Intinti Gruhalakshmi: రాజ్యలక్ష్మికి ఇచ్చి పడేసిన దివ్య.. తులసి వైపు తిరిగిన భాగ్య.. లాస్యకు షాక్

ఎన్నో భాషల కంటే తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రం ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.

దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' మంగళవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!

Photos Courtesy: Star మా and Disney+Hotstar

Intinti Gruhalakshmi Serial Today Episode May 30th 2023

సోమవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే: సోమవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. నందూ ఇమేజ్ పాడు చేసేందుకు లాస్య ఓ వ్యక్తితో డీల్ కుదుర్చుకుంటుంది. అప్పుడతను లాస్యను నందూ కొట్టిన వీడియోను వైరల్ చేస్తాడు. అది చూసిన ఓ కస్టమర్ కెఫేలో ఎవరూ ఉండొద్దని నానా రచ్చ చేస్తుంది.

తర్వాత రాజ్యలక్ష్మి కాలికి కట్టు విప్పేసి ఆమెకు మర్ధనా చేస్తూ దివ్య చుక్కలు చూపిస్తుంది. అంతేకాదు, ఆ కాలు విరిచేస్తానని ఆమెకు వార్నింగ్ ఇస్తుంది. ఇక, భాగ్యను ఇంటికి పిలిచిన తులసి.. ఆమె భర్త సస్పెన్షన్‌ను వెనక్కి తీసుకునేలా చేస్తుంది. దీంతో లాస్య ఫోన్‌లో ఉన్న వీడియోను భాగ్య డిలీట్ చేసేస్తుంది.

Intinti Gruhalakshmi Serial Today Episode May 30th 2023

లాస్యకు హ్యాండిచ్చిన భాగ్య: తులసి సాయం చేయడంతో భాగ్య 'నువ్వు కష్టాల్లో ఉన్నావని తెలిసినప్పుడు కూడా నిన్ను చాలాసార్లు ఏడిపించాను. అయినా నువ్వు నాకు మంచే చేశావు. నా కాపురాన్ని రోడ్డు మీద పడకుండా చేశావు ఇప్పటికైనా నా కళ్ళు తెరుచుకున్నాయి' అని బాధ పడుతుంది. దీంతో తులసి 'ద్వేషం పశ్చాత్తాపంతో తడిస్తే వచ్చే ప్రేమ చాలా బాగుంటుంది. ఇప్పుడు నీ ప్రేమ అలాగే అనిపిస్తుంది. అప్పుడప్పుడు ఇంటికి వస్తూపోతూ ఉండు' అంటుంది.

Intinti Gruhalakshmi Serial Today Episode May 30th 2023

వీడియో డిలీట్ చేసిన భాగ్య: ఆ తర్వాత భాగ్య 'ఇంతకీ నేను ఫోన్ చేసిన విషయం చెప్పటం మర్చిపోయాను. నువ్వు నాకు చేసిన సాయానికి కృతజ్ఞతగా లాస్య ఫోన్లో ఉన్న వీడియో డిలీట్ చేశాను. ఇప్పుడు కోర్టులో తనకు బలమైన సాక్ష్యం లేదు' అని చెబుతుంది. దీంతో తులసి 'నువ్వు చేసిన సాయం చాలా గొప్పది' అంటూ ఫోన్ పెట్టేస్తుంది. ఆ తర్వాత తులసి 'లాస్య దగ్గర ఉన్న బలమైన సాక్ష్యం ఇప్పుడు లేకుండా పోయింది. ఇక, తను ఏమీ చేయలేదు' అని అనుకుంటుంది.

Intinti Gruhalakshmi Serial Today Episode May 30th 2023

దేవుడు చెప్పిన విననంటూ: రాజ్యలక్ష్మికి దివ్య మసాజ్ చేస్తుండడంతో బసవయ్య 'మీ ఆవిడను మసాజ్ చేయవద్దు అని చెప్పు. మా అక్క కాళ్ళు నొప్పితో పోయేలాగా ఉంది' అని విక్రమ్‌తో అంటాడు. అప్పుడు దివ్య 'ఆయనే కాదు దేవుడు చెప్పిన వినను. ఈరోజు ఎలాగైనా అత్తయ్య చేత నడిపిస్తాను అన్నాను.. నడిపించి తీరుతాను.

కాకపోతే కొంచెం నొప్పి భరించాలి' అంటుంది. దీనికి విక్రమ్ 'ఇప్పటికిప్పుడు అమ్మ నడుస్తుందంటే నాకు అంతకంటే ఏం కావాలి' అంటాడు. దీనికామె 'అయితే అందరూ వెళ్లి హాల్లో కూర్చోండి. అత్తయ్యను నడిపించుకుని తీసుకొస్తా'అంటుంది.

