For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Intinti Gruhalakshmi Today Episode: పందెంలో గెలిచిన తులసి..

  |

  ఇండియాలోని అన్ని భాషలతో పోల్చుకుంటే తెలుగు బుల్లితెరపై ప్రసారం అయ్యే సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ నుంచి అతి భారీ స్థాయిలో స్పందన దక్కుతుందన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' సోమవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరు కూడా ఓ లుక్కేయండి!
  Photos Courtesy: Star మా and Disney+Hotstar

  శనివారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  శనివారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  శనివారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. ఇంట్లో ఎవరికీ చెప్పకుండా వెళ్లినందుకు తులసిపై దివ్య ఫైర్ అవుతుంది. అంతేకాదు, అనసూయ, పరందామయ్య కూడా ఎంతగానో భయపడ్డామని చెబుతారు. ఆ తర్వాత ప్రవళ్లిక ఫోన్ చేసి బయటకు వెళ్దాం రెడీగా ఉండు అంటుంది. అందుకు తగ్గట్లే ఆ తర్వాత ఇంటికొచ్చి ఆమెను తీసుకెళ్తుంది. అలా బయటకు వెళ్లిన వాళ్లిద్దరూ షాపింగ్ చేస్తారు. ఆ సమయంలో తులసి కోసం ప్రవళ్లిక ఎన్నో డ్రెస్‌లు కొంటుంది. జాగింగ్ కోసం కూడా ట్రాక్ తీసుకుంటుంది. ఇక, ప్రేమ్‌.. శృతి కోసం ఎన్నో సపర్యలు చేసి ఆమెకు రెస్ట్ ఇస్తాడు.

  Bigg Boss Non Stop: నీ బటన్స్ తీసి బ్రా చూపించు.. ఆమెతో శివ అసభ్యంగా.. నాగార్జున వీడియో చూపించడంతో!

  తులసిని తీసుకెళ్లిపోయిన ప్రవళ్లిక

  తులసిని తీసుకెళ్లిపోయిన ప్రవళ్లిక

  షాపింగ్ చేసి అలసిపోయి పార్కులోకి వచ్చిన తులసి, ప్రవళ్లిక ఎంతో సంతోషంగా గడుపుతూ ఉంటారు. అలా చాలా సేపు ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ సమయంలో ప్రవళ్లిక 'నీకు ఏది చేయాలనిపిస్తే అది చేయి. ఎవ్వరి గురించి ఆలోచించకు' అని సలహా ఇస్తుంది. అప్పుడు తులసి 'నిజమే కానీ.. ఒక్కోసారి బంధాలు వెనక్కి లాగుతుంటాయి' అని చెబుతుంది. దీనికి ప్రవళ్లిక 'అతిగా ప్రేమించడం వల్ల ఇలాంటి పరిస్థితులు వస్తాయి' అని అంటుంది. ఆ తర్వాత పదా బయలుదేరుదాం అంటూ తులసిని మళ్లీ ఎక్కడికో తీసుకెళ్లాలని ప్రవళ్లిక అనుకుంటుంది.

  తులసిని ప్రోత్సహించిన ప్రవళ్లిక

  తులసిని ప్రోత్సహించిన ప్రవళ్లిక


  ప్రవళ్లిక, తులసి నడుచుకుంటూ వెళ్తుండగా పానీపూరీ బండి కనిపిస్తుంది. అదిగో చూడు గోల్ గప్పా అంటూ తమ చిన్ననాటి మెమోరీస్‌ను గుర్తు తెచ్చుకుంటారు. అప్పుడు ప్రవళ్లిక ఒకసారి తిందాం పదా అనగా.. తులసి మాత్రం వద్దంటుంది. కానీ, ఆమె మాత్రం వినకుండా నువ్వు పదా అంటూ తీసుకెళ్తుంది. అవి తింటూ ప్రవళ్లిక 'నీకు గుర్తుందా.. చిన్నప్పుడు మనం ఎవరు ఎక్కువ తింటారా అని పందెం కట్టుకొని మరీ తినేవాళ్లం' అని అడుగుతుంది. దీనికి తులసి 'ఎందుకు గుర్తుకు లేదు. అప్పుడు ప్రతిసారి నువ్వే గెలిచేదానివి కదా' అని సమాధానం చెబుతుంది.

