Intinti Gruhalakshmi: విక్రమ్ సీరియస్ వార్నింగ్.. రాజ్యలక్ష్మి షాక్.. లాస్యను కొట్టిన నందూ
సుదీర్ఘ కాలంగా తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రం ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' శనివారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!
Photos Courtesy: Star మా and Disney+Hotstar
శుక్రవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే:శుక్రవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. నందూ ఇంటికి వచ్చిన లాస్య కెఫే తాళాలను ఇవ్వమని అడుగుతుంది. కానీ, దానికి అతడు ఒప్పుకోడు. దీంతో లాస్య కోపంగా అక్కడి నుంచి వెళ్లిపోతుంది. తర్వాత నందూను తులసి కూల్ చేసే ప్రయత్నం చేయగా.. అతడు మాత్రం దివ్య ఇంటికి వెళ్దామని అంటాడు. దీంతో తులసి కూడా అతడితో వెళ్తుంది. అలా వెళ్తుండగా.. కెఫే మేనేజర్ ఫోన్ చేసి లాస్య వచ్చిందని చెప్తాడు. దీంతో ఆమెను బయటకు గెంటేయమంటాడు. ఆ తర్వాత నందూ, తులసి కలిసి దివ్య ఇంటికి వెళ్లగా.. రాజ్యలక్ష్మి తనకు పని ఉందని వాళ్లతో అంటుంది.

మీ అత్తగారికి చెప్పి చెయ్ అని:రాజ్యలక్ష్మి తనకు పని ఉందని అనడంతో దివ్య 'మా అమ్మ వాళ్లు నాకోసం వచ్చారు.. మీరు బిజీగా ఉంటే మీ పని మీరు చేసుకోండి. మేము మా గదిలోకి వెళ్లి కబుర్లు చెప్పుకుంటాము' అంటుంది. అప్పుడు బసవయ్య 'ఇక్కడ సమస్య కబుర్లు గురించి కాదు. నువ్వు ఏదైనా చేసేటప్పుడు మీ అత్తగారికి చెప్పి చెయ్. ఆవిడ అవమానాలు భరిస్తుంది కానీ ఒక్క మాట అనదు. మనమే అర్థం చేసుకోవాలి' అంటాడు. అంతలోనే విక్రమ్ చెప్పులు కుట్టించి తీసుకువస్తాడు. అప్పుడు చెప్పులు మీద దుమ్ము ఉంటే షర్ట్‌తో తుడుస్తాడు. దీంతో తులసి వాళ్లు ఫీల్ అవుతారు.

బసవయ్యకు స్ట్రాంగ్ వార్నింగ్:రాజ్యలక్ష్మికి సేవలు చేస్తోన్న విక్రమ్‌ను చూసిన దివ్య 'తల్లి గురించి నిజం ఎప్పుడు తెలుసుకుంటాడో' అని మనసులో అనుకుంటంది. తర్వాత విక్రమ్ 'అది సరే కానీ.. అత్తయ్య వాళ్ళను ఇక్కడ ఎందుకు ఉంచేశావు' అని అడుగుతాడు. అప్పుడు దివ్య 'అత్తయ్య పర్మిషన్ లేకుండా మా అమ్మ వాళ్ళను పిలిచానని మీ మావయ్య రాద్ధాంతం చేస్తున్నారు. పాపం అత్తయ్య అసలు ఏమీ అనలేదు' అంటుంది. దీంతో విక్రమ్ 'అసలు సమస్యలన్నీ నీవల్లే. అయినా వాళ్ళు ఇక్కడికి రావడానికి పర్మిషన్ ఏంటి? నీవల్లే అమ్మకి సగం చెడ్డ పేరు వస్తుంది. తమ్ముడు అని అభిమానంతో ఆమె ఊరుకోవచ్చు కానీ నేను ఊరుకోను' అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తాడు. తర్వాత అత్తమామలకు సారీ చెప్పి వెళ్లిపోతాడు.

