twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Intinti Gruhalakshmi Today Episode: అప్పు తీర్చమని నందూకు వార్నింగ్.. ప్రేమ్‌ను బయటకు గెంటేయడంతో!

    |

    ఇండియన్ టెలివిజన్ హిస్టరీలో తెలుగు బుల్లితెపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి భారీ నుంచి అతి భారీ స్థాయిలో స్పందన దక్కుతుంది. సుదీర్ఘ కాలంలో ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.

    దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' గురువారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరు కూడా చూసేయండి మరి!

    Photos Courtesy: Star మా and Disney+Hotstar

    బుధవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

    బుధవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

    బుధవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. పిల్లలకు సంగీతాన్ని నేర్పించే ఉద్యోగాన్ని సంపాదించిన విషయాన్ని తులసి.. ఇంట్లో వాళ్లకు చెబుతుంది. దీంతో వాళ్లంతా చాలా సంతోషిస్తారు. ఆస్తి గొడవల్లో భాగంగా నందూ పని చేస్తోన్న కేఫ్‌ను తన స్నేహితుడి వదిలేసుకుంటాడు. దీంతో నందూకు ఉద్యోగం పోతుంది. ఈ విషయాన్ని లాస్యతో చెబుతాడు. అప్పుడు లక్కీ చప్పట్లు కొట్టగా.. ఆ చిన్నారిపై నందూ ఫైర్ అవుతాడు. ఇక, ప్రేమ్ గొడవ పడ్డాడన్న కారణంతో ఇంటి ఓనర్ వచ్చి ఇల్లు ఖాళీ చేయమని అంటారు. దీంతో ప్రేమ్ వాళ్లకు సారీ చెప్పడంతో వాళ్లు వెళ్లిపోతారు.

    HBD Sudigali Sudheer: ఒక్కో షోకు సుధీర్ ఎంత తీసుకుంటాడో తెలుసా? అతడి ఏడాది సంపాదన తెలిస్తే షాకే!HBD Sudigali Sudheer: ఒక్కో షోకు సుధీర్ ఎంత తీసుకుంటాడో తెలుసా? అతడి ఏడాది సంపాదన తెలిస్తే షాకే!

     నందూపై లాస్య తీవ్ర ఆగ్రహం

    నందూపై లాస్య తీవ్ర ఆగ్రహం

    ఉద్యోగం పోయిన బాధలో ఉంటే లక్కీ నవ్వడంతో పాటు చప్పట్లు కొడుతూ ఉండడంతో నందూకు కోపం తన్నుకొస్తుంది. దీంతో ఆ చిన్నారిపై అరుస్తాడు. దీనికి లాస్య 'ఇప్పుడు వాడి మీద అరిచి ఏంటి లాభం. తులసి చెప్పిందనే ఈ జాబ్‌లో జాయిన్ అయ్యావు కదా. అందుకే ఎవరి మాట పడితే వాళ్ల మాట అస్సలు వినకూడదు' అంటూ చురకలు అంటిస్తుంది. ఆ సమయంలోనే లక్కీ 'అంకుల్ ఎవరికో అన్యాయం చేసి ఉంటారు అందుకే ఇలా జరిగింది' అని అంటాడు. దీంతో నందూకు కోపం ఇంకాస్త ఎక్కువ అవుతుంది. ఆ వెంటనే లక్కీ మీద కోప్పడతాడు.

    నందూను అప్పు కట్టమంటూనే

    నందూను అప్పు కట్టమంటూనే

    ఇంట్లో అలా డిస్కర్షన్ జరుగుతుండానే నందూ ఫ్రెండ్ శేఖర్ అక్కడకు వస్తాడు. వచ్చీ రావడమే 'అరేయ్ నందూ.. నా దగ్గర తీసుకున్న ఇరవై వేల రూపాయలు కావాలి' అని అడుగుతాడు. అప్పుడు నందూ తన ఉద్యోగం పోయిన విషయం చెబుతాడు. అంతేకాదు, 'ఇప్పటికిప్పుడు ఇవ్వమంటే నేను ఎలా తెచ్చివ్వాలిరా. ఒక రెండు మూడు నెలల్లో మొత్తం తిరిగిచ్చేస్తాను' అని అంటాడు. దీనికి అతడి ఫ్రెండ్ 'నీ గురించి చెప్తే జాలి పరిస్థితిలో లేను. మా ఆవిడ ఆరోగ్యం బాలేదు. అందుకే ఆస్పత్రిలో కట్టేందుకు డబ్బులు మొత్తం కావాలి' అని వెళ్లిపోతాడు.