  టాప్‌ను పైకి లేపి షాకిచ్చిన హీరోయిన్: ప్రైవేట్ భాగాలు కనిపించేలా తెలుగు నటి సెల్ఫీ వీడియో

  ఆమెతో పందెంలో తులసి గెలుపు

  ఆమెతో పందెంలో తులసి గెలుపు


  పానీ పూరీలు ఎక్కువగా తినడం గురించి ప్రవళ్లిక 'ఈ పందెం గెలిస్తే జీవితాన్నే గెలిచినట్టు అనుకో. ఈ చిన్న పందెం కూడా గెలవలేవా' అని రెచ్చగొడుతుంది. దీంతో తులసి ఈ పందేన్ని చాలెంజింగ్‌గా తీసుకుంటుంది. వెంటనే పానీపూరీ తినడం ప్రారంభిస్తుంది. ప్రవళిక కంటే ఎక్కువ తినడం స్టార్ట్ చేస్తుంది. దీంతో ప్రవళిక ఆ గేమ్‌లో ఓడిపోతుంది. ఆ తర్వాత నేనే గెలిచాను అంటూ సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అవుతుంది తులసి. ఆ తర్వాత లైఫ్‌లో గెలవడంపై నీకు చాలా పట్టుదల ఉంది అంటుంది ప్రవళిక. దీంతో తులసి చాలా సంతోషిస్తుంది.

  శృతికి గట్టి వార్నింగ్ ఇచ్చిన ఓనర్

  శృతికి గట్టి వార్నింగ్ ఇచ్చిన ఓనర్

  జ్వరంతో బాధ పడుతోన్న శృతికి ఫోన్ వస్తుంది. వాళ్లు ఏదో అడగ్గా ఒంట్లో బాలేదని చెప్తుంది. దీనికామె 'పనికి ఎగనామం పెట్టినప్పుడు ఎవ్వరైనా చెప్పేది ఇదే' అంటుంది. అప్పుడు శృతి 'రేపటి కల్లా జ్వరం తగ్గిపోతుంది. తగ్గిపోయాక నేనే వస్తాను' అంటుంది. దీనికి ఓనర్ 'నాకు తెలియదు. రేపు వస్తేరా పనిలోకి. లేదంటే వేరేవాళ్లను పెట్టుకుంటాను' అని వార్నింగ్ ఇస్తుంది. దీంతో శృతి బాధ పడుతుంది. అప్పుడే ప్రేమ్ ఇంటికి వస్తాడు. శృతిని చూసి.. 'పడుకోకుండా లేచి తిరుగుతున్నావేంటి.. కళ్లు తిరిగి పడిపోతే' అంటాడు. తర్వాత డాక్టర్‌ను తీసుకొస్తాడు.

  పూల్‌లో బికినీతో ప్రియాంక చోప్రా రచ్చ: వామ్మో ఆమెను ఇలా చూస్తే తట్టుకోవడం కష్టమే

  కుర్రాళ్లకు బుద్ది చెప్పిన ప్రవళ్లిక

  కుర్రాళ్లకు బుద్ది చెప్పిన ప్రవళ్లిక

  రోజంతా సంతోషంగా గడిపిన ప్రవళ్లిక, తులసి పార్కులో ఓ గోడ మీద కూర్చొని ఉంటారు. సరదాగా ఏదో తింటూ ఉంటారు. అలా ఇద్దరూ తెగ ఎంజాయ్ చేస్తుంటారు. ఇంతలో అక్కడకు ఇద్దరు యువకులు వచ్చి వాళ్లను టీజ్ చేయాలని చూస్తారు. దీంతో ప్రవళ్లిక వాళ్లను పిలిచి బుద్ధి చెబుతుంది. అంతేకాదు.. యువకులనే ర్యాగింగ్ చేస్తుంది. అలా వాళ్లిద్దరితో డ్యాన్స్ కూడా చేయిస్తుంటుంది. అంతలో నందూ కూడా అక్కడకు వచ్చి ఫోన్ మాట్లాడుతుంటాడు. అతడిని చూసిన తులసి.. ఇక్కడి నుంచి వెళ్లిపోదాం అంటూ ప్రవళ్లికను లాక్కును తీసుకెళ్లిపోతోంది.

  గత వారం కంటే తగ్గిన రేటింగ్

  గత వారం కంటే తగ్గిన రేటింగ్

  తెలుగు బుల్లితెరపై తిరుగులేని రేటింగ్‌ను అందుకుంటూ దూసుకుపోతోన్న సీరియళ్లలో 'ఇంటింటి గృహలక్ష్మి' ఒకటి. ఇది చాలా కాలంగా భారీ స్థాయిలో స్పందనను దక్కించుకుంటోంది. ఈ క్రమంలోనే గత వారం అంటే 15వ వారంలో ఈ సీరియల్ ఏకంగా 9.76 టీఆర్పీ రేటింగ్‌ను సొంతం చేసుకుంది. అయితే, ఈ వారం కాస్త ప్రభావాన్ని కోల్పోయింది. ఫలితంగా 16వ వారానికి సంబంధించి దీనికి 9.05 టీఆర్పీ రేటింగ్ మాత్రమే దక్కింది.

  English summary
  Intinti Gruhalakshmi Episode 620: Pravallika Meets Tulasi and Gives Some Suggestions to her. Ankitha and Abhi Get Into Heated Argument.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X