Intinti Gruhalakshmi Today Episode: అంకితను ఒప్పించిన గాయత్రి.. తులసిని వద్దనడంతో నందూకు షాక్
సుదీర్ఘ కాలంగా తెలుగు బుల్లితెపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి భారీ నుంచి అతి భారీ స్థాయిలో స్పందన దక్కుతుంది. సుదీర్ఘ కాలంలో ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' సోమవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరు కూడా చూసేయండి మరి!
Photos Courtesy: Star మా and Disney+Hotstar

శనివారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే
శనివారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. అభిని తమ బుట్టలో వేసుకోవాలని ప్లాన్ చేస్తున్న లాస్యకు భాగ్య మరిన్ని సలహాలు ఇస్తుంది. అంతేకాదు, ఈ విషయంలో ఇద్దరి మధ్య డీల్ కూడా కుదురుతుంది. ఆ తర్వాత తులసి పార్కులో ఉండగా లాస్య వెళ్లి.. నీ ఫ్యామిలీని ముక్కలు చేస్తా అంటూ ఆమెతో చాలెంజ్ చేస్తుంది. ఇందులో భాగంగానే నందూతో అభికి ఫోన్ చేయించి ఇంటికి రమ్మంటుంది. ఆ తర్వాత అతడు రాగానే ప్రేమగా మాట్లాడి బుట్టలో వేసుకుంటారు. దీంతో అభి.. నందూ కోసం పెద్ద కొడుకుగా ఇకపై ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నానని హామీ ఇస్తాడు.

బొమ్మల్లో పిల్లల్ని చూసుకుంటూ
పిల్లల మీద ఉన్న ప్రేమను చంపుకోలేకపోతోన్న తులసి కిచెన్‌లో కొన్ని బొమ్మలను చూసి మురిసిపోతూ ఉంటుంది. అంతలో పరందామయ్య అక్కడకు వచ్చి నువ్వేంటి వంటింట్లో బొమ్మల కొలువు పెట్టావు అని అడుగుతాడు. దీంతో ఆమె ‘ఇది బొమ్మల కొలువు కాదు.. ఎప్పటికీ అమ్మ గుండెల్లో ఉండే పిల్లల కొలువు. వీడు పెద్దోడు అభి. పక్కనే నా కోడలు అంకిత. జంట ముద్దుగా ఉన్నారు కదా. పక్కనే నా చిన్నకొడుకు ప్రేమ్, నా కోడలు శృతి. వీడు అమ్మ కూచి. అమ్మను చూస్తే కానీ అమ్మతో మాట్లాడితే కానీ, వీడికి తెల్లారినట్టు కాదు. పాపం ఇప్పుడు ఏం చేస్తున్నాడో. నా చిన్న కోడలు శృతి. ఒకరి కోసం ఒకరు పుట్టినట్టు ఉంటారు కదా మామయ్య' అంటుంది.

అభి గురించి తులసి ఆందోళన
తులసి మాటలకు పరందామయ్య ‘ప్రాణం ఉన్న మనుషులను దూరం పెట్టి.. ప్రాణం లేని బొమ్మలను చూసుకొని మురిసిపోతున్నావా తులసి' అని అడుగుతాడు. దీనికామె ‘ప్రాణం లేదని ఎందుకు అనుకుంటావు మామయ్య. వీటికి ప్రాణం ఉంది' అంటుంది. అప్పుడాయన ‘దూరం చేసుకోవడం ఎందుకు.. దిగులు చెందడం ఎందుకు' అంటాడు. దీనికి తులసి ‘నాకే కాదు.. ఏ అమ్మకైనా ఈ బాధ తప్పదు. ఎన్నిసార్లు తుడిచినా అభి మీద దుమ్ము పడుతూనే ఉంటుంది. జాగ్రత్తగా చూసుకోవాల్సిందే' అని అంటుంది. ఇంతలో ఆ బొమ్మ కింద పడబోతుంది.

అభిని చేయి జారనివ్వను అని
అభి అనుకున్న బొమ్మ కింద పడుతుండగా తులసి దాన్ని పట్టుకుంటుంది. అప్పుడు పరందామయ్య ‘చూశావా తులసి.. నువ్వు ఎంత పట్టుకుందామనుకున్నా.. అభి చేయి జారిపోతున్నాడు. ఇది బొమ్మే కానీ వాడికి సరిగ్గా సరిపోతుంది' అంటాడు. దీనికి తులసి ‘వాడు చేజారిపోవాలనుకున్నా.. నేను చేజారిపోనివ్వను. నా కొడుకును సరైనా దారిలో పెట్టుకుంటాను. వాడినే కాదు.. ఎవ్వరినీ అడ్డదారులు తొక్కనివ్వను' అంటూ చెబుతుంది. దీనికి పరందామయ్య ఏం మాట్లాడాలో తెలియక చూస్తూ ఉండిపోతాడు. ఆ తర్వాత తులసి ఆ బొమ్మలను చూసి మురిసిపోతుంది.