Intinti Gruhalakshmi Serial Today Episode May 30th 2023

అత్తను బెదిరించిన దివ్య: అందరూ అక్కడి నుంచి వెళ్లిపోయిన తర్వాత దివ్య 'ఏ నరం నొక్కితే కాలు పడిపోతుందో నాకు బాగా తెలుసు. మర్యాదగా నడుస్తావా లేకపోతే నరం నొక్కమంటావా? నా కొడుకు నా చేతిలో ఉన్నాడు అని గొప్పలు పోయావు. ఇప్పుడు అదే కొడుకు నిన్ను నాకు అప్పజెప్పి కిందకి వెళ్ళాడు. ఇప్పుడు నేను ఏం చేసినా అడిగే దిక్కులేదు. కావాలంటే చూస్తావా' అని కాళ్లు గట్టిగా నొక్కుతుంది. దీంతో రాజ్యలక్ష్మి 'మరీ రెచ్చిపోకు.. ఈసారి నువ్వు గెలవచ్చు కానీ నా టైం వచ్చినప్పుడు నా సంగతి చూపిస్తాను' అంటుంది.

Intinti Gruhalakshmi Serial Today Episode May 30th 2023

మర్యాదగా వస్తావా? లేదా?: రాజ్యలక్ష్మి మాటలకు దివ్య 'ఆ సంగతి తర్వాత చూద్దాం. ముందు ఈ సంగతి చెప్పు. మర్యాదగా నడుచుకొని కిందికి వస్తావా? లేకపోతే కాలును ఓ పట్టు పట్టమంటావా' అని గట్టిగా నొక్కుతుంది. దీంతో ఆమె దివ్యతో పాటు కిందికి వస్తుంది. తల్లిని అలా చూసి ఆనందం పట్టలేకపోయిన విక్రమ్.. ఇప్పుడు అంతా బానే ఉంది కదమ్మా అని అడగ్గా.. బానే ఉంది అంటుంది. దీంతో విక్రమ్ దివ్యను ఎత్తుకుని తిప్పుతాడు.

Intinti Gruhalakshmi Serial Today Episode May 30th 2023

ఎందుకిలా రెచ్చిపోతావు?: బాధగా కూర్చున్న అత్తమామలకు తులసి హారతి ఇచ్చి ఎందుకిలా ఉన్నారని అడుగుతుంది. దీనికి వాళ్లు తెలిసే అడుగుతున్నావా అంటారు. అప్పుడు తులసి 'మనం పోరాటం చేస్తున్నాము. ముందే ఓటమి గురించి ఆలోచించడం ఎందుకు? చచ్చిన శవం కూడా ఒక్కొక్కసారి లేచి కూర్చుంటుంది. మన కేసు కూడా అలాగే అవ్వచ్చేమో నిరాశ పడొద్దు' అంటుంది.

ఆ వెంటనే నందూ దగ్గరికు వెళ్లి హారతి ఇస్తుంది. అప్పుడే లాస్య కూడా అక్కడకు వచ్చి హారతి తీసుకుంటుంది. ఇక, ఆమెను చూసిన వెంటనే అందరూ ఎందుకు వచ్చావని ఆమెతో గొడవకు దిగుతారు. దీంతో లాస్య 'బుద్ధిగా ఉండొచ్చు కదా నందూ. ఎందుకు అలా రెచ్చిపోతావు? కెఫేలో అలా రెచ్చిపోయే కదా దొరికిపోయావు' అంటుంది.

ఆస్తి నాకే కదా అంటూ: ఆ తర్వాత లాస్య 'అయినా నేను వచ్చింది కారు కోసం. ఎలాగో నందు కి శిక్ష పడుతుంది. వారసత్వంగా ఆ కారు నాకే కదా రావాలి. అందుకే ఇక్కడ నుంచి కోర్టుకు అందరూ కలిసి వెళ్దాము. అటు నుంచి అటు నేను కార్లో వెళ్ళిపోతాను' అని అంటుంది. దీనికి తులసి 'అప్పుడే తీర్పు నువ్వే చెప్పేస్తున్నావా? ఎవరికి తెలుసు ఆఖరి నిమిషంలో ఏం జరుగుతుందో.

మరి అంత మిడిసి పడకు' అంటుంది. దీంతో లాస్య సరే అయితే అక్కడే చూసుకుందాం అంటూ వెళ్ళిపోతుంది. తర్వాత నందూ వాళ్లు కూడా కోర్టుకి బయలుదేరుతారు. ఇక, తల్లికి బాగు చేసినందుకు దివ్యకు విక్రమ్ రెడ్ రోజ్ ఇస్తాడు. కానీ, ఆమె వద్దని ఇచ్చేస్తుంది. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X