    యాంకర్ సుమకు హ్యాండిచ్చిన తెలుగు హీరో: ఈవెంట్‌కు పిలిచి పరువు తీయడంతో గొడవయాంకర్ సుమకు హ్యాండిచ్చిన తెలుగు హీరో: ఈవెంట్‌కు పిలిచి పరువు తీయడంతో గొడవ

    ఆంటీనలా ఏడిపించడం వల్లే

    ఆంటీనలా ఏడిపించడం వల్లే


    శేఖర్ డబ్బుల కావాలని డిమాండ్ చేసి వెళ్లిపోవడంతో నందూకు ఏం చేయాలో అర్థం కాదు. అప్పుడు లాస్య సీన్‌లోకి వచ్చి 'నా బ్యాంక్ అకౌంట్స్ జీరో. కనీసం ఈసారి అయినా మంచి సాఫ్ట్‌వేర్ జాబ్ చూసుకో నందూ బాగుపడతావు' అని అంటుంది. దీంతో నందూ 'ఇప్పుడు తులసే నాకంటే బెటర్ పొజిషన్‌లో ఉన్నట్టుంది. ఎంతో కొంత సంపాదిస్తున్నట్టుంది' అని అనుకుంటాడు. అప్పుడు లక్కీ 'అంకుల్.. తులసి ఆంటిని ఏడిపించారు కదా.. మీకు ఇలాగే జరుగుతుంది. మీరు బ్యాడ్ బాయ్' అని అక్కడి నుంచి వెళ్లిపోతాడు. దీంతో నందూ ఢీలా పడిపోతాడు.

    ఫుట్ బాల్ గేమ్ ఆడిన తులసి

    ఫుట్ బాల్ గేమ్ ఆడిన తులసి


    తులసి తన ఇంటి దగ్గర నడుచుకుంటూ వెళ్తుండగా.. పిల్లలు ఫుట్ బాల్ ఆట ఆడుతుంటారు. ఒకరు కొట్టిన బంతి నేరుగా వెళ్లి తులసి దగ్గరకు వెళ్తుంది. అప్పుడామె వాళ్లను కోపంగా చూస్తుంది. దీంతో ఆ పిల్లలంతా కలిసి ఆమెకు క్షమాపణలు చెబుతారు. దీంతో ఓ నవ్వు నవ్వేసిన తులసి ఆ తర్వాత 'నేను కూడా మీతో కలిసి ఆడుతాడు. నన్ను మీ జట్టులోకి తీసుకోండి' అని అడుగుతుంది. దీనికి వాళ్లు ఒప్పుకోవడంతో ఆ పిల్లలతో కలిసి గేమ్ ఆడుతుంది. ఆ సమయంలో తులసి తన బాధలు అన్నింటినీ మర్చిపోయి మరీ ఎంతో సంతోషంగా కనిపిస్తుంది.

    మళ్లీ ఒక్కటైన షణ్ముఖ్, దీప్తి సునైనా: ఇద్దరూ ఒకే ఫొటో షేర్ చేసి మరీ రిక్వెస్ట్

    తులసి కోసం అనసూయ ప్లాన్

    తులసి కోసం అనసూయ ప్లాన్

    ఆర్థికంగా తన వంతు సహాయం చేయాలన్న ఉద్దేశంతో అనసూయ 'నానమ్మ కిచెన్' అనే యూట్యూబ్ చానెల్‌ను స్టార్ట్ చేస్తుంది. ఇంతలో తులసి వచ్చి మీరెందుకు శ్రమ పడుతున్నారు అని అంటుంది. దీంతో నేను నాకోసం వండటం లేదు.. జనం కోసం వండుతున్నాను అని చెబుతుంది. అప్పుడు దివ్య సోషల్ మీడియాలో నానమ్మ కొత్త చానెల్ ఓపెన్ చేసింది అని చెప్తుంది. దీంతో పరందామయ్య షాక్ అవుతాడు.

