Intinti Gruhalakshmi: రాజ్యలక్ష్మిని ఇరికించిన దివ్య.. లాస్య కొత్త డిమాండ్.. మెడ పట్టి గెంటేయ్ అంటూ!

దాదాపు రెండు మూడు దశాబ్దాలుగా తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రం ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' శుక్రవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!
Photos Courtesy: Star మా and Disney+Hotstar

గురువారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే:గురువారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. పంతులును బ్లాక్ మెయిల్ చేయడంతో అతడు దివ్యకు అనుకూలంగా మారిపోతాడు. దీంతో కింద కూర్చుని టిఫిన్ చేయబోతున్న విక్రమ్‌తో 'మీ అమ్మగారి దోషం పోయింది. ఇకపై నువ్వు కూడా పైన కూర్చోవచ్చు' అంటాడు. దీంతో రాజ్యలక్ష్మికి దివ్య ప్లాన్లు అర్థం అవుతాయి. ఆ తర్వాత అత్తగారికి అసలు భయం అంటే ఏంటో చూపిస్తానని దివ్య ప్రియకు చెబుతుంది. ఇక, దివ్యను చూడ్డానికి వస్తున్న తులసి, నందూను లాస్య అడ్డుకుంటుంది. అంతేకాదు, వాళ్లతో గొడవకు కూడా దిగుతుంది. అలాగే, వాళ్లపై నిందలు కూడా వేస్తుంది.

Intinti Gruhalakshmi Serial Today Episode May 19th 2023

ఇక్కడే ఉంటే ఏం చేస్తానో తెలీదు:ఇంటికి వచ్చిన లాస్య.. నందూ, తులసిపై నిందలు వేస్తూ మాట్లాడుతుంది. ముఖ్యంగా నందూను ఎంతగానో రెచ్చగొడుతుంది. దీంతో తులసికి ఏం జరుగుతుందో అని భయం వేస్తుంది. అప్పుడామె 'ఆయనను రెచ్చగొట్టొద్దు. సమస్యను పరిష్కరించుకునే విధానం ఇది కాదు' అని నచ్చజెప్పే ప్రయత్నం చేస్తుంది. కానీ లాస్య మాత్రం 'నేను ఇలాగే మాట్లాడుతాను ఏం చేస్తాడు' అంటూ మరింత రెచ్చిపోయి మాట్లాడుతుంది. దీంతో నందూ 'నువ్వు నా కళ్ళ ముందు ఉంటే ఏం చేస్తానో నాకే తెలియదు. ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో' అంటూ కోపంగా అరుస్తాడు.

Intinti Gruhalakshmi Serial Today Episode May 19th 2023

ఎలా దక్కించుకోవాలో తెలుసని:నందూ అరవగానే లాస్య 'నేనేమీ నీతో ముచ్చట్లు పెట్టుకోడానికి రాలేదు. కెఫే తాళాలు చేతిలో పెట్టు నేను వెళ్ళిపోతాను' అంటుంది. దాంతో నందూ 'ఆ కెఫేతో నీకేం సంబంధం' అని ప్రశ్నిస్తాడు. దీంతో లాస్య 'ఆ కెఫే నాది. మర్యాదగా తాళాలు నా చేతికి ఇవ్వు' అనగా.. నందూ మరింత కోప్పడుతూ 'చచ్చినా ఇవ్వను.. ఏం చేసుకుంటావో చేసుకో' అంటాడు. దీంతో లాస్య 'వాటిని ఎలా దగ్గించుకోవాలో నాకు తెలుసు' అంటూ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.

Intinti Gruhalakshmi Serial Today Episode May 19th 2023

దివ్యను చూసి తీరాల్చిందే అని:లాస్య వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోవడంతో తులసి భయపడిపోతుంది. వెంటనే నందూతో 'తను కెఫే దగ్గరికు వెళ్లి ఏమైనా చేయొచ్చు. మీరు అక్కడికి వెళ్ళండి. మనం దివ్య దగ్గరికి తర్వాత వెళ్దాం' అంటుంది. దీంతో నందూ 'తను ఏమి చేయలేదు. నాకు దివ్యను చూడాలని ఉంది. నువ్వు వస్తావా నన్ను వెళ్ళిపోమంటావా' అని మొండిగా మాట్లాడుతాడు. దీంతో తులసి చేసేదేం లేక అతనితో దివ్య వాళ్ల ఇంటికి బయలుదేరుతుంది.

