Intinti Gruhalakshmi: కోర్టులో నందూకు షాక్.. రాజ్యలక్ష్మికి యాక్సిడెంట్.. దివ్యకు తెలిసిపోయిన నిజం

ఎప్పటికప్పుడు కొత్త ట్రెండ్ పుట్టుకు వస్తున్నా... తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రం ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' శుక్రవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!
Photos Courtesy: Star మా and Disney+Hotstar

గురువారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే: గురువారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. తులసికి సారీ చెప్పేందుకు నందూ ఎంతగా ప్రయత్నించినా ఆమె ఒప్పుకోదు. దీంతో అత్తమామలు వచ్చి ఆమెను బ్రతిమాలుతారు. దీంతో తులసి కూడా నందూ మంచి కోసమే మాట్లాడుతుంది. ఇక, దివ్య వచ్చి అత్తగారి ముందే కాలు మీద కాలు వేసుకుని కూర్చోగా.. రాజ్యలక్ష్మి మాత్రం ఎంతో పొగరుగా మాట్లాడుతుంది. అంతలో విక్రమ్ వచ్చి దివ్య గురించే మాట్లాడుతుంటాడు. దీంతో రాజ్యలక్ష్మి షాక్ అవుతుంది. ఇక, లాస్యకు వ్యతిరేకంగా సాక్షులను తులసి తీసుకు వస్తుంది. అప్పుడు లాస్య.. నందూ తనను కొట్టిన వీడియో చూపిస్తుంది.

Intinti Gruhalakshmi

నందూ సాక్ష్యాలు చెల్లవంటూ: నందూ తరపున కొందరు కొలిగ్స్ వచ్చి లాస్యకు వ్యతిరేకంగా సాక్ష్యాలను చెప్తారు. కానీ, అవి చెల్లవని లాస్య తరపున లాయర్ వాదిస్తాడు. అంతేకాదు, వాళ్లు గతంలో ఓ చీటింగ్ కేసులో పట్టుబడిన వాళ్లు అని అభ్యంతరం వ్యక్తం చేస్తాడు. దీంతో జడ్జ్ కూడా అంతా పరిశీలించిన తర్వాత వాళ్ల సాక్ష్యాలు చెల్లవని.. ఇప్పటి వరకూ వాళ్లు చెప్పిన విషయాలను పరిగణలోకి తసుకోమని స్పష్టం చేస్తారు. అప్పుడు జడ్జ్ లాస్య తరపు లాయర్‌ను 'మీ వైపు ఏదైనా బలమైన సాక్ష్యం ఉందా' అని అడగ్గా.. వాళ్లు గడువు కావాలని కోరుతారు. దీంతో కేసును ఎల్లుండికి వాయదా వేస్తున్నానంటారు.

తులసి డౌట్.. లాస్య రాకతోనే: కోర్టు నుంచి బయటకు వచ్చిన తర్వాత తులసి 'తన దగ్గర బలమైన సాక్ష్యం ఉన్నా.. లాస్య ఎందుకు కోర్టులో ప్రొడ్యూస్ చేయలేదు' అని డౌట్ పడుతుంది. అప్పుడు దివ్య ఏ కారణమూ లేకుండా లాస్య ఆంటీ ఈ పని చేయదు అంటుంది. అంతలోనే లాస్య వచ్చి 'ఏంటి నా గురించే తెగ ఆలోచిస్తున్నట్లుగా ఉన్నారు' అంటుంది. దీంతో దివ్య 'నువ్వు సాక్ష్యాన్ని ఎందుకు ప్రొడ్యూస్ చేయలేదు అని అనుకున్న మాట వాస్తవమే. కానీ నువ్వు ఏం చేస్తే మాకెందుకు ఇలా ప్రతిసారి వచ్చి గిచ్చి వెళ్లొద్దు' అంటుంది.

Intinti Gruhalakshmi

నమ్మకం, ప్రేమ కోల్పోయావు: దివ్య మాటలకు నందూ 'ఏమీ లేదమ్మా.. మరో రెండు రోజులు నా చుట్టూ తిరిగి కాంప్రమైజ్ కోసం చూస్తుంది' అని వెటకారంగా మాట్లాడతాడు. దీంతో లాస్య నాతో పెట్టుకోవద్దు చాలా కోల్పోవాల్సి ఉంటుంది అంటుంది. అప్పుడు దివ్య 'నువ్వు ఇప్పటికే మా నాన్న ప్రేమను, నమ్మకాన్ని కోల్పోయావు. మా నాన్న వెనకాల మేమందరం మేము ఉన్నాము' అంటుంది. దీనికి లాస్య 'నీ డ్యూటీ నీ కూతురికి అప్పచెప్పావా లోడలోడా వాగుతుంది' అనగా.. 'ఈరోజు నా మాటలు వాగుడులాగే ఉంటుంది. కానీ రేపు మా నాన్న కేసు నుంచి బయటకు వచ్చిన తర్వాత అప్పుడు తెలుస్తుంది నా సంగతి' అంటుంది. దీంతో లాస్య కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.

