Intinti Gruhalakshmi: రాజ్యలక్ష్మి బండారం బయటపెట్టిన దివ్య.. మరో కన్నింగ్ ప్లాన్‌తో లాస్య రెడీ

జనరేషన్లు మారుతున్నా తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రం ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.

దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' శనివారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!

Photos Courtesy: Star మా and Disney+Hotstar

Intinti Gruhalakshmi Serial Today Episode May 27th 2023

శుక్రవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే: శుక్రవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. కోర్టులో నందూకు సపోర్టుగా కొందరు సాక్ష్యం చెప్పగా.. వాళ్లు గతంలో చీటింగ్ కేసులో ఇరుక్కున్నట్లు లాస్య తరపు లాయర్ చెప్తాడు. దీంతో ఆ సాక్ష్యాలు చెల్లవని జడ్జ్ అంటాడు. దీంతో విచారణను మళ్లీ వాయిదా వేస్తారు. బయటకు వచ్చిన తర్వాత లాస్య అందరితో గొడవకు దిగుతుంది.

ఇక, కోర్టులో గొడవ తర్వాత రాజ్యలక్ష్మికి లాస్య ఫోన్ చేసి దివ్య మీద కంప్లైంట్ ఇస్తుంది. దీంతో ఆమె యాక్సిడెంట్ అయినట్లు నాటకం ఆడుతుంది. ఆ విషయాన్ని దివ్య గ్రహించి అత్తకు సరైన బుద్ది చెప్పేలా మాట్లాడడంతో ఆమె షాక్ అవుతుంది.

Intinti Gruhalakshmi Serial Today Episode May 27th 2023

లాస్యతో జీవించేది లేదంటూ: లాస్య వ్యవహరిస్తున్న తీరుపై మోహన్ 'న్యాయం మన వైపు ఉన్నా తలదించుకోవాల్సి వస్తుంది. అన్యాయం లాస్య వైపు ఉన్నా మనల్ని ఒక ఆట ఆడిస్తుంది' అంటాడు. దీంతో నందూ 'అనవసరంగా మీరందరూ ఓడిపోయే యుద్ధాన్ని చేస్తున్నారు.

నేను జైలుకు వెళ్లడానికి ఎప్పుడో సిద్ధం. అంతేగాని లాస్యతో కలిసి జీవించేది లేదు' అంటాడు. దీంతో తల్లిదండ్రులు 'ఎందుకు అలా ఆశలు వదిలేసుకుంటావు? కోర్టులో నువ్వు గెలుస్తావని నీకు నమ్మకం లేదు కానీ మాకు నమ్మకం ఉంది' అంటారు.

Intinti Gruhalakshmi Serial Today Episode May 27th 2023

కాంప్రమైజ్ అవడం మంచిది: నందూ మాటలు విన్న తులసి 'లాస్యను కలిసి కాంప్రమైజ్ అవ్వడం మంచిది' అంటుంది. దీంతో నందూ 'ఇన్నాళ్లు మారనిది ఇప్పుడు మారుతుందా' అనగా.. 'ఏం మీరు మారలేదా? తప్పు తెలుసుకోలేదా? అలాగే తను కూడా తెలుసుకుంటుంది.

లాస్య వల్ల మీకు ఎలాంటి సమస్య రాకూడదు. దీనికోసం నేను ఏమి చేయడానికైనా సిద్ధంగానే ఉన్నాను. అంతేకాదు, అందుకోసం మీ ప్రతి కష్టంలోని తోడుంటాను' అంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. దీంతో నందూ ఆలోచనలో పడిపోతాడు.

Intinti Gruhalakshmi Serial Today Episode May 27th 2023

అంతా వేరు.. మా అమ్మ వేరు: భోజనం ముందు కూర్చుని విక్రమ్ కన్నీరు పెట్టుకుంటాడు. దీంతో దివ్య 'ఎందుకు అలా బాధపడతారు? హాస్పిటల్లో చాలా మందికి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మీరు చూస్తున్నారు కదా. మీ అమ్మగారు ఒక్కరికే ఈ సమస్య రాలేదు' అంటుంది. దీనికతడు 'అందరూ వేరు.. మా అమ్మ వేరు.

మా అమ్మను అలా చూసి తట్టుకోలేకపోతున్నాను' అంటాడు. దీంతో దివ్య 'మీ నాన్న గురించి ఒక్కసారి అయినా ఇలా ఆలోచించావా' అని ప్రశ్నిస్తుంది. దీంతో తాతయ్య 'నా కొడుకు విషయంలో నేను ఎలా గుండె ధైర్యంతో ఉన్నానో.. నువ్వు కూడా అలాగే ఉండు' అంటాడు.