    అంతేకాదు, 'ఇందులో చిత్రవిచిత్రమైన వంటలు చేసి జనాలకు నేర్పిస్తా. నేను కూడా ఈ చానెల్ ద్వారా డబ్బులు సంపాదిస్తా' అంటుంది. అప్పుడు ఆమె భర్త 'ఇంతకీ ఏం వండబోతున్నావు' అని అడుగుతాడు. దీంతో కాకరకాయ హల్వా అంటుంది అనసూయ. ఆ తర్వాత తులసి కూడా సంగీత సాధన కోసం యూట్యూబ్ చూస్తానని అంటుంది.

    ప్రేమ్‌కు మ్యూజిక్ డైరెక్టర్ షాక్

    ప్రేమ్‌కు మ్యూజిక్ డైరెక్టర్ షాక్

    గొడవ జరిగిన తర్వాత ప్రేమ్ మరోసారి మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరికి వెళ్తాడు. అప్పుడాయన 'ఎవడ్రా అక్కడ మన స్టూడియోకు లిరిక్ రైటర్ ప్రేమ్ గారు వచ్చారు. ఎవరైనా కాఫీ పట్టుకురండి' అంటూ వెటకారంగా మాట్లాడతాడు. దీంతో ప్రేమ్ మీకు దండం పెడతాను సార్.. నా నెల జీతం ఇప్పించండి అని బ్రతిమాలతాడు. దీనికి మప్పీ లహరి 'నీకు ఉద్యోగమే లేదు.. జీతం ఏంటి' అని సీరియస్ అవుతాడు. దీంతో ప్రేమ్ ప్రాబ్లమ్స్‌లో ఉన్నాను సార్. తెలియక తప్పు చేశాను అన్నా కూడా మ్యూజిక్ డైరెక్టర్ వినడు. పొరపాటున కూడా నా స్టూడియో వైపు చూడకు అంటాడు.

    బెడ్‌పై బ్రాతో అషు రెడ్డి రచ్చ: ఏకంగా అవి చూపిస్తూ రెచ్చిపోయిందిగా!బెడ్‌పై బ్రాతో అషు రెడ్డి రచ్చ: ఏకంగా అవి చూపిస్తూ రెచ్చిపోయిందిగా!

    తల్లి కోసం షాప్ దగ్గర గొడవ

    తల్లి కోసం షాప్ దగ్గర గొడవ

    మ్యూజిక్ డైరెక్టర్ ఎంత చెప్పినా వినడు. దీంతో ప్రేమ్ కనీసం నేను పనిచేసిన దానికైనా డబ్బు ఇవ్వండి సార్ అంటే.. అది అప్పుడే ఇచ్చాను కదా అంటాడాయన. దీంతో కోపంతో అతడి కాలర్ పట్టుకుంటాడు. దీంతో మ్యూజిక్ డైరెక్టర్ 'నా కాలరే పట్టుకుంటావా.. నీ అంతు చూస్తా. ఇండస్ట్రీలో నీకు పని దొరక్కుండా చూస్తా' అని ప్రేమ్‌ను గెంటేస్తాడు. అలా నడుచుకుంటూ వెళ్తుండగా.. తులసి సరుకుల కోసం షాప్‌ దగ్గర ఉంటుంది. డబ్బులు సరిపోక సామాన్లు వెనక్కి ఇవ్వడంతో షాప్ ఓనర్ తిడతాడు. దీంతో ప్రేమ్ అతడి కాలర్ పట్టుకుంటాడు. ఇలా ఈ ఎపిసోడ్ పూర్తైంది.

    English summary
    Intinti Gruhalakshmi Episode 636: Anasuya Plans to Support her Family Financially. After That Prem Lost His Job and Gets Worried about his Debts.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X