For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Intinti Gruhalakshmi May 20th Episode: విడాకుల గుట్టురట్టు.. లాస్య కన్నింగ్ ప్లాన్‌తో కథలో ట్విస్ట్

  |

  తెలుగు బుల్లితెరపై వచ్చే సీరియళ్లకు ఊహించని రీతిలో స్పందన వస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రదర్శితం అవుతున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మీ' ఒకటి. దాదాపు ఏడాది వస్తున్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల్లో ఆసక్తి అంతకంతకూ పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో గురువారం ప్రసారం కానున్న 'ఇంటింటి గృహలక్ష్మీ' ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో చూద్దాం పదండి!

  మాధవి - మోహన్ విడాకుల ప్లాన్ లీక్

  మాధవి - మోహన్ విడాకుల ప్లాన్ లీక్

  మాధవి - మోహన్ విడాకుల వ్యవహారం నందూ ఇంట్లో పెద్ద దుమారాన్నే రేపిన విషయం తెలిసిందే. ఇక, ఇవాళ్టి ఎపిసోడ్‌లో మాధవి - మోహన్ ఇద్దరూ పర్సనల్‌గా కలుసుకుంటారు. అంతేకాదు, తామిద్దరం నందూలో మార్పు తెచ్చేందుకు విడాకుల డ్రామా ఆడినట్లు మాట్లాడుకుంటారు. తమ ప్రయత్నం వల్ల తులసికి మేలు జరగబోతుందని ఒకరినొకరు కౌగిలించుకుంటారు.

  వీడియో తీసిన భాగ్య... లాస్యతో కలిసి

  వీడియో తీసిన భాగ్య... లాస్యతో కలిసి

  మాధవి - మోహన్ కలిసి మాట్లాడుకున్న మాటలను భాగ్య దొంగతనంగా వీడియో తీస్తుంది. అంతేకాదు, దాన్ని తీసుకెళ్లి లాస్యకు అప్పగిస్తూ నందూకి వీడియో చూపిద్దాం అంటుంది. అప్పుడు లాస్య ‘వీడియో చూపించడమే కాదు.. ఈ విడాకుల ప్లాన్‌కు సూత్రధారి తులిసినే అని నమ్మించాలి. అలా చేస్తేనే ఒక దెబ్బకు రెండు పిట్లలు పడతాయి' అని భాగ్యతో కన్నింగ్ ప్లాన్ వేస్తుంది.

  ఇంటికొచ్చి రచ్చ రచ్చ చేసిన మోహన్

  ఇంటికొచ్చి రచ్చ రచ్చ చేసిన మోహన్

  లాస్య, భాగ్య మధ్య ప్లాన్ ముగిసిన తర్వాత మోహన్.. నందూ ఇంటికి ఆవేశంగా వస్తాడు. రావడం రావడమే తన భార్య మాధవితో ‘నా విడాకుల పేపర్లు ఎక్కడ? వెంటనే వాటిని తీసుకొచ్చి ఇవ్వు' అంటూ రచ్చ రచ్చ చేస్తాడు. అప్పుడు మాధవి కూడా ఆవేశంగా ఆ పేపర్లను తీసుకొస్తుంది. ఆ సమయంలో తులసి వీళ్లిద్దరినీ సముదాయించే ప్రయత్నం చేస్తుంది. అయినా వాళ్ల మాట వినరు.

  తులసిపై ఓ రేంజ్‌లో ఫైర్ అయిన నందు

  తులసిపై ఓ రేంజ్‌లో ఫైర్ అయిన నందు

  మాధవి - మోహన్‌కు సంబంధించిన గొడవ జరుగుతోన్న సమయంలోనే నందూ ఇంటికి వస్తాడు. రావడం రావడమే చప్పట్లు కొడుతూ తన భార్య తులసితో గొడవకు దిగుతాడు. ‘విడాకుల నాటకం ఎందుకు ఆడించావు తులసి' అంటూ ఓ రేంజ్‌లో ఫైర్ అవుతాడు. అప్పుడు ఏం జరిగిందో అర్థం కాక తులసి తెల్లముఖం వేస్తుంది. తనకేమీ తెలియదని చెబుతున్నా నందూ మాత్రం వినడు.

  మాధవి - మోహన్‌లపై నందూ ఆగ్రహం

  మాధవి - మోహన్‌లపై నందూ ఆగ్రహం

  తులసిపై గొడవకు దిగిన తర్వాత తన సోదరి మాధవిపై ఆగ్రహం వ్యక్తం చేస్తాడు నందూ. ‘నువ్వు చనిపోతావని నేనెంతగా ఏడ్చానో తెలుసా? ఎందుకు నన్ను మోసం చేయాలని ప్రయత్నించావు' అంటూ ఆమెపై ఒంటి కాలితో ఫైర్ అవుతాడు. ఆ తర్వాత అడ్డొచ్చిన బావ మోహన్‌పైనా అతడు ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. దీంతో వీళ్ల ముగ్గురి మధ్య కాసేపు తీవ్ర స్థాయిలో గొడవ జరుగుతుంది.

  నందూని తిడుతూ ప్రశ్నించిన మోహన్

  నందూని తిడుతూ ప్రశ్నించిన మోహన్

  నందూ తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతోన్న సమయంలో మోహన్ కూడా అదే రీతిలో స్పందిస్తాడు. ‘ఇంక చాలు ఆపు బావ. మేమేమీ తప్పుడు పనులు చేయలేదు. ఇంట్లో భార్య ఉండగా.. మరొకరిని తెచ్చుకుని తల దించుకునేలా ప్రవర్తించలేదు. కట్టుకున్న భార్య గురించి ఆలోచించకుండా పరాయి స్త్రీని ఇంటికి తీసుకొచ్చిన నువ్వా మమ్మల్ని అనేది' అంటూ ఎదురుదాడికి దిగాడు.

  Best Telugu TV Serials In 2020 | కార్తీక దీపం హవా..!!
  లాస్యకే సర్వాధికారాలు అప్పగించేశాడు

  లాస్యకే సర్వాధికారాలు అప్పగించేశాడు

  ఇక, ఈ ఎపిసోడ్ చివరకు వచ్చిన తర్వాత నందూ అదిరిపోయే ప్రకటన చేస్తాడు. ‘తను (లాస్య) పరాయి మనిషి కాదు. నా గురించి ఆలోచించే ఏకైక మనిషి. అందుకే ఇకపై నా ఇంట్లో అన్ని అధికారాలూ లాస్యకే ఉంటాయి. ఆమె చెప్పినట్లే అందరూ నడుచుకోవాలి' అంటూ ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు. దీంతో ఈరోజు ఎపిసోడ్ పూర్తయింది. ఈ సీరియల్ సమాచారం ఫిల్మీబీట్‌లో కొనసాగుతోంది.

  English summary
  Intinti Gruhalakshmi Episode 324: Madhavi and her Husband Mohan divorce Twist reveled. Then Lasya And Bhagya Target Tulasi with Cunning plan.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X