Intinti Gruhalakshmi Serial Today Episode May 27th 2023

తల్లిని అనడంతో విక్రమ్ కోపం: తాతయ్య మాటలకు విక్రమ్ 'మా అమ్మను ఎవరితోనూ పోల్చద్దు తాతయ్య.. మా అమ్మ నాకు ప్రత్యేకం' అంటూ అక్కడి నుంచి కోపంగా వెళ్లిపోతాడు. దీంతో దివ్య ఏంటి తాతయ్య ఇది అంటుంది. అప్పుడు ప్రియ 'అది వాళ్ళ బంధం.

దానిని తప్పు పట్టలేము' అంటుంది. ఆ వెంటనే తాత 'అందుకేనమ్మా నేను వాళ్ళ అమ్మ గురించి ఎక్కువగా మాట్లాడను. వీడి పిచ్చి ప్రేమను వాడుకుంటుంది ఆ రాక్షసి' అంటాడు. దీంతో దివ్య 'కానీ నేను చూస్తూ ఊరుకోను. ఆమె తప్పులు ఆమెకు తెలిసి వచ్చేలా చేస్తాను' అని కోపంగా అంటుంది.

Intinti Gruhalakshmi Serial Today Episode May 27th 2023

వాళ్లను జాగ్రత్తగా చూసుకోమని: ఇంత కాలం తాను చేసిన తప్పులకు నందూ బాధ పడుతుంటాడు. వెంటనే కాఫీని తన ఫొటో మీద పోసుకుంటాడు. అది విని అందరూ గదిలోకి వస్తారు. అప్పుడు తల్లిదండ్రి ఎందుకిలా ప్రవర్తిస్తున్నావు అని ప్రశ్నిస్తారు. దీంతో నందూ 'నేను చేసిన తప్పులు గుర్తొస్తే నాకే సిగ్గుగా అనిపిస్తుంది. నేను జైలుకు వెళ్ళటం ఖాయం.

కానీ మీ గురించి ఆలోచిస్తున్నాను. ఈ వయసులో మీకు అండగా ఉండవలసింది పోయి ఒంటరిగా వదిలేస్తున్నాను. తల్లిదండ్రుల్ని జాగ్రత్తగా చూసుకో. నా జీవితం ముగిసిపోయింది' అని తులసితో అంటాడు. అప్పుడు పరందామయ్య వాళ్లు 'వాడి బాధ చూడలేకపోతున్నాము. వాడికి ధైర్యం చెప్పగలిగింది నువ్వు ఒక్కదానివే' అని ఆమెను వెళ్లమంటారు.

Intinti Gruhalakshmi Serial Today Episode May 27th 2023

నందూకు నచ్చజెప్పిన తులసి: ఆ తర్వాత నందూకు తులసి కాఫీ తీసుకెళ్లి ఇస్తుంది. దీంతో నందూ నిన్ను అనవసరంగా ఇబ్బంది పెడుతున్నాను అంటాడు. దీనికామె 'పాతికేళ్ల కిందట ఇలా ఆలోచించి ఉంటే మనకి ఇన్ని కష్టాలు ఉండేవి కాదు. జైలుకి వెళ్ళటానికి సిద్ధపడే ఉన్నారు కదా.

అయినా ఎందుకు ఇంత ఆవేశం. నా భర్త నన్ను అంతకన్నా ఎక్కువగానే ఇబ్బంది పెట్టారు. నేను మౌనంగా భరించాను. జీవితానికి ముగింపు చావు మాత్రమే మిగిలినవన్నీ తాత్కాలికమే. మన సంతోషాన్ని మాత్రమే ఇతరులకు పంచాలి దుఃఖాన్ని మనమే భరించాలి' అని నందూకు నచ్చజెబుతుంది.

Intinti Gruhalakshmi Serial Today Episode May 27th 2023

రాజ్యలక్ష్మికి దివ్య మరో షాక్: దివ్య వచ్చి అందరికీ ఒక గుడ్ న్యూస్ అని పిలుస్తుంది. దీంతో బసవయ్య 'మా అక్క కాలు విరిగిపోతే గుడ్ న్యూసా' అంటాడు. దీంతో దివ్య 'ముందు నేను చెప్పేది వింటే అది గుడ్డో, బ్యాడ్డో మీకే తెలుస్తుంది. నేను అత్తయ్య గారి స్కానింగ్ చూశాను.

ఆవిడ కాలు విరగలేదు కేవలం బెణికింది. రేపటికల్లా ఆవిడ నడిచేలాగా చేస్తాను' అంటుంది. అదెలా సాధ్యం అని బసవయ్య అనగా.. ఆ స్కానింగ్ రిపోర్ట్ ఇస్తుంది. దీంతో నిజమే అంటాడు. దీంతో విక్రమ్ భార్యను హగ్ చేసుకుంటాడు. ఇక, నందూను అన్‌పాపులర్ చేయడానికి లాస్య ఓ వ్యక్తితో డీల్ కుదుర్చుకుంటుంది. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X