Intinti Gruhalakshmi: తులసికే ఎదురు తిరిగిన నందూ.. విక్రమ్‌ను తాళ్లతో కట్టేసి.. దివ్య కొత్త ప్లాన్

ఇండియాలోని ఎన్నో భాషల కంటే తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రం ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' బుధవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!
Photos Courtesy: Star మా and Disney+Hotstar

మంగళవారం ఎపిసోడ్‌లో జరిగిందిదే: మంగళవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. దివ్య సలహా మేరకు స్టైలిష్‌గా మారిన విక్రమ్‌ను రాజ్యలక్ష్మి కోప్పడుతుంది. దీంతో అతడు ఆమె కాళ్లపై పడి క్షమించమని వేడుకుంటాడు. దీంతో దివ్యపై గెలిచినట్లు రాజ్యలక్ష్మి గర్వంగా ఫీల్ అవుతుంది. అనంతరం విక్రమ్‌ను తాతయ్య రెచ్చగొడతాడు. దీంతో దివ్య వెనుకాలే వెళ్తుంటాడు. అప్పుడు రాజ్యలక్ష్మి చూసి అతడిని ఆపుతుంది. ఇక, లాస్య దగ్గరకు తులసి వచ్చి రాయభారం చేయబోగ.. ఆమె కొన్ని డిమాండ్లను ఉంచుతుంది. దీంతో చేసేదేం లేక తులసి వెళ్లిపోతుంది. తర్వాత ఈ విషయాన్ని ఇంట్లో వాళ్లకూ వివరిస్తుంది.

Intinti Gruhalakshmi

అందుకే లాస్య దగ్గరకెళ్లాను: లాస్య దగ్గరకు వెళ్లిన విషయాన్ని ఇంట్లో వాళ్లకు చెప్పడంతో పరందామయ్య, అనసూయ 'ఆమె దగ్గరికు వెళ్లి తప్పు చేశావు ఏమో' అంటారు. దీంతో తులసి 'అలానే ఊరుకుంటే సమస్య పెరిగే పెద్దదవుతుంది. నిన్నటి వరకు తన భర్త తనకి సారీ చెప్తే చాలు అనుకుంది. కానీ ఈరోజు కెఫే కూడా అడుగుతుంది. దీన్ని ఇలాగే వదిలేస్తే రేపటి రోజున ఇంకేం అడుగుతుందో. అందుకే తనతో మాట్లాడడానికి వెళ్ళాను. ఈ సమస్య ఇక్కడితో ముగిసిపోతే బాగుంటుంది' అని చెబుతుంది.

తులసిని ప్రశ్నించిన నందూ: తులసి మాట్లాడుతుండగా అక్కడకు వచ్చిన నందూ 'సమస్య అంటున్నావేంటి? ఆఫీసులో నీకు ఏదైనా సమస్యా? ఆలోచిస్తే ఏ సమస్యకైనా ఏదో ఒక పరిష్కారం దొరుకుతుంది' అంటాడు. అప్పుడు తులసి 'అదేంటో సమస్య పక్క వాళ్ళది అనే సరికి బోలెడన్ని పరిష్కారాలు వచ్చేస్తాయి. అదే సమస్య మనది అంటే మనసుకు దిగులు వచ్చేస్తుంది' అంటూ లాస్య దగ్గరికి వెళ్లి వచ్చిన విషయం చెప్తుంది. దీంతో నందూ అక్కడికి ఎందుకు వెళ్లావు అని ప్రశ్నిస్తాడు. దీంతో తులసి 'మిమ్మల్ని చూసి అత్తమామలు బాధపడుతున్నారు. వారు సరిగ్గా భోజనం కూడా చేయట్లేదు. అందుకే సమస్యకు పరిష్కారం దొరుకుతుందేమో అని వెళ్లాను. కానీ ఆమెకి అదే మొండితనం అదే మూర్ఖత్వం' అంటుంది.

