Intinti Gruhalakshmi: ఫస్ట్ నైట్ ముందు ప్రమాదం.. రాజ్యలక్ష్మి ప్లాన్ వర్కౌట్.. శోభనం వద్దన్న విక్రమ్

కేవలం తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రం ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.

దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' మంగళవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!

Photos Courtesy: Star మా and Disney+Hotstar

Intinti Gruhalakshmi Serial Today Episode May 2nd 2023

సోమవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే: సోమవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. రాజ్యలక్ష్మి దగ్గర లాస్య డబ్బులు తీసుకోవడాన్ని చూసిన తులసి ఇంటికొచ్చిన తర్వాత పెద్ద గొడవ చేస్తుంది. అప్పుడు నందూ కూడా ఆమెకు కొట్టబోతాడు. దీంతో లాస్య.. గతంలో నందూ ఇచ్చిన మనీ మొత్తం పోగొట్టేశానని..

ఇప్పుడు అడ్వాన్స్ ఇవ్వడం కోసం రాజ్యలక్ష్మి దగ్గర ఆ డబ్బును అప్పుగా తీసుకున్నానని అబద్ధం చెప్తుంది. దీంతో ఆమెపై అందరూ విరుచుకుపడతారు. అనంతరం ఆ డబ్బును తీసుకుని రాజ్యలక్ష్మి ఇంటికి వెళ్తారు. అప్పుడు చాలా డ్రామా నడిచిన తర్వాత వాళ్లు తీసుకొచ్చిన బ్రీఫ్‌కేస్‌ను ఆమెకు అందిస్తారు.

Intinti Gruhalakshmi Serial Today Episode May 2nd 2023

ఫస్ట్ నైట్ సలహా అడిగిన దివ్య: శోభనానికి ముందు దివ్యను రెడీ చేయడంతో ఆమె కూర్చుని టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడు వాళ్ల నానమ్మ అనసూయతో 'నీకు చాలా అనుభవం ఉన్నది కదా. ఇలాంటి సమయంలో నాకు ఏవైనా ముందు మాటలు చెప్పొచ్చు కదా' అని అడుగుతుంది. అప్పుడామె 'తెలిసీ తెలియని వయసులోనే నాకు పెళ్లి చేసేసారు. అందుకే నాకు ఏమీ తెలియదు. కావాలంటే మీ తోడికోడలు ప్రియను అడుగు' అని సూచిస్తుంది.

Intinti Gruhalakshmi Serial Today Episode May 2nd 2023

హనీమూన్‌కు వెళ్లలేదు అంటూ: తన పేరును చెప్పగానే ప్రియ 'ఫస్ట్ నైట్ గురించి నాకూ ఏం తెలీదు' అని అంటుంది. అప్పుడే అందరూ అక్కడి నుంచి వెళ్లిపోతారు. ఆ తర్వాత దివ్య 'నువ్వు హనీమూన్‌కు ఎక్కడికి వెళ్లావు' అని ప్రియను అడుగుతుంది. అప్పుడామె 'నేను ఈ ఇంటికి రావడమే నా అదృష్టం అనుకుంటున్నాను. నా గురించి తర్వాత గాని.. ముందు మీరు రెడీ అవ్వండి' అని అక్కడి నుంచి వెళ్లిపోతుంది. దీంతో దివ్యకు ప్రియ విషయంలో అనుమానం వస్తుంది.

Intinti Gruhalakshmi Serial Today Episode May 2nd 2023

ఆ రికార్డును బ్రేక్ చేయాలంటూ: ఇక, మరో గదిలో విక్రమ్‌ను రెడీ చేస్తూ ఉంటారు. అప్పుడు వాళ్ల తాతయ్య 'నాకు పెళ్లయిన సంవత్సరానికి కొడుకు పుడితే.. వాడికి పెళ్లయిన 10 నెలలకే నన్ను తాతని చేశాడు. నువ్వు ఆ రికార్డును బ్రేక్ చేయాలిరా మనవడా' అని అంటాడు. దీనికి విక్రమ్ అలాగే తాతయ్య అంటాడు. అక్కడంతా సంతోషంగా ఉండగా నందూ మౌనంగా ఉండడం చూసి 'ఎందుకు మావయ్య మౌనంగా ఉన్నారు' అని విక్రమ్ ప్రశ్నిస్తాడు.