Intinti Gruhalakshmi Serial Today Episode May 19th 2023

విక్రమ్‌ మనసు మార్చాలని ప్లాన్:ఇక, ఇంట్లో దివ్యను విక్రమ్ దగ్గరకు తీసుకుంటాడు. దీంతో దివ్య 'ముహూర్తం పెట్టకుండా ఇలాంటి పనులు చేస్తే బాగోదేమో. ముహూర్తం విషయంలో మీ అమ్మగారిని గట్టిగా నిలదీయండి' అంటుంది. అప్పుడు విక్రమ్ 'తను మాత్రం ఏం చేస్తుంది? ముహూర్తాలు ఉండాలి కదా' అని అడుగుతాడు. అప్పుడు దివ్య 'పోనీ మా అమ్మ వాళ్ళనే పెట్టించమని చెప్పనా' అనగా.. మా అమ్మ మీద నమ్మకం లేదా అంటాడు విక్రమ్. దీంతో దివ్య 'అలా అని కాదు.. కొందరు పేషెంట్లు ఒక డాక్టర్ దగ్గరికి చూపించుకొని మరొక డాక్టర్ దగ్గరికి సెకండ్ ఆప్షన్ కోసం వెళ్తారు. అలాగే, ఇప్పుడు అడుగుదామా' అని అంటుంది. దీంతో విక్రమ్ అమ్మను అడిగి చెప్తాను అంటాడు. అంతలోనే రాజ్యలక్ష్మి.. విక్రమ్‌ను పిలుస్తుంది.

Intinti Gruhalakshmi Serial Today Episode May 19th 2023

చెప్పులు కుట్టించమని చెప్పగా:విక్రమ్‌ను పిలిచిన రాజ్యలక్ష్మి 'నా చెప్పులు తెగిపోయాయి. అవి నాకు చాలా ఇష్టం. పని వాళ్ళు ఎవరూ కనిపించడం లేదు' అంటుంది. దీంతో విక్రమ్ నేను కుట్టించుకొని వస్తాను అంటాడు. దీనికి రాజ్యలక్ష్మి 'పెళ్లికి ముందు అంటే పర్వాలేదు కానీ.. ఇప్పుడు నీకు పెళ్లైంది కదా. ఇలాంటి పనులు చేయకూడదు' అని అంటుంది. అప్పుడే దివ్య రావడంతో విక్రమ్ 'చూడు మా అమ్మ ఎలా అంటుందో. తల్లి చెప్పులు కొడుకు కుట్టిస్తే తప్పా' అంటాడు. దీనికామె 'మీ అమ్మగారు చెప్పారంటే అందులో అర్థం ఉంటుంది. అయినా ఇలాంటివి పనివాళ్ళు చేస్తారు' అంటుంది.

Intinti Gruhalakshmi Serial Today Episode May 19th 2023

నోరు పడిపోయిందా అని ఫైర్:దివ్య మాటలకు బసవయ్య 'తల్లి చెప్పులు కొడుకు కుట్టిస్తే నామోషినా? విక్రమ్ బాధ్యత గల కొడుకు. ఇంతకుముందు కూడా చాలా సార్లు కుట్టించాడు' అంటాడు. అంతలోనే సంజయ్ అటుగా వెళ్తుండగా.. దివ్య 'నువ్వు బయటికి వెళ్తున్నావు కదా. మీ అమ్మగారు అమ్మగారి చెప్పులు కుట్టించుకొని రా' అంటుంది. దీంతో సంజయ్ 'పని వాళ్ళు చేయవలసిన పనులు నాతో చేయిస్తావా' అని సీరియస్ అవుతాడు. దీంతో దివ్య 'బాబాయ్ గారు బాధ్యత అంటూ ఏదో అన్నారు ఇప్పుడేమంటారు? నోరు పడిపోయిందా' అని ప్రశ్నిస్తుంది. అప్పుడు తాత భలే అడిగావ్ అమ్మ అంటాడు. తర్వాత విక్రమ్ చదువు గురించి మాట్లాడతాడు. దీంతో దివ్య నువ్వు అందుకే చదువు మానేశావా అని ప్రశ్నిస్తుంది. తర్వాత విక్రమ్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు.

Intinti Gruhalakshmi Serial Today Episode May 19th 2023

మెడ పట్టుకుని గెంటేయ్ అని:ఇక, నందూ, తులసి కలిసి దివ్య వాళ్ల ఇంటికి వెళ్తుండగా మేనేజర్ ఫోన్ చేసి 'లాస్య మేడం వచ్చారు. కెఫే తాళాలు కావాలని అడుగుతున్నారు' అని చెప్తాడు. దీంతో నందూ 'తాళాలు ఇవ్వొద్దు. అసలు తనకేం సంబంధం? మెడ పట్టుకుని గెంటేయ్' అంటాడు. తర్వాత అతడిని తులసి కూల్ చేస్తుంది. ఇక, దివ్య వాళ్ల ఇంటికి వెళ్లిన వెంటనే రాజ్యలక్ష్మి 'మీరు చెప్పా పెట్టుకుండా వచ్చారేంటి? నాకు ఇప్పుడు చాలా పని ఉంది' అంటుంది. దీంతో దివ్య 'వాళ్లు నాకోసం వచ్చారు' అంటుంది. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X