపిస్తుంది. అంతేకాదు, మీరు కూడా తినిపించండి అత్తయ్య చాలా సంతోషిస్తారు అంటుంది. విక్రమ్ కూడా సంతోషంగా దివ్య‌కు టిఫిన్ తినిపిస్తాడు. అది చూసిన రాజ్యలక్ష్మి కోపంతో రగిలిపోతూ ఉంటుంది.

Intinti Gruhalakshmi Serial Today Episode May 18th 2023

దివ్యను చూడ్డానికి వెళ్లాలని:మాధవి భర్త తులసికి ఫోన్ చేసి.. 'కేసు విషయంలో నాకేమీ పాలుపోవటం లేదు. అందుకే నీకు ఫోన్ చేశాను' అంటాడు. దీంతో తులసి 'ఏం చేయడానికైనా ఆయన సహకరించాలి కదా. పూర్తిగా ఓటమికి సిద్ధపడిపోయారు' అంటుంది. ఇంతలోనే నందూ రావటం గమనించి తర్వాత ఫోన్ చేస్తాను అంటూ కాల్ కట్ చేస్తుంది. అప్పుడు నందూ.. తులసితో 'దివ్యను చూడాలనిపిస్తుంది. అక్కడికి వెళ్దాము' అనగా తులసి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో బాగోదేమో అంటుంది. దీనికతడు 'పర్వాలేదు.. మళ్లీ ఈ పరిస్థితులు ఎలా ఉంటాయో ఏంటో దివ్యని చూడగలనో లేదో' అంటాడు. దీంతో తులసి వెళ్దాం అంటుంది.

Intinti Gruhalakshmi Serial Today Episode May 18th 2023

భయం ఏంటో చూపిస్తానని:దివ్యను ప్రియ అక్కా అని పిలిచి 'ఇన్నాళ్లు ఈ ఇంట్లో భయాన్ని చూశాను. ఈరోజు తలెత్తుకొని మాట్లాడే శివంగిని చూశాను. ఇకనుంచి నేను కూడా ధైర్యంగా ఉంటాను' అంటుంది. వాళ్ళిద్దరూ సంతోషపడుతూ ఉండగా విక్రమ్ వాళ్ల తాతయ్య వచ్చి ముచ్చటపడుతుంటాడు. అప్పుడాయన 'విక్రమ్ తల్లి మాయలో పడిపోయాడు' అనగా.. దివ్య 'మీరేమీ బాధపడకండి తాతయ్య. ఆయనకు అన్ని విషయాలు తెలిసేలాగా నేను చేస్తాను. అత్తయ్యకి భయం అంటే ఏంటో చూపిస్తాను' అంటుంది. దీనికాయన ఇప్పటికే నువ్వు తనకి భయాన్ని రుచి చూపించావు అంటాడు.

Intinti Gruhalakshmi Serial Today Episode May 18th 2023

తులసి, నందూపై నిందలు:నందూ, తులసి కలిసి దివ్య దగ్గరకు వెళ్తుండగా లాస్య ఎదురవుతుంది. అప్పుడామె 'చిలకా గోరింక ఎక్కడికో బయలుదేరినట్లు ఉన్నారు. అడిగేవాళ్లు లేక అడ్డు ఆపు లేదు' అంటూ వాళ్లపై నిందలు వేస్తూ మాట్లాడుతుంది. దీంతో నందూ 'తప్పుగా మాట్లాడితే చంపేస్తాను' అంటాడు. దీంతో లాస్య 'కొట్టకపోయినా కొట్టావు అని కేసు పెట్టాను. ఇప్పటికీ బయటకు రాలేక గింజుకుంటున్నావు. మళ్లీ చంపేస్తాను అంటున్నావు' అంటూ రెచ్చగొడుతుంది. దీంతో తులసి కలుగజేసుకుని ఆయనని రెచ్చగొట్టొద్దు అంటుంది. దీనికి లాస్య 'భుజం మీద చేయి వేసి కళ్ళల్లో కళ్ళు పెట్టి మాట్లాడుతాను ఏం చేస్తావు' అని అంటుంది. దీంతో ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X