For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Intinti Gruhalakshmi May 28th Episode: లాస్యకు ఘోర అవమానం.. తులసి గురించి ఆమెకు తెలిపోయిన నిజం!

  |

  ఎంతో కాలంగా తెలుగు బుల్లితెరపై ప్రసారం అయ్యే సీరియళ్లకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రదర్శితం అవుతున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో రన్ అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మీ' ఒకటి. దాదాపు ఏడాది నుంచీ ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మీ' శుక్రవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో చూద్దాం పదండి!

  గురువారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  గురువారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  గురువారం ప్రసారమైన ఎపిసోడ్‌లో తులసికి చుక్కలు చూపిస్తానని లాస్య వార్నింగ్ ఇస్తుంది. అప్పుడే ఆమెకు రోహిత్ ఉద్యోగం ఇస్తానని ఆఫర్ చేస్తాడు. ఆ విషయం తెలిసిన నందూ తట్టుకోలేక రగిలిపోతుంటాడు. ఆ సమయంలో లాస్యతో ‘తులసి నా భార్య' అని అరుస్తాడు. ఆ తర్వాత శృతి.. ప్రేమ్‌కు ఫోన్ చేసి అన్ని వివరాలు చెబుతుంది. ఇక, అత్తగారు అభీని తీవ్రంగా అవమానిస్తుంది.

  తులసి ఇంటికి వచ్చిన లాస్యకు షాక్

  తులసి ఇంటికి వచ్చిన లాస్యకు షాక్

  నిన్న జరిగిన దానికి అలిగిన లాస్యను నందూ బ్రతిమాలడంతో ఈరోజు ఎపిసోడ్ ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత లాస్య.. నందూ ఆఫీస్ ఫైల్స్ కోసం తులసి ఇంటికి వస్తుంది. ఆ సమయంలో ఆమెకు ఊహించని అనుభవం ఎదురవుతుంది. ఎదురొచ్చిన తులసి.. లాస్యపై ఓ రేంజ్‌లో ఫైర్ అవుతుంది. ఆ తర్వాత ఆమెను మాట్లాడనీయకుండా ఎన్నో మాటలు అంటూ ఇబ్బంది పెడుతుంది.

   లాస్యను అవమానించిన నందూ తండ్రి

  లాస్యను అవమానించిన నందూ తండ్రి

  తులసి.. లాస్యను తిడుతున్న సమయంలోనే అనసూయ వచ్చి అడ్డు పడుతుంది. అప్పుడు నందూ తండ్రి ఎంట్రీ ఇచ్చి.. ఆమెపై తీవ్ర స్థాయిలో కోప్పడతాడు. అంతేకాదు, లాస్యను ‘మళ్లీ ఏ ముఖం పెట్టుకుని వచ్చావు లాస్య.. నీ లాంటి వాళ్లకు సిగ్గు అనేది ఉండదు. మళ్లీ మా ఇంటికి వస్తే వేరేలా ఉంటుంది. అయినా మనుషులకైతే ఏదైనా చెప్పొచ్చు.. నీకు కాదు' అంటూ అవమానించాడు.

   తులసిలోని మార్పులపై లాస్య, భాగ్య

  తులసిలోని మార్పులపై లాస్య, భాగ్య

  తులసిలో రెండు మూడు రోజులుగా కనిపిస్తున్న మార్పుల గురించి లాస్య, భాగ్య మధ్య సంభాషణ జరుగుతుంది. ఆమె ఒక్కసారిగా ఇలా ఎందుకు మారిపోయింది? ఏ ధైర్యంతో అందరినీ ఎదురిస్తోంది? అసలు ఏం ప్లాన్ వేసి ఇలా ప్రవర్తిస్తోంది? అంటూ వాళ్లు మాట్లాడుకున్నారు. మొత్తానికి ఇకనుంచి తులసితో తామందరం ఎంతో జాగ్రత్తగా ఉండాలని డిసైడ్ అయిపోయారు.

   తులసికి షాకింగ్ న్యూస్ చెప్పిన బ్రదర్

  తులసికి షాకింగ్ న్యూస్ చెప్పిన బ్రదర్

  భర్త ఇంటి నుంచి వెళ్లిపోయిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఉండగా.. ఆమె సోదరుడు ఫోన్ చేస్తాడు. ‘నీతో బావగారితో సత్యనారాయణ స్వామి వ్రతం చేయించడానికి అమ్మ మీ ఇంటికి వచ్చింది' అని షాకింగ్ న్యూస్ చెబుతాడు. అప్పుడు తులసి ఇంట్లో జరిగిన విషయం మొత్తం తమ్ముడికి చెబుతుంది. దీంతో అతడు కంగారు పడిపోయి.. నేను కూడా ఇంటికొస్తున్నా అంటూ భరోసా ఇస్తాడు.

  తులసి మదర్‌ను తీసుకొచ్చిన నందూ

  తులసి మదర్‌ను తీసుకొచ్చిన నందూ

  నందూ రోడ్డు మీద నిల్చుని ఫోన్ మాట్లాడుతుండగా.. తులసి తల్లి నడుచుకుంటూ వస్తుంది. అప్పుడు అతడిని చూసి ‘అల్లుడు గారూ మీరు ఇక్కడున్నారేంటి' అని అడుగుతుంది. అదే ప్రశ్నను అతడు కూడా అడుగుతాడు. దీంతో ‘మీ ఇంటికే వస్తున్నాను. పదండి వెళ్దాం' అంటుంది. అప్పుడు చేసేదేం లేక ఆమెను కారు ఎక్కించుకుని ఇంటి ముందర దిగబెట్టి అలాగే నిల్చుని ఉంటాడు.

  Best Telugu TV Serials In 2020 | కార్తీక దీపం హవా..!!
  తులసి గురించి తల్లికి తెలిసిన వాస్తవం

  తులసి గురించి తల్లికి తెలిసిన వాస్తవం

  తల్లి వచ్చిన విషయం తెలిసి తులసి బయటకు వస్తుంది. కారు దిగిన నందూ ఎంత పిలిచినా లోపలికి రాడు. ఏమైందని తులసి తల్లి అడుగుతుండగానే లాస్య ఎంట్రీ ఇస్తుంది. ‘ఏంటి నందూ అలా నిల్చున్నావు. మన ఇంట్లోకి వెళ్దాం పదా' అంటుంది. అప్పుడు తులసి బాధగా తన తల్లి వైపు తిరిగి చూస్తుంది. దీంతో ఆమెకు తన కూతురు పడుతోన్న బాధ గురించిన నిజం తెలిసిపోతుంది.

  English summary
  Intinti Gruhalakshmi Episode 331: Nandhu Father Warning and abasement to Lasya in front of Tulasi. After That Tulasi Mother Came to her House. Then She Learned the truth.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X