రాజ్యలక్ష్మికి లాస్య కంప్లైంట్: రాజ్యలక్ష్మి, సంజయ్ కారులో మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడను 'అన్నయ్య పెళ్లికి ముందు వరకు నీకు ఎదురులేకుండా పోయింది. కానీ దివ్య వచ్చిన తరువాత నీ ఆటలు సాగవేమో అనిపిస్తుంది. త్వరగా తనను వదిలించుకోవాలి' అంటాడు. దీనికామె 'దివ్యను కోరి కోడలు చేసుకుంది వదిలించుకోవడానికి కాదు. నీకు ఇంకా మీ అమ్మ సంగతి తెలియదు' అంటుంది. అంతలోనే రాజ్యలక్ష్మికి లాస్య ఫోన్ చేసి 'నీ కొడుకు నీ కోడల్ని కాస్త అదుపులో పెట్టు. వాళ్ళు నా కాళ్ళకి అడ్డం తగులుతున్నారు. వాళ్లు మీ వాళ్ళని ఊరుకుంటున్నాను' అంటుంది.

Intinti Gruhalakshmi:

రాజ్యలక్ష్మికి యాక్సిడెంట్: లాస్య మాటలకు రాజ్యలక్ష్మి 'అక్కడ నా అనే వాళ్ళు లేరు. కాళ్ళకి అడ్డం తగిలిన వాళ్ళను అడ్డుతప్పించుకొని వెళ్ళిపోవటమే మన పని' అని ఫోన్ పెట్టేస్తుంది. తర్వాత సంజయ్‌తో 'ముందు విక్రమ్‌ను ఇల్లు కదలకుండా చేస్తే అప్పుడు దివ్య కూడా ఇల్లు కదలదు. నాకు యాక్సిడెంట్ అయితే విక్రమ్ ఇల్లు కదలడు' అంటుంది. దీంతో సంజయ్ 'ఇప్పటికిప్పుడు నీకు యాక్సిడెంట్ ఎలా అవుతుంది' అంటాడు. దీంతో రాజ్యలక్ష్మి సంజయ్‌ను నెట్టేయగా.. అతడు కారును పక్కకు తిప్పేస్తాడు. కట్ చేస్తే.. రాజ్యలక్ష్మికి యాక్సిడెంట్ అయినట్లు విక్రమ్‌కు ఫోన్ కాల్ వస్తుంది. దీంతో అందరూ ఇంటికి వెళ్తారు. అప్పుడు డాక్టర్ పేషెంట్‌ను జాగ్రత్తగా చూసుకోవాలి అనగా.. విక్రమ్ మేము చూసుకుంటాం అంటాడు. అప్పుడు తులసి దివ్యకు బాధ్యతను అప్పగిస్తుంది.

Intinti Gruhalakshmi:

ఏకలవ్య శిష్యరికం చేయాలి: ఆ తర్వాత లాస్య యాక్సిడెంట్ డ్రామా ఆడుతోన్న రాజ్యలక్ష్మికి ఫోన్ చేసి 'నువ్వు నా కన్నా షార్ప్‌గా ఆలోచిస్తున్నావు. మీ దగ్గర ఏకలవ్య శిష్యరికం చేయాలి' అంటుంది. దీనికామె 'నీది కమిషన్ వ్యవహారం. నాది కోట్లలో వ్యవహారం. ఈ మాత్రం షార్ప్‌నెస్ ఉండాలి. అవుతూ.. ఇంతకీ నెక్స్ట్ ఏం చేయబోతున్నావు' అని లాస్యను ప్రశ్నిస్తుంది. దీంతో లాస్య 'నందూను కెఫేకు దూరం చేయాలనుకుంటున్నాను. అది లేకపోతే తను బ్రతకలేడు' అంటుంది. దీంతో రాజ్యలక్ష్మి ఆనందంగా ఫోన్ పెట్టేస్తుంది.

దివ్యకు తెలిసిపోయిన నిజం: లాస్యతో రాజ్యలక్ష్మి ఫోన్ మాట్లాడిన వెంటనే దివ్య వచ్చి 'మీ జిగిని దోస్త్ ఏమంటుంది? నన్ను ఇంట్లోంచి కదలనివ్వకుండా మంచి ప్లానే వేశారు' అంటుంది. దీంతో రాజ్యలక్ష్మి 'అయితే ఏంటి ఇప్పుడు ఇదంతా మీ అమ్మకు చెప్తావా? తను తట్టుకోగలదా' అంటుంది. దీంతో దివ్య 'ఎడమ కాలికి దెబ్బ తగిలిందని చెప్పి కుడి కాలికి కట్టు కట్టారు. ఈ విషయం మీ కొడుకు చెప్తే తట్టుకోగలడా' అనగానే ఆమె ఒక్కసారిగా షాక్ అవుతుంది. తర్వాత దివ్య 'అప్పుడే ఈ విషయాన్ని మీ అబ్బాయి వరకు తీసుకువెళ్లను. దానికి ఇంకా టైం ఉంది. అప్పటివరకు ఎంజాయ్ చేయండి' అంటూ వెళ్లిపోతుంది. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X