Intinti Gruhalakshmi

మాట ఇవ్వడానికి నువ్వెవరు: తులసి మాటలకు నందూ 'నాకు కావలసింది కథ కాదు క్లైమాక్స్. అది చెప్పు చాలు' అనగా.. 'కెఫే తన పేరు మీద రాసిస్తే క్లైమాక్స్ సుఖాంతం అవుతుంది. రేపు వెళ్లి తనను ఇంటికి తీసుకురండి. అలా అని నేను మాటిచ్చాను' అని అంటుంది. దీంతో నందూ 'అలా ఎలా మాటిస్తావు? నాకు ఏదైనా సమస్య వస్తే సలహా ఇవ్వు అంతేకానీ నా జీవితాన్ని గుప్పెట్లో తీసుకోవాలని అనుకోకు. అయినా నా తరఫున మాట ఇవ్వటానికి నువ్వు ఎవరు' అని ఫైర్ అవుతాడు. దీంతో తులసి ఇకపై మీ జోలికి రాను అంటూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఆ తర్వాత పరందామయ్య వాళ్లు 'నువ్వు మాటలు అన్నది నీ మాజీ భార్యను కాదు.. నువ్వు కష్టంలో ఉంటే బాధపడే ఒక మంచి మనిషిని అయినా నీకు లాస్య లాంటి భార్యే కరెక్ట్' అని వెళ్లిపోతారు.

విక్రమ్ కోసం దివ్య మరో ప్లాన్: విక్రమ్‌ను ఎలాగైనా తన వైపు తిప్పుకోవాలని అనుకుంటున్న దివ్య.. 'నా భర్త నా మాట వింటే తన మాట చెల్లదని మా అత్త కుట్రలు పన్నుతుంది. ఎలా అయినా నా భర్తను కవ్వించి నా దగ్గరికి తెచ్చుకుంటాను. దెబ్బకి మా అత్తగారి మొహం మాడిపోవాలి' అనుకొని బసవయ్య గది వైపు వెళుతుంది. బసవయ్య పక్కన పడుకుని విక్రమ్ అప్పటికే నిద్ర పట్టక అవస్థ పడుతూ ఉంటాడు. అప్పుడు దివ్య విక్రమ్‌కు సైగలు చేసి బయటకు రమ్మని అంటుంది. దీంతో అతడిలో ఉత్సాహం పెరిగి బయటకు వచ్చేందుకు ప్రయత్నిస్తాడు.

Intinti Gruhalakshmi

కింద పడ్డ విక్రమ్.. కోపంతోనే: దివ్య బయటకు రమ్మనడంతో విక్రమ్ దొంగ చాటుగా వెళ్లేందుకు ప్రయత్నిస్తాడు. కానీ, అతడి కాలుకు, బసవయ్య కాలును కలిపి తాడును కట్టి ఉంచుతాడు. అతి తెలియని విక్రమ్ మంచం దిగే ప్రయత్నంలో కింద పడిపోతాడు. దీంతో బసవయ్యకు మెలుకువ వస్తుంది. అప్పుడాయన 'నువ్వు ఇలా ఏ అర్ధరాత్రో బయటకు వెళ్ళిపోతావు అని నాకు తెలుసు. అందుకే నువ్వు ఎక్కడికీ వెళ్లకుండా కాలికి తాడు కట్టాను' అంటాడు. దీంతో విక్రమ్‌కు కోపం వస్తుంది. అప్పుడను 'కాలుకు కాదు.. మెడకి కట్టవలసింది' అని కోప్పడతాడు. అదంతా చూసి దివ్య నవ్వుకుంటుంది.

తులసికి సారీ చెప్పాలని వచ్చి: ఇంట్లో పని చేసుకుంటున్న తులసిని చూసిన నందూ.. 'నిజంగానే అమ్మ అన్నట్లు ఒక మంచి మనసును బాధపెట్టాను' అనుకుంటాడు. ఆ తులసి దగ్గరకు వెళ్లి సారీ చెప్తాడు. దీంతో తులసి 'మీరు నాకు సారీ చెప్పినా చెప్పకపోయినా ఒరిగేదేమీ లేదు. ఎవరికి చెప్పాలో వాళ్ళకి చెప్తే కనీసం సమస్యలైనా తీరుతాయి' అంటుంది. దీంతో నందూ 'ఎందుకు నాకు ఇష్టం లేని పని నా చేత చేయిస్తావు. లాస్యతో జీవితం అనేది ముగిసిపోయిన కథ' అంటాడు. దీంతో తులసి అక్కడి నుంచి కోపంగా వెళ్లిపోతుంది. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X