Intinti Gruhalakshmi Serial Today Episode May 2nd 2023

నా గుండెల్లో పెట్టి చూసుకుంటా: విక్రమ్ ప్రశ్నించగానే నందూ 'నా కూతురు పెళ్లి అయ్యాక ఎలాంటి ఇంట్లో ఉంటుందా అని భయపడే వాడిని. కానీ ఇప్పుడు ఆ భయం లేదు' అంటాడు. దీనికి విక్రమ్ 'దివ్యను నా గుండెల్లో పెట్టి చూసుకుంటాను. మీకు ఎలాంటి భయం అక్కర్లేదు' అంటాడు. ఆ మాటలకి నందూ సంతోషిస్తాడు. ఆ తర్వాత అందరూ ఒకచోట కూర్చుని నీళ్ల బిందెలో ఉంగరం వేసి దివ్య గెలిస్తే తులసి గెలిచినట్టు, విక్రమ్ గెలిస్తే రాజ్యలక్ష్మి గెలిచినట్టు అని అంటారు.

విక్రమ్ త్యాగం.. దివ్య విజయం: బిందెలో వేయడానికి నందూ తన ఉంగరం తీసి ఇస్తాడు. అప్పుడు లాస్య 'నందూ.. దివ్య మీద కాకుండా తులసి మీద ప్రేమతో ఈ ఉంగరం ఇస్తున్నట్టుంది. అయినా జరగని శోభనానికి ఇన్ని సోకులు ఎందుకు' అని అనుకుంటుంది.

ఇక, ఆటలో ఉంగరం విక్రమ్‌కు దొరికినా కూడా దివ్య చేతిలో పెట్టడంతో ఆమె గెలుస్తుంది. అప్పుడు తులసి అందరి ముందు 'నీ భార్య ఓడిపోకూడదు అని నువ్వు చేసిన త్యాగం గొప్పది కనుక ఈ పోటీలో ఇద్దరు గెలిచారు' అంటుంది.

Intinti Gruhalakshmi Serial Today Episode May 2nd 2023

రాజ్యలక్ష్మి కోపం.. లాస్య టెన్షన్: ఆ ఆట అయిపోయిన తర్వాత రాజ్యలక్ష్మి 'అమ్మ పేరు చెప్పినా సరే దివ్యకి ఉంగరం ఇచ్చాడు అంటే మా ఇద్దరి మధ్య బంధం తగ్గుతుంది' అనుకుంటుంది. ఆ తర్వాత కొత్త జంటతో బంతాట ఆడిస్తారు. అప్పుడు లాస్య 'అదేంటి ముహూర్తం దగ్గరికి వస్తుంది. ఇంకా శోభనం ఆపే ప్లాన్ వెయ్యలేదు' అని మనసులో అనుకొని టెన్షన్ పడుతూ ఉంటుంది. అనంతరం దివ్య, విక్రమ్ శోభనం గదిలోకి ఎంట్రీ ఇస్తారు.

రాజ్యలక్ష్మి ప్లాన్‌.. ఆగిన శోభనం: విక్రమ్, దివ్య శోభనం గదిలోకి వెళ్లి రొమాన్స్ మొదలు పెడతారు. దీంతో బయట ఉన్న తులసి వాళ్లు వెళ్లిపోడానికి రెడీ అవుతుంటారు. అప్పుడు లాస్య 'ఈ శోభనం ఎలా ఆగిపోతుందో అర్థం కావట్లేదు' అని టెన్షన్ పడుతుంది. అప్పుడే రాజ్యలక్ష్మి మెట్ల మీద నుంచి కింద పడినట్లు నటిస్తుంది. దీంతో విక్రమ్, దివ్యలు బయటకు వస్తారు. అప్పుడతను తన తల్లి బాధ పడుతుంటే.. ఫస్ట్ నైట్ చేసుకోను అంటాడు. దీంతో అందరూ షాక్ అవుతారు. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X