ఎలా మలుచుకోవాలో తెలుసు:లాస్య, భాగ్య కలిసి కెఫేలో కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు భాగ్య 'బావగారిని మరీ దెబ్బ మీద దెబ్బ కొడుతున్నావు. కనీసం అబ్బా అనటానికి కూడా టైం ఇవ్వటం లేదు. అతనితో కలిసి కాపురం చేయాలని ఉంటే పద్ధతి ఇది కాదేమో' అంటుంది. దీంతో లాస్య 'ముందు కలిసి కాపురం చేయటానికి ఒప్పుకుంటే చాలు. తర్వాత అతన్ని ఎలా మలుచుకోవాలో నాకు బాగా తెలుసు' అంటుంది. ఇంతలో కెఫే మేనేజర్ వచ్చి సార్ మిమ్మల్ని మర్యాదగా బయటికి వెళ్ళమన్నారు అని చెప్తాడు. దీంతో తాళాలు ఎలా ఇవ్వడో నేనూ చూస్తాను అని వెళ్లిపోతుంది.

పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను:ఇక గదిలోకి వెళ్లిన తర్వాత తులసి, నందూ 'మీ అత్తగారు నిన్ను బాగానే చూసుకుంటుందా' అని అడుగుతారు. దీంతో దివ్య నిజం దాచేసి మరీ 'మా అత్తగారు నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు' అని చెప్తుంది. అప్పుడు విక్రమ్ 'మీ అమ్మాయి గురించి మీరేమీ బాధపడకండి. తనని పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను' అంటాడు. దీంతో నందూ 'పువ్వుల్లో పెట్టి చూసుకోకపోయినా పర్వాలేదు.. కన్నీరు పెట్టుకోకుండా చూస్తే చాలు' అంటాడు. తర్వాత విక్రమ్ దంపతులు తులసి దంపతులకు బట్టలు పెడతారు.

కెఫే దగ్గర లేడీస్ ధర్నా చేస్తూ:ఆ తర్వాత కెఫే మేనేజర్ నందూకు ఫోన్ చేసి 'మీరు ఇప్పటికిప్పుడు కచ్చితంగా కెఫేకు రావాలి సార్. లాస్య మేడం కొందరు ఆడవాళ్ళను తీసుకొచ్చి ఇక్కడ గొడవ చేస్తున్నారు. నేను హ్యాండిల్ చేయలేకపోతున్నాను' అని చెప్తాడు. దీంతో నందూ వాళ్లు కంగారుగా బయలుదేరి కెఫెకు వెళ్లిపోతారు. వీళ్లు అక్కడకు వెళ్లగానే లాస్య అమాయకంగా నటిస్తూ ఉంటుంది. అప్పుడు అక్కడున్న లేడీస్ 'ఇంట్లోంచి బయటికి పంపించేసింది చాలదా? కెఫేను కూడా లాక్కుంటే తను ఎలా బ్రతుకుతుంది' అని నిలదీస్తారు. దీంతో లాస్య ఆయనను ఏమీ అనకండి అంటుంది. దీనికి వాళ్లు మరి కేసు ఎందుకు పెట్టావు అంటారు. దీంతో తులసి మీద నిందలు వేస్తూ వాళ్లను రెచ్చగొడుతుంది.

లాస్యను వాళ్లు ముందే కొట్టేసి:లాస్య వేస్తున్న నిందలను విన్న నందూకు చాలా కోపం వస్తుంది. ఆ వెంటనే లాస్య అందరి ముందే కొడతాడు. అది చూసి తులసి కోప్పడుతుంది. అప్పుడు లాస్య 'చూశారా రోజు ఇంట్లో ఇదే పరిస్థితి. రెచ్చగొట్టినట్లు రెచ్చగొట్టి ఇప్పుడు మళ్లీ ఎలా మాట్లాడుతుందో చూడండి. ముందు తనను బయటికి పంపించేయండి' అని అక్కడున్న వాళ్లతో చెప్తుంది. దీంతో నందూ 'వెళ్లవలసింది ఆమె కాదు.. నువ్వు' అంటూ మెడ పట్టి బయటకి గెంటేస్తాడు. అంతేకాదు, 'నా మీద కోర్టులో కేసు వేసావు కదా. అక్కడే చూసుకుందాము. అంతవరకు ఏం చేసుకుంటావో చేసుకో' అంటాడు. తర్వాత వాళ్లను కూడా వెళ్లిపోమని అంటాడు. దీంతో వాళ్లంతా నీ సంగతి చూస్తాం అంటూ బయలుదేరుతారు. ఇలా ఈ ఎపిసోడ్ పూర్తైంది.


Click it and Unblock the Notifications











