Intinti Gruhalakshmi Today Episode: లాస్య, నందూకు లక్కీ షాక్.. ప్రేమ్‌ను ఇంట్లోకి రానివ్వని ఓనర్
సుదీర్ఘ కాలంగా తెలుగు బుల్లితెపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి భారీ నుంచి అతి భారీ స్థాయిలో స్పందన దక్కుతుంది. సుదీర్ఘ కాలంలో ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' శుక్రవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరు కూడా చూసేయండి మరి!
Photos Courtesy: Star మా and Disney+Hotstar

గురువారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే
గురువారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. ఉద్యోగం పోయిన చిరాకులో ఉన్న నందూను లక్కీ తన ప్రవర్తనతో విసిగిస్తాడు. దీంతో అతడికి కోపం వస్తుంది. అప్పుడు లాస్య.. నందూపై ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఆ తర్వాత నందూ స్నేహితుడు వచ్చిన తనకు ఇవ్వాల్సిన 20 వేలు తక్షణమే కావాలంటూ గొడవ చేస్తాడు. మరోవైపు, తులసికి ఆర్థికంగా సహాయం చేయాలన్న ఉద్దేశంతో అనసూయ వంటల యూట్యూబ్ ఛానెల్ ప్రారంభిస్తుంది. ఇక, మప్పీ లహరి దగ్గర జీతం డబ్బుల కోసం వెళ్లిన ప్రేమ్.. ఆయన మాటల వల్ల గొడవ పడతాడు. దీంతో అక్కడి నుంచి అతడిని గెంటేస్తారు.

తులసితో గొడవ.. ప్రేమ్ ఆగ్రహం2
ఇంట్లో సరకులు అయిపోవడంతో తులసి దాచుకున్న డబ్బులను వెతికి కిరాణా షాప్‌కు వెళ్తుంది. అయితే తాను రాసుకున్న లిస్టులో ఉన్న సరుకులకు ఆమె దగ్గర ఉన్న డబ్బులు సరిపోవు. దీంతో తీసుకున్న వాటిలో కొన్నింటిని వెనక్కి ఇచ్చేస్తుంది. దీంతో షాప్ ఓనర్‌కు తులసిపై కోపం వచ్చి చెడామడా తిట్టేస్తాడు. అప్పుడు అటుగా వెళ్తున్న ప్రేమ్ ఇదంతా చూసి షాప్ ఓనర్‌తో గొడవ పడతాడు. అప్పుడు ఆపిన తులసి 'ఇందులో తప్పు నాది.. నువ్వెవరు అతనితో గొడవపెట్టుకోవడానికి ఏ సంబంధం లేని నువ్వు ఎవరు నా గురించి మాట్లాడటానికి' అని తిట్టి వెళ్తుంది.

అద్దె డబ్బుల కోసం పరువు తీస్తూ
తులసి మాటలకు ప్రేమ్ 'ఎందుకమ్మా నాపై అంత కోపం.. నీకు ఎంత దగ్గరవ్వాలన్నా నన్ను దూరం పెడుతూనే ఉన్నావ్' అని అనుకుంటాడు. అనంతరం ప్రేమ్ కోసం ఇంటి ఓనర్ ఎదురుచూస్తూ ఉంటుంది. అతడు రాగానే 'అద్దె ఎప్పుడు ఇస్తారు? ఊర్లోనే ఉన్నారు కదా.. పారిపోయారేమో అనుకున్నా.. సర్లే అద్దె డబ్బు ఇవ్వు' అని పరువు తీసినట్లు మాట్లాడుతుంది. దీంతో ప్రేమ్ 'మిమ్మల్ని సొంత వాళ్లు అనుకున్నాము. అలాంటిది అద్దె డబ్బుల కోసం మోసం చేసి వెళ్లిపోతామని ఎలా అనుకున్నారు. అలాంటి పనులు ఎన్నటికీ చేయము' అని అంటాడు.

ప్రేమ్‌ను అడ్డుకున్న ఇంటి ఓనర్
ప్రేమ్ చెప్పిన మాటలకు ఇంటి ఓనర్ ఒప్పుకోదు. దీంతో డబ్బులు సర్దుబాటు కాలేదు.. కొద్ది రోజులు గడువు ఇవ్వమని ప్రేమ్ ప్రాధేయపడతాడు. అప్పుడు ఆమె 'నువ్వు అద్దె ఇచ్చే వరకూ ఇంట్లోకి కూడా పోనివ్వను. బయటకు పో. లేకపోతే మా ఆయన మీదే నోరు పారేసుకుంటావా' అని అడ్డుకుంటుంది. దీంతో ప్రేమ్ వెళ్లిపోతుండగా శృతి వచ్చి ఆగు ప్రేమ్ అంటూ తన చెంగున కట్టిన డబ్బులు తీసి ఓనర్ చేతిలో పెడుతుంది. అంతేకాదు, 'ఈసారి నుంచి టైంకి అద్దె ఇచ్చేస్తాం పిన్ని' అని చెప్తుంది. ఆ తర్వాత ఇంటి ఓనర్ ముందు తనకి జరిగిన అవమానం తలుచుకుంటూ ప్రేమ్ బాధపడతాడు. చేతకాని వాడిలా మిగిలిపోయా.. ఉన్న జాబ్ కూడా పోయింది అని ఫీల్ అవుతుండగా.. భారాన్ని జోడెద్దుల్లా కలసి లాగుదాం అని శృతి ధైర్యం చెప్తుంది.

