For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Intinti Gruhalakshmi May 29th Episode: పోలీసులంటూ షాకిచ్చిన దీపక్.. నందూకి నిజం చెప్పేసిన తండ్రి!

  |

  ఎంతో కాలంగా తెలుగు బుల్లితెరపై ప్రసారం అయ్యే సీరియళ్లకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రదర్శితం అవుతున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో రన్ అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మీ' ఒకటి. దాదాపు ఏడాది నుంచీ ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మీ' శనివారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో చూద్దాం పదండి!

   శుక్రవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  శుక్రవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  శుక్రవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. నందూ ఫైల్స్ కోసం తులసి ఇంటికి వచ్చిన లాస్యకు ఘోర అవమానం జరుగుతుంది. ఆ తర్వాత భాగ్య, లాస్య ఇద్దరూ తులసిలో వచ్చిన మార్పులు చూసి భయపడిపోతుంటారు. ఇక, తులసి సోదరుడు ఫోన్ చేసి అమ్మ మీ ఇంటికి వస్తుందని చెబుతాడు. అన్నట్లుగానే ఆమె నందూ కార్‌లోనే ఇంటికి వస్తుంది. ఆ తర్వాత ఆమెను నిజం తెలిసిపోతుంది.

   తల్లికి జరిగిందంతా చెప్పేసిన తులసి

  తల్లికి జరిగిందంతా చెప్పేసిన తులసి

  నందూ.. లాస్యతో కలిసి వెళ్లిపోతుండగా.. తులసి తల్లి చూసి ఏమైందని ప్రశ్నించడంతో ఈ ఎపిసోడ్ ప్రారంభం అయింది. ఎన్నిసార్లు అడిగినా తులసి ఏమీ మాట్లాడకుండా ఉంటుంది. ఆ సమయంలో ఆమె తల్లి ఆగ్రహించగా.. అప్పుడు జరిగిన విషయం మొత్తం వివరించి బాధ పడుతుంది. అంతలో తులసి మామగారు కూడా అక్కడకు వచ్చి ఆమెకు మద్దతుగా మాట్లాడతాడు.

  నందూపై పోలీస్ కేసంటూ దీపక్ షాక్

  నందూపై పోలీస్ కేసంటూ దీపక్ షాక్

  ఇది జరిగిన కాసేపటికి తులసి సోదరుడు దీపక్.. నందూ ఇంటికి వెళ్తాడు. అక్కడ లాస్య ముందే అతడికి గట్టి వార్నింగ్ ఇస్తాడు. ‘విడాకులు అయ్యేంత వరకూ నువ్వు మా అక్క దగ్గరే ఉండాలి. లేదంటే పోలీస్ కేసు పెడతాను. అప్పుడు వాళ్లే నిన్ను మెడపట్టి మా అక్క కాళ్ల దగ్గర పడేస్తారు' అంటాడు. దానికి నందూ కూడా గట్టిగా ఆన్సర్ ఇవ్వడంతో దీపక్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు.

  ఫిర్యాదు చేయనీకి ఒప్పుకోని తులసి

  ఫిర్యాదు చేయనీకి ఒప్పుకోని తులసి

  తన అక్కకు జరుగుతోన్న అన్యాయం గురించి బాధ పడుతోన్న దీపక్.. నందూ ఇంటి నుంచి నేరుగా తులసి దగ్గరకు వస్తాడు. అప్పుడు పోలీస్ కేసు పెడదాము పద అక్కా అని పిలుస్తాడు. కానీ, ఆమె మాత్రం దానికి అంగీకరించదు. ‘కేసుల వల్ల ఆయన నా దగ్గరకు రావడం కాదు.. తన తప్పును తెలుసుకుని రావాలి. అలా అయితేనే నాకు సంతోషం' అంటూ తమ్ముడిని శాంత పరుస్తుంది.

   బాధతో వెళ్లిపోయిన తల్లి... సోదరుడు

  బాధతో వెళ్లిపోయిన తల్లి... సోదరుడు


  కేసు పెట్టడానికి ఒప్పుకోకపోవడంతో పాటు భర్తను దారిలో పెట్టుకోలేని కూతురిని చూసి తులసి తల్లి తల్లడిల్లిపోతుంది. ఆ వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోతానని చెబుతుంది. తులసి ఆపే ప్రయత్నం చేసినప్పటికీ ఆమె మాత్రం ఆగదు. ఆమె తర్వాత దీపక్ కూడా అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఆ తర్వాత కొద్ది సేపటికి తల్లి, సోదరుడు ఇద్దరూ ఇంటికి వెళ్లారా లేదా అని ఫోన్ చేసి వాకబు చేస్తుంది.

   నందూకు ఫోన్ చేసి ఫైర్ అయిన తండ్రి

  నందూకు ఫోన్ చేసి ఫైర్ అయిన తండ్రి

  ఇంట్లో తులసి పడుతోన్న బాధను చూసి నందూకు ఫోన్ చేస్తాడు అతడి తండ్రి. కాల్ లిఫ్ట్ చేసి మంచిగా మాట్లాడే ప్రయత్నం చేయగా.. అతడిపై తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతాడాయన. అంతేకాదు, ‘తులసి గురించి నీకు చాలా నిజాలు తెలియాలి రా. దివ్యకు కాలేజ్ ఫీజు కట్టింది నువ్వు కాదు.. తనే. తన డబ్బులిచ్చి నీ పరువు పోకుండా కాపాడిందిరా' అంటూ అసలు నిజం చెప్పేస్తాడాయన.

   తప్పతాగి తులసి ఇంటికొచ్చిన నందూ

  తప్పతాగి తులసి ఇంటికొచ్చిన నందూ

  బావమరిది దీపిక్ ఇంటికి వచ్చి బెదిరించడం.. ఆ తర్వాత తన తండ్రి ఫోన్ చేసి తిట్టడంతో తనలో తానే రగిలిపోతుంటాడు నందూ. ఈ క్రమంలోనే ఆరోజు రాత్రి సమయంలో ఫుల్లుగా మద్యం సేవించి తులసి ఇంటికి వస్తాడు. అప్పుడు గట్టిగా అరుస్తూ గొడవకు దిగుతాడు. దీంతో ఆమె బయటకు రావడంతో ఇద్దరి మధ్య డిస్కర్షన్ జరుగుతుంది. దీంతో ఈరోజు ఎపిసోడ్ పూర్తి అయిపోయింది.

  English summary
  Intinti Gruhalakshmi Episode 332: Tulasi Brother Deepak Went Nandhu House. After That He Warned Nandhu in Front of Lasya. Then Tulasi Back Step on Police Case.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X