అంకిత కోపం.. ఒప్పించేందుకు
ఇక, తన పుట్టినరోజును నందూ, లాస్య చేయాలని నిర్ణయించుకోవడంపై అంకిత అసహనంగా ఉంటుంది. అంతేకాదు, ‘నాకు ఇష్టం లేదు. ఈ విషయంలో నేను ఎవ్వరి మాట వినను. నందూ అంకుల్ వాళ్లు నా బర్త్‌డే సెలబ్రేట్ చేయడం ఏంటి' అని ప్రశ్నిస్తుంది. అప్పుడు అభి ఆయన మా డాడ్ అంటాడు. అలాగే, గాయత్రి ఆయన మీ మామ అంటుంది. దీంతో అంకిత ‘అది ఒకప్పుడు. మనం కలిసి ఉన్న రోజుల్లో ఎప్పుడైనా మన మీద ప్రేమ చూపించారా? వాళ్లను ఎలా అర్థం చేసుకోవాలి? ఎందుకు నమ్మాలి' అంటూ ఎదురు ప్రశ్నలు వేస్తూ గొడవ చేస్తుంటుంది.

అంకితను ఒప్పించిన ఫ్యామిలీ
అంకిత మాటలకు తండ్రి ‘అలా అని వాళ్ల నాన్నకు అభిని దూరంగా పెట్టడం తప్పు కదా. ఇప్పటికే అరేంజ్ మెంట్స్ కూడా పూర్తయ్యాయట. ఇప్పుడు వద్దంటే ఎలా' అంటాడు. దీనికి గాయత్రి ‘నువ్వు ఒప్పుకుంటావు కదా అని అరేంజ్‌మెంట్స్ అన్నీ పూర్తి చేశారు. మాటిచ్చి వెనక్కి తప్పుకుంటే.. మన పరువు మనం తీసుకోవడమే. ఈ సారి నా మాట కాదనకు అమ్మ' అని బతిమిలాడుతుంది. ఆ తర్వాత ఆమె తండ్రి ‘ఆపేక్షగా నీ బర్త్‌డే జరిపిస్తామంటున్నారు కదా. ఇందులో తప్పేముంది అమ్మ. ఏది ఏమైనా.. నీకు తెలియకుండా ఇంకోసారి ఇలా చేయం అని మీ అమ్మ మాట ఇచ్చింది కదా. ఈ సారికి ఒప్పుకో అమ్మ ప్లీజ్' అంటాడు. దీంతో చివరకు అంకిత ఒప్పుకుంటుంది.

లాస్య, నందూకు దివ్య ఝలక్
ఇంట్లో తులసి పిల్లలకు మ్యూజిక్ నేర్పిస్తూ ఉంటుంది. ఎలా నేర్పిస్తుందో అని దివ్య చూస్తుంటుంది. ఇంతలో లాస్య, నందూ వచ్చి.. ‘ఇది నీ సామర్థ్యం. ఇంతేనా నీ పనితనం' అంటూ తులసిని నిందిస్తారు. దీంతో దివ్యకు కోపం వచ్చి.. ‘అందుకే నీ కంపెనీ మూతపడింది కదా. నీ కంపెనీ మూత పడటానికి కారణం నీ సామర్థ్యమే కదా' అంటుంది. ఆ తర్వాత అనసూయ కూడా లాస్య మీద విరుచుకుపడుతుంది. అదంతా పక్కన పెట్టండి. అసలు వీళ్లెందుకు వచ్చారు అని అడుగుతాడు పరందామయ్య. దీంతో అంకిత బర్త్‌డే సెలబ్రేట్ చేస్తున్నాం అని చెబుతారు.
Recommended Video


నందూ.. లాస్యతో అనసూయ
ఆ తర్వాత నందూ ‘ఈ పార్టీకి తులసిని పిలవడం లేదు. అమ్మానాన్న మీరిద్దరూ రావాలి. దివ్య నువ్వు కూడా రావాలి. అయినా మాకు ఏమౌతుందని తులసిని పిలవాలి' అంటాడు. దీంతో పరందామయ్య ‘నీకేం కాదు కానీ.. అంకితకు అత్తయ్య అవుతుంది' అంటాడు. ఆ తర్వాత అనసూయ ‘నీకేం సంబంధం లేదు అనుకున్న వాళ్లతో మాకు కూడా సంబంధం లేదు' అంటుంది. దీనికి నందూ ‘వాళ్లంతా తులసి మాయలో ఉన్నారు లాస్య. మనం ఏం చేయలేం. వాళ్లేం నష్టపోతున్నారో భవిష్యత్తులో వాళ్లకే తెలుస్తుంది పదా వెళ్దాం' అంటాడు. ఆ తర్వాత అనసూయకు లాస్య బొట్టు పెడుతుండగా తిడుతుంది. ఇక, చివర్లో ప్రేమ్, శృతికి చీర తీసుకు రాగా ఆమె క్లాస్ పీకుతుంది. ఆ తర్వాత రొమాన్స్ పండిస్తారిద్దరూ. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.


Click it and Unblock the Notifications