కూరల్లో ఉప్పు కారం ఎక్కువేసి
కిచెన్‌లో వంట చేసుకుంటూ ప్రేమ్‌తో జరిగిన గొడవ గురించి తులసి గుర్తు చేసుకుంటూ ఉంటుంది. మనసును అక్కడే ఉంచుకున్న ఆమె వంటలో ఉప్పు, కారాలు మోతాదుకు మించి వేసేస్తుంది. ఇంతలో దివ్య ఆకలివేస్తుంది అమ్మా అని అనడంతో.. తాతయ్యా, నానమ్మల్ని కూడా పిలు వడ్డిచేస్తా అని అంటుంది. అందరూ ఆకలితో అన్నం తింటూ ఉంటారు. అప్పుడు వాళ్లకు ఉప్పు, కారం ఎక్కువయ్యాయని తెలిసినా తులసి బాధ పడుతుందని చెప్పరు. అయితే, ఎక్కువ సేపు వాటిని తినలేక అనసూయ, పరందామయ్యలు మధ్యలోనే లేచి వెళ్లిపోతారు.

దివ్య చెప్పడంతో తులసి బాధగా
పరందామయ్య, అనసూయ అన్నం మధ్యలోనే వెళ్లిపోవడంతో తులసి ఏమైందని దివ్యను ప్రశ్నిస్తుంది. అప్పుడామె 'ఈరోజు వంట అస్సలు తినేట్టు లేదు' అని చెబుతుంది. వాటిని రుచి చూసిన తులసి నువ్వైనా చెప్పొచ్చు కదా? అని అడుగుతుంది. దీనికి దివ్య 'తాతయ్య నానమ్మలే చెప్పలేదు కదా.. నేను ఎందుకు చెప్పడం అని ఆగిపోయా' అని అంటుంది. ఆ తర్వాత తులసి తన అత్తమామల దగ్గరు వెళ్లి బాధ పడుతుంది. దీనికి వాళ్లు అర్థం చేసుకున్నామని అంటారు. అలా చాలా సేపు మాట్లాడుకున్న తర్వాత అందరూ ఎవరి దారిలో వాళ్లు వెళ్లిపోతారు.

నందూ బొమ్మలను పడేసిన లక్కీ
లాస్య కొడుకు లక్కీ కోసం నందూ ఆటబొమ్మలను తీసుకుని వస్తాడు. అప్పుడా చిన్నారి కోపంగా వచ్చి ఏమైందని అడుగుతాడు. ఆ సమయంలో నందూ తెచ్చిన బొమ్మలను తీసి ఇవ్వగా.. లాస్య ఎంతగానో సంతోష పడుతుంది. అప్పుడు లాస్య 'లక్కీ కోసం ఇంత ఆలోచిస్తున్నావా?' అంటుంది. దీనికి నందూ 'వీడిని దూరం పెట్టి తప్పుచేశాను. ఆ తప్పుని దిద్దుకోవాలని అనుకుంటున్నా. తీసుకో నాన్నా' అని అంటాడు. లక్కీ మాత్రం వాటిని నేలకేసి కొడతాడు. అంతేకాదు, 'నాకు బొమ్మల్ని కొనివ్వడానికి అతను ఎవరు? ఆయనకేం సంబంధం?' అంటాడు.

ఈయన నిన్ను కూడా వదిలేస్తాడు
లక్కీ మాటలకు లాస్య ఆయన మీ డాడీ అని అంటుంది. దీంతో లక్కీ 'ఈయన మా డాడీ కాదు.. దివ్య అక్క వాళ్ల డాడీ.. వాళ్లని వదిలేసి మనతో ఉంటున్నారని నాకు తెలుసు' అని అంటాడు. దీంతో లాస్య కొడుకును కొట్టబోతుంది. అప్పుడు నందూ ఆపి లక్కీ దగ్గరకు వెళ్లి.. 'నేను దివ్య డాడీనే.. కానీ నీకు కూడా డాడీనే' అని అంటాడు. అప్పుడు లక్కీ 'నాకు బ్రెయిన్ లేదనుకోకండి.. దివ్య అక్కకి డాడీ అయినపప్పుడు మీరు నాకు ఎలా డాడీ అవుతారు' అని ప్రశ్నిస్తాడు. దీనికి లాస్య లాస్య.. 'ఈయన తులసి ఆంటీని వదిలేసి నన్ను పెళ్లి చేసుకున్నారు.. అందుకే నీకు డాడీ అయ్యారు' అని అంటుంది. ఆ మాటతో లక్కీ 'రేపు నిన్ను కూడా వదిలేస్తే ఏం చేస్తావ్.. తులసి ఆంటీని వదిలేసిననోడు నిన్ను వదిలేయడా ఏంటి' అని ప్రశించగా ఈ ఎపిసోడ్ పూర్తైంది.


Click it and Unblock the Notifications











